‘వాటర్‌ బెల్స్‌’ మోగిద్దామా?

ఇన్నాళ్లు దేశంలోని పాఠశాలల్లో ప్రార్థనకు, పిరియడ్‌లకు సంబంధించిన గంటలు మాత్రమే మోగేవి. నేడు నీటి గంటలు మోగుతున్నాయి. నీటి గంటలు కొట్టే కార్యక్రమం పట్ల ప్రజలు అబ్బురపడుతున్నారు. పాఠశాలల్లో ఒకటో గంట, రెండో గంట, మూడో గంట, పిరియడ్‌ గంటలు మాత్రమే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సుపరిచితం. ఉదయం పూట నిర్ణీత సమయానుసారం పాఠశాల ప్రారంభ సమయంలో విద్యార్థులను ప్రార్థనకు సన్నద్ధం చేయడం కోసం ఒకటో గంటను సుదీర్ఘంగా మోగిస్తారు.

Water bells rings in a healthy pratice in kerala schools (file)

ఐదు నిమిషాల అనంతరం దీర్ఘమైన రెండోగంట ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులచే ప్రార్థన ప్రారంభమవ్ఞతుంది. ప్రార్థన అనంతరం మూడవ గంట ద్వారా విద్యార్థులు తమ, తమ తరగతి గదుల్లోకి వెళ్లిన తర్వాత మొదటి పిరియడ్‌ ప్రారంభమవ్ఞతుంది. తర్వాత నిర్ణీత కాలవ్యవధిలో పిరియడ్‌ల ప్రకారం గంటలు మోగుతాయి. సాయంత్రం చివర్లో లాంగ్‌బెల్‌ ద్వారా విద్యార్థులు తమ ఇళ్లకు పయనమవ్ఞతారు. ఇది పాఠశాలల రోజువారీ కార్యక్రమం. ప్రస్తుతం సామాజిక, ప్రసార మాధ్యమాలలో వార్తాపత్రికలలో ప్రచారమవ్ఞతున్న వార్త వాటర్‌ బెల్స్‌. దీనిపై కథనాలకు వివిధ వర్గాల ప్రజలందరూ ఆకర్షితులవ్ఞతున్నారు. వాటర్‌ బెల్స్‌ ద్వరా ఒనగూరే ప్రయోజనాల గూర్చి తల్లిదండ్రు లు ఆలోచిస్తున్నారు.

ఈ వినూత్న వాటర్‌బెల్స్‌ కార్యక్రమాన్ని కేరళరాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో ప్రవేశపెట్టింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రధానాంశంగా చేసుకొని వారికి మంచి అలవాటును నేర్పే కార్యక్రమంగా వైద్యులు దీనిని ప్రశంసిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవచ్చో వాటర్‌ బెల్స్‌ మోగించడం ద్వారా కేరళ ప్రభుత్వం విద్యార్థులకు తెలియచేస్తున్నది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించడానికి రోజు నీరు సరైన మోతాదులో తాగడం చాలా ముఖ్యం. మానవ శరీరంలోనీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

ప్రతి రోజూ ఆరు నుంచి ఎని మిది గ్లాసులనీరు తాగ డంవలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నా యని వైద్యులు చెబుతు న్నారు. శరీరంలో వ్యర్థా లను తొలగించడానికి, చర్మాన్ని శుభ్రం చేయడానికి, అధిక బరు వ్ఞని నియంత్రించడానికి, రక్తప్రసరణను సమతౌల్యంలో ఉంచడా నికి, మలబద్ధకనివారణకు, డీహైడ్రేషన్‌ నియంత్రణకు సరైన పాళ్లలో నీరు తీసుకోవాలని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. సహజంగా చిన్న పిల్లలు పాఠశాలల్లో వివిధ వ్యాపకాలలో పడి నీటిని తాగటాన్ని మర్చిపోతారు. విద్యార్థుల్లో నీటిని తాగటాన్ని ఒక అలవాటు చేయడానికి కేరళరాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

కేరళరాష్ట్రంలోని అన్ని పాఠశాల ల్లో ప్రతి మూడు గంటలకోసారి వాటర్‌ బెల్‌ కొట్టే ఏర్పాటును విద్యాశాఖ చేసింది. ఆ సమయంలో విద్యార్థులు నీరు తాగేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకుంటారు. విద్యార్థులతోపాటు వారి ఆరోగ్యంపై శ్రద్ధపెట్టినట్లు అక్కడి విద్యాశాఖాధికారులు చెబుతు న్నారు. వాటర్‌బెల్‌ కార్యక్రమం కేరళనుండి క్రమేపీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వ్యాపించింది. తమిళనాడు పాఠశాలల్లో కూడా కొంత సమయాన్ని వాటర్‌బెల్‌ కార్యక్రమానికి కేటాయిస్తు న్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ లోని కొన్ని పాఠశాలల్లో ప్రవేశపెడుతున్నట్లు ఆయా పాఠశాలల యాజమాన్యాలు ప్రకటిస్తున్నాయి. తెలంగాణాలోని కొన్ని ప్రైవే ట్‌పాఠశాలల యాజమాన్యాలు వాటర్‌బెల్స్‌కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా వాటర్‌ బెల్స్‌ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవే శపెట్టాలనే చర్చమొదలైంది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు వైద్యుల ద్వారా నిర్వహిస్తున్నది. మధ్యాహ్న భోజనంలో దొడ్డు బియ్యం ద్వారా సరైన మోతాదులో ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారని గుర్తించి సన్నబియ్యం ద్వారా ఆహారాన్ని వండిస్తున్నది.పాఠశాలల్లో రక్షిత మంచినీరు, మరుగు దొడ్లు, మూత్రశాలల ద్వారా వాటర్‌బెల్స్‌ ప్రక్రియ సఫలీకృతమ వ్ఞతుంది. ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా మంచినీరు ప్రతీ పాఠశాలకు సరఫరా చేయాలి. ఫలితంగా పాఠశాలల్లో కూడా వాటర్‌బెల్స్‌ మోగించొచ్చు. విద్యతోపాటు పిల్లల ఆహారాన్ని సంరక్షించినట్లవ్ఞతుంది.

  • బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/