విద్యాసంస్థల పునఃప్రారంభంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : స్కూళ్ల ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం గురువారం (ఫిబ్రవరి 3, 2022) విడుదల చేసింది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రల్లో ఇప్పటికే విద్యాసంస్థలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థల పునఃప్రారంభంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం కేంద్ర విద్యాశాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యలు, స్కూల్ టైమ్‌టేబుల్, భావోద్వేగ, మానసిక ఆరోగ్యాలకు సంబంధించిన సూచనలు ఇందులో పొందుపరిచారు. ఇప్పటి వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోని మొత్తం 98.85% టీచింగ్, 99.07% నాన్ టీచింగ్ స్టాఫ్‌కు టీకాలు వేయడం పూర్తిచేసింది. విద్యార్థులు కోరితే అన్‌లైన్ విద్యకు అనుమతి ఇవ్వవలసిందిగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలిపింది.

విద్యాసంస్థల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్ర మార్గదర్శకాలు ఇవే..

.పాఠశాలల్లో శుభ్రత, శానిటేషన్ సౌకర్యాలను నిర్ధారించడం, పర్యవేక్షించడం.
.తరగతి గదిలో విద్యార్థుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి
.స్టాఫ్ రూమ్‌లు, ఆఫీస్ ఏరియా, అసెంబ్లీ హాల్, ఇతర సాధారణ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించాలి.
.తరగతులను తక్కువ టైంకు కుదించి, టైం టేబుల్ తయారు చేసుకోవాలి.
.సామాజిక దూరం సాధ్యం కాని చోట స్కూల్ ఈవెంట్స్ చేపట్టరాదు.
.విద్యార్థులు, సిబ్బంది అందరూ ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించి రావాలి.
.మధ్యాహ్న భోజన సమయంలో సామాజిక దూరం విధిగా పాటించాలి.
.రోజూ పాఠశాలలో శానిటేషన్ చేయాలి.
.హాస్టళ్లలో పడకల మధ్య తగిన దూరం ఉండేలా చూసుకోవాలి.
.హాస్టళ్లలో ఎప్పటికప్పుడు సామాజిక దూరం పాటించాలి.
.విద్యార్ధులు హాస్టల్‌లోకి ప్రవేశించే ముందు స్కానింగ్‌ చేయాలి.
.తల్లిదండ్రుల అనుమతితో ఇంటి నుండి చదువుకోవడానికి ఇష్టపడే విద్యార్థులకు పర్మిషన్ ఇవ్వాలి.
.అటెండెన్స్ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/