నివురుగప్పిన నిప్పులా నిరుద్యోగ సమస్య

 Unemployment is a problem, like a fire
Unemployment is a problem, like a fire

ఇటీవల కాలంలో వర్కింగ్‌ ఏజ్‌ జనాభా గ్రామీణ కార్మికుల జాబితాలో చేరడంతో వీరి సంఖ్య పెరిగింది. కానీ తగినన్ని అవకాశాలు లేవ్ఞ. వీరు ప్రస్తుతం ఉద్యోగాలు వెతుక్కోవడంలో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశంలో సాధారణంగా రుతుపవనాలు కూడా నిరుద్యోగ ప్రభావం చూపుతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రుతుపవనాల పురోగతి ఆలస్యమై, వర్షాలు అస్థిరంగా ఉన్న కారణంగా విత్తనాలు వేయడంలో జాప్యం జరుగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల రీత్యా స్థానికంగా వర్షాలు అత్యధికంగా కురవడంతో వరదలు ఏర్పడి పెద్దమొత్తంలో విత్తనాలు వేసేందుకు అనువైన పరిస్థితి లేదు. సాధారణంగా ఖరీఫ్‌సీజన్‌లో ఉండే డిమాండ్‌ కన్నా గ్రామీణ కార్మికులకు డిమాండ్‌ ప్రస్తుతం తక్కువగా ఉంది.

దే శంలో నివ్ఞరుగప్పిన నిప్పులా నిరుద్యోగ సమస్య కొనసాగుతోంది. అగ్ని పర్వతం బద్దలై లావా బహిర్గత మైతే ఏవిధంగా విధ్వంసం చోటు చేసుకుంటుందో అదే విధంగా ప్రభుత్వాలు కుప్పకూలుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఈ విషయాన్ని పాల కులు గుర్తించడం లేదు. ఇంకా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నట్టు ఉంది. భారత్‌లో దేశ జనాభా కంటే వేగంగా నిరుద్యోగం మరింత అధికమవ్ఞతున్నది. ముఖ్యంగా ఈ సమస్య పట్టణాలలో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉందని పలు నివేదికలు సైతం ఘోషిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌ సుమారు తొమ్మిది శాతం నిరుద్యోగ మార్క్‌ను దాటిపోయింది. దీంతో గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో నిరుద్యోగం పెరిగిందని ప్రముఖ ఆర్థికవేత్తలు, పలువ్ఞరు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం గత నెల ఆగస్టు 25తో ముగిసిన వారాంతానికి 9.07 శాతానికి నిరుద్యోగం చేరుకుందని వ్యాఖ్యానాలు వెల్లడయ్యాయి.

అంతకుముందు 2016 సెప్టెంబరు తొలివారం నుండి చూస్తే ఇది అత్యధికమని సమాచారం. కానీ గడచిన నాలుగు వారాల్లో 7.9 శాతం నుండి 9.07శాతం మధ్య నమోదయ్యే అవకాశాలు కనిపిం చినప్పటికీ 8.9శాతం మధ్య నిరుద్యోగం రేటు నమోదు అయి నట్టు తెలిసింది. ఇది అంతకుముందు మూడు మాసాలలో నమో దైన 7.2-7.9 శాతం కన్నా 100 బేసిస్‌ పాయింట్లు అత్యధిక మని కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 25తో ముగిసిన వారానికి 9 శాతం నిరుద్యోగ రేటు నమోదుకాగా గడచిన 30 రోజులలో సగటు నమోదు 8.25శాతంగానే ఉండటం ప్రత్యేకంగా చెప్పు కోదగిన విషయం. నెల రోజుల నిరుద్యోగ సూచీని పరిగణ నలోకి తీసుకున్నప్పుడు ఆగస్టు నెలలో నిరుద్యోగ రేటు 7.5 శాతం నుండి 8 శాతానికి చేరుకుంది. ప్రస్తుతవారంలో నిరుద్యోగ రేటులో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ ఆగస్టు మాసాంతానికి 8.5 శాతానికి చేరుకునే అవకాశాలు కనిపించాయి.

గతవారంలో నమోదైన తొమ్మిది శాతం పెరుగుదలతో పోలిస్తే ఇదేమంత ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ గడిచిన మూడు నెలల్లో నమోదైన అత్యధిక నిరుద్యోగ రేటు ఇదే అవ్ఞతుంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు జులై 2017 నుండి నిలకడగా పెరుగుతూ వస్తున్నట్టు కనిపిస్తోంది. 2018 నుండి కార్మికుల భాగస్వామ్యంతో కొనసాగుతున్న స్థిరత్వం, ఉపాధి రేటు పడిపోవడం ఫలితంగా నిరుద్యోగ రేటులో పెరుగుదల నిలకడ కొనసాగుతోంది. పనిచేయగల సామర్థ్యం ఉన్న కార్మికుల (వర్కింగ్‌ ఏజ్‌) సంఖ్యలో ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతుండడంతో కొత్తవారికి అవకాశాలు కనిపించడం లేదు. అయితే కార్మికుల సంఖ్య పెరుగుతున్నా తగినంతగా ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. దీని ఫలితంగా నిరుద్యోగ రేటు పెరుగుతున్నది. తగినంత ఉద్యోగ అవకాశాలు లేకపోవడాన్నే ఉద్యోగ రేటు పడిపోవడంగా పరిగణిస్తాం. అయితే ఇక్కడో ఇంకో వినూత్న పరిణామం చోటు చేసుకుంది. గ్రామీణ నిరుద్యోగలో ఆకస్మిక పెరుగుదల కనిపించినట్టు ఓ యూనివర్శిటీ చేసిన అధ్యయనంలో తేలింది.

