చేనేత రంగానికి చేయూత అవసరం

Handloom sector

భారత చేనేత వస్త్ర పరిశ్రమ అతి పురాతనమైనది. దేశ ఆర్థిక పరిపుష్టిలో వెన్నుదన్నుగా ఉన్నది. వ్యవసాయం తర్వాత ఉపాధి రంగంలో ద్వితీయ స్థానంలో ఉండి 43 లక్షల మంది నేతన్నలకు ఉపాధినిస్తూ దేశీయ ఉత్పత్తులలో 15శాతం బట్ట ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 25 శాతం విదేశాలకు ఎగుమతు లు జరుగుతున్నాయి. దేశీయ ఆర్థిక పరిపుష్టిలో భాగస్వామిగా ఉన్న ఈ పరిశ్రమ ఒక తరం వారి నుండి మరొక తరం వారికి నైపుణ్యాన్ని బదిలీ చేస్తున్నది. చేనేత బట్ట నాణ్యత మన్నిక గ్యారంటీ, వాతావరణ సమతుల్యాన్ని కాపాడటం, బట్ట ధరించిన వారికి సంఘంలో గౌరవం పెంచడం వగైరాలతో దేశాన్ని పాలించిన రాజులూ, రాజ్యాధినేతల మన్ననలను పొందగలిగింది.

నేటికి 105 దేశాలకు చేనేత ఉత్పత్తులు ఎగుమతులు చేయగల గడం ఈ పరిశ్రమ గొప్పతనం. ప్రపంచీకరణ పుణ్యమా అని యాంత్రికయుగం ప్రవేశించి పరిశ్రమకు పోటీగా కారు చౌకగా నాణ్యతా ప్రమాణాలు లేని బట్టను తయారీ చేసి మార్కెట్లో చేనేత పరిశ్రమను దెబ్బతీస్తున్నది. చేనేత పరిశ్రమ పది శాతం షెడ్యూల్‌ కులాలు, 18 శాతం ఇతర వెనుకబడిన కులాలు, 27 శాతం ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నది. సాలీనా 7208 మిలియన్‌ చద రపు మీటర్ల బట్ట తయారీ చేస్తున్నారు. చేనేత రంగం అగ్గిపెట్టెలో పెట్టగల అతి సన్నని చీరె తయారుచేయగల సామర్థ్యం గలిగి దేశ ప్రతిష్టను వేనోళ్ల కొనియాడే నైపుణ్యం కలిగి దేశ విదేశాలలో శభాష్‌ అని పేరొందిందని చెప్పడం అతిశయోక్తికానేరదు. చేతితో నేత నేయడం అనేది దేశీయ సంస్కృతి సాంప్రదాయాలకుచిహ్నం.

చేనేత రంగం పరపతి సౌకర్యలేమి, మార్కెటింగ్‌ వసతి లేమి, అధికనిల్వలు మరమగ్గాలు, మిల్లుల నుండి ఎదురవ్ఞతున్న అనైతిక పోటీ వగైరాల వల్ల కుదేలవ్ఞతున్నది. చట్టసభలలో వీరికి ప్రాతి నిధ్యం లేదు. చేనేతలు రాష్ట్రజనాభాలో 12 శాతం వాటా కలిగి ఉన్నా వీరికి చట్టసభలలో వీరి సమస్యలు లేవనెత్తడానికి ఎన్నిక కాబడిన సభ్యులు కరవయ్యారు. ఇతర రంగాల సభ్యులు వారి వారి సమస్యలను చట్టసభల దృష్టికి తెస్తుంటే వీరి తరపున సభ లో మాట్లాడేవారు లేరు. కారణం వీరంతా ఇతర రంగాలకు చెంది నవారు అయినందువల్ల వారికి ఈరంగ సమస్యలుతెలియవ్ఞ. రాజ కీయపార్టీలు వీరిని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు.ఒకఆంధ్రప్రదేశ్‌ లో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 25వేల ఓటు బ్యాంకు ఉన్నది. అయినప్పటికీ వీరికి సీట్లు కేటాయించాలంటే పార్టీలు ముందుకు రావడం లేదు. ముఖ్యకారణం వీరంతా గ్రామీణ నిరుపేదలు,ఆర్థిక పరిపుష్టిబలంగా లేనివారు.పార్టీలకు కావలసింది ఆర్థికంగా బలవంతులు.

ఇక్కడే సామాజిక న్యాయం దెబ్బతింటు న్నది.పేద, ధనిక వర్గాల మధ్యనే పోటీ నడుస్తుంది. ధనికులు సీట్లు సంపాదించగలరు. పోటీలలో నెగ్గగలరు. ఈ సామాజిక అసమానతలను తొలగించడం పార్టీల కనీస కర్తవ్యం.చేనేత కార్మి కులను చట్టసభలకు నామినేషనుద్వారా ఎంపిక చేయాలి. అప్పుడే సామాజిక న్యాయం కాపాడిన వారవ్ఞతారు. ప్రజాస్వామ్య పరిరక్ష కులవ్ఞతారు. అన్ని రాజకీయ పార్టీలలో ఈ అంశంపై చర్చించి తగు సామాజిక న్యాయం కాపాడాలి. భారత రాజ్యాంగం అధీక రణ 43లో చేనేత రంగానికి చేయూతనివ్వాలని నిర్దేశించబడింది. కుటీర పరిశ్రమలలో మేటి చేనేత అనేది జగమెరిగిన సత్యం. కేంద్రం 2011 నుండి పరపతిసౌకర్యం కల్పించాలని పియన్‌బి ముద్రా యోజన పథకం ద్వారా ప్రతి నేత కార్మికునికి రూ. ఐదులక్షల వరకు రుణసౌకర్యం కల్పించాలని పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు వారితో ఒప్పందం కుదుర్చుకున్నది.

