నేడు ఏపిలో విద్యాసంస్థల బంద్‌!

ap
ap

అమరావతి: ఏపిలో ఈరోజు విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశాయి. పెండింగ్ లో ఉన్న రూ. 1,112 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలను వెంటనే విడుల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి. బంద్ కు పీడీఎస్యూ, పీడీఎస్వో, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, తదితర విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా… తాగాజా టీఎన్ఎస్ఎఫ్ కూడా తన సంఘీభావాన్ని ప్రకటించింది. బంద్ పై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/