ఉపశమనం లేదా?

కరోనా మహమ్మారిపై భయాందోళన

corona effect
corona effect

కరోనా మహమ్మారి నుండి ఇప్పట్లో బయట పడే అవకాశం లేనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) అభిప్రాయ పడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఒకవేళ ఇది తాత్కాలికంగా తగ్గినట్లుగా కనిపించినా మళ్లీ విజృంభించే అవకాశం ఉన్నట్లు వైద్యనిపుణులు కూడా అంగీకరిస్తున్నారు.

దీంతో డబ్ల్యూహెచ్‌ఒ కూడా ఏకీ భవిస్తున్నది. డబ్ల్యూహెచ్‌ఒ అధికార ప్రతినిధి డాక్టర్‌ డేవిడ్‌ నాబర్రో తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు.

ఇది పూర్తి నిర్మూలం కావాలంటే దీనికి వ్యాక్సిన్‌ వచ్చే వరకు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఆయన అభిప్రాయం పడినట్లు చైనాలో కూడా మళ్లీ ఈ వ్యాధి సోకుతున్నట్లు వార్తలు అందుతున్నాయి.

ఆదివారం మరో వందమందికిపైగా చైనాలో ఈ వ్యాధి సోకినట్లు అధికార వర్గాలే వెల్లడించాయి.

దీంతో మళ్లీ వ్యాధి పుంజుకుం టుందనే భయాందోళనలు అక్కడ వ్యక్తం అవ్ఞతున్నాయి. నివారణచర్యలు తిరిగి చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్ప డ్డాయి.

వాస్తవంగా వూహాన్‌లో డిసెంబరులో ఈ వ్యాధి బయటపడినప్పుడు చైనా అంతగా పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితులు దాపురించాయనే వాదన కూడా త్రోసిపుచ్చలేం.

ఈ వ్యాధిసోకి ఒక్క వూహాన్‌లోనే వేలాది మంది అసువ్ఞలు బాసిన చైనా చాలావరకు వాస్తవాలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అది విదేశా లకు పాకిన తర్వాత కానీ ఈ వ్యాధి గురించి బయట ిప్రపంచానికి చెప్పలేదు.ఇక అమెరికా ఈ వైరస్‌ సోక కుండా ముందుజాగ్రత్తలు తీసుకొనే విషయంలో చేసిన నిర్లలక్ష్యం పరాకాష్టగా చెప్పచ్చు.

అందుకు భారీగానే మూల్యం చెల్లిస్తున్నది. వేలాది మంది ప్రాణాలు కోల్పో యారు.

లక్షలాదిమందికి ఈ వ్యాధి సోకింది.అమెరికా చరిత్రలోఇంతటి సంక్షోభం గతంలో ఎప్పుడూ ఎదు ర్కొన్న దాఖలాలు లేవు .

భారత్‌ మాత్రం ఈ కరోనా వైరస్‌ను నియంత్రించడంలో మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందనే చెప్పచ్చు.కానీ రానున్న రోజుల్లో భారత్‌ వైద్యపరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది.

వాస్తవంగా మందులకు సంబంధించి భారత్‌తో సహా అనేక దేశాలు చైనాపై ఆధారపడుతున్నాయి. ఈ వ్యాధి పుట్టుక గురించి కూడా అనేక రకాల వివాదా లున్నాయి.

చైనా ఒక పధకం ప్రకారం అగ్రరాజ్యంపై కుట్రపూరితంగానే ఈ వ్యాధిని ప్రబలింపచేశారని ఆరోప ణలున్నాయి.

సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే ఈ విషయం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అరోపణలు కురిపించారు.

అయితే మందుల తయారీలో కొత్తకొత్త వ్యాక్సిన్‌ రూపొందించడంలో పొరపాటు జరగడంతో లీక్‌ అయి ఇది వ్యాపించిందనే వాదన కూడా ఉంది.

ఏదిఏమైనా ఇది ఎందుకు ఎలా పుట్టి వచ్చినా ఇప్పటికే లక్షా పది హేనువేలమంది మరణించగా మరో 18లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది.

వారిలో ఎందరు చికిత్సపొంది బయటికి వస్తారో అంతుపట్టకుండా ఉంది.