ఆగస్టు 25తో ముగిసిన వారంలో గ్రామీణ నిరుద్యోగంలో ఆకస్మిక పెరుగుదల ఏర్పడింది. పట్టణ ప్రాంతంలోని 8.9శాతం నిరుద్యోగం కన్నా అధికంగా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం 9.1 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంత నిరుద్యోగం కన్నా గ్రామీణ ప్రాంత నిరుద్యోగంలో పెరుగుదల అరుదైన విషయమేమీ కాదు. అందువల్ల ఇటీవల వారాల్లో గ్రామీణ నిరుద్యోగంలో పెరుగుదలను అసాధారణ విషయంగా చూడరాదు. కాగా రైతులకు సంబంధించి ఇది దేశంలో ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో గ్రామీణ భారతంలో కార్మికుల భాగస్వామ్యం పెరిగింది.

30 రోజుల సగటు కూలీల భాగస్వామ్యం ఆగస్టు 25తో ముగిసిన వారానికి 44.4శాతంగా ఉంది. ఇది జులైలో నమోదైన దానికన్నా అధికం. ఈ సీజన్‌లో ఏడాది కాలంలో గ్రామీణ ప్రాంతాలలో కార్మిక భాగస్వామ్యం అత్యధికంగా ఉంటుంది. దీంతో ఇటీవల కాలంలో వర్కింగ్‌ ఏజ్‌ జనాభా గ్రామీణ కార్మికుల జాబితాలో చేరడంతో వీరి సంఖ్య పెరిగింది.కానీ తగినన్ని అవకాశాలు లేవ్ఞ. వీరు ప్రస్తుతం ఉద్యోగాలు వెతుక్కోవడంలో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశంలో సాధారణంగా రుతుపవనాలు కూడా ్దనిరుద్యోగ ప్రభావం చూపుతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

రుతుపవనాల పురోగతి ఆలస్యమై, వర్షాలు అస్థిరంగా ఉన్న కారణంగా విత్తనాలు వేయడంలో జాప్యం జరుగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల రీత్యా స్థానికంగా వర్షాలు అత్యధికంగా కురవడంతో వరదలు ఏర్పడి పెద్దమొత్తంలో విత్తనాలు వేసేందుకు అనువైన పరిస్థితి లేదు. సాధారణంగా ఖరీఫ్‌సీజన్‌లో ఉండే డిమాండ్‌ కన్నా గ్రామీణ కార్మికులకు డిమాండ్‌ ప్రస్తుతం తక్కువగా ఉంది. దుక్కిదున్నడం, విత్తనాలు చేయడం వంటి పనులు చేసి కూలీల వేతన రేట్లు జూన్‌ నెలలో ఏడుశాతం పెరిగాయి. అయితే ఆగస్టు వచ్చే నాటికి ఈ రేటుకు కూడా కూలీలు పనిచేయడం లేదు. దీంతో వారి భాగస్వామ్యం తగ్గింది.

సిపిహెచ్‌సి కార్మిక గణాంకాల మేరకు గ్రామీణ మార్కెట్లలో పెరుగుతున్న కార్మికులు తగినంత ఉపాధి పొందలేకపోతున్నారు. దీని ఫలితంగా ఆగస్టు తొలివారాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ రేటు 41శాతం కన్నా తక్కువగా ఉంది. గ్రామీణ కూలీల వేతనాలు తగ్గుతున్న కొద్దీ కొంత ఒత్తిడి వాతావరణం ఏర్పడుతుంది. కానీ ఈ పరిస్థితి పట్టణ ప్రాంతాల్లో కనిపించదు. దీంతో ఉద్యోగరేటు క్రమంగా పడిపోతున్నది. ఈ ఏడాది జులై నాటికి 36.8శాతానికి పడిపోయింది. అందువల్ల గ్రామీణ కార్మికులకు డిమాండ్‌ తగ్గడం అంత మంచిదికాదు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించడం వల్ల ప్రస్తుతం ఆర్థిక మాంద్యాన్ని కొంతమేర ఉపశమనం కల్పించవచ్చు అని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. కానీ దీర్ఘకాలికంగా ఈ చర్యల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని వారంతా అభిప్రాయపడుతున్నారు. ఆర్థికమాంద్యం పూర్తిగా నివారించాలంటే కేవలం ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడం ద్వారానే సాధ్యం అవ్ఞతుందన్న విషయం ప్రభుత్వం మరవరాదు. లేని పక్షంలో నివ్ఞరుగప్పిన నిప్పువలే ఉన్నటువంటి ఈ ఆర్థికమాంద్యం సర్కారు ఉనికిని కూడా రాబోయే రోజుల్లో కనుమరుగు చేసే ప్రమాదం ఉందని పాలకులుగుర్తించక తప్పదు.

మన్నారం నాగరాజు
(రచయిత:రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ లోక్‌సత్తాపార్టీ)

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/