అమలు చేయలేని చట్టాలెందుకు?

ఒక్కమాట  (ప్రతి శనివారం)

Why Impractical laws?

ఏ తల్లిదండ్రులూ తమ పిల్లలను మనస్ఫూర్తిగా అలాంటి పనులకు ఆ వయసులో పంపరనేది వాస్తవం. అయినా ప్రేగు తెంచుకొని పుట్టిన కన్నబిడ్డలను పదిరాళ్లకోసం పరాయిపంచకు పంపడానికి కారణం వారి ఆర్థిక పరిస్థితేననేది నగ్నసత్యం. ఆ పిల్లలు చేయలేని, చేయరాని పనులెన్నో చేస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తున్నారనే విషయం ఆ తల్లిదండ్రులకు కూడా తెలియందికాదు. అయినా వారి ఆర్థిక పరిస్థితులే నోరు విప్పనీయడం లేదు.

తల్లిదండ్రులకు దూరమై వారి ప్రేమావాత్సాల్యాల కోసం ఆ పసిహృదయాలు ఎంత వేదన పడుతుంటాయో చెప్పడానికి మాటలు దొరకవ్ఞ.అటు తల్లిదండ్రులకు దూరంగా, ఇటు తమకు ఇష్టం లేని వ్యవస్థలోకి పిల్లలు బలవంతంగా ప్రవేశిస్తున్నారు. అందుకు ఏకైక కారణం ఆ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న దారిద్య్రమే. ఆ కోణంలో ఆలోచిస్తే ఈ సమస్యకు కొంతవరకైనా పరిష్కారం లభిస్తుంది.

నే టి బాలలే రేపటి పౌరులు, భావిభారత నిర్మాతలంటూ దాదాపు దేశమంతా గురువారం మళ్లీ ఒకసారి మారు మ్రోగిపోయింది. దేశవ్యాప్తంగా మొన్న బాలలదినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ ఒక్క ఏడాదేకాదు ప్రతి ఏడాదీ నవంబరు 14న బాలలదినోత్సవం జరుపుకుంటూనే ఉన్నాం. బాలల భవిష్యత్తు గురించి వారి అభ్యున్నతికి చేపట్టే కార్యక్రమాల గురించి పెద్దఎత్తున నేతలు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. బాలలకు ప్రాథమిక హక్కుల గూర్చి రాజ్యాంగంలో రాసుకున్నాం. విద్యా వైద్యం తదితర కనీసజీవనానికి అవసరమైన అన్నిఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందనేది అందరికి తెలిసిందే. కానీ ఏ మేరకు అమలు చేస్తున్నాం?

ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బాలలదినోత్సవాలు జరుగుతున్నాయి. ఐక్య రాజ్యసమితి పిలుపు మేరకు ప్రపంచదేశాలన్నీ నవంబరు 20న బాలల దినోత్సవాలు జరుపుకుంటే భారత్‌లో మాత్రం పండిట్‌ జవహర్‌లాల్‌నెహ్రూ జన్మదిన సందర్భ´ంగా చిల్డ్రన్స్‌డేను నిర్వహిం చుకుంటున్నాం.వాస్తవంగా 1964 వరకు భారతదేశం కూడాఇతర దేశాలతోపాటు నవంబరు20నే ఈ బాలల దినోత్సవాన్ని జరుపు కునేది.

ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ 1964లో మరణించి న తర్వాత ఆయనకు పిల్లలపై ఉండే ప్రేమానురాగాలకు గుర్తుగా ఆయన పుట్టిన రోజు నవంబరు 14న చేసుకుంటున్నాం. కానీ ఎన్నో కోట్లమంది బాలలు ఈ ఆనందానికి,ఈ ఉత్సవాలకు దూరంగా ఉన్న విషయాన్ని విస్మరించలేం. ఆటపాటలు, చదువ్ఞ సంధ్యలతో ఆనందంగా గడపాల్సిన కోట్లాదిమంది బాలల జీవితా లు కళ్లముందే బుగ్గిపాలవ్ఞతున్నాయి.బాలకార్మికులుగా ఏళ్లతరబడి మగ్గిపోతున్నారు.పాత చట్టాలకు మరింత పదునుపెట్టి పకడ్బందీ గా సరికొత్త చట్టాలను తీసుకొచ్చామని నేతలు చెప్పుకుంటున్నా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఏదో ఒక మార్గంలో ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉన్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఏళ్లతరబడి మగ్గుతున్న బాలకార్మికులను ఆ కూపం నుండి బయటకు తీసుకువచ్చినా వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్రప్రభుత్వాలు విఫల మవ్ఞతున్నాయి.

