ఏరులైపారుతున్న మద్యం- పట్టించుకోని ప్రభుత్వాలు

Unlimited Liquor Sales
Unlimited Liquor Sales

రా ష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా వీధివీధికి, గల్లీగల్లీకి బెల్టుషాపులు వెలసి, ఎల్లవేళలా స్వాగతం పలకడానికి తలుపులు తెరుచుకొని ఉంటాయి. ఒకప్పుడు ఒక వ్యక్తి పొద్దంతా పనిచేసి అలసిపోయి ఏదో ఒక గ్లాసు గుడుంబా తాగి, బుక్కెడు బువ్వతిని నిద్రపోయేవాడు. ఇరవై,ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన వ్యక్తులెవరైనా అలవాటు ఉండి మద్యం సేవించాలనుకుంటే ఎంతో భయపడేవారు. కానీ మారుతున్న కాలానుసారంగా ఎన్నో మార్పులు సంభవించాయి. మొదట్లో పండుగలకు, పబ్బాలకు మద్యం సేవిస్తే తర్వాత అదికాస్తా వారానికొకసారి వెళ్లింది. వెంటనే రోజుకొకసారిగా మారి, ఇప్పుడది వీలైనప్పుడల్లా, రోజంతా మారిందనడంలో ఎలాంటి అబద్దం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా, నిర్భయంగా, సమయంతో సంబంధం లేకుండా తాగేస్తున్నారు. ఎందుకంటే వివిధ సర్వేల ఫలితాలను చూస్తుంటే అర్థమవుతుంది. వైజ్‌గా§్‌ు రిపోర్టు సర్వేలో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, ఢిల్లీ, ఛండీఘడ్‌, ముంబాయి, పూణె, కోల్‌కతా, బెంగళూరులలో వెయ్యి మందిని సర్వే చేస్తే ఆశ్చర్యపడేటటువంటి వాస్తవాలు బయటికొచ్చాయి. మహిళలు సైతం మద్యం సేవించడం, ఎక్కువగా వైన్‌, ఖరీదైన మద్యాన్ని తీసుకోవడం జరుగుతుందని, మగవారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని వెల్లడించాయంటే దేశంలో తాగునీటి సమస్యలేర్పడుతున్నాయేమోకానీ మద్యం ఎక్కడైనా దొరుకుతుం దని తెలుపుతున్నాయి. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మద్యం అమ్మకా లకు, విక్రయాలకు విచ్చలవిడిగా పూర్తిగా స్వేచ్ఛనిస్తే రాష్ట్ర ఖజా నాకు డబ్బులొస్తాయేమోకానీ, మూడు నాలుగు సంవత్సరాలు దాటితే మద్యంప్రియులు అనారోగ్యపాలుకావడం, కుటుంబం మానసిక, ఆర్థిక ఇబ్బందులతో రోడ్డునపడే పరిస్థితులు దాపు రించి, ఉత్పాదకరంగమంతా నాశనమై రాష్ట్ర, దేశ ఆర్థిక పత నానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్ప డుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తికాలేదు. ప్రపంచదేశాలతో పోలిస్తే భారతదేశంలో, దేశంలోని రాష్ట్రాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఏ విధంగా ఉన్నాయో ఈ మధ్య ‘ఇండియన్‌ ఆల్కహాల్‌ కంజప్షన్‌ ది చేజింగ్‌ బిహేవియర్‌ పేరిట వైజ్‌గా§్‌ు రిపోర్టు అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాలను పరిశీలిస్తే సగటు మానవ్ఞనికి ఒకింత కలవరానికి గురిచేయక మానవ్ఞ. వివరాల్లోకి వెళ్లితే ప్రపంచ లిక్కర్‌ వినియోగంలో భారతదేశం ప్రథమస్థానంలో నిలిచింది. అలాగే దేశంలో 2022 నాటికి మద్యం అమ్మకాల అంచనా 1680 కోట్ల లీటర్లు ఉండవచ్చని అంచనా వేసింది. ఇదిలావ్ఞంటే దేశంలోని అన్ని రాష్ట్రాలలో చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానాన్ని, ఆక్రమిస్తే, ద్వితీయ స్థానంలో తెలంగాణ ఉండటమనేది ఏరులైపారుతున్న మద్యం ఘనతను చెప్పకనే చెబుతున్నాయి. తరువాతిస్థానాలను కేరళ, కర్ణాటక, సిక్కిం, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు