వింత వైరస్‌ల విషవలయం

coronavirus
coronavirus

ఒక్కమాట.. (ప్రతిశనివారం)

అసలు ఏ వ్యాధికి ఎంత మంది బలైపోతున్నారో తెలియని విచిత్ర పరిస్థితి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న గిరిపుత్రుల పరిస్థితి వర్ణనాతీతం. విషజ్వరాలు అంటున్నారే తప్ప ఆ మరణాలకు కారణాలు చెప్పలేకపోతున్నారు. ఆ మరణాల్లో ఎంత మంది డెంగ్యూ, చికున్‌గున్యా తదితర వ్యాధులబారిన పడి అసువ్ఞలు బాసారో వైద్యనిపుణులకే సమాచారం అందడం లేదు. ఆ ప్రాంతాల్లో డాక్టర్లు ఉంటే మందులుండవ్ఞ. మందులుంటే డాక్టర్లు రారు. కిందిస్థాయిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్న సిబ్బందితో కూడా సమర్థవంతంగా పనిచేయించలేకపోతున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ప్రజారోగ్యరంగంలో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి.

ఎం తో ఆధునిక విజ్ఞానాన్ని సముపార్జించుకున్నామని విర్రవీగే మానవజాతిపై ప్రకృతి విసురుతున్న సవాల్‌కు వారూ వీరూ అనే తేడా లేకుండా అందరూ బలైపోతున్నారు. ఆ శక్తి ముందు మానవ్ఞడు ఎప్పటికీ తలవంచుకోవాల్సిందేనన్న వాస్తవాన్ని చాటుతూ రకరకాల కొత్త వ్యాధులు ప్రబలిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బలైపోతున్నారు. కోట్లాది మంది రోగపీడితులవ్ఞతున్నారు. ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఎక్కడో పుట్టి ఎంతో కాలంగా నిగూఢంగా ఉండి ఒక్కసారిగా ప్రజారోగ్యంపై విజృం భిస్తున్నాయి. మొన్న మలేరియా, నిన్న చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ, ఇప్పుడు తాజాగా కరోనా సరికొత్త వ్యాధి పెచ్చరిల్లి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నది. అంతకుముందు ఎబోలా అనే మరొక కొత్త రకం వ్యాధి ప్రజారోగ్యంపై దాడి చేసింది. సైన్స్‌ ఎంతో అభివృద్ధిచెందినా కొత్త కొత్త సాంకేతిక పరికరాలు,సరికొత్త చికిత్స విధానాలు, కొత్త మందులు కనుగొంటున్నా ఈ వ్యాధుల బారినుండి కాపాడుకోలేకపోతున్నారు. ఈ వ్యాధులు ప్రబలినప్పు డల్లా వేలసంఖ్యలో అసువ్ఞలు బాస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న కరోనా వ్యాధి చైనాలో పుట్టి ఇప్పటికే 26 దేశాలకుపైగా విస్తరించినట్లు వార్తలు అందుతున్నాయి. చైనా వూహన్‌లో రెండు రోజుల వ్యవధిలోనే వంద మందినిపైగా బలితీసుకొని ఇప్పటికే ఆరువందల మందికిపైగా ఈ వ్యాధితో పరలోకానికి పయనం కట్టారు.ఇవి అధికారుల లెక్కలు.ఇవి వాస్తవం కాదని ఇప్పటికే 24వేల మందికిపైగా మరణించారని మరో ఒకటిన్నర లక్షల మందికి పైగా ఈ వైరస్‌ సోకిందని చైనాకు చెందిన అతిపెద్ద ఆన్‌లైన్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ ప్రకటించింది.ఎంతమంది చనిపోయారు మరెందరు ఈ వైరస్‌ బారినపడి అల్లాడుతున్నారేమో కానీ కరోనా మాత్రం ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నది. అసలు ఈ వ్యాధి ఎలా వస్తుందో, నివారణ ఏమిటో, నియంత్రించడం ఎలాగో తెలియక ప్రపంచ ఆరోగ్య నిపుణులే ఆందోళన చెందుతున్నారు. గబ్బిలాల నుండి మనుషులకు సంక్రమించిందనుకుంటున్న ఈ వైరస్‌ వ్యాప్తి ని అడ్డుకోవడం తమ దేశం తీవ్రమైన సవాల్‌ ఎదుర్కొంటున్నదని ఆ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ బహిరంగంగా చెప్పారంటే పరి స్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనాలో యుద్ధ పాతిపదికపై చర్యలు చేపట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ వ్యాధిని నియంత్రించేందుకు,వ్యాధిసోకిన వారికి చికిత్స అందిం చేందుకు కేవలం పదిరోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించి రికార్డు సృష్టించారు. ఆ దేశంలో దాదాపు పదమూడు నగరాల్లో కోటి మందికిపైగా ప్రజల ఆరోగ్యాన్ని పరిశీలించి ఈ వ్యాధిని కనుగొని నియంత్రించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భారత్‌సహా అనేక దేశాలు తమ దేశంలోకి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్నా వారిని ఆస్పత్రికి పంపించి వైద్యపరీక్షలు చేయించి నిర్ధారించుకున్న తర్వాతనే బయటకు పంపుతున్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. భారతదేశంలో కూడా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌కు సంబంధించి గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. పాకిస్థాన్‌ పాలకులు చైనాలో ఉన్న తమ పౌరు లను తమదేశానికి పంపవద్దని,ఆ వ్యాధికి అవసరమైన మందులు చికిత్స తమ వద్దలేవని చేతులెత్తేశారు. 1992 ప్రాంతంలోచైనాలో వెలుగుచూసిన సార్స్‌ వ్యాధి సృష్టించిన బీభత్సాన్ని కరోనా గుర్తుకు తెస్తుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. కరోనా వ్యాధి ప్రజారోగ్యాన్నే కాదు ఆర్థికరంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపు తున్నది. చైనా పంపే ఎగుమతులు నిలిపివేయడంతో మార్కెట్‌ పై తీవ్రరూపం దాల్చుతున్నది.మిర్చిధరలు ఒక్కసారిగా పడిపోవ డానికి కరోనాయే కారణం అంటున్నారు. ఈ సమస్యనుండి గట్టెక్కించేందుకు చైనా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. మొన్నటి ఎబోలా వ్యాధి మనదేశాన్ని ఇంతగా గడగడలాడించక పోయినా అనేక దేశాల్లో కలకలం రేపింది. ఈ వ్యాధిని తొలిసారి 1976లో పశ్చిమాఫ్రికాలోని మారుమూల ప్రాంతంలో కొనుగొ న్నట్లు చెప్తున్నారు. ఇక డెంగ్యూ కూడా ప్రజారోగ్యంపై నిరంతరం దాడి చేస్తూనే ఉంది. ఈ వ్యాధి ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఎన్నోఏళ్ల నుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఎనిమిదేళ్ల క్రితం ఈ వ్యాధిని అనధికారికంగా గుర్తించారు. 1997 లో మొదటి కేసు నమోదు అయింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఈ వ్యాధితో ఎంతో మంది బాధపడుతున్నా, అసువ్ఞలు వీడు తున్నా గుర్తించిన సందర్భాలు లేవ్ఞ. ప్రతిఏడాది డెంగ్యూవ్యాధి మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక పారిశుద్ధ్యలోపం వల్ల దోమలు వ్యాపించి విషజ్వరాలు విస్తరిస్తూనే ఉన్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఉదాసీ నత వహిస్తున్నారనే విమర్శలు పెల్లుబుకుతూనే ఉన్నాయి.జ్వరాలే కాదు గుండె జబ్బులు, కిడ్నీ రోగాలు, ఇతర వ్యాధులకు డాక్టర్లు, వైద్యం ఉన్నా వాటికి అయ్యే వ్యయం సామాన్యులు అందుకోలే నంతగా పెరిగిపోతున్నది. వైద్యం ఒకవ్యాపారంగా రూపాంతరం చెందింది.కార్పొరేట్‌ రంగం ప్రవేశించినప్పటి నుంచి వైద్యం అనేది బీదాబిక్కి బడుగువర్గాలకే కాదు మధ్యతరగతి వారికి కూడా అందని ద్రాక్షపండుగా తయారైంది. రోగిని, రోగాన్ని పరిశీలించి పరీక్షించి వైద్యం అందించే రోజులు పోయి రోగి జేబును చూసి వైద్యం చేసే దురదృష్టపు రోజులు దాపురించాయి. సొంత డబ్బు లేక బ్యాంకుల నుంచి అప్పోసొప్పో చేసి నక్షత్రపుస్థాయి హోటళ్లకు మించి ఆస్పత్రులను నిర్మించడం, ఆ తర్వాత పెట్టుబడిని వడ్డీతో సహా రాబట్టడంకోసం చేయరాని,చేయకూడని పనులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.