మిసైల్‌ వీరుడు ఎపిజె అబ్దుల్‌ కలామ్‌

నేడు అబ్దుల్‌కలామ్‌ జయంతి

Abdul kalam

ఆయన మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా. ఆయనో గొప్ప రాష్ట్రపతి. వందల కోట్ల మందికి విజయ రహస్యాన్ని బోధించిన స్ఫూర్తి ప్రదాత. ఓ సామాన్యునిగా పుట్టి దేశం గర్వించే శాస్త్రవేత్తగా విశ్వయవనికపై దేశం పేరును రెపరెపలాడించిన గొప్ప వైజ్ఞానికుడు. అంతకుమించి తనకి జన్మనిచ్చిన ఈ దేశానికి, ఈ పుడమి తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అని నిత్యం తపనపడిన దేశభక్తునిగా ఆ పుడమితల్లి భూతాపాన్ని చల్లార్చి భూమిని ఓ సుందర గ్రహంగా మార్చాలని కలలుకని ఆ కలల్ని సాకారం చేసిన మిసైల్‌ వీరుడు అబ్దుల్‌ కలామ్‌ 1931 అక్టోబరు 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జైనులుద్దిన్‌, ఆయుషమ్మ దంపతుల ఇంట యుగపురుషునిగా జన్మించారు.

కాలమ్‌గారి తండ్రి ఫెర్రిబోట్‌ను నడిపేవారు. అబ్దుల్‌ కలామ్‌ తండ్రి పరిస్థితిని అర్థం చేసుకొని ఆర్థికంగా సహాయపడటం కోసం ఇంటింటికి వెళ్లి న్యూస్‌పేపర్లు వేసేవారు. దాంతో వచ్చిన సంపాదన తల్లికే ఇచ్చేవారు. ఇలా కష్టించి పనిచేస్తూనే రామేశ్వరానికి కొద్ది దూరంలో ఉన్న రామనాథపురంలోని స్క్వాజ్‌ మెట్రిక్యులేషన్‌ పాఠశాలలో 10వ తరగతి వరకు కష్టపడి చదువ్ఞకున్నారు. చిన్నప్పటి నుండే కొత్త విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాస, తపన ఎక్కువగా ఉండేవి. కలాం గారికి పదేళ్ల వయస్సున్నప్పుడు తనకి బాగా ఇష్టమైన టీచర్‌ శివసుబ్రహ్మణ్యం అయ్యర్‌ పక్షుల గురించి క్లాస్‌ చెప్తున్నారు. పక్షులు ఎలా ఎగురుతాయి? ఎగురుతున్నప్పుడు రెక్కలు ఎలా ఉంటాయి? తోక ఎలా ఊపుతుందో? పక్షులు గుంపులుగా ఎందుకు ఎగురుతాయి అనే విషయాలు వివరిస్తున్నారు. క్లాస్‌ చెప్పడం అయిపోయాక మీ అందరికి అర్థమయిందా అని అడిగారు టీచర్‌. కలాంగారు లేచి తనకి అర్థం కాలేదు అన్నారు.

అందరికి లైవ్‌ ఎగ్జాంపుల్‌ చూపించడానికి సముద్ర తీరానికి తీసుకువెళ్లారు టీచరు. అక్కడ చాలా పక్షులున్నాయి. వాటిని పిల్లలందర్ని పరిశీలించమన్నారు. పక్షి ర్కెలు ఎలా ఊపుతుందో చూడమన్నా రు. ఎగురుతున్నప్పుడు తోక ఎలా ఊపుతుందో చూపించారు. తర్వాత ఎగురుతున్న పక్షికి ఇంజన్‌ ఎక్కడ ఉంటుందని టీచర్‌ అడిగారు. ఎవరు కూడా సమాధనం చెప్పలేకపోయారు. ఆ పక్షికి ఎగరాలి అనే సంకల్పం ఉంది. అదే దాని ఇంజన్‌ అని చెప్పారు. అప్పుడు కలామ్‌గారికి మెదడు లోతుల్లోంచి ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.

