అవని ఆరోగ్యాన్ని కబళిస్తున్న ప్లాస్టిక్‌

PLASTIC WASTE POLLUTION

సులభంగా ఉపయోగించగలగడం, తేలికగా ఉండటం, మన్నిక, చౌకధరల్లో లభించడం, తడవకపోవడం వంటి సుగుణాల వల్ల ప్లాస్టిక్‌ అత్యంత వేగంగా ప్రజాజీవితంలో భాగమైంది. ఉదయం లేవగానే చేసుకునే బ్రష్‌ నుండి టబ్‌లు, మగ్‌లు, బకెట్‌లు దువ్వెనలు, బెల్టులు,వాటర్‌ బాటిల్స్‌, లంచ్‌ బాక్స్‌లు, కుర్చీలు, ఇలా మన జీవితం మొత్తం ప్లాస్టిక్‌తో ముడిపడిపోయింది.

కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌, క్యారీ బ్యాగులు, ప్లేట్లు, టీగ్లాసులు, స్ట్రాలు ఇలా ప్రతి ఒక్కటి విస్తృత ఉపయోగంలో ఉంది. అయితే సింథటిక్‌ సెమీసింథటిక్‌ రసాయన ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌ కాలుష్యం నేడు భూతంలా తయారై మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. ప్లాస్టిక్‌ తయారీ దశ నుండి సముద్రాలను చేరే దశవరకు కణాలుగా గాలిలో కలవడం, విషరసాయనాలను విడుదల చేయడం ద్వారా జల కాలుష్యం, నేల కాలుష్యం మొదలగు పర్యావరణం కాలుష్యం ఏర్పడుతుంది.

ఇ రవైవ శతాబ్దంలో విప్లవాత్మక ఉత్పత్తిగా ప్రసిద్ధిపొంది మానవ జీవితాన్ని ఎంతో సౌకర్యవంతం చేసిన ‘ప్లాస్టిక్‌కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ వాడ కాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోడీ తరచుగా చెబుతున్నారు. జీవజాతి ఆరోగ్యాన్ని కబళిస్తున్న ప్లాస్టిక్‌ను ఇప్పటికే 60 దేశాలు నిషేధించాయి. మనదేశంలో సిక్కిం, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, నాగాలాండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో నిషేధించగా మరికొన్ని రాష్ట్రాలు నిషేధ బాటలో పయనిస్తున్నాయి.

దేశంలో ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తూ వృద్ధిరేటు తగ్గుతున్నవేళ 11 లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్న ప్లాస్టిక్‌ పరిశ్రమపై నిషేధం గణనీయ ప్రభావం చూపుతుందని, అందువల్ల కొంతకాలం వెసులుబాటు ఇస్తూ ఈ లోగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మానవ జీవితంలో విడదీయ రానంతగా పెనవేసుకుపోయిన ప్లాస్టిక్‌ ఆవిర్భావం 1839లో జరిగింది. బిలియర్డ్‌ బంతుల కోసం ప్రత్యామ్నాయ తెల్లటి సెల్యూలాయిడ్‌ అనే పదార్థాన్ని ‘జాన్‌వెస్లీ కనుగొన్నాడు. ఆ తర్వాత బొగ్లు ఫిసాల్‌ నుండి బేకలైట్‌, చమురు ఇథిలిన్‌ వాయువ్ఞతో పాలిఇథిలిన్‌ ఆవిష్కరణ జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వినియోగ వస్తువ్ఞల రంగంలోకి ప్లాస్టిక్‌ ప్రవేశిం చింది. మనదేశంలో 1957లో పాలిస్టిరీస్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. 2018 నాటికి ప్రపంచ ప్లాస్టిక్‌ ఉత్పత్తి 380 మిలియన్‌ టన్నులు కాగా, భారత్‌లో 15,541 కిలోటన్నుల ఉత్పత్తి జరిగింది.

