ఒకే బాటలో లెఫ్ట్‌ అండ్‌ రైట్‌

రాష్ట్రం: పశ్చిమబెంగాల్‌

West Bengal Politics
West Bengal Politics

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో సరికొత్త రికార్డు రాజకీ యం కనిపిస్తున్నది. లోక్‌ సభ ఎన్నికల్లో లెఫ్ట్‌-రైట్‌ పార్టీలు ఒకే బాటలో పయనించడం అంద రినీ ఆశ్యర్యపర్చుతున్నాయి. ప్రత్యర్థి బలంగా ఉంటే స్వంతంగా ఎదుర్కొనే సత్తా లేని పరిస్థితి ఉంటే సిద్ధాంతాల రాద్ధాంతాలు పక్కకు పోతాయని మరోసారి బెంగాల్‌లో రుజువవుతు న్నది.శ్రామిక శ్రేయోరాజ్యం, కమ్యూ నిస్టు సిద్ధాంతాలు అంటూ గిరిగీసుకుని ఉండే పార్టీలు తమ దృక్పథానికి భిన్నంగా మతతత్వ పార్టీగా ముద్ర పడిన బిజెపికి కొమ్ముకాయడం గమనార్హం. సహజం గా కమ్యూనిస్టు పార్టీలు ఇతరత్రా అన్ని పార్టీలతో ఏదో ఒకవిధంగా సర్దుబాటు సై అంటూ నడుస్తాయే కానీ భారతీయ జనతాపార్టీ లేదా దానికి ముందు జనసంఘ్‌ పేరుతో ఉన్నప్పటి రోజుల్లో సైతం బిజెపి ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో నూ బిజెపితో అంటకాగడానికి ససేమిరా అంటాయి. ఇంతగా ఉపోద్ఘాతం ఎందుకు అవసరం అయిందంటే బెంగాల్‌లో ఈ సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులు నేరుగా బిజెపితో కూడా కలిసి పోవడానికి ముందుకు రావడమే రాజకీయాల్లో కీలక పరిణామంగా అంచనా వేయాల్సి వస్తున్నది. శత్రువుకు, శత్రువు మిత్రుడనే రాజకీయ నీతి ఈ విధంగా కమ్యూనిస్టులు కొత్త సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకొని తృణమూల్‌ పార్టీని ఓడించేందుకు బిజెపితో జతకట్టారని ఇదికూడా అంతా లోపాయికారిగానే జరుగుతున్నదనే ప్రచారం బెంగాల్‌లో అధికంగా జరుగుతున్నది. కమ్యూనిస్టులకు నిర్భేద్యమైన కోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఈ కోటను బద్దలు కొట్టి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాష్ట్రంలో కమ్యూ నిస్టుల ప్రాబల్యం క్రమేణ తగ్గుతూ వస్తున్నది. దీంతో మమతాను దెబ్బతీయడానికి అను వైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న కమ్యూనిస్టులకు ఈ ఎన్నికలు ఒక మంచి అవకాశంగా తీసుకు న్నాయి. దాదాపు 34 సంవత్సరాల ఎదురులేని కమ్యూనిస్టుల పాలన రికార్డు స్థాయిలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రికార్డు సాధించిన జ్యోతిబసు పాలన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిలో ఉంటుంది. అయితే ఇలాంటి చరిత్రను తిరగ రాసినట్లుగా మమతా బెనర్జీ ఆ రాష్ట్రం లోనే తిరిగులేని ఆధిక్యతతో ముఖ్య మంత్రిగా పీఠాన్ని అధిరోహించడం కూడా చరిత్రలో తప్పక రికార్డుకావాల్సిందే. అయితే తమను ఓడించిన మమతపై సహజంగానే కమ్యూనిస్టులు కోపంగా ఉంటారు. కానీ ఇది సిద్ధాంతాలనే వదులుకునే స్థాయి ఆగ్రహంగా మారిం దని ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపి స్తున్నది. బెంగాల్‌ ప్రస్తుతం ప్రధాన రాజకీయ ప్రత్య ర్థులు తృణమూల్‌- బిజెపిలే.