అప్పటి నుండి కలామ్‌ కూడా పక్షిలాగా ఎగ రాలనుకున్నారు.ఫ్లైటుకి సంబంధించిన చదువ్ఞ చదవాలనుకు న్నారు. ఇలా పైలెట్‌ అవ్వాలని అనుకొని మరుసటి రోజు స్కూలుకి వెళ్లి దానికి సంబంధించిన చదువ్ఞ గురించి శివ సుబ్రహ్మణ్యం అయ్యర్‌ టీచర్‌ని అడిగి వివరంగా తెలుసుకున్నారు. అప్పుడే కలామ్‌ గారి లక్ష్యం ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ అయిపోయిం ది. కష్టపడి చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించా రు. కలామ్‌ ఎక్కడ చదువ్ఞకుంటున్నా కూడా తన మనసంతా ఇంటి వద్ద ఉన్న తల్లిండ్రులమీదే ఉండేది. తల్లిదండ్రుల వద్ద ఎన్నో విలువలు నేర్చుకున్న కలామ్‌ వారికి చేదోడువాదోడుగా ఉంటూ వారినే దైవంగా భావించేవారు.

ఇలా కష్టపడి పనిచేసుకుంటూ, చదువ్ఞకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూనే తిరుచురాపూర్‌లోని సెయింట్‌జోసెఫ్‌ కాలేజీలో 1954లో ఫిజిక్స్‌ పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత తన కలైన ఏరోనాటిక్‌ ఇంజినీరింగ్‌ కోసం మద్రాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్‌ ఇంజి నీరింగ్‌ కాలేజీలో చేరారు. కలామ్‌ గారు ఇంజి నీరింగ్‌ థర్డ్‌ఇయర్‌లో ఉండగా లోలెవెల్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ ఎటాక్‌ మీద ప్రాజెక్టు చేయ మన్నారు.ఇది చాలా కష్టమైన ప్రాజెక్టు. అయినా కూడా ఆ ప్రాజెక్టుహెడ్‌మూడు రోజులలో పూర్తి చేయమన్నారు.

తన కలలను సాకారం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో కష్టపడి దానికి కావాల్సిన సమాచారాన్ని సేకరించి ఆ ప్రాజెక్టుని విజయ వంతంగా పూర్తి చేసి స్కాలర్‌షిప్‌ సహాయంతో ఏరోస్పేస్‌ ఇంజినీ రింగ్‌ అత్యధిక మార్కులతో విజయవంతంగా పూర్తి చేసి ప్రొఫె సర్లందరిచే ప్రశంసలు అందుకున్నారు ఈ అపర మేధావి. అలాగే ఏరోనాటికల్‌ ప్రవేశపరీక్షలో ఎనిమిదే ఉద్యోగాలుంటే తనకి 9వ స్థానం రావడంతో కొద్ది తేడాతో పైలెట్‌ అయ్యే అవకాశాన్ని కోల్పో యారు. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా 1960లో కలామ్‌ డిఆర్‌డిఒలో ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ లో శాస్త్రవేత్తగా చేరారు. అక్కడ భారత సైన్యం కోసం ఓవర్‌క్రాఫ్ట్‌ డెవలప్‌ చేయడం ఆయన పని.

ఆ తర్వాత ఇస్రోలో రాకెట్‌ ఇంజి నీర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. కలామ్‌, సారాబా§్‌ు గారు కలిసి ఇస్రోను ఎంతో అభివృద్ధి చేశారు. ఇస్రోలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి రాకెట్‌ లాంచింగ్‌ టెక్నిక్స్‌ మీద ట్రైనింగ్‌ కోసం ఇస్రోవారు అమెరికా పంపించారు. అక్కడ ట్రైనింగ్‌ విజయ వంతంగా పూర్తి చేసుకొని ఇండియా వచ్చారు. ఆ తర్వాత విక్రమ్‌, సతీష్‌ధామన్‌ సహకారంతో కలామ్‌గారు రోహిణి అనే శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపడానికి ఎస్‌ఎల్‌వి అనే రాకెట్‌ను అభివృద్ధి చేశారు. ఎస్‌ఎల్‌వి3 లాంచ్‌ అయ్యే చివరి నిమిషంలో ఫెయిల్‌ అయి సముద్రంలో కుప్పకూలిపోయింది. అయినా కలామ్‌గారు నిరుత్సాహపడకుండా మళ్లీ 1980లో రెండో ప్రయోగం కోసం ఎల్‌ఎస్‌వి3ని రెడీ చేశారు.