సగటు వినియోగం మనదేశంలో 11 కిలోలు కాగా అమెరికాలో 109 కిలోలు, చైనాలో 38 కిలోలుగా ఉంది. దేశీయ డిమాండ్‌ ఎక్కువగా ఉండటం వల్లే ప్లాస్టిక్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దేశంలో ఉత్పత్తి అవ్ఞతున్న ప్లాస్టిక్‌లో 40 శాతం రిలయన్స్‌, 28 శాతం ఐఓసి, ఒఎన్‌జిసి హోల్డియు పెట్రో కెమికల్స్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. ఏటా 10 శాతం వృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమ 11 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. సులభంగా ఉపయోగించగలగడం, తేలికగా ఉండటం, మన్నిక, చౌకధరల్లో లభించడం, తడవకపోవడం వంటి సుగుణాల వల్ల ప్లాస్టిక్‌ అత్యంత వేగంగా ప్రజాజీవితంలో భాగమైంది. ఉదయం లేవగానే చేసుకునే బ్రష్‌ నుండి టబ్‌లు, మగ్‌లు, బకెట్‌లు దువ్వెనలు, బెల్టులు,వాటర్‌ బాటిల్స్‌, లంచ్‌ బాక్స్‌లు, కుర్చీలు, ఇలా మన జీవితం మొత్తం ప్లాస్టిక్‌తో ముడిపడిపోయింది. కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌, క్యారీ బ్యాగులు, ప్లేట్లు, టీగ్లాసులు, స్ట్రాలు ఇలా ప్రతి ఒక్కటి విస్తృత ఉపయోగంలో ఉంది. అయితే సింథటిక్‌ సెమీసింథటిక్‌ రసాయన ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌ కాలుష్యం నేడు భూతంలా తయారై మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది.

ప్లాస్టిక్‌ తయారీ దశ నుండి సముద్రాలను చేరే దశవరకు కణాలుగా గాలిలో కలవడం, విషరసాయనాలను విడుదల చేయడం ద్వారా జల కాలుష్యం,నేల కాలుష్యం మొదలగు పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ప్లాస్టిక్‌ పదార్థాలు చిన్న, మధ్యతరహా, 5.5 ట్రిలియన్‌ ప్లాస్టిక్‌ ముక్కలు సముద్రా లపై తేలియాడుతున్నట్లు తేలింది. ప్రతి సంవత్సరం 8.8 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాలలోకి చేరుతున్నాయి. 1950 నుండి 2018 వరకు ప్రపంచంలో 6.3 బిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి కాగా ఇందులో 9శాతం రీసైకిల్‌ చేయబడింది. 12 శాతం మండించబడుతుంది. మనదేశంలో 2017-18లో 5500 టన్నుల ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేశారు. ఇది మొత్తం ఉత్పత్తిలో 60 శాతం. 2022 నాటికి ఆరు రకాల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్స్‌ను పూర్తిగా నిషేధించాలని మన ప్రభుత్వ ఆలోచన. ఇవి చెంచాలు, కప్పులు, స్ట్రాలు, బాటిల్స్‌, క్యారీబ్యాగులు సాబెత్‌లు. దేశంలోని మొత్తం ప్లాస్టిక్‌ వ్యర్థాలలో 50 శాతం ఈ ఆరింటి వల్లే జరుగుతుంది.

పైగా ఇవి రీసైకిల్‌ చేయలేనివి. చేసినా అత్యంత నాణ్యత లేని పదార్థం తయారవ్ఞతుంది. అందువల్ల పారవేయాల్సివస్తుంది. అందుకే వీటినిపూర్తిగా నిషేధించాల్సివస్తుంది. 2018లో ఏడువేల మంది 387 కి.మీ సముద్రతీరంలో తిరిగి ఇరవైవేల కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించారు. ఇందులో 11,091 కేజీలు ఫుడ్‌వ్రాపర్స్‌, 8522 కేజీలు క్యారీబ్యాగులు, 8,354 కేజీలు ప్లేట్లు, కప్పులు, 7993 కేజీలు సిగరెట్‌ పీకాలు, 6511 కేజీలు సీసాలు, 3905 కేజీలు స్ట్రాస్‌, మూతలు, చెంచాలు, ఫోర్క్‌లు లభించాయి. ఒకసారి మాత్రమే ఉపయోగపడే పై ఆరు రకాల ప్లాస్టిక్‌ వస్తువ్ఞలు చాలా ఆలస్యంగా శిధిలమై విచ్ఛిన్నమవ్ఞతాయి. దినపత్రిక కాగితం- ఆరువారాలు, సిగరెట్‌ బట్‌-ఐదు సంవత్సరాలు, అస్తి పంజరం పది సంవత్సరాలు, క్యారీబ్యాగులు 20 సంవత్సరాలు, నైలాన్‌ 40 సంవత్సరాలు కాప్‌లు యాభై సంవత్సరాలు, స్ట్రా- 200 సంవత్సరాలు, వాటర్‌ బాటిల్‌ 450 సంవత్సరాలలో శిధిలమై భూమిలో కలిసిపోతుంది. సగటు భారతీయుని జీవన కాలం 69 సంవత్సరాలు. కాగా బాటిల్‌ ఆరు తరాల వరకు అలాగే ఉంటుంది.

