‘విమోచన’ను అధికారికంగా జరపలేమా!

నేడు తెలంగాణ విమోచన దినోత్సవం

Telangana vimochana dinam
Sardar Patel

తొంభై ఏళ్ల తరువాత సుదీర్ఘ పోరాటానంతరం మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం లభించింది. ప్రజాస్వామ్య పద్ధతిని పక్కన పెట్టి, గాంధీగారికి ప్రియ శిశ్యుడు అయినందున నెహ్రూను ప్రధాన మంత్రిగా, వల్లబాయిపటేల్‌ను ఉపప్రధాని, హోంమంత్రిగా ఎన్నుకోవడమైంది. స్వాతంత్య్రం లభించే నాటికి 565 సంస్థానాలున్నాయి. అంటే జనాభాలో 28శాతం, భూభాగంలో 31 శాతం సంస్థానాల ఆధీనంలో ఉన్నాయి. పటేల్‌ చొరవతో, చాకచక్యంతో సంస్థానాలన్నీ చకచక భారతదేశంలో కలిసి పోయాయి. ఓ మూడు తప్ప. ఒకటి జమ్మూకాశ్మీర్‌, రెండవది గుజరాత్‌ రాష్ట్రంలోని జునాఘడ్‌, మూడవది తెలంగాణ అప్పటి నైజాం ఏరియా. పైమూడింటిలో మొదటి రెండింటిలో హిందువ్ఞ మైనారిటీలు, నైజాంలో ముస్లిం మైనారిటీలు. అయినా కూడా నైజాం పరిపాలనలో హిందువ్ఞలు రెండోశ్రేణి పౌరులుగా పరిగణించబడుతూ వచ్చారు. భారతదేశ కేంద్రప్రభుత్వ పెత్తనం, సుప్రీంకోర్టు అజమాయిషీ, రాజ్యాంగ నియమావళి ఇటువంటి ఏవీ కూడా మాకు వర్తించకూడదు. అలానైతేనే మేము భారత్‌లో కలుస్తామని కాశ్మీరంలో ముస్లిం పెద్దలు షరతు విధించారు. ఇక నైజాం నవాబు మేము ఎట్టి పరిస్థితుల్లో భారత్‌లో కలవమని, కలవడం అనేది జరిగితే పాకిస్థాన్‌లో కలుస్తామని ప్రకటించారు. నైజాం ప్రకటనను ఆసరాగా చేసుకొని జునాఘడ్‌ నవాబు కూడా సమర్థించాడు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో కేంద్రానికి ఏం చేయాలో తోచలేదు. ఆచార్య జె.బి కృపలాని, డా. పట్టాభి సీతారామయ్య, కామరాజు, మౌంటుబాటన్‌ లాంటి పెద్దలు సమావేశమై ఈ సమస్యను పరిష్కారించే శక్తియుక్తి ఒక్క పటేల్‌కే ఉంది. కావ్ఞన ఆయనకే అప్పచెప్పాలన్నారు.

కాని ప్రధాన మంత్రిగా నెహ్రూ కలగచేసుకొని, జమ్మూకాశ్మీర్‌ మా తాతలదండ్రుల రాష్ట్రం కాబట్టి దాని విలీన బాధ్యత నేను తీసుకుంటానని గుజరాత్‌లోని జునాఘడ్‌ పటేల్‌ రాష్ట్రం కావ్ఞన ఆయనకు అప్పచెప్పాలని, ఇక నైజాం విషయంలో మనం తలదూర్చకూడదని కూడా చెప్పారు. నెహ్రూకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. కారణం గాంధీగారి అండదండలు ఆయనకున్నాయి. తన శక్తియుక్తులతో జునాఘడ్‌ను ఎటువంటి షరతులు లేకుండా భారత్‌లో విలీనం చేశారు పటేల్‌. ఇక జమ్మూకాశ్మీర్‌ విషయానికొస్తే నెహ్రూ జిన్నాతో కలిసి 370, 35ఎ లాంటి ఆర్టికల్స్‌తో భారత్‌లో విలీనం చేశారు. నెహ్రూ తప్పిదం వల్ల మొన్నటివరకు రావణకాష్టంలా కాలుతూ వచ్చింది జమ్మూకాశ్మీర్‌. జమ్మూ నుండి వేలాది మంది కాశ్మీర్‌ పండితులు వలసపోయారు.