1980 జులై 18న ఎస్‌ఎల్‌వి3 లాంచ్‌ అయి రోహిణి శాటిలైట్‌ను ఆర్టికల్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఆయన ఆనందానికి హద్దులు లేవ్ఞ. స్వయంగా ఇందిరాగాంధే ఫోన్‌ చేసి అభినందించారు. ఆ తర్వాత 1981లో కలామ్‌గారిని పద్మభూషణ్‌ అవార్డు వరించింది. ఇక ఆయన వెనక్కితిరిగి చూడలేదు. ఆయన తారు చేసిన రాకెట్‌లాగానే ఆయన కూడా విజయపథంలో ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు. ఇలా ఇండియా ఆర్మీ కోసం ‘అగ్ని పృథ్వి, నాగ్‌, ఆకాశ్‌, త్రిపాల్‌ లాంటి ఎన్నో శక్తివంతమైన మిసైల్స్‌ని తయారు చేసి భారత్‌ని ఓ శక్తివంతమైన దేశంగా మార్చి భారతదేశ ఖ్యాతిని వినువీధుల్లో ఎగురవేశారు. అందుకే అబ్దుల్‌ కలామ్‌గారిని మిసైల్‌ మాన్‌ ఆఫ్‌ ఇండియా అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు అందరు. ఆయన ఓ గొప్ప మానవతావాది. అంతకుమించి ఓ గొప్ప సేవాతత్పరుడు. కలామ్‌గారు డిఆర్‌డిఒలో పనిచేసేటప్పుడు కేథరిన్‌ అనే తన కారుడ్రైవర్‌ని పట్టుబట్టి మరీ పి.జి.వరకు ఖర్చులన్నీ తానే భరించి చదివించారు. ఇప్పుడు ఆ కారుడ్రైవర్‌ ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీలో ఓ పెద్ద ఆఫీసర్‌. అందుకే కలామ్‌ గారు అంటారు

ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించడం గొప్పకాదు. తన వెంటవ్ఞన్న వంద మందిని గెలిపించి ఉన్నత శిఖరాలకు చేర్చడంలోనే అసలు సిసలైన ఆనందం ఉందని. కలామ్‌గారు కొంతకాలం పాటు ప్రధాన మంత్రికి సైంటిఫిక్‌ అడ్వయిజర్‌గా, ఒఆర్‌డిఒకి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ ప్రజాసేవకున్ని వాజ్‌పేయిగారు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. 2002లో రాష్ట్రపతిగా ఏక గ్రీవంగా ఎన్నికై ప్రజల రాష్ట్రపతిగా దేశ ప్రజలందరి జేజేలందుకు న్నారు. రాష్ట్రపతిగా ఎంతో నిరాడంబరంగా ఉంటూ అధ్యక్షుడిగా కొత్త ఒరవడికి నాందిపలికారు. రాష్ట్రపతి భవన్‌ను ప్రజలచెంతకు తీసుకువెళ్లి తనదైన శైలిలో ముద్రవేసుకున్నారు. ఆయన రాష్ట్రపతి గా పదవీవిరమణ చేశాక ఓ సరికొత్త జీవితానికి నాందిపలికారు. ఓ గొప్ప గురువ్ఞగా అత్యున్నత స్థాయి బోధకుడిగా మారి విద్యార్థుల తో మమేకమై దేశాభివృద్ధికి బాటలు వేశారు.కలామ్‌గారు కేర్‌హాస్పిటల్‌ ఫౌండర్‌ అయిన భూపతిరాజు,సోమరాజుగార్లతో కలిసి చాలా తక్కువ ఖర్చుకే స్టంట్‌ని రూపొందించారు. దానికి కలామ్‌రాజు స్టంట్‌ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 2012లో పల్లెటూర్లో ఆరోగ్యపరీక్షల కోసం ఒక టాబ్లెట్‌ కంప్యూటర్‌ని రూపొందించారు. దానికి కూడా కలామ్‌రాజు టాబ్లెట్‌ అని పేరుపెట్టారు. ఇలా ఎన్నో కొత్తకొత్తపరికరాల్ని సృష్టించి గొప్ప సైంటిస్టుగా, దేశభక్తునిగా అందరి ప్రశంసలు అందుకున్న అపరమేధావి 2017 జులై 27న షిల్లాంగ్‌లో మరణించారు.

  • పింగళి భాగ్యలక్ష్మి

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/