ప్లాస్టిక్‌ కాలుష్యం జీవజాతుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. దేశంలోని పంపునీటిలో 72 శాతం ప్లాస్టిక్‌ రేణువ్ఞలు ఉన్నట్లు తేలింది. ఒక వ్యక్తి సంవత్సరానికి మూడువేల నుండి నాలుగువేల సూక్ష్మప్లాస్టిక్‌ కణాలను లేదా 250 గ్రాముల బరువ్ఞగల ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నారని తేలింది. ఈ కాలుష్యం నీటి వనరులలో చేరి చేపల ద్వారా మన ఆహారంలోకి ప్రవేశిస్తుం ది. ప్లాస్టిక్‌ వల్ల మురికి చేరి దోమలు పెరుగుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. మనశరీరంలో హార్మోన్‌ వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా ఎండోక్రైన్‌ వ్యాధులు రావడం, వ్యంధత్వానికి దారితీయడం జరుగుతుంది. 2019లో ప్లాస్టిక్‌, పర్యావరణ నివేదిక ప్రకారం ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల 850మిలి యన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌కు సమానమైన గ్రీన్‌ హౌజ్‌ వాయువ్ఞల ఉద్గారం జరిగింది.

సముద్రజీవరాశుల మనుగడకు మూలమైన పైటోప్లాంక్టన్‌లపై ప్లాస్టిక్‌ విషం ప్రభావం చూపు తుంది. తిమింగళల ప్రెగులలో పెద్దమొత్తం ప్లాస్టిక్‌ అవశేషాలు దొరికాయి. కేన్సర్‌, ఇతర ఊదరసంబంధ వ్యాధులు మనుషులకు సంక్రమిస్తున్నాయి. వ్యర్థాల వల్ల నేలల కాలుష్యం జరిగి పంట దిగుబడి తగ్గుతుంది. ప్లాస్టిక్‌ దుష్ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యా మ్నాయ ప్లాస్టిక్‌ మార్గాలు వచ్చాయి. 45-50 సార్లు ఉపయోగిం చగలిగే పాలసరఫరా కోసం పిఎఫ్‌వై పర్సులు, సంచులు వచ్చా యి. ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను రహదారుల నిర్మాణం, ప్లాస్టిక్‌ ఇటుకల తయారీ, కార్లునడిపే వంతెనల తయారీలో వాడు తున్నారు. ఏమైనప్పటికీ ఈ ప్లాస్టికాసురున్ని అంతం చేయాలంటే ప్రజలభాగస్వామ్యం, సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం జరిమానాలు విధిం చడం, విస్తృతరగా ప్రజల్లోఅవగాహన కల్పించడం,ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్లు నెలకొల్పటం, ఆంటీప్లాస్టిక్‌ స్క్వాడ్‌ బృందాల ఏర్పాటు, జనపనార, నూలు, గుడ్డ సంచుల వాడకం, స్టీలు గ్లాసు వాడకా న్ని ప్రోత్సహించడం, బయోడిగ్రీ డబుల్‌ ప్లాస్టిక్‌ తయారీ, తదితర మార్గాలు అనుసరిస్తే అవని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

– తండ ప్రభాకర్‌ గౌడ్‌

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/