‘జల జాగృతి’తోనే సంక్షోభ నివారణ

Save Water
Save Water

పరిమితమైన మంచినీటి లభ్యత వల్ల ఆసియా, ఆఫ్రికా దేశాలతోపాటు భారతదేశం చరిత్రలో అత్యంత ఘోరమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ జనాభాలో 18 శాతం, ప్రపంచ మంచినీటి వనరులలో నాలుగుశాతం కలిగిన మనదేశంలో 600 మిలియన్ల మంది తీవ్ర నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం లభించే నీటి వనరులలో 40 శాతం వినియోగిస్తున్నప్పటికీ రెండు లక్షల మంది నీటి కొరత సమస్య వల్ల మనదేశంలో మరణిస్తున్నారు. 2020 నాటికి 21 భారతీయ నగరాలలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతాయని నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది. ఇందులో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి మహానగరాలున్నాయి.

అ వనిపై జీవ సృష్టికి మూలం జలం. ధరిత్రిపై 71 శాతం సముద్ర జలాలు ఆవరించి ఉన్నా యి. మానవ శరీరంలో కూడా దాదాపు అంతే నిష్పత్తిలో నీరు ఉండటం కాకతాలీయమే అయినా, జలం లేనిదే మనం రెండు, మూడు రోజులకు మించి బతకలేం. జీవ కోటికి ప్రాణాధారమైన నీరు, భూమి పైకి ఎలా వచ్చిందనే విషయంలో భిన్న వాదనలున్నాయి. తోక చుక్కలు, ఉల్కలు, గ్రహశఖలాలు భూమిని బలంగా తాకినప్పుడు వాటిలోని నీరు మన భూమిపైకి వచ్చి చేరిందని కొందరు డ్యూటీ రియం ప్రొటియం ఐసోటోపుల నిష్పత్తి ఆధారంగా చెప్పారు. 2018 జనవరిలో దొరికిన 400-440 కోట్ల సంవత్సరాల నాటి హేడియన్‌ కాలం నాటి ఉల్కలలో నీరు లభించింది. ఇటువంటి ఆదిమ కాలగ్రహశఖలాలే భూమిపై నీటి చేరికకు మూలం అని చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు, ఇతరుల అభిప్రాయం. అయితే మరికొందరు భూమి ఏర్పడిన తొలినాళ్లలో అగ్నిపర్వత ప్రక్రియ వల్ల నీటి ఆవిరి వెలువడి వాతావరణంలోకి చేరి, మేఘాలుగా మారి, వర్షించి సముద్రాలు ఏర్పడ్డాయని మరో వాదన లేవదీశారు. ఏమైనప్పటికీ భూమితో పాటే ఏర్పడిన నీరు భూమిపై 71 శాతం విస్తీర్ణాన్ని ఆక్రమించింది. 29 శాతం ప్రాంతీయ ఖండాలు ఉన్నాయి. ఇక భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97శాతం సముద్ర ఉప్పునీరే. మూడు శాతం మంచినీటిలో రెండు శాతం దృవాలు, హిమానీ నదాలలో గడ్డకట్టి ఉంది. ఇక మనకు అందుబాటులో ఉన్న ఒక శాతంలో 0.7 శాతం భూగర్భంలో ఉండగా 0.3 శాతం భూమిపైన సరస్సులు (8.7శాతం) చిత్తడి నేలలు (11 శాతం)నదులలో (2శాతం) ఉన్నాయి. పరిమితమైన మంచినీటి లభ్యత వల్ల ఆసియా, ఆఫ్రికా దేశాలతోపాటు భారతదేశం చరిత్ర లో అత్యంత ఘోరమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ జనాభాలో 18 శాతం ప్రపంచ మంచినీటి వనరులలో నాలుగుశాతం కలిగిన మనదేశంలో 600 మిలియన్ల మంది తీవ్ర నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం లభించే నీటి వనరులలో 40 శాతం వినియోగిస్తున్నప్పటికీ రెండు లక్షల మంది నీటి కొరత సమస్య వల్ల మనదేశంలో మరణిస్తున్నారు. 