మెట్టుదిగండి..పట్టు వీడండి!

TGS RTC workers strike

తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండుగ దసరా. ఈ పండగకు ప్రజలు ప్రయాణం హైదరాబాద్‌ నలుమూలల నుండి వారి స్వస్థలాలకు, స్వస్థలాల నుండి హైదరాబాద్‌కు చేరవేయ డంలో ఆర్టీసీ, రైల్వే, ప్రైవేట్‌ వాహనాల పాత్ర ముఖ్యమైనది. పండుగకు ముందు తర్వాత రవాణా సౌకర్యాల ప్రాముఖ్యత చాలా ఉంటుంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలు రవాణా సౌకర్యాలకు తగినంత ఏర్పా ట్లుచేయాలి. ఆర్టీసీ, రైల్వే, ప్రైవేట్‌ వాహనాలు నడిస్తేనే ప్రయా ణికుల తాకిడికి సరిపోయే వాహనాలు అందించలేరు. ఇలాంటి స్థితిలో ఆర్టీసీ సమ్మెలోకి వెళతామని ముందస్తు సమ్మె నోటీ సులు ఇవ్వడం జరిగింది.దానిని సకాలంలో చర్చల ద్వారా పండుగకు ముందు పరిష్కరించుకోలేకపోవడం వలన రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, అటు ప్రభుత్వం మొండిగా వ్యవహరించి పండుగపూట సామాన్య ప్రజలను అష్టకష్టాల పాలుచేశారు. ప్రైవేట్‌ దోపిడీ పెరిగిపోయింది.

చాలా కాలంగా ఆర్టీసీ ఉద్యో గుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మొరపెట్టు కున్నా పట్టించుకోవడం లేదని, తప్పనిస్థితిలో సమ్మెలోకి వెళ్లవలసి వచ్చిందని ప్రజలు మాకు సహకరించాలని ఒకవైపు ఆర్టీసీ కోరుకుంటూ సమ్మెను ఉధృతం చేస్తుంది. వారికి రాష్ట్రం లోని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఇతర ఉద్యోగ సంఘాల రాజకీయపార్టీల మద్దతు రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రభుత్వ ప్రకటనలు సమ్మె నివారణకు దోహదపడేలా లేవనే వైఖరితో ఏ మార్పు కనిపించడం లేదని కోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సమ్మె ప్రభావం ప్రయాణికుల సౌకర్యాల ఏర్పాటు, ప్రైవేట్‌ వాహ నాలను వాడుకోవడం,అవసరమైన మేరకు ఉద్యోగుల నియామ కానికి ఆదేశాలు జారీ చేయడం చర్చల ప్రసక్తి లేకుండా పోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిపోయింది.

సమ్మె లోకి వెళ్లడం వల్ల వాళ్లే ఉద్యోగాలను కోల్పోయారని స్వయాన ముఖ్యమంత్రి ప్రకటనలు ఇవ్వడం వలన ఆందోళనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రజారవాణా మెరుగుపరచాలని, ప్రైవేటీ కరణ తగ్గించాలని, గత చాలా కాలంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా నష్టాలు వచ్చాయి. కానీ ఉద్యోగుల వలన కాదని, ప్రభుత్వాలు ఉద్యోగులను నిందిస్తూ నష్టాలను వారిపైదోస్తూ రాయితీలను, బాకీలను చెల్లించకుండా కార్మికులను బలిపశువ్ఞ లను చేసి ప్రైవేటీకరణకు పూనుకోబోతుందని ఆందోళన చెందు తున్నారు.

వెంటనే ఆర్టీసీ సమ్మె నివారణ దిశగా అడుగులు వేయాలని తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర గణనీయమైనదని నాడే ముఖ్యమంత్రి ఉద్యోగభద్రత, ఆర్టీసీని ప్రభుత్వాధీనంలోకి తీసుకుంటామని చెప్పినమాటలకు కట్టుబడి ఉండాలని, న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేస్తున్నారు. లాభాలతో సంబంధం లేకుండా ప్రజా రవాణా అందించే సామాజిక బాధ్యత ప్రభుత్వాలపై దండిగా ఉంది.ఆ బాధ్యతలకు తిలోదకాలిచ్చి సమ్మె తీవ్రతను ఉదాసీ నంగా భావిస్తూ సామాన్య ప్రజల రవాణా కష్టాలను ఏ ఒక్కరు మానవీయకోణంలో ఆలోచించకపోవడం మంచి విధానం కాదు. సమ్మెకు ఇలాంటి కీలక స్థితిలో కూడా వెళ్లడం, పరిష్కరించక పోవడం పాలకులు వారి బాధµ్యతలను, ఉద్యోగులు వారి విధు లను విస్మరించినట్లేనని ప్రజలు వాపోతున్నారు. ఇరువర్గాలు పట్టింపులకు పోయినందువలన సామాన్య ప్రజలు అనేక ఇబ్బం దులపాలవ్ఞతున్నారు. ప్రజల అవసరాలు, ధనం వృధాగా పోయిన తర్వాత ఇరువర్గాల నిర్ణయాలు ఏ వర్గాలకు మేలు చేస్తాయి. చాలా కాలంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిం చకుండా కాలయాపన చేస్తూ కీలక స్థితిలో సమ్మెలకు దిగితే? ప్రజల నుండి ఉద్యోగులను వేరుచేసి ప్రజల ముందు ఉద్యోగు లను దోషులుగా చేయడం పాలకులకు పరిపాటిగా మారింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఉద్యోగుల పాత్రను ప్రజలను చైతన్యపరచడం, సకలజనుల సమ్మె విజయవంతమవ్వడంలో వారి కృషిని కొనియాడిన ముఖ్యమంత్రి నేడు ఇంత కఠిన నిర్ణయాలు తీసుకోవడం సమంజసంకాదు. ఆత్మగౌరవ పాలనలో పండగపూట ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోగా, ఉన్న ఉద్యోగాలను తీసివేస్తూ కొత్త నియామకాలను చేస్తామని నిర్ణయాలు తీసుకోవడం భావ్యంకాదు. కోర్టులు జోక్యం చేసుకొనేదాకా వెళ్లకుండా వెంటనే ప్రభుత్వం, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చలుజరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి. ఆర్టీసీ ఉద్యోగులు పట్టువీడాలి. పాలకులు మెట్టు దిగాలి

. నేడు ప్రజాక్షేమాన్ని కోరి, ఇరువర్గాల సమస్యను పరిష్కరించుకొని మానవీయతను చాటాలి. ప్రజల సౌకర్యాలకు ఇంతగా విఘాతం కలిగించడం ఇరువర్గాలకు శ్రేయస్కరంకాదు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక మానవీయకోణంలో పాలన అందించాల్సిన పాలకులు సమస్యలను పరిష్కరించకపోవడం ఎంత మాత్రం బాధ్యత అనిపించుకోదు. ఆర్టీసీ కార్మికులు, పాలకులు పట్టింపులకు పోవడం లాంటి వైఖరి ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన విధానాన్ని గమనించాలి. ఈలోటును ఎవరు పూడ్చలేరని గమనించాలి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను నిలువరించాలి. ప్రజలకు వెంటనే ప్రయాణ సౌకర్యాలు పునరుద్ధరించాలి.

  • మేకిరి దామోదర్‌

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/