అదుపు తప్పుతున్న ఆర్థిక నేరాలు

Financial Criimes

శాంతిభద్రతలు కాపాడే విషయంలో అన్నింటి కంటే ప్రధానంగా ఆర్థిక నేరా లను అదుపు చేసేందుకు పాలకులు చేపడు తున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నా యేమోననిపిస్తున్నది. ఒకపక్క నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నా మరొకపక్క ఆర్థికనేరాలకు అంతేలేకుండా పోతున్నా వీటిని నియంత్రించడంలో అధికారగణం విఫ లమవ్ఞతుందనే చెప్పొచ్చు. ఆర్థికనేరాలను అదుపు చేసేం దుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నా వెలుగుచూసి నప్పుడు కేసు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నా ఈ నేరాలు ఆగడం లేదు.

దేశవ్యాప్తంగా సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవ్ఞతున్నది. దేశంలో ఆర్థిక నేరాల్లో మోసపోతున్నవారిలో అధికశాతం సామాన్యులు, మధ్యతరగతి వర్గాలవారే ఉన్నారు. తాజాగా పిఎంసి బ్యాంకు కుంభకోణంలో కష్టకాలంలో తమకు, తమ వారసులకు అవసరం వస్తుందనుకున్న డిపాజిట్లు గల్లంతయ్యాయనే వార్తలతో గుండెలు ఆగిపోతున్నాయి. మొన్న సోమవారం ఇద్దరు,మంగళవారం మరొకరు కేవలం 24 గంటల వ్యవధిలో ముగ్గురు డిపాజిటర్ల ప్రాణాలు అనంతవాయువ్ఞల్లో కలిసిపోయాయి. తమ సొమ్ముకోసం రోడ్లెక్కిన బాధితులు ఆందోళనలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పిఎంసి బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో రిజర్వుబ్యాంకు విధించిన ఆంక్షలు డిపాజిటర్లను కృంగదీస్తున్నాయి. జీవితకాలం కష్టపడి దాచుకున్న డబ్బు ఇలా కుంభకోణాలపాలైందనే వార్తలు డిపాజిట్‌దారులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

పోలీసులచుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకులు ఇలా డిపాజిటర్ల డబ్బును మోసం చేయడం ఇది మొదటిసారికాదు, చివరిది కూడా కాదు. దేశంలో ఈ ఆర్థికనేరాలు అంతకంతకు పెరిగిపోతున్నదనేది కాదనలేని వాస్తవం. పాలకులు తీసుకుంటున్న చర్యలు వీటిని ఏమాత్రం నియంత్రించలేకపోవడంతో మళ్లీ మళ్లీ ఈ కుంభకోణాలు పునరావృతం అవ్ఞతున్నాయి. చట్టాల్లో ఉన్న లోపాలు, ఈ దగాకోర్లకు కొందరు రాజకీయ నాయకుల మద్దతు ఉండటమే కారణమనే ఆరోపణలను కొట్టివేయలేం.మన రాజ్యాంగ నిర్మాతలు కుల,మత,వర్గ, లింగ బేధాలు లేకుండా అందరికి సమానంగా వర్తించే విధంగా శాసనాలతో రాజ్యాంగాన్ని రూపొందించారు.

కొందరు అధికారులు రాజకీయ ఒత్తిడిలకు లొంగి లేక దక్షిణలకు లోబడి చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చు కుంటారని నాటి రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేకపో యారు. ఫలితంగా వందలాది కరుడుగట్టిన ఆర్థికనేర స్తులు ప్రజలను వంచించి కోట్లాది రూపాయలు దోచు కుంటున్న వైట్‌కాలర్‌ నేరస్తులు తప్పించుకోగలుగు తున్నారు. సమర్థవంతంగా దర్యాప్తు జరిపి పటిష్టంగా రికార్డులు తయారు చేసి అవసరమైన సాక్షాలను కోర్టుల ముందు నిలబెట్టినేరాలను రుజువ్ఞ చేయడంలో అధికారు లు విఫలమవ్ఞతున్నారనే చెప్పొచ్చు.