2020 నాటికి 21 భారతీయ నగరాలలో భూగర్భజలాలు పూర్తిగా అయిపోతాయని నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది. ఇందులో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి మహానగరాలున్నాయి. రోజురోజుకు వేగంగా క్షీణిస్తున్న భూగర్భజలాలు, పొడి రుతపవ నాలు తగ్గిన వర్షపాతం వల్ల ఎపి,తెలంగాణ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర నీటి సంక్షోభంలో ఉన్నాయి. సరఫరాను మించి పెరుగుతున్న నీటి డిమాండ్‌ జలవనరులపై నానాటికి మరింత ఒత్తిడిని పెంచుతుంది. నీటి కొరత వల్ల ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగా లకు అవసరమైన మేర నీరు అందుబాటులో లేదు. అందుబాటు లో ఉన్న మంచినీటి వనరులలో 70 శాతం కలుషితం కావటం వల్ల ప్రపంచ నాణ్యతా సూచీలో 122 దేశాల్లో మనదేశం 120వ ర్యాంకు పొందింది. ప్రజలు ఎంత విషజలాన్ని మింగుతున్నారో, జలకాలుష్యం, ఏవిధంగా మానవ నిర్మిత ముప్పుగా పరిణమించిం దో స్పష్టమవ్ఞతుంది. దేశంలో నీటి సమర్థ నిర్వహణ విషయంలో అనేకరాష్ట్రాలు, వెనుకబడి ఉంటున్నాయి. 2015-16లో 24 రాష్ట్రాలలో 14 రాష్ట్రాలు 50 శాతం కంటే తక్కువ స్కోరు సాధించాయి. గుజరాత్‌ (76 శాతం) మధ్యప్రదేశ్‌ (69 శాతం) ఆంధ్రప్రదేశ్‌ (68శాతం)తో సమర్థనీటి నిర్వహణ చేపట్టగా తెలంగాణ (50-65 శాతం)తో మీడియం స్థాయిలో నిలిచింది. ఢిల్లీలో వారానికి మూడు సార్లు ట్యాంకర్ల ద్వారా ఒక వ్యక్తికి రెండు బకెట్లు సరఫరా చేస్తుండగా , చెన్నైకి రైళ్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. చెన్నైకి 30 కిలోమీటర్ల దూరం నుండి, బెంగళూరుకు 86 కిలోమీటర్ల, ఢిల్లీకి 230 కిలోమీటర్లు దూరం నుండి నీటిని సేకరించి నేడు సరఫరా చేస్తున్నారు. ఢిల్లీలో 18శాతం కుటుంబాలకే వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నాణ్యమైన నీరు అందుతుంది. దేశంలో తలసరి నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. ఢిల్లీలో రోజుకు 1100 మిలియన్‌ గ్యాలన్ల నీరు అవసరం కాగా, 900 మిలియన్‌ గ్యాలన్ల నీరే అందుబాటులో ఉంది. అసు రక్షిత జలం వల్ల 21శాతం వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అటవీ ప్రాంతాలలో నీటికొరతవల్ల పశుపక్ష్యాదులే కాక, జంతువ్ఞలుకూడా నీటి కోసం వెళ్లి బావ్ఞలలో పడి మరణిస్తున్నాయి. నీటి కొరతను పసిగట్టిన మార్కెట్‌ శక్తులు ఈ వ్యాపారంలో ప్రవేశించాక నేడు సంప్రదాయ నీటి వనరులు అంతరించిపోయాయి. నీటి వ్యాపార పరిశ్రమగా వర్ధిల్లుతోంది. కావేరీ జలాలపై వివాదం, సింధూజలా లపై భారత్‌-పాక్‌ వివాదం ఇలా నీరు వివాదాలకు, యుద్ధాలకు దారితీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తంగా నీటి సమస్యనేడు సంక్షోభంగా రూపుదాల్చింది. గుక్కెడు మంచినీటి కోసం జల యుద్ధాలు చేసుకునే స్థితికి కారణాలు అన్వేషిస్తే ప్రజలకు ప్రభుత్వా లకు జీవాధారం పట్ల సరైన ముందుపుచూపు లేదని చెప్పవచ్చు. ప్రాచీన, మధ్య యుగాలలోనే మన పూర్వీకులు నదులకు ఆన కట్టలు కట్టి, చెరవ్ఞలను తవ్వి, ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేశారు. కాని నేటి పాలకులు పెరుగుతున్న జనాభాకనుగుణంగా ప్రజల నీటి అవసరాలను గుర్తించి నీటి నిల్వ, సరఫరా వ్యవస్థల ను నిర్మించక పోవడం వల్లనే నేడు ఈ దుస్థితి దాపురించింది. నేడు వ్యవసాయ రంగం విస్తరించి నీటి అవసరం పెరిగింది. వరి ఆధారిత వ్యవసాయం కావటం వల్ల ఎక్కువ నీరు కావలిసి వస్తుంది. ఒక కిలో బియ్యం ఉత్పత్తికి మూడు క్యూబిక్‌ మీటర్ల నీరు అవసరం. ఆధునిక, సంకర జాతి, తక్కువ కాలవ్యవధి, తక్కువ నీటితో పండే రకాలు వచ్చినా రైతులకు సరైన శిక్షణ అవగాహన లేక ఎక్కువ నీటిని వినియోగిస్తున్నారు. 