దక్కించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 2015-16 సంవత్సరంలో రాష్ట్ర ఎక్సైజ్‌ ఆదాయం 12,474 కోట్లు ఉండగా 2018-19 నాటికది 17,340 కోట్లకు చేరుకున్నది. అదే తెలంగాణ రాష్ట్రంలో 2018 సంవత్సరం ఎక్సైజ్‌ ఆదాయం ఇరవైవేల కోట్ల రూపాయలకు చేరుకున్నది. గత 2017 సంవత్సరంతో పోలిస్తే 3,404 కోట్లు అదనంగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ వివరాలను బట్టిచూస్తే సంవత్సరానికి ఒక వ్యక్తి మద్యం విక్రయించడానికి 13వేల రూపాయలను ఖర్చుపెడుతున్నాడు. 2005 సంవత్స రంలో ఒక వ్యక్తి తలసరి వినియోగం 2.4 లీటర్లు ఉండగా, 2010 నాటికది రెండు రెట్లు పెరిగి 4.3 లీటర్లకు చేరుకొని, 2016 వచ్చే నాటికి ఒక వ్యక్తి తలసరి వినియోగం 5.7 లీటర్లకు చేరుకుందంటే ఆశ్చర్యమేయకతప్పదు. దీనిపై ప్రభుత్వ దృష్టి సారించకబోతే భవిష్యత్‌ను తలుచుకుంటే భయమేయక మానదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో విడుదల చేసిన ‘ఆల్కహాల్‌ అండ్‌ హెల్త్‌ ఆన్‌ గ్లోబల్‌ స్టేట్‌ రిపోర్టు ప్రకారం దేశంలో 2016 సంవత్సరంలో తాగుడుకు అలవాటుపడి అనారోగ్యం పాలు కావడం, మద్యం సేవించిన మైకంలో వివిధ రకాల ప్రమాదాల బారినపడి 30 లక్షల మంది చనిపోవడం, అందులో 23 లక్షల మంది పురుషులుండటం గమనార్హం. ఇవేకాకుండా మద్యం మత్తులో గొడవలకు దిగి, హింసలు చెలరేగి 28శాతం, మద్యపానం కారణంగా లివర్‌ చెడి అనారోగ్యంపాలై 21 శాతం, గుండె సంబంధిత వ్యాధులతో 19శాతం మంది చనిపోయారని ఫలితాలను వెల్లడించాయి. వీటన్నింటిని చూస్తుంటే వారి కుటుంబ మానసిక, ఆర్థిక పరిస్థితుల గురించి అంచనా వేయలేమా, ఏవో సరదా కోసమో కాలక్షేపం కోసమో అలవాటుబడిన మద్యంప్రియులు, దానిని మానలేక బానిసలై తమ జీవితాలను కోల్పోయి, కుటుంబాలను రోడ్డునపడేసిన సందర్భాలు కన్పిస్తున్నాయి.
వీటన్నింటిని చూసుకుంటూపోతే ప్రపంచంలో మొదటిస్థానంలోనున్న మనదేశం ఎందుకు అదుపులో పెట్టలేకపోతున్నది? ఎందుకు ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు? ఖజానాలోకి డబ్బు రాదనా? లేదా ప్రభుత్వాల మనుగడ కష్టమవ్ఞతుందనా? ఎందుకు ప్రజల అనారోగ్యాలకు కారకులవ్ఞతున్నారు? ఈమధ్యనే 2019 సంవత్సరంలో మిజోరం రాష్ట్ర అసెంబ్లీలో మద్యపాననిషేధం బిల్లు-2019ను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. 2009 సంవత్సరం నుండి గుజరాత్‌లో మద్యాన్ని ఇళ్లల్లో తయారు చేస్తే మరణశిక్షలు విధించెటటువంటి కఠిన చట్టాన్ని తీసుకొచ్చాయి. 2015లో బీహార్‌ రాష్ట్రం మద్యపాన నిషేధాన్ని అమలుపరుస్తుంది. ఈమధ్యనే 2019 జూన్‌ మాసం నుండి ఆంధ్రప్రదేశ్‌లో కొలువైన నూతన ప్రభుత్వం మద్యపాన నిషేధంలో భాగంగా బెల్టుషాపులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి కాకుండా విడతలవారీగా చర్యలు చేపట్టి మద్యపాన నిషేధం గావించాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తుంది.ఈ రాష్ట్రాలను యావత్తు లోకం హర్షించక మానదు. వాటిని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు సైతం వారి అడుగుజాడలలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖజానాకు వచ్చే డబ్బును చూడకుండా, ప్రజల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ముందడుగు వేయడానికి కృషి చేయాలి.

  • పోలంసైదులు