విదేశాలకు తరలిపోతున్న ఎర్రచందనం

చట్టాలెన్ని ఉన్నా అడ్డుకట్ట పడటం లేదు

Red sandalwood
Red sandalwood

చట్టాలు ఎన్నిచేసినా, వాటిని అమలు చేసేందుకు ఎంత మంది అధికారులను నియమించినా అక్రమాలను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు అంతకంతకు పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ శేషాచలం అడవుల్లో మాత్రమే లభ్యమయ్యే అపూర్వ వృక్షసంపద ఎర్ర చందనాన్ని కాపాడుకోలేకపోతున్నాం.

ఈ అటవీ సంప దను కాపాడేందుకు పాలకులు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదు. పక్కాప్రణాళిక ప్రకారం ఎర్రచందనం వృక్షాలను తెగనరికి వివిధ ప్రాంతాలకు అంచలంచెలుగా చేరవేసి విదేశాలకు తరలిస్తున్నారు.

అడ్డువచ్చిన అటవీ అధికారులపై దాడులు చేయడమేకాదు చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇందులో కొందరు పెద్దల పాత్ర ఉండటం వల్లనే అధికారులు సమర్థవం తంగా అడ్డుకోలేకపోతున్నారనే ఆరోపణలు ఎంతోకాలంగా వినిపిస్తున్నాయి.

గతంలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు కూడా ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో చోటు చేసుకున్నాయి.

పోలీసు,అటవీశాఖ అధికారులు చేస్తున్న దాడుల్లో కేవలం డబ్బుకు ఆశపడి ఈచెట్లను నరికేందుకు వచ్చే కూలీలు మాత్రమే దొరుకుతున్నారు తప్ప వెనుక ఉన్న సూత్రధారులు పట్టుబడటం లేదు.

అయితే ఈ అక్రమరవాణాకు ఎప్పటికప్పుడు మార్గాలను,వ్యూహాలను మార్చుకుంటున్నట్లు సమాచారం.

ఢిల్లీలో దాదాపు యాభై లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసుల దర్యాప్తు బృందం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆయన ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌కు ఆది వారం చేరుకున్నది.

ఈ వ్యాపారంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నట్లు దర్యాప్తులో వారి దృష్టికి వచ్చినట్లు చెప్తున్నారు.

అంతర్జాతీయ స్మగ్లింగ్‌ ముఠాలతో పట్టుబడిన వ్యక్తికి సంబంధాలున్నట్లు దర్యాప్తులో బయటపడింది.ఎర్రచందనం రానురాను అత్యంత విలువైన అటవీసంపదగా మారిపోయింది.

అరు దైన ఈ వృక్షాలు నెల్లూరు,కడప,చిత్తూరు సరిహద్దుల్లోని వెలిగొండలు, శేషాచలం అడవ్ఞల్లో మాత్రమే పెరుగుతాయి.

అక్కడే ఎందుకు పెరుగుతాయి? మిగిలిన ప్రాంతాల్లో అంత నాణ్యత కలిగిన ఎర్రచందనం పెరగకపోవడానికి కారణాలు ఏమిటో కొన్ని వందల సంవత్సరాలుగా వృక్ష శాస్త్రవేత్తలకే అంతుబట్టడం లేదు.

రెండుశతాబ్దాల క్రితమే బ్రిటిష్‌శాస్త్రవేత్తలు ఎర్రచందనం చెట్లను వివిధ ప్రాంతా లకు చివరకు ఇంగ్లాడ్‌కుకూడా తీసుకువెళ్లి పరీక్షలు జరిపి పెంచేందుకు చేసినప్రయత్నాలు ఫలించలేదు.

అంతేకాదు అసలు ఈ చెట్లకు ఎందుకు ఇంత విలువఉందో ఇప్పటికీ అంతుబట్టని విషయంగానే చెప్తారు. అన్నింటికంటే ముఖ్యంగా చైనా, జపాన్‌ దేశాల్లో వీటికి అత్యంత విలువ ఉంది.

