కప్పదాట్లపై ‘సుప్రీం’ కొరడా!

Supreme Court of India

కర్ణాటకలో జెడిఎస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలడానికి కీలకంగా మారిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీం సమర్థించింది. స్పీకర్‌కు ఉన్న అధికారాలను కాదనలేమని, అయితే అనర్హతవేటు కాలపరిమితిని నిర్ణ యిస్తూ ఇచ్చిన ఆదేశాలను మాత్రం కొట్టివేస్తున్నామని చెప్పడంలో అనర్హత ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలుచిక్కింది. సంకీర్ణ ప్రభుత్వంలో అప్పటి స్పీకర్‌ రమేష్‌కుమార్‌ 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును వేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా వీరు 2013 సంవత్సరం ముగిసేంతవరకూ ఎన్నికల్లో పోటీచేయకూడదని స్పీకర్‌ ఆనాడు ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. ఈ నిబంధనపై సుప్రీంకోర్టులో అనర్హత ఎమ్మెల్యేలు సవాల్‌ చేసారు. విచారణలో ఉన్న సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటకలోని ఈ 17స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకువచ్చింది.

పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారంటూ అనర్హత ఎమ్మెల్యేలు ఢిల్లీకి సైతం పయనం కట్టారు. ఈ లోపు సుప్రీం తన పిటిషన్‌పై తీర్పును ఈనెల 13వ తేదీనే ఇస్తామని వెల్లడించడం అనుకున్నట్లుగానే బుధ వారం తీర్పును ప్రకటించడంతో ఎమ్మెల్యేలకు కొండంత ఊరట లభించింది.ఈ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యేలు మొత్తం ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు మార్గం ఏర్ప డింది. 193 అధికరణం చర్చించిన సుప్రీంకోర్టు అనర్హత విషయంలో మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, అనర్హత అనేది చర్య జరిగిన కాలానికి మాత్రమే వర్తి స్తుందని, కొంతకాలంపాటు ఎన్నికల్లో పోటీచేయకూడ దంటూ ఆదేశాలు ఇచ్చే అధికారం స్పీకర్‌కు లేదని న్యాయస్థానం తన అభిప్రాయాలు నిష్కర్షగా తేల్చి చెప్పింది.

అందువల్లనే స్పీకర్‌ విధించిన అనర్హతవేటు కాలపరిమితిని కొట్టివేస్తున్నట్లు వెల్లడిస్తూ స్పీకర్‌ వేసిన అనర్హత వేటు మాత్రం రాజ్యాంగ బద్ధమేనని తీర్పు చెప్పింది. అంతేకాకుండా నాడు ఎమ్మెల్యేల అనర్హత వేటుపరంగా స్పీకర్‌ పాక్షిక న్యాయబద్ధ అథారిటీగా మాత్రమే వ్యవహరించారని, ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేసారా లేదా అన్నది మాత్రమే స్పీకర్‌ పరిధి లోనికి వస్తుందని, ఈ క్రమంలో స్పీకర్‌ అధికారపరిధి పరిమితమని సుప్రీం బెంచ్‌ విశ్లేషించింది. అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలుకల్పిస్తూ ఒకవేళ గెలిస్తే మంత్రిపదవులుసైతం చేపట్టవచ్చని స్పష్టం చేయడంతో 17 మంది ఎమ్మెల్యేలకు తమ రాజకీయ భవిష్యత్తుకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగినట్లయింది.

అలాగే అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు ముందు కర్ణాటక హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు రావడాన్ని తప్పుపట్టింది. ముందు హైకోర్టును ఆశ్రయించిన తర్వాతనే సుప్రీం జోక్యం ఉంటుందని, అయితే కేసు పూర్వాపరాలు, నిజానిజాలను పరిగణనలోనికి తీసుకుని మాత్రమే తాము తీర్పును వెల్లడించామని సుప్రీం బెంచ్‌ వెల్లడించడంతో కర్ణాటకలోని కాంగ్రెస్‌, జెడిఎస్‌ ఎమ్మెల్యే లు ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేసేందుకు రాజమార్గం ఏర్ప డింది. ఈ ఏడాది జులై నెలలోనే కర్ణాటకలో తలెత్తిన రాజకీయసంక్షోభంలో కొందరు సంకీర్ణ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో సంకీర్ణప్రభు త్వం కుప్పకూలింది.

