జీవ వైవిధ్యాన్ని హరిస్తున్న యురేనియం తవ్వకాలు

Uranium Mining
Uranium Mining

దేశంలో లభ్యమైన యురేనియం నిక్షేపాలు చాలా తక్కువ గ్రేడ్‌లో ఉన్నాయి. వాటి లభ్యత కూడా బహుస్వల్పం. కడప బేసిన్‌ కిందికి వచ్చే తెలంగాణ ప్రాంతం నిక్షేపాలు గణనీయంగా ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. అత్యంత నాణ్యమైన నిక్షేపాలు ఇవి. ఇప్పుడు నల్లమలలోని ప్రజల, వన్యప్రాణుల భవిత ప్రశ్నార్థకమవ్ఞతుంది. బతుకు చిధ్రమయ్యే సూచనలు కనిపిస్తు న్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో విస్తరించిన అటవీ ప్రాంతం పెద్దపెద్ద యంత్రాల మోతలతో, తవ్వకాలతో తన రూపుకోల్పోతుంది. అమ్రబాద్‌ టైగర్‌ రిజర్వులో యురేనియం నిక్షేపాల అన్వేషణకు కేంద్ర అణుశక్తి సంస్థకు, కేంద్ర అటవీశాఖ మండలి సూత్రప్రాయంగా అనుమతివ్వటం కేవలం చరిత్రను చెరిపివేయడమే కాదు.

కేం ద్రప్రభుత్వం నల్లమల అడవ్ఞలలో యురేనియం నిక్షేపాలు భారీగా ఉన్నాయని, వాటిని వెలికి తీయాలని 2008 నుండి 2014 వరకు నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎమ్‌డిసి) ఆధ్వర్యంలో యురేనియం నిల్వలపై అన్వేషణ చేపట్టడానికి అనుమతించింది. 2012లో యురేనియం కోసం బోరులు వేస్తున్న సమయంలో ప్రజలకు ఎటువంటి విషయ సమాచారం లేని స్థితిలో తిరుమలాపూర్‌ గ్రామంలోబోరు మిషన్లను ధ్వంసం చేసారు. మా ప్రాంతంలో యురేనియం కోసం బోరులు వేయనియ్యమని ఆ గ్రామ ప్రజలు తిరగబడ్డారు. యురేనియం వెలికితీత నల్లమలలోని జీవ వైవిధ్యాన్ని నాశనం చేసి సమస్త ప్రాణకోటిని హరించే రేడియోథార్మిక కిరణాలను ప్రసరింపచేస్తుంది. యురేనియం వెలికితీత మానవజాతి ప్రాణా లను, కేన్సర్‌ను బహుమతిగా ఇస్తుంది. యురేనియంతో జల, వాయు కాలుష్యంతోపాటు భూమిని సైతం విషపూరితం చేస్తుంది. యురేనియం వెలికితీతపై నల్లమల ప్రజానీకం యుద్ధం ప్రకటించా రు.2008 నుండి 2014 వరకు నల్లమల అడవ్ఞలలో డబీర్స్‌ వజ్రాల వేట కోసం పరిశోధన కొనసాగింది. అదే సందర్భంలో యురేనియం నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేంద్ర ప్రభు త్వం యురేనియం నిక్షేపాలను వెలికి తీయడానికి అనుమతిచ్చింది. నల్లగొండ జిల్లా పరిధిలోని పెద్దగట్టు, సేరుపల్లి గ్రామాలలో 2001లోనే యురేనియం తవ్వకాల కోసం అన్వేషణ చేపట్టిన నేపథ్యంలో ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టి వ్యతిరేకించిన నేపథ్యంలో ప్రభుత్వం వెనకకు తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నల్గొండ, నాగర్‌కర్నూల్‌, కర్నూల్‌, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రెండు లక్షల 75వేల హెక్టారులలో విస్తరించి ఉన్న నల్లమలఅటవీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా చెంచులు, గిరిజను లు వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. మంచి పర్యాటక ప్రాం తంగా కొనసాగుతున్నది. నల్లమలలోని పోడు ఏరియాల్లో రోడ్డు వేయాలన్నా, చెంచుపేటలకు విద్యుత్‌సౌకర్యం కల్పించాలన్నా తీవ్ర మైన ఆంక్షలతో ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. నల్లమల లో 600 జాతులకు చెందిన ఔషధ మొక్కలు,700 రకాల అరు దైన వన్యప్రాణులు,అరుదైన చెంచు, ఆదిమజాతి గిరిజనులు నివ సిస్తున్న నేపథ్యంలో ఈ యురేనియం తవ్వకాలతో ఈ ప్రాంతం ఉనికికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. అటవీహక్కుల చట్టాన్ని అటవీశాఖే అతిక్రమిస్తుందని స్పష్టం అవ్ఞతుంది.

