ఆచరణకు రాని ఆదివాసి హక్కులు?

2015న ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఆ రాష్ట్ర ఆదివాసుల పాలిట శాపంగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటి 25.16 శాతంగా ఉన్న అడవిని 33 శాతానికి పెంచాలని సంకల్పించింది. మొక్కలు నాటి అడవ్ఞలను పెంచాలన్న ఉద్దేశాన్ని ఎవరూ కాదనరు. అయితే నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాలంటే లక్షలాది ఎకరాల భూమి అవసరమవ్ఞతుంది. ఆ లక్షలాది ఎకరాల ఖాళీ భూములు ఎక్కడున్నాయి? ఎవరి వద్ద ఉన్నాయనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న? ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం నిలిపివేసి ఆదివాసులు, ఇతర అటవీ నివాసితుల హక్కులను నిరాకరించి తరతరాలుగా ఆదివాసులు సాగు చేసే పంటభూముల్లో హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది.

TRIBALS LIFE
TRIBALS LIFE

దే శవ్యాప్తంగా అటవీ భూములపై హక్కుల కోసం చేస్తున్న తిరుగుబాట్లు, ప్రకృతినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసులు, ఇతర అటవీ నివాసులందరికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తలపెట్టిన అటవీ చట్టాల సవరణలు పేరుతో చేస్తున్న మార్పులు ఆదివాసుల మనుగడకు సరికొత్త హెచ్చరిక. ఈ దేశ ప్రజల మౌలిక ప్రయోజనాలకంటే బహుళజాతి సంస్థల (మల్టీనేషనల్‌ కంపెనీల) వ్యాపార ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తున్న ప్రభుత్వాలు స్వల్ప సంఖ్యాకులైన ఆదివాసి ప్రజల హక్కులు హరించడానికే చూస్తున్నాయి.

ఆదివాసులను ఈ ప్రకృతిలో కానీ మానవ సమాజంలో కానీ భాగంగా చూడటానికి ఇష్టపడటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 1980 తరువాత షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఇతరుల వలసలు విపరీతంగా పెరిగాయి. ఆదివాసుల నివాసప్రాంతాలన్నీ ఆదివాసేతరుల నివాస ప్రాంతాలుగా, వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. వలసలు పెరగడంతో ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వైరుధ్యమైన జీవన పరిస్థితులను ఇముడ్చుకోలేని గత్యంతర పరిస్థితుల్లో నుంచి మరింత అడవ్ఞలలోకి వెల్లవలసిన అత్యయిక స్థితి ఆదివాసులకు నెలకొంది. కోయజాతి ఆదివాసులకు స్వర్గదామంగా ఉండే భద్రాచలం టౌన్‌షిప్‌ నేడు టెంపుల్‌ సిటీ పుణ్యాన ఆదివాసేతర వ్యాపారస్తుల అడ్డాగా మారి ఆ జాతి ఉనికినే దెబ్బతీసింది. ఇలా దేశంలో అనేక ప్రాంతాలకు ఈ పరిస్థితి దాపురించింది.

ఈ అత్యయిక పరిస్థితులను ఆసరాగా తీసుకొంటున్న పాలకపక్షాలు ఆదివాసులను అడవ్ఞల వినాశన కారులుగా, ప్రకృతి విధ్వంసకరాలుగా చిత్రీకరించి అడవ్ఞల నుంచి పూర్తిగా దూరం చేయాలని చూస్తున్నారు. ఇది ఆదివాసుల, ఇతర అటవీ నివాసితుల జీవితాల్లో మరింత ఆందోళన కలిగించే పరిణామం. ఎన్నో దశాబ్దాలుగా అడవికి, భూమికి నిరాకరించ బడుతూ వస్తున్న ఆదివాసులు పోరాటాల ద్వారా నష్టపరిహారంగా సాధించుకొన్న ‘అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 అమలు చేయకుండానే నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు పూనుకున్నాయి.

