దేవుని హుండీలకే కన్నాలు!

భారతీయ సంస్కృతికి మారుపేరుగా, భక్తివిశ్వాసాలకు నిలయాలుగా ప్రజా దరణ పొంది ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొందిన దేవాలయాలు దీనావస్థకు చేరుకుంటు న్నాయి. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు ఎంతో విలువైన ఆస్తిపాస్తులున్నా నిత్యపూజలకు గతిలేక దీపం పెట్టే దిక్కులేక కళావిహీనంగా మిగిలిపోతున్నాయి. జీర్ణావస్థకు చేరుకుంటున్నాయి.

Hindu Temple

మరొకపక్క ఆదాయం ఉన్న దేవాలయాల్లో అవినీతి, అవకతవకలు రాజ్యమేలు తున్నాయి. అధికారుల మీద అధికారులున్నా పాలక పెద్దలు దేవ్ఞళ్ల సేవలో తరిస్తున్నామని చెప్పుకుంటున్నా దేవాలయాల్లో అవకతవకలు తారాస్థాయికి చేరుకుంటు న్నాయి. ఏళ్లతరబడి దేవ్ఞళ్ల భూములను నామమాత్రపు లీజుకింద తీసుకొని కొందరు ఘరానా పెద్దలు అనుభవి స్తున్నా పట్టించుకునేవారే లేకుండాపోతున్నారు. చివరకు దేవ్ఞళ్లను, దేవ్ఞళ్ల భూములను మింగడమేకాదు కొన్ని ప్రాంతాల్లో దేవ్ఞళ్ల హుండీలకే కన్నాలు వేస్తున్నారు.

మొన్న వేములవాడ రాజరాజేశ్వేరీ దేవాలయంలో రాజన్న హుండీ నుండి తొమ్మిదివేల రూపాయలు ఆ దేవాలయ ఉద్యోగే తస్కరిస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగిం చిన సంఘటన విస్మయం కలిగిస్తున్నది. అంతకుముందు కూడా అటు ఆంధ్రప్రాంతంలో ఎన్నో దేవ్ఞళ్ల హుండీలకు కన్నాలు వేసిన పెద్దలు ఎందరో ఉన్నారు. ఇక ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కోట్లాది మంది ఆరాద్యదైవం తిరుమల వెంకన్నకు కూడా ఈ అవినీతిపరుల వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి దొంగలను పట్టుకుంటున్నా, విచారణలు చేయి స్తున్నా ఇవేమీ ఆగడం లేదు. ఇక లెక్కల మాయాజాలం తో కోట్లాది రూపాయలు భోంచేసే పెద్దలు కూడా లేకపోలేదు.

దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళాస్తీశ్వర దేవాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు గతంలో ఆకస్మికంగా దాడులు చేస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దర్యాప్తు ఏమైందో, ఎవరిపై చర్యలు తీసుకున్నారో రెండేళ్లు దాటినా వెలుగు చూడలేదు. అక్కడే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక దేవాలయాల్లో ఈ అవినీతి, అవకతవకలు రాజ్య మేలుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం దేవ్ఞడిని, దేవాలయాలను దైవభక్తిని దుర్వినియోగం చేసే దుష్ట సంప్రదాయం ఆరంభమైనప్పటి నుంచి దేవాలయ వ్యవస్థ పతనం అయిందని చెప్పొచ్చు.

పవిత్రమైన హిందూ దేవాలయ వ్యవస్థలో పాలకుల జోక్యం రోజురోజుకు పెరిగిపోతున్నదని గతంలో ఎందరో ధర్మాచార్యులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక ప్రవక్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలపై వచ్చే ఆదాయం దైవ ప్రచారాలకు, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని మఠాధిపతులు ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే దేవాలయ ఆస్తులను కాపాడటానికి ఒక ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం వస్తుందని గతంలో హెచ్చరించారు. గతంలో ఎన్నో విదేశీ దాడులు ఎదుర్కొని మరెన్నో ఆటుపోట్లు తట్టుకున్న దేవ్ఞళ్లు ఇప్పుడు స్వజనుల దోపిడీని నివారించలేకపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యపూజలు అందుకోని దేవ్ఞళ్లు, దేవాలయాలు వేలసంఖ్యలో ఉన్నాయి. ఆస్తులు స్వాహా చేయడమే కాదు వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన అపురూప శిల్పఖండాలున్న దేవాలయ ప్రాంగణా లలో విగ్రహాలను పెకిలించుకుపోతున్నారు.

