ప్రజారోగ్యాన్ని పట్టించుకునే వారేరి?

Public Health
In Patients


ప్రజలను విలవిల్లాడిస్తున్న స్వైన్‌ఫ్లూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్ర ణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యాధుల నివారణకు కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల అమలు తీరుపై వచ్చే నెల రెండోతేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ తదితర వ్యాధులకు సంబంధించి సరైన చికిత్స అందడంలేదని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవని ఒక న్యాయవాది రాసిన లేఖను సుమోటు ప్రజాప్రయోజనవాజ్యంగా స్వీక రించిన హైకోర్టు విచారణ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌ చౌహన్‌, జస్టిస్‌ షమీర్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారిస్తూ రుతుపవనాలు వచ్చాక ఇలాంటి వ్యాధుల నిరోధానికి తక్షణ చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో చెప్పాలని ఆదేశాల్లో పేర్కొన్నది. వాస్తవంగా గత పదిపదిహేను రోజులుగా ఒక్క తెలంగాణరాష్ట్రంలోనే కాదు అటు ఆంధ్రప్రదేశ్‌,పొరుగునున్న మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో డెంగ్యూ, చికెన్‌ గున్యా, స్వైన్‌ఫ్లూ వంటి విషజ్వరాలతో పాటు మలేరియా, డయేరియా ఒకటేమిటి అన్నిరకాల వ్యాధులు ప్రజా రోగ్యంపై దాడిచేస్తున్నాయి. ఈ విష జ్వరాలబారిన పడి ఎందరో అసువ్ఞలు బాస్తుండగా,లక్షలాది మంది ఆస్పత్రుల పాలవ్ఞతున్నారు. ప్రజారోగ్యం ఇంతటి తీవ్ర పరిస్థితుల్లో ఉంటే బాధ్యత కలిగిన రాజకీయ నాయ కుల్లో కొందరు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మునిగితేలుతుండగా మరికొందరు రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు పన్ని విజయాలు సాధిం చాలనే విషయాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రజల పరిస్థితి పట్టిం చుకునే తీరిక ఓపిక పాలకులకు ఉన్నట్టు కన్పించడం లేదనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. ఎంతో ఆధునిక విజ్ఞానాన్ని సముపార్జించుకున్నామని విర్రవీగే మానవ జాతిపై ప్రకృతి విసురుతున్న సవాల్‌కు వారూవీరూ అని తేడా లేకుండా అందరు బలైపోతున్నారు.ఆ శక్తి ముందు మానవ్ఞడు ఎప్పుడూ తలవంచుకోవాలనే వాస్తవాన్ని చాటుతూ వ్యాధులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. డెంగ్యూ వ్యాధితో సామాన్యులే కాదు అత్యాధునిక వైద్యం చేయించుకోగలిగిన లక్ష్మీపుత్రులు కూడా బలైపో తున్నారు. అత్యున్నతమైన వైద్యసేవలు అందుబాటులో ఉండికూడా నిష్ప్రయోజనం అవ్ఞతున్నాయనే విషయం వీరి మరణాలు చెప్పకనే చెబుతున్నాయి. సైన్స్‌ఎంతో అభివృద్ధిచెందిందని, ఎన్నో కొత్త మందులు కనుగొంటు న్నామని చెప్పుకుంటున్న మానవ్ఞని మేధాశక్తిని సవాల్‌ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త జబ్బులు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు దక్షిణా దిలో పెద్దగా కురియకపోయినా రకరకాల వ్యాధులు మాత్రమే విజృంభిస్తున్నాయి. అవి ఎందుకు వస్తాయో? ఎలా వస్తాయో? చెప్పలేని పరిస్థితి. సీజన్‌ మారినప్పుడల్లా విజృంభిస్తున్న దోమల ద్వారా ఈ విషజ్వరాలు కొంతమేరకు విస్తరిస్తున్నాయి. ఈ వ్యాధులు సోకిన లక్ష్మీప్రసన్నుల సంగతి అలా ఉంచినా మధ్యతరగతి ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని రోజువారీ కూలీలు చిన్నాచితక వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగించే వారి పరిస్థితి దారుణంగా ఉంది. కొత్తకొత్త వ్యాధులు వారిని గడగడలాడిస్తున్నాయి.