క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకొని నిర్దిష్ట చర్యలవైపు అడుగులు వేయలేకపో తున్నారు.చట్టాలు,శిక్షలు కాగితాలకే పరిమితం కావడంతో బాల కార్మికవ్యవస్థ యధేచ్ఛగా కొనసాగుతుందని చెప్పొచ్చు.స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి జవహర్‌లాల్‌నెహ్రూ మొదలు నేటి ప్రధాని నరేంద్రమోడీ వరకు బాలలపట్ల అత్యంత ప్రేమానురాగాలు చూపే వారే.ఈ బాలలే భావిభారత పౌరులని,వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశించినవారే. ఆ దిశలో ఎన్నో కార్యక్రమాలు,మరెన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రోత్సహించిన వారే.

అంతెందుకు రాజ్యాం గంలోని 24వ అధికరణ బాలకార్మిక వ్యవస్థను సమూలంగా వ్యతిరేకిస్తున్నది.14 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలను వ్యక్తులుకానీ, సంస్థలు కానీ పనిలో పెట్టుకోకూడదని నిర్దేశిస్తు న్నది. రాజ్యాంగంలోని 39(ఇ) అధికరణ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. లేత వయసులో ఉన్నపిల్లలను వారి వయసుకు మించిన పనిలో పెట్టుకోకూడదని రాజ్యాంగ నిబంధ నలు ఘోషిస్తున్నాయి. చివరకు తల్లిదండ్రులు కూడా తమ ఆర్థిక అవసరాల నిమిత్తం పిల్లలకు వయసుకు మించిన భారం అప్ప గించకూడదని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది.మరొకపక్క ప్రమా దాలకు అవకాశం ఉన్న పరిశ్రమలు,గనులు వంటి ప్రదేశాల్లో బాల కార్మికులను నియమించరాదని మరో చట్టాన్ని తీసుకువచ్చారు.

రాజ్యాంగ నిర్దేశాలు, చట్టాలున్నా ఫలితం అంతగా లేకపోవడంతో బాలకార్మిక వ్యవస్థలో మార్పులులేక మరింత పెరుగుతుండడంతో 1986లో 13 వృత్తులకు సంబంధించి 57 రకాల పనులను చిన్న పిల్లలతో చేయించకూడదని మరోచట్టాన్ని తీసుకువచ్చారు.ఆ చట్టా నికి విరుద్ధంగా బాలకార్మికులను పనిలో నియమించుకునే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీచేశారు. అయినా ఆశించిన ఫలితాలు చేకూరలేదు.1994లో ఈవిషయంలో ఆందోళన చెందిన అప్పటి ప్రధాని పి.వి నరసింహారావ్ఞ పటిష్టమైనచర్యలకు ఆదేశిం చారు. 2000నాటికి ఈ వ్యవస్థ సమూలంగా నిర్మూలించగల మని ప్రకటించారు.అదికూడా కాగితాలకే పరిమితమైంది. రోజురోజుకు పెరిగిపోతున్న బాలకార్మికుల సంఖ్యను,పరిస్థితులను చూసి ఆందోళన చెందిన సర్వోన్నత న్యాయస్థానం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో కేంద్రప్రభుత్వం ఉన్న చట్టా లతో బాలకార్మికవ్యవస్థ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయడం సాధ్యంకాదని 2006అక్టోబరు పదిన మరో చట్టాన్ని తీసుకువచ్చా రు. దేశవ్యాప్తంగా ఇళ్లల్లో పనిచేస్తున్న లక్షలాది మంది బాలకార్మి కుల భవిష్యత్తుకు భరోసాకల్పించి వారికి అక్షరాలునేర్పించి చైతన్య వంతులను చేయాలనే దిశలో నడుంబిగించారు.

ఈ చట్టం ప్రకారం ఇళ్లల్లోనూ, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు తదితర చోట్ల పనిచేసే బాలలందరికీ విముక్తి కలిగించి ప్రత్యామ్నాయం చూపాలని నిర్దే శించారు. ఇందుకోసం పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, బాలలను పనిలో పెట్టుకునేవారిపై క్రిమినల్‌ కేసులు పెట్టి జరిమానాతో సరిపెట్టకుండా జైలుశిక్ష కూడా విధించే విధంగా చర్యలుతీసుకోనున్నట్లు ప్రకటించారు.ఈ హడావ్ఞడి, హం గామా చూసి కొంతలో కొంతైనా మార్పు వస్తుందని ఆశించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలు ఎయిర్‌కండిషనర్‌ గదుల్లో ఉండే అధికారులకు తెలియకపోవడం,చట్టాలను అమలుచేసేందుకు అవసరమైన కనీస సిబ్బందిని కూడా నియమించకపోవడంతో ఆశించిన ఫలితాలు చేకూరలేదు. అలాని ఏమి చేయలేదని చెప్ప డంలేదు.ఇళ్లల్లో, హోటళ్లల్లో, రెస్టారెంట్లలో పనిచేస్తున్న బాలకార్మి కులను కొందరిని బయటకు తీసుకువచ్చారు.