ఇప్పటికే అభివృద్ధి నమూనా బూచిని చూపి భారీ ప్రాజెక్టులు, గనులు వెలికితీత పేరిట ఆదివాసుల వద్ద ఉన్న భూములను బలవంతంగా గుంజుకొన్నారు. నర్మద, శ్రీశైలం, పోలవరం (ఇందిరాసాగర్‌) నాగార్జున సాగర్‌, సీలేరు, చిత్రకొండ, డొంకరాయి, జలాపుట్టు కొలాబ్‌ రిజర్వాయర్‌ (ఒడిశా) కంతనపల్లి, బాక్సైట్‌ గనుల త్వకాలు, బహిరంగా బొగ్గుగనులు, పులులు, జింకలకు పార్కులు, అభయారణ్యాలు వంటి భారీ ప్రాజెక్టులు అంటూ రిజర్వాయర్ల వల్ల అదివాసీలను బలిచేశారు. చేస్తున్నారు. వారికి కనీస పునరావాసం కూడా కల్పించలేదు. ఈ నష్టాన్ని ప్రకృతి విధ్వంసంగా, మానవ వినాశకర ప్రక్రియగా ఎందుకు గుర్తించరు? ఆదివాసులే ఈ దేశానికి మూలవాసులంటూ బుద్ధిజీవ్ఞలు, మేధావ్ఞలు, చరిత్రకారులు ఎంత హితబోధ చేస్తున్నా పాలకులకు ఎందుకు పట్టడం లేదు? 1971నాటి బెంగాల్‌ విభజన అనంతరం బెంగాళీలను శరణార్థులుగా ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి, నవరంగపూర్‌ జిల్లాల్లో ఒక్కొక్క కుటుంబానికి మూడేసి ఎకరాల చొప్పున లక్షాయాభైవేల కుటుంబాలకు నాలుగు లక్షల యాభైవేల ఎకరాల అటవీ భూమిని పంచిపెట్టినా భూమిపుత్రులను నిర్వాసితులను చేశారు.

ఇది భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్డ్‌ అనుసరించి చేసిన 1/70 భూ బదలాయింపు నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతం. 2015న ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఆ రాష్ట్ర ఆదివాసుల పాలిట శాపంగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటి 25.16 శాతంగా ఉన్న అడవిని 33 శాతానికి పెంచాలని సంకల్పించింది. మొక్కలు నాటి అడవ్ఞలను పెంచాలన్న ఉద్దేశాన్ని ఎవరూ కాదనరు. అయితే నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాలంటే లక్షలాది ఎకరాల భూమి అవసరమవ్ఞతుంది.

ఆ లక్షలాది ఎకరాల ఖాళీ భూములు ఎక్కడున్నాయి? ఎవరి వద్ద ఉన్నాయనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న? ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం నిలిపివేసి ఆదివాసులు, ఇతర అటవీ నివాసితుల హక్కులను నిరాకరించి తరతరాలుగా ఆదివాసులు సాగు చేసే పంటభూముల్లో హరితహారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అడవ్ఞలపై వల్లమాలిన ప్రేమ. ఆదివాసీలపై పెంచుకొన్న ద్వేషం కారణంగా ఒక్కటంటే ఒక్క ఉమ్మడి హక్కుపత్రం కూడా మంజూరు చేయలేదు.

అటవీహక్కుల చట్టం రాకమునుపు విశాఖపట్నం జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్‌ 11 మండలాల పరిధిలో ఆదివాసుల ఉమ్మడి యాజమాన్యపు నిర్వహణలో ఉన్న అటవీభూములను ఉమ్మడి అటవీ నిర్వహణ, సామాజిక అటవీ నిర్వహణ కింద అటవీశాఖ బలవంతంగా గుంజుకొంది. వీటినే నేడు జె.ఎఫ్‌.ఎమ్‌, సి.ఎఫ్‌.ఎమ్‌ అనే పేర్లతో పిలుస్తున్నారు. ఆదివాసులను అడవ్ఞల నుంచి పంపించే క్రమంలో మహిళలపైన, చిన్న పిల్లలపైన అటవీశాఖా అధికారులు హింసకు పాల్పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల సరిహద్దుల్లోకి వచ్చి గుడిసెలు వేసుకుని తలదాచుకొంటున్నారు ఆదివాసులు.

అటవీ హక్కుల చట్టం అమలు చేయాల్సిన పాలకులు చట్టం అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారు. అటవీహక్కుల చట్టం ఉండగా 2016లో ‘కాంపెన్‌సెటరీ అప్పరేస్ట్రేషన్‌ మెయింటెనేన్స్‌ అండ్‌ ప్లానింగ్‌యాక్ట్‌ బిల్లును తెరమీదకు తీసుకువచ్చింది. అంతేకాకుండా సవరణ చట్టం పేరుతో ఇండియన్‌ ఫారెస్ట్‌ యాక్ట్‌-1927ను మార్పు చేసి భారతీయ అటవీ చట్టం (సవరణ) 2019 పేరుతో వచ్చే అటవీ చట్టం వల్ల అటవీ హక్కుల చట్టాన్నే కాదు ఈ దేశ ఆదివాసులు, ఇతర అటవీ నివాసుల మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చివేస్తుంది. రాజ్యాంగంలో షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ఏ సాధారణ చట్టనియమాలను ఆపదించకూడదని నిర్దేశించింది. 70ఏళ్లు గడచినా ఏ ఒక్క పాలకులు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించి నడుచుకొన్న పరిస్థితి లేదు.

  • రామారావు దొర