వితంతు బతుకులపై వీడని నిర్లక్ష్యం

Widows
Widows (FILE)

వితంతు బతుకులపై వీడని నిర్లక్ష్యం

భర్తలు చనిపోగానే వితంతువ్ఞలుగా మిగిలిపోతున్న మహిళలు దేశంలో కొన్ని వేల మంది ఉన్నారు. వితంతు పునర్వివాహం వంటి సంస్కరణలు వచ్చి ఎన్నో ఏళ్లవ్ఞతున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో వితంతువ్ఞలపై ఆయా కుటుంబాల నుంచే ఉదాసీనత ఎదురవ్ఞతోంది. వారికి భర్త నుంచి వచ్చే ఆస్తిపాస్తులపై ఎలాంటి హక్కులు లేకుండా వీధి లోకి నెడుతున్నారు. భర్త ఆస్తిపాస్తులు వీరికితప్పనిసరిగా చెందుతాయన్న భ యంతో ఆయా కుటుంబాలు వీరిని బలవంతంగా ఇంటి నుంచి వెళ్లగొట్టడం తరచుగా జరుగు తోంది. అటువంటి వారిలో చాలా మంది ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ వంటి నగరాలకు చేరి అనాధశరణాలయాల్లో తలదాచుకోవలసి వస్తోంది.దీని వెనుక మూఢా చారాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. వితంతువ్ఞ ఎవరైనా హిందుమత సంప్రదాయం ప్రకారం సాధారణ జీవితంలోని మూడు ప్రధాన అంశాలను విడిచిపెట్టాలి. అర్థ,కామ,ధర్మ అనే ఈ మూడు అంశాలను విడిచిపెట్టాలన్న ఆచారంతో వితంతు వ్ఞలను ఇంటి నుంచి బయటకు వెళ్లగొడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌ లోని కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా వితంతువ్ఞ అయితే మళ్లీ పెళ్లి చేసుకోడానికి వీలుండదు. మంచి ఆహారం తీసుకో కూడదు.

తెల్లవస్త్రాలు ధరించాలి. నిరాడంబరంగా మంచి వారిగా కనిపించాలని వినీతవర్మ చెప్పారు.ఎలాంటి లాభా పేక్ష లేని ‘సులాభ్‌ ఇంటర్నేషనల్‌ అనే సేవాసంస్థకు ఉపాధ్యక్షులు గా వినీత వర్మ పనిచేస్తున్నారు. ఈ వితంతువ్ఞలు తమ తరు వాత జీవితం తమభర్తల మృతికి సంతాపంగా, ప్రశాంతంగా గడపాలన్న భావన కనిపిస్తోంది.

భర్తలు చనిపోగానే భర్త తర పు బంధువ్ఞలు వీరిని చాలా వేగంగా బలవంతంగా బయటకు పం పుతుంటారు. భర్తవారసత్వ ఆస్తిని వీరు కోరతారేమోనన్న భయం కుటుంబీకులను పీడిస్తుంటుంది. సమాజం, కుటుంబం ఎప్పుడైతే వీరిని బయటకు నెట్టివేసిందో చాలామంది పవిత్ర పుణ్యక్షేత్రం బృందావన్‌కుచేరుతుంటారు

ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆత్మ శాంతిని కోరుతుంటారు. అయినా వీరిని ఆదుకునే ఆర్థికతోడ్పాటు కరువై చాలామంది బిచ్చగత్తెలుగా గడుపుతుం టారు. ఈ ప్రక్రియ లో వీరు అత్యాచారాలకు,ఇతర దురాగతా లకు బాధితులవ్ఞతుం టారు. చాలా మంది వితంతువుల ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడుస్తుండే అనాథ శరణాయాల్లో తలదాచుకొంటున్నారు. ఈ శరణాలయాల్లో వృద్ధులకు కావలసిన సౌకర్యాలు ఉండవ్ఞ. శరణాలయాలు శిధిలస్థితిలో కొట్టుమిట్టాడుతుంటాయి. వీటి తలుపులకు, కిటికీలకు మర మ్మతులు ఉండవ్ఞ. దీన స్థితిలో ఉంటుంటాయి. చలికాలం లో వీరి బాధలు చెప్పడం వీలుకాదు. ఎముకలు కొరి కేలా చలి ఉన్నా తమ బాగోగులు ఎవరూ పట్టించుకోవడం లేదని వీరు ఫిర్యాదు చేస్తున్నారని జాతీయ మహిళా కమిషన్‌ 2016 అధ్యయనం వెల్లడించింది. అధ్వాన్నస్థితిలో ఉన్నఈరక్షణ గృహా ల్లో దాదాపు రెండువేల మంది ఉంటున్నారు.

డబ్బులు చెల్లిస్తే మెరుగైన వసతులు కల్పిస్తారన్న ఆశతో వీరు బిచ్చమె త్తుకునే ఉదంతాలు కూడా జరుగుతున్నాయి. వీరి బాధలను 2012లో సుప్రీంకోర్టు గమనించింది.వీరి దీనస్థితిని అధ్యయ నం చేయడానికి ప్రత్యేక కమిటీని నియమించింది. ఎందుకు వీరు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. వీరి ఆర్థికవనరులు ఏమిటో తదితర కారణాలను ఆరా తీయడానికి పూనుకుంది. ఈ నేపథ్యంలో మంత్రిత్వశాఖ, మహిళా జాతీయ కమిషన్‌ సవివరంగా ఆమోదకరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి గతఏడాది సుప్రీం కోర్టు ముందు నివేదిక ఉంచింది. వితంతువ్ఞల సంరక్షణకు సరైన చర్యలు తీసుకోవాలని 2012 లో నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ ఆధారిటీ నల్సా కోరింది.

– దొరయ్య