ఆకలి కేకలు అరికట్టలేని పాలకవర్గాలు

Globall hunger index

అయిదేళ్లలోపు పిల్లల మరణాలు గత పదిహేను సంవత్సరాలుగా తగ్గుముఖం పట్టినా, ఇప్పటికీ ప్రపంచంలో పెద్దసంఖ్య ఇండియాదేనని ప్రముఖ వైద్యపత్రిక లాన్సెట్‌ తాజా అధ్యయనం స్పష్టీకరిస్తోంది. 2000 సంవత్సరం నాటికి దేశంలో అయిదేళ్లలోపు శిశువ్ఞలు ఏటా 25 లక్షల మంది అర్థాంతరంగా చనిపోయారు. ప్రతి సంవత్సరం సుమారు రెండు కోట్ల 60 లక్షల జననాలు నమోదవ్ఞతున్న గడ్డమీద శిశుమరణాలు ఇప్పటికీ ఇంతగా పెరగడం ఎందరో తల్లులకు తీరని వేదన కలిగిస్తుంది. శిశుమరణాల నియంత్రణలో వివిధ రాష్ట్రాల మధ్య, ఒకే రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల నడుమ నెలకొన్న తీవ్ర అంతరాలను అంతర్జాతీయ ఆరోగ్య నివేదిక సూటిగా తప్పుపట్టింది.
భారతదేశం నేడు అనేక సంక్షో భాలతో కొట్టుమిట్టాడుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భారత దేశంలో ఆకలికేకలను కప్పిపుచ్చడా నికి మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది. మీ దేశంలో 20 శాతం మంది చిన్న పిల్లలు వారానికి ఒక గుడ్డు, రెండు వారాలకు ఒక పండు తినలేని పరిస్థి తిలో ఉన్నారు. వారి ముఖాలు ఏ విటమిన్లు లేక కళ తప్పి కనిపిస్తున్నాయి. ఎందరో శిశువ్ఞలు ఆకలి తో మరణించడం బాధాకరం. 117 దేశాల వరుసలో ఆకలిసూచిలో భారత్‌ 102వ స్థానంలో ఉందని ఇతర దేశాలు నవ్ఞ్వతున్నాయి. అంటే పాలకులకు కరుణ లేదా? భారతదేశ గోదాముల్లో మూలు గుతున్న ధాన్యాగారాలన్నీ ఎలుకలు, పందికొక్కులు తినాల్సిందే నా? దేశంలోని అతి పేదలకు ఆహారం పెట్టలేని ప్రభువ్ఞ నిర్ధయుడుకాదా!

అయిదేళ్లలోపు పిల్లల మరణాలు గత పదిహేను సంవత్సరాలుగా తగ్గుముఖం పట్టినా, ఇప్పటికీ ప్రపంచంలో పెద్దసంఖ్య ఇండియాదేనని ప్రముఖ వైద్యపత్రిక లాన్సెట్‌ తాజా అధ్యయనం స్పష్టీకరిస్తోంది. 2000 సంవత్సరం నాటికి దేశంలో అయిదేళ్లలోపు శిశువ్ఞలు ఏటా 25 లక్షల మంది అర్థాంతరంగా చనిపోయారు. ప్రతి సంవత్సరం సుమారు రెండు కోట్ల 60 లక్షల జననాలు నమోదవ్ఞతున్న గడ్డమీద శిశుమరణాలు ఇప్పటికీఇంతగా పెరగడం ఎందరో తల్లులకు తీరని వేదన కలిగిస్తుంది.

శిశుమర ణాల నియంత్రణలో వివిధ రాష్ట్రాల మధ్య ఒకే రాష్ట్రంలోని వేర్వే రు జిల్లాల నడుమ నెలకొన్న తీవ్ర అంతరాలను అంతర్జాతీయ ఆరోగ్య నివేదిక సూటిగా తప్పుపట్టింది. పాలకులు భారత రాజ్యాంగ సూత్రాలను విస్మరించారా భారతదేశంలో పుట్టిన బిడ్డను రక్షించాల్సిన బాధ్యతను విస్మరించారా? పౌష్టికాహారం తక్కువగా ఉన్న పిల్లల్లో దళితులు 90శాతం మందని సర్వేలు చెబుతున్నా యి. రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధిస్తుంది.

అంటరానితనం అంటే ఆహార పంపిణీలో భూమి పంపకంలో విద్యా,ఉద్యోగ వసతిలో అంటరానితనం కొనసాగడం వల్లే దళితులు ఆహారం లేక తమ పిల్లలను పురిటిలోనే పోగొట్టుకుంటున్నారు.ఆ తల్లివేదనను పాలకులు ఎందుకు ఆలకించడం లేదు. ఆర్థిక,సామాజిక రంగాల్లో పూర్తిగా వెనుకబడిన దళితుల జీవన స్థితిగతులు చట్టసభల్లో కొన్ని ఇచ్చినందువల్ల కానీ, ప్రభుత్వంలో కొన్ని ఉద్యోగాలు ఇచ్చినందు వల్ల కానీ మాసిపోవని అంబేద్కర్‌ చెప్పారు.