గుప్తనిధుల కోసం నిరాటంకంగా తవ్వకాలుజరుగుతున్నాయి. ఈ ముఠాలు అప్పుడప్పుడు పట్టుబడినా వారిపై నామ మాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటుండటంతో అవి నిరాటంకంగా జరుగుతున్నాయి.గతంలో ఇలా పట్టుబడిన ముఠాలు జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి వచ్చి మళ్లీ అదే పనిని కొనసాగించిన సంఘటనలు కూడా వెలుగు చూశా యి. ఇంత జరుగుతున్నా దేవ్ఞళ్లను,దేవ్ఞళ్ల ఆస్తులను పరి రక్షించాల్సిన ఇరువ్ఞరాష్ట్రాల్లోని దేవాదాయశాఖలుఅంతగా శ్రద్ధచూపడం లేదు. అసలు దేవాలయాల భూములు ఎన్ని? ఎవరి ఆధీనంలో ఉన్నాయి? వాటిపై రావాల్సిన ఆదాయం ఎంత? ఎంత వస్తున్నది? తదితర వివరాలు దేవాదాయశాఖ వద్ద ఇప్పటికీ లేవంటే పరిస్థితి ఏస్థాయి లో ఉందో అర్థమవ్ఞతుంది.

దీనికితోడు పాలకులు ఎప్పటి కప్పుడు సంక్షేమం పేరుతో కొన్ని ప్రాంతాల్లో దేవ్ఞళ్ల భూములను కేటాయిస్తున్నది. పాలకులు అధికారులతో ఇలాంటి ప్రమాదం ఉంటుందని, దేవ్ఞళ్ల ఆస్తులను కాపా డేందుకు భక్తులు సమర్పించిన ప్రతిపైసా సద్వినియోగం చేసేందుకు ఎంతో ముందుచూపుతో పెద్దలు ధర్మకర్తల వ్యవస్థను ఏనాడో ఏర్పరిచారు.

ఎలాంటి జీత భత్యాలు లేకుండా, లాభాపేక్ష లేకుండా దేవ్ఞడి సేవలో తరించాల నుకునే ఆశయాలు ఉన్నవారిని, భూవిరాళాలు సమర్పిం చుకున్నవారిని ధర్మకర్తలుగా గతంలోనియమించే వారు. వారు ఎంతో నీతి నియమాలు,నియమనిష్టలు, భక్తివిశ్వా సాలు,సత్ప్రవర్తనతో ప్రజలకు ఎంతో ఆదర్శంగా ఉండే వారు. పంచాయతీరాజ్‌ వచ్చిన తర్వాత గ్రామాల్లో కొంత మార్పువచ్చిన మాటవాస్తవమే కానీ మరికొన్ని ప్రయోజ నాలు చేకూరింది నిజమేకావచ్చు.

కానీ గ్రామ రాజకీయాల ప్రభావం దేవాలయవ్యవస్థపై పడింది.ధర్మకర్తల మండళ్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. వ్యక్తిగత గుణాలు, దైవచింతన వంటి ఉత్తమ గుణాలను పరిగణనలోకి తీసుకోకుండా తమ పార్టీ కార్యకర్తలను, తమ అనుయాయులను ధర్మకర్తల మండలిలో నియ మించడం ప్రారంభమైనప్పటి నుంచి ఆలయ వ్యవస్థ భ్రష్టుపట్టిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా పాలకులు విజ్ఞతతో ఆలోచించాలి.

దేవాలయాలకు ధర్మకర్తలను నియ మించేటప్పుడు వారి వ్యక్తిగత చరిత్ర, సేవాధర్మనిరతిని పరిగణనలోకి తీసుకోవాలి. ఆలయ ఆస్తులను పరిరక్షించే ఉద్యమంలో భాగస్వాములవ్ఞతారనుకున్న విశ్వాసం ఉన్న వారిని ధర్మకర్తలుగా నియమిస్తే కొంతలో కొంతవరకైనా దేవ్ఞళ్లకు, దేవాలయ ఆస్తులకు రక్షణ ఏర్పడుతుంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/