మహోన్నత వ్యక్తి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌

నేడు బాబూ రాజేంద్రప్రసాద్‌ వర్థంతి

DR.BABU RAJENDRA PRASAD

బీహార్‌ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి స్వతంత్ర భారతావనికే రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై రెండుసార్లు తన అమూల్య సేవలతో భారతీయుల హృదయాలను చూరగొన్న మహోన్నత వ్యక్తి బాబూ రాజేంద్ర ప్రసాద్‌.

1906 కోల్‌కతాలో జరిగిన స్వాతంత్రోద్యమ సభలో ప్రధాన వక్తలు తిలక్‌, బిపిన్‌ చంద్రపాల్‌, లాలా లజపతిరా§్‌ు, మాలవ్య, జిన్నా మొదలగు వారిప్రసంగాలు ఆ సభలో వలంటీ రుగా పాల్గొన్న బాబూ విని, గోపాలకృష్ణ గోఖలేను కలుసుకుని, ఆయన స్థాపించిన సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీలో చేరా రు. ఓసారి నీలిమందు తోటల యజమానులకు రైతులకు మధ్య తలెత్తిన ఘర్షణలో గాంధీజీతో పరిచయం ఏర్పడింది. అప్ప ట్నుంచి గాంధీజీ సన్నిహితుడుగా మారారు.

1929లో బీహార్‌ మహాసభలో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కోరుతూ తీర్మానం చేశా రు. బీహార్‌కు నాయకత్వం వహించారు. దాంతో ఆయన్ని ప్రభుత్వం నిర్బంధించింది. ఆరునెలల జైలుశిక్ష విధించింది. 1934లో భారత కాంగ్రెస్‌ అధ్యక్షులైనారు. 1942లో ‘ఇండియా డిలైట్‌ పుస్తకాన్ని రాశారు. 1950లో నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చా క దేశానికి 1952లో తొలి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మళ్లీ 1957లో రెండవసారి కూడా ఎన్నికైనారు.

1962 లో పదవీ విరమణ చేసిన బాబూ రాజేంద్రప్రసాద్‌ దేశానికి ఎంతో సేవ చేశారు. వీరు డిసెంబరు 3, 1884న బీహార్‌ రాష్ట్రంలో జీరాదేయి గ్రామంలో జన్మించారు. 1893 వరకు పారశీక గురువ్ఞ వద్ద ప్రాథమిక విద్య, అనంతరం కాలేజీ చదువ్ఞల్లో సర్‌.జగదీష్‌చంద్రబోస్‌ వంటి ప్రముఖల వద్ద విద్య అభ్యసించారు. మాస్టర్‌ ఆఫ్‌ లా డిగ్రీ పూర్తి చేసి కోల్‌కతా హైకోర్టులోనూ, పాట్నా హైకోర్టు లోనూ లాయర్‌గా ప్రాక్టీసు చేశారు.

న్యాయశాస్త్రంలో డాక్టరేట్‌ డిగ్రీ పొందారు. పాట్నా పురపాలక సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. 1905లో విదేశీ వస్త్ర, వస్తు బహిష్కరణ ఉద్యమంలో రాజకీయాలలో చురుగ్గా ప్రవేశించారు. బిపిన్‌ చంద్రపాల్‌, అరవిందఘోష్‌ లాంటి మహా వ్యక్తుల వ్యాసాలతో మరింత ప్రభావితులయ్యారు.

1946 సెప్టెంబర్‌లో నెహ్రూ నాయకత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో వ్యవసాయ శాఖామంత్రిగా నియమితులైనారు. రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షలై నారు. భారత ప్రభుత్వం వీరికి 1962లో భారతరత్న అవార్డు ను అందచేసింది. వీరు 1963 ఫిబ్రవరి 28న మరణించారు. వీరి జయంతి డిసెంబరు 3న న్యాయవాదుల దినోత్సవంగా నిర్వహిస్తారు. వీరు తన ఆత్మకథను రాశారు. దాని పేరు ‘ఆత్మకథ. ఇది 1946లో రాయబడిన గ్రంథం.

  • డా.జె.వి.ప్రమోద్‌కుమార్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/