ప్రభుత్వం తెలివిగా ఆహార పంపిణీకి సంబంధించిన విషయాలను దళిత మంత్రికే అప్పచెప్పి దళితుల ఆదివాసీల నోళ్లు కొడుతున్నారు.వారు జీవించే హక్కును కాలరాస్తున్నారు. దేశంలో అన్ని సర్వేలు దళితుల్లోనే నిరక్షరాస్యతా శాతం ఎక్కువ ఉందని, గృహ వసతి లేనివారు దళితులేనని, ఉద్యోగాల భర్తీలో వివక్షకు గురవ్ఞతున్నారని తేల్చింది. రాజ్యాంగ అధికరణం 14లో చట్టం ముందు అందరూ సమానులే. ఈ ఆర్టికల్‌ గురించి రాజ్యాంగ పరిషత్‌లో చాలా చర్చ జరిగింది. అంబేద్కర్‌ పోలిస్టేషన్‌, కలెక్టర్‌ ఆఫీసులన్నీ ప్రభుత్వం నడిపే ఆఫీసులు వీరికి న్యాయం చేయాలన్నారు. నేడు ముఖ్యంగా భూపంపకం ప్రధానమైంది.

భారతదేశవ్యాప్తంగా రెండు శాతం భూమి కూడా దళితులకులేదు. భూ సంస్కరణలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే అసలు భూమి ఊసే ఎత్తకుండా కేంద్ర ప్రభుత్వం పాలన చేస్తుంది. భారతదేశంలో 30,770 లక్షలఆహార నిల్వలు పెట్టుకొని ఎందుకు పసిపిల్లలు మరణానికి ప్రభుత్వం కారణం అవ్ఞతుంది. నెహ్రూ, ఇందిరాగాంధీ అన్ని రాష్ట్రాల్లో భూ స్వామ్య కులాలకు ప్రభుత్వాధికారాలు ఇచ్చారు. ఆనాడు ఆంధ్ర ప్రదేశ్‌ను రెడ్లకు అప్పచెప్పారు. ఆ తర్వాత కమ్మవారు పాలించా రు. మిగిలిన వారు స్వల్పం.

ఆంధ్రరాష్ట్రంలో కొత్త పరిపాలన కోసం దళితులు పెద్దఎత్తున ఓటువేశారు. నూతనంగా వచ్చిన ప్రభుత్వం కూడా భూస్వామ్య విధానాన్నే పక్కాగా అనుసరిస్తుంది. ఒక ఎకరం భూమిని ఇంతవరకు పంచలేదు. ఇక పంచుతుందనే నమ్మకం లేదు. దళితులు ఈ రెండు దశాబ్దాల్లో వ్యవసాయంలోకి యాంత్రిక పరికరాలు రావడం వల్ల భవన నిర్మాణ కార్మికులుగా రూపొందారు. కొత్త ప్రభుత్వం ఇసుకను బంధించడంతో అన్నం లేని పనిస్థితికి వీళ్లు వచ్చారు. పనిలేని వారికి పని కల్పించాల్సిన ప్రభుత్వం ఉన్న పని పోగొట్టింది.

ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా రూపొందడంలో వారి పోరాటం అపారమైంది. డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రభుత్వ సంస్థలనుబలోపేతం చేస్తూ దళిత బహుజన మైనార్టీలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయమన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి మొదట దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని రాజ్యానికి వచ్చారు. ఆ మాట తప్పారు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని చెప్పారు. ఇవ్వలేదు. ఆయన రైతులకు కాంప్రియేషన్స్‌ ఇస్తానని, కౌలుదారులకు ఇవ్వనని నిక్కచ్చిగా చెప్పారు. ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ముఖ్యపట్టణం నిర్మాణం మీద, వివిధ పట్టణాల నిర్మాణం మీద దృష్టి పెట్టాలి.

ఇంతకుముందు ప్రభుత్వం చేసిన అవినీతిని తొలగిస్తూనే నూతన పంథాల్లో కార్యక్రమాలను నడపాలి. వ్యవసాయం, భవననిర్మాణం, పరిశ్రమల నిర్మాణం, పోర్టుల నిర్మాణం, సమతుల్యంగా సాగినప్పు డే యువతకు పని లభ్యమవ్ఞతుంది. నిర్మాణం పట్ల ద్వేషం లేక నిర్లక్ష్యం నూతన రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టు. ప్రభుత్వంలో పార దర్శకత ఉండాలి. రాజ్యాంగ విలువలను పాటించకపోతే కొత్త విధానాలతో ప్రభుత్వం నడువదు. అధికారులు ఆశ్రిత పక్షపాతులు చెప్పే మాటలతో ఉప్పొంగిపోయి ప్రజల ఆకలి కేకలు వినపడక పోతే ప్రభుత్వం చెవిటిది అయిందా అనే భావన వస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అస్పృశ్యతను అన్ని రంగాల్లో పాటిస్తున్నారనక తప్పదు.