చికెన్‌గున్యా లాంటి వ్యాధి సోకిన వారు కొన్ని రోజులు కాలకృత్యాలు కూడా తీర్చుకోలేకపో తున్నారు. చికెన్‌గున్యాను నియంత్రిం చేందుకు ఏనాటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నా సఫలీకృతం కాలేకపోతు న్నారేమోననిపిస్తున్నది.వాస్తవంగా ఈ వ్యాధినిమొట్టమొదట 1953లో టాంజేనియాలో కనుగొన్నారు. ఆ తర్వాత 1955లో కోల్‌కతాలో బయట పడింది. 62 ప్రాంతంలో కేరళ, తమిళనాడుల ద్వారా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కూడా విస్తరించింది. దీనికితోడు ఇప్పుడు తాజాగా డెంగ్యూ కూడా వీరవిహారం చేస్తున్నది. ఇక గ్రామీణ ప్రాం తాల్లో పరిస్థితి ఆందోళనక రంగా ఉంది. పెద్దపెద్ద రోగాల సంగతి అటుంచి చిన్న వ్యాధులకు కూడా వాడే సూది మందు, మందుబిళ్లలు ప్రభుత్వ వైద్యశాలలో దొరకడం లేదు. అవసరం మేరకు సిబ్బందిలేరు. డాక్టర్లు ఉండరు. ఉన్నా సక్రమంగా విధులకు హాజరుకారు. సమీక్షలు లేవ్ఞ. పర్యవేక్షణలు లేవ్ఞ. దీనికితోడు పారామెడికల్‌ సిబ్బంది కొరత అన్నీకలిపి ప్రజారోగ్యాన్నిపతనం అంచునకు చేర్చు తున్నాయి. ఉన్న కొద్దిపాటి సిబ్బందితో కూడా సమర్థవం తంగాపని చేయిం చుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా సిబ్బంది కొరత ప్రజారోగ్యాన్ని కాపాడే విషయంలో ప్రధాన సమస్యగా పరిణమిస్తున్నది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వారికి సోకు తున్న వ్యాధుల వివరాలు సేకరించి కొన్ని మందులు ఇచ్చే వారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం జరగడం లేదు. ఉన్న కొద్దిపాటి సిబ్బంది కూడా గ్రామాలకు వెళ్లడం లేదు. చాలావరకు పట్టణాలకే పరిమి తమై అప్పుడప్పుడు గ్రామాలకు వెళ్లివస్తున్నారు. దీంతో వ్యాధుల తీవ్రత గురించి ప్రభుత్వానికి సమగ్రమైన సమా చారం లేకుండాపోతున్నది. ఇకజ్వరాలే కాదుగుండెజబ్బులు, కిడ్నీరోగాలు, ప్రధానంగా కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలిపోతున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్టు వార్త లు అందుతున్నాయి. వచ్చీరాని వైద్యంతో కొందరు నాటు వైద్యులు చేస్తున్న చికిత్స గిరిజన ప్రాణాలకు ముప్పు తెస్తున్నది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో నైనా పాలకులు ప్రజారోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ జ్వరాలకు మూలకారణమైన దోమలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. మరో ప్రధానకారణమైన గ్రామీణనీటి సరఫరాశాఖ మంచినీరు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ప్రజారోగ్యసంరక్షణ బాధ్యత ప్రభుత్వంపై మాత్రమే కాకుండా ప్రజలు, స్వచ్ఛందసంస్థలు కూడా ఈ యజ్ఞంలో పాలుపంచుకోవాలి.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