అమ్రబాద్‌ నల్లమల నుండి ఈ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టు దేశంలోనే అతిపెద్దది. దేశంలోనే అత్యంత జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతం కూడా ఇదే. పులులు, చిరుతలు, అడవిపందులు, కణుజులు, దుప్పులు, ఎలుగుబంట్లు, నెమళ్లు వంటి జీవరాసులకు ఇది నెలవ్ఞ. ఇక్కడి యురేనియం నిక్షేపాలకు అనుమతిస్తే అడవి నాశనమే.

వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎన్నో ఏళ్లుగా పడిన శ్రమ వృధా అవ్ఞతుంది. వన్యప్రాణుల మనుగడకే ముప్పు వాటిల్లుతుందని అర్రబావ్ఞ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతం ఫీల్డ్‌ డైరెక్టర్‌ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టంగా తెలిపారు. యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరపాలని భావిస్తున్న అడవీ ప్రాంతంలో నాలుగు ప్రాంతాలున్నాయి. ఈ మొత్తం బ్లాకుల విస్తీర్ణం 83 చ.కి.గా ఉంది. బ్లాక్‌-1 మొత్తం విస్తీర్ణం 38 చIIకిII. ఇది అమ్రబాద్‌రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోని మాచవరం బీట్‌ పరిధిలో ఉంది. అమ్రబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ బఫర్‌ ఏరియాలో ఇదొక భాగం. ఇందులోని 239,240,241 కంపార్ట్‌మెంట్లు కోర్‌ ఏరియాలోనే ఉన్నాయి.

కొండలు, చెట్లు, ముళ్లపొదలతో నిండిఉంది. ఇక్కడ అడవి పందులు, కణుజులు, దుప్పులు, ఎలుగుబంట్లు, పులులు వంటి జీవరాసులు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో తవ్వకాలకు భారీ యంత్రాలు తీసుకువెళ్లడం అంత సులువ్ఞకాదు. తవ్వకాలు ఎక్కడ జరుపుతారో కూడా చెప్పలేదు. చెట్లను తొలగిస్తారా? లేదా? అనే విషయాలు కూడా స్పష్టత లేదు. బ్లాక్‌-2 మొత్తం విస్తీర్ణం 38 చIIకిII విస్తీర్ణంలో ఉంది.

అమ్రబాద్‌ అటవీ రేంజ్‌లోని పాధ్ర, మారేడుపల్లి బీట్ల పరిధిలో ఉంది. అమ్రబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులోని రాజీవ్‌గాంధీ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఈ బ్లాక్‌ పరిధిలోనే ఉంది. ఇందులోనే నల్లవాగు ప్రాంతంలో పులుల సంచారం ఉంటుందని చెపుతారు. కొండలు, గుట్టలతో కూడిన ఈ ప్రాంతం వైపు వెళ్లడానికి రహదారులు లేవ్ఞ. యంత్రాలు తీసుకువెళ్లి తవ్వకాలు జరపడంపై స్పష్టత ఇవ్వలేదు. బ్లాక్‌-3 మొత్తం విస్తీర్ణం మూడు చIIకిIIమీ. దేవరకొండ రేంజ్‌లలో కంబాలపెల్లి బీట్‌లో ఉన్న 116 కంపార్ట్‌మెంట్‌ కిందికి వస్తుంది.

ఇక్కడ రాజీవ్‌గాంధీ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంది. ఈ బ్లాక్‌లోనూ ఎక్కడ తవ్వకాలు జరుపుతారనే స్పష్టత లేదు. బ్లాక్‌-4మొత్తం విస్తీర్ణం 3చIIకిIIమీ. ఇది కూడా దేవరకొండ రేంజ్‌లలో కంబాలపెల్లిబీట్‌లో 117 కంపార్ట్‌మెంట్‌ పరిధిలోకి వస్తుంది. ఇందులోను రాజీవ్‌గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంది.

ఇక్కడ పలు రకాల వన్యప్రాణులు సంచరిస్తున్నట్లు వివిధ నివేదికల్లో స్పష్టమైనది. మొదటి మూడు బ్లాక్‌లలో అమ్రబాద్‌ టైగర్‌ ప్రాజెక్టు నిర్మితమైన ప్రదేశం. కావ్ఞన వన్యప్రాణి సమస్తం దెబ్బతినే అవకాశం ఉన్నది. అమ్రబాద్‌ రిజర్వ్‌ నెత్తిన యురేనియం పిడుగు 20వేల టన్నుల నిక్షేపాల అన్వేషణకు కేంద్రం అనుమతి 83చIIకిIIమీII విస్తీర్ణంలో తవ్వకాలు, నాలుగువేల బోర్లు తవ్వనున్న అణుశక్తిశాఖ దేశంలోనే అత్యంత నాణ్యమైనది, లభ్యమయ్యేది ఇక్కడే. కేంద్రం అమ్రబాద్‌ టైగర్‌ రిజర్వులో భారీస్థాయిలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయి.