ఆహారం లేక మరణిస్తున్న శిశువ్ఞలు ఎక్కువ మంది ఎవరు? ప్రభుత్వం ప్రభుత్వవైద్యశాలలను బలోపేతం చేయకుండా దేశవ్యాప్తంగా వైద్య శాలలకు తెలుగు వారిని పంపడం ఏమిటి? అసలు దేశవ్యాప్తం గానే అనారోగ్య పరిస్థితి ఇలా వ్ఞంది అని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నవజాత శిశుమరణాల్లో 27శాతం, అయిదేళ్లకే నూరేళ్లు నిండిపోతున్న పిల్లల్లో 21 శాతం, అంతర్జాతీయ వ్యాధుల భారంలో అయిదోవంతు దాకా భారత్‌లోనే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.ఇకపోతే డయేరియా, తట్టు, గవదలు, టైఫాయిడ్‌, పచ్చకామెర్లు, మలేరియా, డెంగ్యూల తాకిడితో జనా రోగ్యానికి తీవ్రంగా తూట్లుపడుతున్నాయి.

నిరుడు ప్రపంచవ్యాప్తం గా రెండు లక్షల 27వేల మంది తట్టు వ్యాధిన పడితే లక్షా36వేల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. 2017తో పోలిస్తే 47శాతం అధికంగా కేసులు నమోదయ్యాయని మొన్న ఫిబ్రవరిలో ప్రకటించింది. అల్పాదాయవర్గాల ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసేలా స్వైన్‌ఫ్లూ, డెంగ్యూల విజృంభణపై ఎంత చెప్పినా తక్కు వే. ఇటీవలే బీహార్‌, అసోమ్‌లలో ఎక్యూట్‌ ఎన్‌కెఫలైటిస్‌ సిండ్రో మ్‌ (ఎఇఎస్‌)వ్యాధి ప్రబలి వందలమంది పిల్లల్ని పొట్టన పెట్టుకోవ డం తెలిసిందే. దానిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో వైద్యసదుపాయాలు, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం వంటి కీలకాంశా లపై సుప్రీంకోర్టు బీహార్‌ ప్రభుత్వంతోపాటు కేంద్రాన్నీ ప్రతివాదిగా చేర్చిందని పరిశీలకులు చెబుతున్నారు.

భారత రాజ్యాంగం 45వ అధికరణలో ఆరు సంవత్సరాలోపు బాలబాలికల పరిరక్షణ ప్రభు త్వానిదని పేర్కొంది. ఆరు సంవత్సరాలు పూర్తయ్యేవరకు ప్రభు త్వాలు పరిరక్షించాలి.86వ రాజ్యాంగ సవరణతో నిర్బంధ విద్య బాధ్యత కలిగించింది. మరి ఎందుకు ప్రభుత్వాలు రాజ్యాంగ సూత్రాలను పాటించడం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 48ఎ ప్రకారం అడవ్ఞలను, జంతువ్ఞలను కాపాడాల్సిన బాధ్యత ప్రభు త్వానిదే. దేశీయంగా అడవ్ఞలు భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం ఉండాలి.తాజా అటవీ నివేదిక 2013 ప్రకారం 21శాతం మాత్రమే ఉన్నాయి.

దీనివల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డిబీర్స్‌ అనే కార్పొరేట్‌ సంస్థ ఇప్పటికే 430 బోర్లు వేసింది. భారత్‌ 16 దేశాలతో అణు ఒప్పందాలు చేసు కుంది. అణురియాక్టర్ల దిగుమతికి సులభమైన మార్గదర్శకాలను రూపొందించుకుంది.

కార్పొరేట్‌ కంపెనీల అణువిద్యుత్‌ ఉత్పత్తిలో భాగంగా అనర్థాలు జరిగితే, సదరు కంపెనీకి ఎటువంటి బాధ్యతలేని విధంగా ఒప్పందాలు ఉన్నాయి. భారత్‌ తన ప్రజలవైపా, బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసమా అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఉచితంగా ధనం ఇవ్వడం కాదు, పని కల్పించాలి. ఉన్న పనిని తొలగించే విధానాలు రాజ్యాంగ వ్యతిరేకమైనవి. వీళ్లు పునరాలోచించాలి.

-డాక్టర్‌ కత్తిపద్మారావు, (రచయిత: సామాజిక తత్త్వవేత్త)

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/