అణుఇంధనం తయారీలోనూ, శృంగారసామర్థ్యం పెంచే మందుల్లోనూ వీటిని ఉపయోగి స్తున్నారని ఊహిస్తున్నారు.కానీ ఆ దేశాలు తాము ఎందు కు వీటిని అత్యంత ధరలు చెల్లించి కొంటున్నారో నేటికీ చెప్పడం లేదు.

1973లో అరుదైన వృక్షజాతి జాబితాలో (కన్వెన్షన్‌ ఆఫ్‌ ఇంటర్నెషనల్‌ ట్రేడ్‌ఇన్‌ ఎన్‌డేంజర్డ్‌స్పైసీస్‌) లోకి చేర్చారు.

దీనివల్ల ఎర్రచందందుంగలు అప్పటి నుంచి అంతర్జాతీయ వాణిజ్య దిగుమతులపై నిషేధంఅమలులోకి వచ్చింది.

ఈ వృక్షాలను రక్షించుకునేందుకు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి.అయితే కోట్లాది రూపాయల ఆదా యం వస్తుండటంతో స్మగ్లర్లు ఈ ఎర్రచందం దుంగలను అక్రమంగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటూనే ఉన్నారు.

సముద్ర మార్గం ద్వారా దేశసరిహద్దు దాటించేం దుకు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు అనుసరిస్తూనే ఉన్నారు.కొంతకాలం వ్యవసాయోత్పత్తుల పేరుతో బోగస్‌ ఎగుమతుల అనుమతి పొంది తరలించారు.

చెన్నై,ముంబా యి, కొచ్చిన్‌, ముంద్రా రేవుల నుంచి సరుకురవాణా ఓడల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా కూడా అక్రమ రవాణా సాగుతూనే ఉంది.

ఢిల్లీ,చండీగఢ్‌లోని గోదాముల్లో దాచిన సరుకును అదును చూసి నేపాల్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి చైనాకు రవాణా చేయడం సులువ్ఞ అవ్ఞతుంది.

మణిపూర్‌,మిజో రం రాష్ట్రాలు ఈ అక్రమ రవాణాకు కేంద్రంగామారాయి. చట్టాల్లో ఉన్న లోపాలను కూడా స్మగ్లర్లకు ఉపయోగప డుతున్నాయి.

ఫలితంగా వారిపై పెట్టిన కేసుల్లో అధిక శాతం న్యాయస్థానాల్లో నిరూపణ కాకపోవడంతో వీగిపో తున్నాయి.

అంతర్జాతీయ బయోడైవర్‌సిటీ సంస్థ అంచనా ప్రకారం ఒక టన్ను ఎర్రచందనానికి దాదాపు పది, పన్నెండు కోట్ల రూపాయలకుపైగా ధర పలుకుతుందనేది అంచనా.

ఐదారు చెట్లు అయితే పది కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని చెప్తున్నారు. మనదేశంలోని ఓడరేవ్ఞల ప్రాంతాలకు చేర్చుకోగలిగితే టన్నుకు 80 లక్షల రూపా యలు చెల్లిస్తున్నట్లు చెప్తున్నారు.

అందుకే వీటిని స్మగ్లింగ్‌ చేసేందుకు కొందరు మాఫీయాలుగా ఏర్పడి మరికొందరు రాజకీయనాయకుల అండదండలతో ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

ఇలాంటి అపూర్వమైన ఎర్రచందనం వృక్షసంపద ఏ దేశంలో ఉన్నా దేశాభివృద్ధికి, ప్రతిష్టకు ఎంతగానో ఉపయోగపడేవి. దురదృష్టవశాత్తు మనదేశంలో అక్రమ వ్యాపారాలకు బలిపెడుతున్నారు.

ఇప్పటికైనా పాలకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చట్టానికి మరింత పదునుపెట్టాలి. కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేయాలి.

ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఎంతో ఆర్థిక సంపత్తిని చేకూర్చి ఖజానాకు ఆదాయం తెచ్చి పెట్టాల్సిన అపూర్వ ఎర్రచందనం అక్రమంగా దేశసరిహద్దులు దాటిపోతూనే ఉంటుంది.