ఇంకా ఈ వ్యాధి ఎన్ని లక్షలమందికి విస్తరిస్తుందో కూడా అంచనా కు అందడంలేదు. భారత్‌లో కూడా ఈ వైరస్‌ విస్తరిస్తుం దనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నది.

లాక్‌డౌన్‌,భౌతిక దూరం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు.

లాక్‌డౌన్‌ ఎంతకాలం విధించగలరు?ఇందువల్ల రాబోయే అర్ధకసంక్షోభం ఎలా ఎదుర్కోవాలి? అన్నీ ప్రశ్నలే. ఇలాంటి సమస్యలకు శాశ్వత పరష్కారం వైపు అడుగులు వేయాలి. వైద్యరంగంలో మరింత పురోగమించాల్సిన అవసరం ఉంది.

మందుల తయారీలో భారతదేశం ఆదిలో కొంత వెనుకబడి ఉన్నా ఇప్పుడు బాగా పుంజుకుందనే చెప్పవచ్చు.

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో భారత ఔషధ పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యం అంతంతమాత్రమే ఉండేది.

దీంతో భారత్‌లో ఉత్పత్తి సాగిస్తున్న విదేశీ మందుల సం స్థల మీద అధికంగా ఆధారపడాల్సి వచ్చేది. మందుల ధరలు కూడా బాగా ఎక్కువగా ఉండేవి.

గత రెండు మూడు దశాబ్దాల్లో భారత్‌ ఔషధ పరిశ్రమ బాగా ఎదిగి నేడు భారత్‌ను ప్రపంచంలో అత్యధిక పరిణామంలో మందులను తయారు చేసే దేశాల్లో మూడోస్థానంలోకి చేరుకుంది.

అయితే మందుల నిల్వలపరంగా చూస్తే 14వ స్థానంలో నిలిచింది.

నేడు భారత్‌ దిగుమతి చేసు కుంటున్న ముడిసరుకుల విలువ కన్నా ఎగుమతి చేసే మందుల విలువ ఆరు రెట్లు ఎక్కువ.

అమెరికాకు భారత దేశం ఎగుమతి చేస్తున్న మందుల పరిణామం వాటి మొత్తం విలువ చైనా ఎగుమతులకు మించిపోయింది.

అమెరికా మందుల నియంత్రణ సంస్థ అనుమతి పొం దిన మందుల తయారు యూనిట్ల సంఖ్య అమెరికా తర్వాత భారత్‌లోనే ఎక్కువ.

విదేశీ ఫార్మసంస్థల కం పెనీ కన్నా తమ ఖర్చులు తగ్గించుకోనేందుకు భారతదేశం లోనే మందులు తయారు చేయించుకుంటున్నాయి.

ప్రపంచ టీకాల ఉత్పత్తి 60శాతం యూనిసెఫ్‌కు ఏటా సరఫరా చేసే మందులు 30శాతం ఐక్యరాజ్యసమితి ఏటా కొనుగోలు చేసే మందులు 80శాతం భారత్‌లో ఉత్పత్తి అవ్ఞతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తైతే మందులు టీకాలు తయారుచేసే భారతీయ ఔషదీయసంస్థలు తమ ముడిసరుకుల కోసం చైనామీద ఆధారపడుతున్నాయి.

ఆ ఆధారపడ్డం తగ్గించేందుకు గత ఐదారేళ్లుగా భారత్‌ ప్రయత్నం చేస్తున్నది.

ఇది సఫలీకృతం అవ్ఞతే భార తీయ ప్రజా ఆరోగ్యరంగం పదిలంగా ఉండడం మాత్రమే కాక ఔషధరంగంలో భారత్‌ అంతర్జాతీయ నాయకత్వ శ్రేణికి చేరుకుంటుంది.ఆధునిక వైద్యం అంటే అల్లోపతి ఒక్కటేకాదు.

ఆయుర్వేదం,యునాని,హోమియో,సిద్డి లాంటి ఎన్నో దేశీయ వైద్యవిధానాలు ఉన్నాయి.

ఐరోపా దేశాలతో పాటు చైనా కూడా ప్రాచీన వైద్యవిధానల వైపు దృష్టి సారిస్తున్నాయి

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఔషధ మొక్కల వ్యాపారం ఇందుకు అద్దం పడు తున్నది.భారత్‌ కూడా ఆ కోణంలో మరిన్ని అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/