కాంగ్రెస్‌,కమ్యూ నిస్టు పార్టీలది తర్వాతి స్థానాలే. అయితేమమత జాతీయ రాజకీయాల్లో నూతన ప్రభావాన్ని పెంచు కునే దిశగా వేస్తున్న అడు గులు బిజెపి అగ్రనాయక త్వానికి ఏమాత్రం రుచించ డం లేదు. దీంతో ఆమెను గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో బిజెపి జాతీయ నాయకత్వం ప్రత్యేక కార్యాచరణతో వ్యూహం పన్ని అధిక వనరులను వ్యయం చేస్తూ, కలసి వచ్చే వారందరి చేయూతను తీసుకుంటున్నది. అయితే బెంగాల్‌లో కమ్యూనిస్టులు తిరిగి పాగా వేయడానికి అవకాశాలు వెంటనే లేకపో వడంతో మమతను మట్టి కరిపించడానికి బిజెపిని ముందుపెట్టి తమ పంతం నెరవేర్చుకోవాలనే తలంపుతో వామపక్ష నేతలు పరోక్షంగా బిజెపికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. బిజెపికి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో తగిన బలం- బలగం లేనందున సిపిఎం శ్రేణులు తృణమూల్‌కు వ్యతిరేకం గా పనిచేస్తున్నందున అది నేరుగా బిజెపికే మేలు జరిగేలా ఉంది. కోల్‌కతా ఉత్తర్‌ నియోజక వర్గంలోని 1862 పోలింగ్‌ కేంద్రాల్లో నాలుగోవంతు పోలింగ్‌ కేంద్రాల్లో కూడా బిజెపికి బలంలేదు. వారి కార్యకర్తలు కేవలం 450 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మాత్రమే కనిపిస్తున్నారు. బిజెపి పోల్‌ మేనేజర్లు స్వయంగా సిపిఎం కార్యకర్తలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిరోజూ కార్యాచరణకు పూనుకుంటున్నారనే విమర్శ లున్నాయి.బిజెపికి ఏజెంట్లు కూడా లేని ప్రాంతాల్లో సిపిఎం ఎజెంట్లు పోలింగ్‌ కేంద్రాల్లో ఉండి, బిజెపికి అనుకూలంగా పనిచేయాలనే విధంగా మాట సహాయం చేసుకుంటున్నారని, ఇరుపక్షాల మధ్య ఇలాంటి ఒడంబడిక ఉందని అంటున్నారు. అయితే సిపిఎం అగ్రనేతలు మాత్రం ఇలాంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా క్యాడర్‌ మాత్రం తృణమూల్‌పై కోపంతో కమ్యూ నిస్టులకు సహకరిస్తున్నారు. దీంతో అగ్ర నేతల్లో ఆందోళన కనిపిస్తున్నది. జాతీయ స్థాయిలో వారు బిజెపికి భద్ర విరోధులుగా ఉంటున్న పరిస్థితుల్లో బెంగాల్‌ రాష్ట్రంలో తమ క్యాడర్‌ అదే పార్టీతో సన్ని హితంగా మెలగు తుండటం సహజంగానే అగ్రనేతలకు ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టివేసినట్లుగా ఉంటున్నది. సిపిఎం పొలిట్‌బ్యూరో స్థాయిలో ఈవిషయం పరిశీల నకు వచ్చింది. ఈ మేరకు అగ్రనేతలు తమ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు కూడా పంపినప్పటికీ క్యాడర్‌ దానిని బేఖాతరు చేసినట్లు సమాచారం. అయితే తృణ మూల్‌ ప్రభుత్వం వల్ల కమ్యూనిస్టు క్యాడర్‌ అధికంగా నష్టపోయింది. క్యాడర్‌కు అనేక ఇబ్బందులు వచ్చిపడ్డా యి.ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బిజెపి పట్ల కమ్యూనిస్టు క్యాడర్‌ కొంత మొగ్గు చూపు తూ తృణమూల్‌ నుంచి రక్షణకావాలంటే బిజెపి మద్దతు అవసరమై విధంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న ట్లుగా చెబుతున్నారు. బిజెపితో చేతులు కలపడం ఆత్మ హత్యా సదృశ్యమని, కాషాయం కట్టుకోవద్దు అని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నప్పటికీ పరిస్థితుల్లోమార్పు లేదు. తృణమూల్‌ దెబ్బతో కమ్యూనిస్టుల కంచుకోట దెబ్బతిని వారి ప్రభావం నామమాత్ర స్థాయికి పడిపోగా, ప్రస్తుతం బిజెపి వైపు మొగ్గు చూపుతున్న వారి వల్ల కమ్యూనిస్టుల ఉనికికే ప్రమాదం ఏర్పడే స్థాయికి రాజకీయాలు మారాయని భావిస్తున్నారు.

కోనేటి రంగయ్య