వారికి విముక్తి కలిగి స్తున్నట్లు ప్రకటించారు.కానీ వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ డంలో విఫలమవ్ఞతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బాలకార్మికులు మగ్గిపోతుంటే వేలమందిని బయటకు తీసుకువస్తున్నారు. వందల సంఖ్యలో మాత్రమే పునరావాసం కల్పిస్తున్నారు. అవి కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో ఆ వందల సంఖ్యలో ఉన్న పిల్లలు కూడా తిరిగి పాతబాటే మేలని భావించి ఆ మార్గంవైపు మొగ్గుచూపుతున్నారు. పిల్లల పునరావా సంకోసం చేపడుతున్న కార్యక్రమాలు, రెసిడెన్షియల్‌ బ్రిడ్జిసెంటర్లు విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పుకుంటున్నా వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.

నిర్మాణరంగంలో అవసరమయ్యే సిమెంటు, ఇటుకలు తదితర సామాగ్రి తయారు చేయడంలో వేలాదిమంది బాలకార్మికులు మగ్గిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం కల్పించే పునరావాస కార్యక్రమాలపై నమ్మకం కలగడం లేదు.ఇటు చదువ్ఞరాక, పనిరాక రెంటికి చెడ్డరేవడిలా తయారయ్యే మరో మార్గంలో ప్రయాణిస్తారేమోనన్న భయం, ఆందోళనకు గురవ్ఞతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదువ్ఞతున్న బాలల పరిస్థితి మరోవిధంగా ఉంది.

పన్నెండు, పదమూడేళ్ల వయస్సు ఉన్న పిల్లలను ఒకటో తరగతిలోనూ, రెండోతరగతిలోనూ నాలుగైదేళ్ల వయస్సున్న పిల్లలతో కలిపి కూర్చోపెడితే ఏమవ్ఞతుందోనని పెద్దలు ఆలోచించకపోవడం దురదృష్టకరం. ఉపాధ్యాయులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా తొమ్మిది, పదేళ్ల తేడాతో ఉన్న పిల్లలతో కలిసి చదువ్ఞకోడానికి వారు నామోషిగా భావిస్తున్నారు. ఫలితంగా కొన్ని రోజులకే పాఠశాలకు స్వస్తి చెప్పి మళ్లీ పాతబాటపడుతున్నారు. వారికి ఆశావాహక భవిష్యత్తు గురించి వివరించే కౌన్సిలింగ్‌ సమర్థవంతంగా, సక్రమంగా చేయలేకపోతున్నారు. ఈ బాలకార్మికులను ఈ కూపం నుంచి బయటకు తెచ్చి, పునరావాసం కల్పించామని ప్రకటనలు చేస్తున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగాఉన్నాయి.

కోట్లాది రూపాయల నిధులు నిరుపయోగం అవ్ఞతున్నాయి. దీనికి తోడు లేతవయస్సులో చదువ్ఞ సంధ్యలతో ఆడుతూపాడుతూ కళ్లముందుండాల్సిన పిల్లలు ఎక్కడో కన్పించని ప్రాంతాలకు పని కోసం పంపుతున్న ఆ తల్లిదండ్రులు ఎంతటి మానసికక్షోభకు గురవ్ఞతున్నారో ఒక్కసారి మనస్సుపెట్టి ఆలోచించాలి. ఏ తల్లిదం డ్రులూ తమపిల్లలను మనస్ఫూర్తిగా అలాంటి పనులకు ఆ వయ సులో పంపరనేది వాస్తవం.అయినా పేగుతెంచుకొని పుట్టిన కన్న బిడ్డలను పదిరాళ్లకోసం పరాయిపంచకు పంపడానికి కారణం వారి ఆర్థికపరిస్థితేననేది నగ్నసత్యం.

ఆ పిల్లలు చేయలేని, చేయరాని పనులెన్నో చేస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తున్నారనే విషయం ఆ తల్లిదండ్రులకు కూడా తెలియందికాదు. అయినా వారి ఆర్థిక పరిస్థితులే నోరు విప్పనీయడం లేదు. తల్లిదండ్రులకు దూరమై వారి ప్రేమావాత్సాల్యాల కోసం ఆ పసిహృదయాలు ఎంత వేదన పడుతుంటాయో చెప్పడానికి మాటలు దొరకవ్ఞ. అటు తల్లిదండ్రులకు దూరంగా, ఇటు తమకు ఇష్టం లేని వ్యవస్థలోకి పిల్లలు బలవంతంగా ప్రవేశిస్తున్నారు. అందుకు ఏకైక కారణం ఆ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న దారిద్య్రమే. ఆ కోణంలో ఆలోచిస్తే ఈ సమస్యకు కొంతవరకైనా పరిష్కారం లభిస్తుంది.

-దామెర్ల సాయిబాబ

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/