భూమిపై ఆక్సిజన్‌ వ్యాపించి జీవజాలం పుట్టుకకు ముందు నాటి కాలానికే ఇవి భూరాతి పొరల్లో నిక్షిప్తమై ఉన్నట్లు ఓ అంచనా. ఇంతవరకు దేశంలో లభ్యమైన యురేనియం నిక్షేపాలు చాలా తక్కువ గ్రేడ్‌లో ఉన్నాయి. వాటి లభ్యత కూడా బహుస్వల్పం. కడప బేసిన్‌ కిందికి వచ్చే తెలంగాణ ప్రాంతం నిక్షేపాలు గణనీ యంగా ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. అత్యంత నాణ్యమైన నిక్షే పాలు ఇవి. ఇప్పుడు నల్లమలలోని ప్రజల, వన్యప్రాణుల భవిత ప్రశ్నార్థకమవ్ఞతుంది. బతుకు చిధ్రమయ్యే సూచనలు కనిపిస్తు న్నాయి.

ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో విస్తరించిన అటవీ ప్రాంతం పెద్దపెద్ద యంత్రాల మోతలతో, తవ్వకాలతో తన రూపుకోల్పోతుంది. అమ్రబాద్‌ టైగర్‌ రిజర్వులో యురేనియం నిక్షేపాల అన్వేషణకు కేంద్ర అణుశక్తి సంస్థకు, కేంద్ర అటవీశాఖ మండలి సూత్రప్రాయంగా అనుమతివ్వటం కేవలం చరిత్రను చెరిపివేయడమే కాదు. ప్రముఖ శైవక్షేత్రాలు, ఆదివాసు లైన చెంచులు, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన దేశంలోనే రెండవ పెద్దదైన పులుల అభయారణ్యం అమ్రబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టుల అస్థిస్వానికి పెద్దదెబ్బ.

ఈ నిర్ణయం ఈ ప్రాంత వాసు లలో భయాందోళనలు రేపుతున్నది. అమ్రబాద్‌ అభయారణ్య ప్రాంతంలోని 83 చ.కి.మీ విస్తీర్ణంలో యురేనియం తవ్వకాలు జరుగుతాయి. ఈ ప్రాంతంలోనే అమ్రబాద్‌ మండలంలో 28 గ్రామాలు, పదర మండలంలో 19 గ్రామాలు, లింగాల మండలం లో 11 గ్రామాలు,అచ్చంపేట మండలంలో 11 గ్రామాలు, బల్మూ ర్‌ మండలంలో ఆరు గ్రామాలతోపాటు మొత్తం తండాలు, గూడె లు, చెంచుపల్లెలు కలిసి 120కిపైగా ఉన్నాయి. దాదాపు 11వేల మంది జీవనం సాగిస్తున్నారని పర్యావరణవేత్తలు చెపుతున్నారు.

ఖనిజ తవ్వకాల నుండి, శుభ్రం చేయడం, విద్యుత్‌ ఉత్పత్తి వరకు మొత్తం అణుఇంధన ప్రక్రియలో100కుపైగా రేడియోధార్మికశ్రేణులు విడుదలవ్ఞతాయి. వాటిలో క్యాన్సర్‌ను కలిగించేవి, జీవజాలానికి ప్రమాదకరమైన స్ట్రాన్షియం-90, ఐమెడన్‌-131, సినియం-137 లాంటి మూలకణాలు ఉత్పత్తి అవ్ఞతాయి. ఒక వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న అణువిద్యుత్‌ రియాక్టరు నుండి 10-15 అణుబాం బుల తయారీకి సరిపడే ప్లుటోనియం ఉత్పత్తి అవ్ఞతుందని ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ 2005లో హెచ్చరిం చాడు.

అణువిద్యుత్‌ రియాక్టర్లు అణుబాంబుల తయారీకి ఉప యోగపడే ఇంధనాన్ని తయారు చేసి మొత్తం మానవాళిమెడలో అణుబాంబులను వేలాడదీస్తాయి.దీంతో యురేనియం శుద్ధికి కృష్ణా జలాలుతప్ప వేరేమార్గం లేదు.ముడి యురేనియం నుంచి వెలు వడేఅణుశక్తితో కాంక్రీట్‌నిర్మాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఇంజి నీరింగ్‌ నిపుణులు అంటున్నారు.యురేనియంతో నేడు నల్లమల్లలో అడవేకాదు. తెలంగాణ మొత్తంగా విధ్వంసానికి గురికాబోతుంది.

-ఉజ్జిని రత్నాకర్‌ రావు, (రచయిత: ఎఐటియుసి సీనియర్‌ నాయకుడు)