మొదటిగా ఈ పథకం వారణాసి, భువనేశ్వర్‌లలో ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని ప్రతి కార్మికునికి రూ. ఐదు లక్షలు పరపతి సౌకర్యం కల్పిస్తే వారంతా స్వయం సమృద్ధి సాధించి జీవితాలలో వెలుగులు నింపుకుంటారు. కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ లేఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 487971 మంది నేతన్నలు 12471.4 చేమగ్గాలపై ఉపాధి పొందుతున్నారని తెలిపింది.ముద్రా లోన్లు ఆంధ్రప్రదేశ్‌లో 21,197మందికి మాత్రమే ఇవ్వబడ్డాయి. మిగిలిన వారు పరపతి సౌకర్యం అందక నానా అవస్థలుపడుతున్నారు. అధిక వడ్డీలు కట్టవలసి వస్తున్నదని వాపోతున్నారు. బ్యాంకులు ముద్రా లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కారణం వారికి గ్యారంటీగా తిరిగి చెల్లించే వారి కోసం చూస్తున్నారు. దీనికి పరిష్కారమార్గం ఒక్కటే. భారత ప్రధాని రూ.1500 కోట్లతో ప్రత్యేక చేనేత పరపతి బ్యాంకు మంజూరు చేయాలి. ఇతర రంగాలకు ఇస్తున్న తరహాలో ఇవ్వాలి. గత ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 54 బ్లాక్‌ లెవల్‌క్లష్టర్లు మంజూరు చేశారు. దీనివల్ల 33479 మంది నేత న్నలకు ప్రయోజనం.

31.27 కోట్లతో ప్రకాశం, గుంటూరు జిల్లాకు మెగా క్లష్టరు మంజూరు. లబ్ధిదారులు 43,900 మంది. 69 మార్కెటింగ్‌ ఈవెంట్స్‌ మంజూరు 90100 లబ్ధిదారులు, నిధులు 2-50 కోట్లు. నకిలీల బాధ నుండి కాపాడుటకు గాను ఉప్పాడ, జమాదారి చీరె, ధర్వవరం పట్టుచీరె, వెంకటరి చీరె, మంగళగిరి ఉత్పత్తులకు భౌగోళిక సూచి చట్టం కింద రిజష్టరు చేశారు. తక్కు వ వడ్డీ పరపతి సౌకర్యార్థమై 21197 ముద్రాలోను మంజూరు చేశారు. రూ.102-67 కోట్లు నిధులు. మహాత్మాగాంధీ బీమా యోజన కింద 2,08,977 మంది చేరారు. ఆరోగ్యబీమా పథకం కింద 1,40,030 చేనేతలు లబ్ధిపొందుతున్నారు. మిల్లు ధరకే నూలు సరఫరా పథకం కింద 75 నూలు డిపోల ద్వారా60-28 లక్షల కిలోల నూలు ఖరీదు 338-52 కోట్లు చేనేతలు చేశారు.

కేంద్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు జాతీయ చేనేత అభివృద్ధి పథకం, సమీకృత చేనేత కార్మికులు సంక్షేమ పథకం, నూలు సరఫరా పథకం, సమీకృత చేనేత క్లష్టరు అభివృద్ధిపథకం. పై పథకాల ద్వారా నూలు సరఫరా, పనిముట్లు కొనుగోలు కొత్త డిజైన్ల రూపకల్పన, నైపుణ్యం పెంచుట, మార్కెట్‌ిం అభివృద్ధి చేయబడతాయని కేంద్రం తెలియచేసింది. ఇదే లేఖలో చేనేత వ్యాపారాభివృద్ధి కోసం సవిరమైన ప్రతిపాదనలు పంపితే వారికి ఆర్థిక సహాయం చేయబడునని తెలియచేసింది.చేనేతశాఖ అధికార్లు ఇందుకు సమయాత్తమై ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలి. ఆప్కో సంస్థ వారు ప్రాథమిక చేనేత సహకార సంఘాల నుండికొనుగోలు చేసిన బట్టల తాలూకు బిల్లులు వెంటనే చెల్లించాలి.

ఈ మధ్యనే తూర్పుగోదావరి జిల్లాలో పిల్లల హాస్టల్స్‌కు సరఫరానిమిత్తం కొను గోలు చేయబడిన దుప్పట్లు తాలూకు కోట్లాది రూపాయలు బకా యిలుసంఘాలకు ఇవ్వలేదని ప్రసారమయింది.అందులో ఆ మహి ళల ఆర్తనాదాలు ఎలాంటి హృదయాన్నయినా చలింపచేస్తాయి. కావ్ఞన ప్రభుత్వం ఆప్కోవారికి ఇవ్వవలసిన బకాయిలు ఇచ్చి చేనేత రంగాన్ని కాపాడాలి. ఆప్కోవారు సంఘాలకు ఇవ్వవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలి. ప్రాథమిక సంఘాల దగ్గర నిల్వవ్ఞన్న బట్ట యావత్తు ఆప్కో కొనుగోలు చేయాలి. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం కనీసం 200 కోట్ల రూపాయలు అప్పుగానైనా ఆప్కోకు ఇవ్వాలి.

  • పడవల లక్ష్మణస్వామి , రచయిత: ప్రధాన కార్యదర్శి ఎ.పి.వీవర్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/