జమ్మూకాశ్మీరు భారత్‌లో అంతర్భాగమైనా కూడా పాకిస్థాన్‌ పెత్తనం చెలాయిస్తూ వచ్చింది. ఆరోజు సెప్టెంబరు 14, 1948 సంవత్సరం. నైజాం నవాబు ఓ ఫర్మాణాను జారీ చేశాడు. నైజాం ఏరియాలో ఉన్న హిందువ్ఞలను భయభ్రాంతులకు గురి చేయాలి. భయపడి పొరుగు రాష్ట్రాలకు పారిపోయే వాళ్లను పోనివ్వాలి. మతం మారడానికి ఒప్పుకున్న వాళ్లను ఇస్లాం మతంలోకి తేవాలి. ఎదురు తిరిగేవాళ్లను ఖతం చేయాలి. ఇది ఫర్మాణాలోని ఉద్దేశం. ఇక నైజాం అనుచరుడు ఖాషిం రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్లు రెచ్చిపోయారు. కొంతమంది

ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని కమ్యూనిస్టులు ఎదురు తిరగడం వల్ల జిల్లా మొత్తం అట్టుడికి పోయింది. వరంగల్‌ జిల్లా పాలకుర్తికి చెందిన వీరనారి చాకలి ఐలమ్మ లాంటి వారు వీరోచితంగా రజాకార్లను ఎదుర్కొన్నారు. ఆమె భర్త, ఇద్దరు కొడుకులు రజాకార్ల చేతిలో బలైపోయారు. సూర్యాపేట దగ్గర్లో ఉన్న సోమారం గ్రామంలో 42 మంది ఆడవాళ్లను నగ్నంగా చేసి బతుకమ్మ ఆడించారు రజాకార్ల ముష్కరులు. మూడు రోజులలో వేలాది మంది హిందువ్ఞలు కనుమరుగైనారు. కొంత మంది మతం మారడం, మరికొంత మంది అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పొరుగు రాష్ట్రాలకు పారిపోవడం, ఎదురు తిరిగిన ఇంకొంతమంది హత్యలకు గురి అవడం జరిగింది.

పెళ్లికాని ఆడపిల్లలు బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడ్డారు. వేలాది మంది ఆడవాళ్లు రజాకార్లచే చెర్చబడ్డారు. 1948 సెప్టెంబరు 16 తేదీ రష్యాలో సోసియల్‌ కాన్ఫరెన్సుకు హాజరు కమ్మని ప్రధానికి పిలుపువచ్చింది. కానీ నెహ్రూ తన బదులు ఉపప్రధాని పటేల్‌ను హాజరు కమ్మని కోరడం చేత 16 నాడు పటేల్‌ ప్రయాణం అవ్ఞతున్న సమయంలో అప్పుడే హైదరాబాద్‌ నుండి వందేమాతరం రాంచంద్రారావ్ఞ, రాజాబహదూర్‌ వెంకటరామిరెడ్డి లాంటి పెద్దలు నైజాంలో జరుగుతున్న ఆకృత్యాలను, అరాచకాలను పటేల్‌కు ఫోను ద్వారా తెలియచేశారు. అప్పుడు పటేల్‌ ఆడిన ఒక అబద్దం తెలంగాణ హిందువ్ఞలను కాపాడింది.

నెహ్రూవద్దకు పోయి నాకు గుండెనొప్పిగా ఉందని చెప్పి, నెహ్రూను రష్యాకు పంపించి తను హైదరాబాద్‌కు ప్రయాణమయ్యాడు. నాలుగు మార్గాలలో సైన్యాన్ని తరలించి హైదరాబాద్‌లో ప్రవేశించి పోలీసు యాక్షన్‌ డిక్టెర్‌ చేసి నైజాంను అరెస్టు చేసి నైజాం ఏరియా మొత్తాన్ని భారత్‌లో విలీనం చేశారు. పటేల్‌ ఈ సహసోపేతమైన చర్యతో తెలంగాణ యావత్‌ పులకించిపోయింది. హిందువ్ఞలందరూ పటేల్‌ పుణ్యమా అని మరో జన్మెత్తారు. నైజాం ప్రాంతం నుండి విడిపోయిన షోలాపూర్‌, బీజాపూర్‌, గుల్బర్గా, బీదర్‌ లాంటి ప్రాంతాల వారు వారివారి రాష్ట్రాల సహకారంతో 17 సెప్టెంబరు ను ఇప్పటికీ ఘనంగా విమోచనదినంగా జరుపుకుంటున్నాయి. జమ్మూకాశ్మీర్‌లోని 370, 35ఎ ఆర్టికల్‌ రద్దు అవడానికి 72 సంవత్సరాలు పట్టింది. తెలంగాణ విమోచన దినాన్ని అధికారి కంగా జరుపుకోవడానికి ఇంకెన్నాళ్లు పడుతుందో చూడాలి.

-మునిగంటి శతృఘ్నాచారి
(రచయిత: కార్యదర్శి రాష్ట్ర బి.సి సంఘం, తెలంగాణ)