ఆర్థిక విధానాలపై ఆత్మపరిశీలన అవసరం

TS CM KCR Presents Budget 2019-20
TS CM KCR Presents Budget 2019-20

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర మైన ఆర్థికమాంద్యం కొనసాగుతున్న ఈ తరుణంలో ప్రవేశపెడుతున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లో ఎలాంటి కోతలుం టాయో? సంక్షేమ కార్యక్రమాలు ఎంతవరకు కొనసాగిస్తా రో? ముఖ్యంగా వ్యవసాయరంగానికి ప్రోత్సాహానికి ఇ స్తున్న పథకాల పరిస్థితి ఏమిటో? తదితర అంశాలపై స ర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సమయంలో సోమవారం ము ఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖరరావ్ఞ శాసనసభలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఆర్థికమాంద్యం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా తీవ్రంగా ఉన్నా సంక్షేమ పథ కాల విషయంలో ప్రధానంగా వ్యవసాయరంగంపై ఎలాం టి కోతలూ లేకుండా కార్యక్రమాలు కొనసాగించేందుకు నిధులు కేటాయించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా గత మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభలు ఆమోదించిన ఓట్‌ ఆన్‌అకౌంట్‌ బడ్జెట్‌ సెప్టెంబరు నెలాఖరుకు ముగు స్తుంది. అక్టోబరు నుండి వచ్చే మార్చి వరకు అవసరమై న పూర్తిస్థాయి బడ్జెట్‌ను సోమవారం ముఖ్యమంత్రి ప్రవే శపెట్టారు. ఈసారి బడ్జెట్లో కొంతమేరకైనా వాస్తవ పరిస్థి తులు దృష్టిలో ఉంచుకొని పెద్దఎత్తునే కసరత్తు చేశారని చెప్పొచ్చు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,82,017 కోట్ల రూపాయల ప్రతిపాదిత వ్యయంగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఆ అంచనాకు అనుగుణంగా ఆదాయవనురులు గణనీయంగా పడిపోయాయి.

దేశ ఆర్థిక పరిస్థితి ప్రభావం రాష్ట్రంపై పడిందని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించారు. అందుకే మారిన పరిస్థితులకనుగుణంగా బడ్జెట్‌ రూపొందించినట్లు ప్రకటించారు. ప్రతిపాదిత వ్యయం 1,46,492.30 కోట్ల రూపాయలకు తగ్గించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,11,055.84 కోట్ల రూపాయలు కాగా మూలధనం వ్యయం 17,274..67 కోట్ల రూపాయలు. ఆర్థిక లోటు 24,081.74 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేశారు.

సాధ్యమై నంతవరకు పేదలకు, వ్యవసాయరంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు, పథకాల్లో కోతలు విధించకుండానే బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. పేదలకు అందించే ఆసరా పెన్షన్లు, కెసిఆర్‌ కిట్స్‌, కళ్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, బియ్యం లాంటి పథకాలకు ఎలాంటి నిధుల కొరత రానియ్యమని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్‌ యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు.

అంతేకాకుండా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడానికి అయ్యే విద్యుత్‌ బిల్లుల భారం ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించించారు. దీంతో విద్యుత్‌ సబ్సిడీ వ్యయం ఎనిమిది వేల కోట్లకు పెరిగింది. అలాగే రైతుల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికి నిర్ణయించారు. రైతులకు ఏడాదికి అందిస్తున్న పది వేల రూపాయల రైతుబంధు పథకం యధాతథంగా కొనసాగుతుందని ఈ బడ్జెట్లో ఈ పథకా నికి పన్నెండు వేల కోట్లు ప్రతిపాదించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే రైతు బీమా పథకాన్ని కూడా కొన సాగిస్తామన్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వంపై ముఖ్య మంత్రి తన ప్రసంగంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న వివిధ రకాల పన్నుల ద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి గత ఐదేళ్లలో 2,72,926 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అందగా ఈ నిధుల్లో అన్ని రాష్ట్రాలకు వచ్చిన విధంగానే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకోసం తెలంగాణకు 31,802 కోట్ల రూపాయలు వచ్చాయి. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఈ ఏడాది రావాల్సిన 450 కోట్ల రూపాయల్లో ఇంకా నిధులు కేంద్రం ఇవ్వలేదని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఆదాయ వనరులనుబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన ప్రాధాన్యతను నిర్ణయించుకుంటూ వ్యవహరిస్తున్నదని సభకు తెలియచేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరిగితే.. అందుకు అనుగుణంగా అంచనాలు సవరించుకునే అవకాశం ఉందని కూడా ముఖ్యమంత్రి సభకు చెప్పారు.

వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి అంత ఆశాజనకంగా లేదనే విషయం ఏనాటి నుంచో ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలోని అనేక రాష్ట్రాలు ఆర్థికసంక్షోభం లో,అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాస్తవ బడ్జెట్‌ అని చెప్పి కేటాయింపులు చేసి నిధులు ఆ మేరకు విడుదల చేసి కార్యక్రమాలు అమలు చేసినప్పుడే ఇది వాస్తం బడ్జెట్‌ అనే మాటలకు అర్దం ఉంటుంది. ప్రస్తుత పరిస్ధితుల్లో అది సాధ్యమేనా? అనే అనుమానాలు వ్యక్తం అవ్ఞతున్నాయి.

రాబడికన్నా ఖర్చు పెరిగిపోయింది. ఆదాయ వ్యయాల మధ్య ఉన్న అంతరాయం పూడ్చేందుకు అప్పులు చేయాల్సిన తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. సంక్షేమ కార్యక్రమాలు వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం గతంలో ఎక్కడా లేని విధంగా చేపట్టడంతో ఖర్చులు పెరిగిపోయాయి.

ఏటా వేలాది రూపాయలు వడ్డీ రూపంగా చెల్లించాల్సిన పరిస్థితులు దాపురించాయి. మనది సంక్షేమ ప్రభుత్వమే. దారిద్య్రారేఖకు దిగువనున్న వారి సంక్షేమంకోసం పథకాలు చేపట్టాల్సిందే. వారి అభ్యున్నతికి కృషిచేయాల్సిందే.

అందులో మరో వాదనకు తావ్ఞలేదు. కానీ అందులో అవినీతి జరగకుండా ప్రజల సొమ్ము దళారుల పాలుకాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధు లపై ఉంది. ప్రజా సొమ్ముకు కాపలాదారులనే విషయం మరిచిపోకూడదు. అప్పులు చేయడంకంటే అనవసర మైన ఖర్చు తగ్గించుకుని నిర్మాణాత్మకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేతప్ప ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడే అవకాశాలు లేవు.