దీనితో యెడియూరప్ప నాయకత్వం లోని భారతీయ జనతాపార్టీ మళ్లీ అధికారంలోనికి వచ్చింది.అయితే ఆనాడు సంకీర్ణకూటమిలోని 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్‌ రమేష్‌కుమార్‌ అర్హతవేటు వేయడం సంచలనంగా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించడమే కాకుండా కర్ణాటక 15వ అసెంబ్లీ ముగి సేంతవరకు అంటే 2013 చివరివరకు ఎమ్మెల్యేలు ఎన్ని కల్లో పోటీచేయకూడదని ఉత్తర్వులు జారీచేసారు.

ఈ ఉత్తర్వులను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆధ్వర్యంలోని బెంచ్‌ విచారణ జరిపింది. గతనెల 25వ తేదీనే రిజర్వులో ఉంచిన తీర్పును బుధ వారం వెల్లడించడంతో ఉప ఎన్నికలవైపు రెబెల్‌ ఎమ్మె ల్యేలు కార్యోన్ముఖులయ్యేందుకు వీలు కలిగినట్లయింది. ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడటంతో కర్ణాటకలోని ఈ అసమ్మతి ఎమ్యెల్యేలు తమ భవిష్యత్తు అంధకారం లోనికి వెళుతోందని భావించారు.

ఢిల్లీస్థాయిలో పైరవీలు ముమ్మరం చేసారు.తమఅనర్హత వేటును సుప్రీం సమర్థిం చిన పక్షంలో తమ కుటుంబీకులు లేదా తమ వారసు లకు టికెట్లు ఇవ్వాలని ఆనాటి అసమ్మతి వ్యూహకర్తల వద్దకు రాయబారాలు పంపించారు.అలాగే కర్ణాటకముఖ్య మంత్రి సైతం అసమ్మతి ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సి న బాధ్యత బిజెపిపైనే ఉందని కార్యకర్తలతో మాట్లాడు తున్నట్లున్న ఆడియోక్లిప్‌ లు కూడా వెల్లడి అయ్యాయి.

ఈ నేపథ్యంలో కర్ణాటకలో యెడియూరప్ప మళ్లీ ముఖ్య మంత్రి కావడానికి అసమ్మతి ఎమ్మెల్యేలు పరోక్షంగా కీలక సహకారం అందించారనే చెప్పాలి. సుదీర్ఘకాలంపాటు నలిగిన కర్ణాటక సంక్షో భం చివరకు విశ్వాసపరీక్షలో కుమారస్వామి విజయం సాధించలేకపోవడంతో సంకీర్ణ సర్కారు కుప్పకూలింది. వెనువెంటనే బిజెపి తన ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు విశ్వాసపరీక్షలో కూడా నెగ్గింది.అందుకుసైతం పరోక్షంగా ఈ ఎమ్మెల్యేల సంఖ్యా బలం మద్దతిచ్చిందనే చెప్పాలి.

ఇప్పుడు రెబెల్‌ ఎమ్మెల్యే లను గెలిపించుకునే బాధ్యత బిజెపి తీసుకుంటుందా లేక పరోక్ష సహకారం అందించి వారికి పరోక్ష అండదండలి స్తుందా అనేది చూడాలి.లేనిపక్షంలో ఎమ్మెల్యేలు మొత్తం బిజెపిలోనే చేరిటికెట్లు తెచ్చుకుని గెలవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈకేసు లో బిజెపి హైకమాండ్‌ నిర్ణయమే మరోసారి రెబెల్స్‌ భవిష్యత్తుకు కీలకం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/