కొన్నిసార్లు పరిస్థి తుల ప్రభావం వల్ల దర్యాప్తు సక్రమంగా ముందుకు నడ వకపోతే మరికొన్ని సందర్భాల్లో అధికారులే కేసులు వీగి పోయేలా రికార్డులు తయారు చేస్తున్నారు.మరికొన్ని సంద ర్భాల్లో అధికారులు సకల అవస్థలుపడి కోర్టుల ముందు రుజువ్ఞ సర్వంసిద్ధం చేసినప్పుడు కొందరు పాలక పెద్దలు జోక్యం చేసుకొని కేసులు నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు అప్పటి పరిస్థితులకు అనుగు ణంగా తయారు చేసిన సిఆర్‌పిసి, ఐపిసి నిబంధనలు కాలానుగుణంగా సవరించాలనే పోలీసు అధికారుల వాదన కూడా సమంజసమే.

ఆ విషయం అలాఉంచితే ఉన్న నిబం ధనలను, చట్టాలను ఏమేరకు నిష్పాక్షపాతంగా అమలు చేస్తున్నారనేదే ప్రశ్న. ధనిక, పేద అని తేడా లేకుండా ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించ గలుగుతున్నారనేదే ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల వల్ల నష్టపోయిన వారి సంగతి అలా ఉంచితే విచ్చలవిడిగా బోగస్‌ ఫైనాన్స్‌ కంపెనీలు పెట్టి లక్షలాదిమంది అమాయకుల కష్టార్జితాన్ని కొల్లగొట్టి బోర్డులు తిప్పేస్తే జీవితకాలం పాటు సంపాదిం చు కున్న డబ్బు పోగొట్టుకొని న్యాయం చేసేవారు లేక బాధితుల వేదన అరణ్యరోదనగా మారి కొందరు ఆత్మ హత్యలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్లుగా కనీసం పదివేల కోట్ల రూపాయ లకుపైగా ఫైనాన్స్‌కంపెనీలు, చిట్‌ఫండ్‌ కంపెనీలు ప్రజలను మోసం చేసి దోచుకున్నట్లు అనధికార అంచనా. ఇందులో కొన్ని పోలీసులకు ఫిర్యాదులు అందినా, కేసులు నమోదు చేసినా రికవరీ మాట ఎలా ఉన్నా నిందితుల్లో పదిశాతం మందిపై కూడా నిర్దిష్టమైన, కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవ్ఞ. 25 లక్షల రూపాయల మొదలు ఐదువందల కోట్లవరకు మోసం చేసిన ఫైనాన్స్‌ కంపెనీల యజమానులపై చర్యలు తీసుకోవడంలోనూ, నిందితులను పట్టుకొని బాధితులకు న్యాయం చేయడం లోనూ విఫలమవ్ఞతున్నారు. ఏదోరకంగా డబ్బు సంపా దించగలిగితే తమను ఎవరూ ఏమీ చేయలేరనే భావన రోజురోజుకు పెరిగిపోతున్నది.

అందుకే ఒకరిని చూసి ఒకరు పోటీలు పడి ప్రజలను మోసం చేసి కోటీశ్వరులు అయిపోతున్నారు. ఈ విషయాల్లో బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు న్యాయం సంగతి ఎలా ఉన్నా అసలు కేసులు నమోదు చేసుకోవడానికే కొందరు పోలీసు అధికారులు ఇష్టపడటం లేదు. మమ్మల్ని అడిగి ఇచ్చవా? ఇచ్చేటప్పుడు తెలివిలేదా?లాభం వస్తే మాదగ్గరికి వచ్చేవాడివా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించి మళ్లీ పోలీసు స్టేషన్‌కు రాకుండాచేసిపంపుతున్నారు.

మరికొన్ని సార్లు కోర్టుకు వెళ్లి కేసులు పెట్టి వసూలు చేసుకోమని సలహాలిస్తున్నారు. ఏదిఏమైనా దేశవ్యాప్తంగా ఈ ఆర్థికనేరాలు అంతకంతకు పెరగడం ఆందోళన కలిగించే విషయం. బ్యాంకులపై ఇప్పటికే నమ్మకాలు సన్నగిల్లాయి. మరొకపక్క ఎలాంటి నిబంధనలు పాటించకుండా చట్టవిరుద్ధంగా నడుస్తున్న చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌కంపెనీలపై ఇప్పటికైనా పాలకపెద్దలు ఉక్కుపాదం మోపాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/