ఈ సంపాదన ఆరాటంలో నైతిక విలు వలు పాటించడంలేదు.అందరూ అలా వ్యవహరిస్తున్నారని చెప్ప డంలేదు కానీ అధికశాతం ఆ మార్గంలోనే పయనిస్తున్నారు. వినడానికి కఠినంగా అనిపించినా ఇది వాస్తవం. ఇది రోజురోజుకు పెరుగుతున్నదే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు ఈ ఆరాటపోరాటంలో కొందరు డాక్టర్లు కూడా బలైపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగర శివారుల్లో ఏకంగా ప్రైవేట్‌ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఒక యువ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకు న్నాడు.ఈ విషయంలో ప్రభుత్వం కూడా ప్రేక్షకపాత్ర వహించడం విచారకరం. ప్రజారోగ్యరంగంలో ఇటువంటి వారిపై చర్యలు తీసు కునేందుకు ఎలాంటి నియమ నిబంధనలు ఇప్పటివరకు రూపొం దించలేదు. గత రెండు మూడు దశాబ్దాలుగా ఈ విషయంలో కమిటీలు, అధ్యయనాలు, సమీక్షలతోనే కాలం గడుపుతున్నారు తప్ప సమగ్ర చట్టాలకు రూపకల్పన జరగలేదు. ఎన్నో ఏళ్లతరబడి కష్టపడి నాలుగు డబ్బులు వెనకేసుకొని పేదరికం నుంచి కొంత మేరకైనా బయటపడిన మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరో ఒకరు ఈ వ్యాధి బారినపడి కార్పొరేట్‌ వైద్యాన్ని ఆశ్రయిస్తే ఉన్నదంతా ఊడ్చుకొనిపోయి మళ్లీ దరిద్రంపాలవ్ఞతున్నారు. దేశంలో లక్షలాది కుటుంబాలు ఈ సుడిగుండంలో పడి కొట్టుకుమిట్లాడుతున్నాయి. ఆ మాత్రం ఆర్థికస్తోమత లేనివారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చు భరించలేక డయాలసిస్‌కు అయ్యే ఖర్చుపెట్టుకోలేక మృత్యువ్ఞకు దగ్గరవ్ఞతున్నారు. కుటుంబ సభ్యులు ఈ వ్యాధుల బారినపడి బలైపోతున్నారని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో దేవ్ఞనిపై భారం వేసి కాలం గడుపుతున్న కుటుంబాలు దేశవ్యాప్తంగా లక్షలసంఖ్యలోఉన్నాయి. ఒక్క కిడ్నీ బాధితులే కాదు, కేన్సర్‌, గుండెజబ్బులు తదితర రోగుల పరిస్థితి వర్ణనాతీతం.ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దేశవ్యాప్తంగా అటు కేంద్రం కానీ,ఆయా రాష్ట్ర పాలకులు కానీ వేలాదికోట్లు ఖర్చుపెడుతున్నారు. కానీ వాటి ఫలి తాలు ఏమేరకు ప్రజలకు చేరుతున్నాయో పట్టించుకునే నాధుడు లేడు. ప్రాణాపాయం నుండి కాపాడే మందుల సంగతి అటుంచి కుక్కకాటుకు అవసరమయ్యే సాధారణమందులు కూడా అందు బాటులో ఉండటం లేదు. ఆస్పత్రులను మెరుగుపరచడం కోసం కేంద్రంనుంచి ఎన్నోపథకాల పేరుతో కోట్లాదిరూపాయలు వెచ్చిస్తు న్నారు.వాటిని వెచ్చించినట్లు లెక్కలు రాసుకుంటున్నారు. అదంతా ఒక ప్రహసనంగా మారిపోయింది.అసలు ఏ వ్యాధికి ఎంత మంది బలైపోతున్నారో తెలియని విచిత్ర పరిస్థితి. ఇక ఏజెన్సీప్రాంతాల్లో ఉంటున్న గిరిపుత్రుల పరిస్థితి వర్ణనాతీతం. విషజ్వరాలు అంటు న్నారే తప్ప ఆ మరణాలకు కారణాలు చెప్పలేకపోతున్నారు. ఆ మరణాల్లో ఎంతమంది డెంగ్యూ, చికున్‌గున్యా తదితర వ్యాధుల బారినపడి అసువ్ఞలు బాసారో వైద్యనిపుణులకే సమాచారం అంద డంలేదు.ఆ ప్రాంతాల్లో డాక్టర్లు ఉంటే మందులుండవ్ఞ. మందు లుంటే డాక్టర్లురారు.కిందిస్థాయిలో సిబ్బంది కొరతతీవ్రంగా ఉంది. ఉన్న సిబ్బందితో కూడా సమర్థవంతంగా పనిచేయించలేకపోతు న్నారు.స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ప్రజారోగ్య రంగంలో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి.

  • దామెర్ల సాయిబాబ

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/