60శాతం నీరు ఆవిరి కావ డమో, నదుల్లో కలవడమో జరుగుతోంది. ఒక వైపు ఎల్‌నినోల ప్రభావం వల్ల వర్షాభావం ఏర్పడి నీటి లభ్యత తగ్గుతూ వస్తోంది. సంప్రదాయ నీటి వనరులైన చెరువ్ఞలు, వాగులు, కుంటలు, బావ్ఞలు, మొదలగు వాటి నిర్వహణ సరిగా లేదు.దాంతో వాటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ప్రాజెక్టులలో రిజ ర్వాయర్లలో పూడిక తీయకపోవడం వల్ల నిల్వ సామర్థ్యం పడిపో యింది.నేడు భూగర్భ జలాలను వినియోగిస్తున్న రేటుకు, తిరిగి భూమిలోకి ఇంకుతున్న రేటుకు మధ్య వ్యత్యాసం పెరిగింది. జల సంరక్షణలో 1984లో గంగా శుద్ధి కార్యక్రమం,ఇతర నదుల అభి వృద్ధి కార్యక్రమాలు, మిషన్‌ భగీరథ, మిషణ కాకతీయ, నీరు- విూరు, వాటర్‌షెడ్‌ పథకాలు, అన్నాహజారే రాజేంద్రసింగ్‌ లాంటి వారి కృషి, తాజాగా కేంద్రం ప్రారంభించిన జలశక్తి అభియాన్‌ వంటి ప్రజాచైతన్య కార్యక్రమాలు కన్పిస్తాయి. మార్చి 22న ప్రపంచ మంచి నీటి సంవత్సరం నిర్వహించి, చైతన్య కార్యక్రమా లు నిర్వహించడం, యుఎన్‌ఇపి, ప్రపంచ వాటర్‌ అభివృద్ధి నివేదికలు వరల్డ్‌ వాటర్‌ ఫారమ్‌, యుఎన్‌ఐసిఇఎఫ్‌, ఎస్‌ఐఎస్‌, గేట్‌ వాటర్‌ గేమ్‌ (బాలికల విద్యపై నీటి కొరత ప్రభావం), కేంద్ర, రాష్ట్రాల జలవనరుల అభివృద్ధి కృషి నిరంతరం కొనసాగుతున్నా యి. ఇటీవలి కాలంలో ప్రభుత్వాల వైఖరిలో మార్పువచ్చింది. ఎంత ఖర్చు అయినా వెచ్చించి వాన నీటిని ఒడిసి పట్టాలనే పాలకుల కృషి ఫలితాలను ఇస్తున్నట్టు కన్పిస్తుంది. జలజాగృతి తోనే ఈ సంక్షోభం నుండి మనం బయట పడతాం. ప్రతి నీటి బిందువ్ఞను ఒడిసిపట్టే పథకాలు, తక్కువ నీటితో హెచ్చు దిగుబ డులకు ప్రణాళికలు, వాటర్‌షెడ్‌ ప్రాంతాలను సక్రమంగా నిర్వహిం చడం,లీకేజీలు అరికట్టడం,నీటి యాజమాన్యాన్ని మెరుగుపరచడం, దేశంలో వినియోగంలోకి రాని జలసంప దపై దృష్టిసారించడం, జలదౌత్యాన్ని క్రియాశీలం చేయడం, పరస్పర సహకారంతో రాష్ట్రాలు నదీ జలాలను పంచుకోవడం,నదుల అనుసంధానం, కేంద్రం గుర్తించిన నీటి ఒత్తిడి గల 256 జిల్లాలోని 1592బ్లాకు లలో నీటి వినియోగంపై ఆంక్షలు విధించడం, రైతులను ఈ ప్రాంతాలలో విద్యుత్‌ సబ్సిడీ తగ్గించడం, నీటి కాలు ష్యాన్ని అడ్డుకునేందుకు చట్టాలు బలోపేతం చేయడం, భూగర్భ జలాల వాడకాన్ని నియంత్రించడం, కొత్త కార్యక్రమాలు,వ్యూహాలు రూ పొందించి ప్రజల్లో నీటినిర్వహణ కళను పెంచేలా వారిని జాగృతం చేయడం, మరిన్ని చిన్న, మధ్యతరహా నీటి పథకాలు నిర్మించడం, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత తవ్వడం తప్పని సరి చేయడం, పొలాల్లో నీటి నిల్వ రిజర్వాయర్‌లు ఏర్పాటు చేయడం, బిందు సేద్యం (40-60 శాతం నీరు ఆదా) తుంపర సేద్యం (30-40 శాతం నీరు ఆదా)లను ప్రోత్సహించడం, చెక్‌డ్యాంలు, కెనాల్‌ బండ్లు, పెర్కొలేషన్‌ ట్యాంకులు నిర్మించడం, నీటిపై సమర్థ ఆడి ట్‌ నిర్వహించడం తక్కువ వ్యవధి వంగడాలను అభివృద్ధి చేయడం వంటి కృషి జరిగితేనే జలసంరక్షణ సాధ్యమవ్ఞతుంది.

  • తండ ప్రభాకర్‌ గౌడ్‌