ఆగని సమ్మె…తీరని కష్టాలు

ఒక్కమాట..(ప్రతి శనివారం)

Telangana RTC workers strike

రోజూ లక్షలాది మందికి సేవలు అందిస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎంతో మందికి జీవనాధారంగా ఉన్న ఆర్టీసీని ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయడం క్షంతవ్యంకాదు. అలాగే కార్మికులు కూడా విశాలదృక్పథంతో ఆలోచించాలి. ఇన్నాళ్లు, ఇన్నేళ్లు తామంతా అహోరాత్రులు కష్టపడి నిర్మించుకున్న ఈ సౌధాన్ని కూలదోయడం ఏమాత్రం సమంజసంకాదు.మునిగిపోతున్న ఆర్టీసీని అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొని కలిసికట్టుగా ఆదుకోవాలి. కార్మికుల డిమాండ్లను పరిశీలించాల్సిందే. కానీ అదే సమయంలో అవి ఎంతవరకు సమంజసమో విజ్ఞతతో ఆలోచించాలి. ప్రభుత్వం కూడా బెట్టు చేయకుండా మెట్టుదిగాలి.

రెండుపక్షాలూ పట్టుదలకుపోతే కోడెల కొట్లాటలో దూడెల కాళ్లు విరిగినట్లుగా తయారవ్ఞతుంది. ప్రజావిశ్వాసం కోల్పోతే ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.అందరూ శాకాహారులే కానీ గంపకింద కోడి మాయమైన దన్నట్లుగా ఉంది ఆర్టీసీ విషయంలో అటు పాలకులు, ఇటు కార్మికులు వ్యవహరిస్తున్న తీరు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థను కాపాడుకునే ఏకైక లక్ష్యంగా తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని, కార్మికులు ఘంటాపథంగా చెప్తుండగా నష్టాల్లో మునిగిపోతున్న ఆర్టీసీని రక్షించేందుకు తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు పాలకపెద్దలు ప్రకటిస్తున్నారు. నష్టాలకుమీరంటే మీరని ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటు న్నారు. ఆర్టీసీని కాపాడే లక్ష్యంగా అందరూ పనిచేస్తున్నట్లు పరస్పర వైరుధ్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనేది సామాన్యు లకు అర్థంకాని ప్రశ్న.

తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు మూడువేల రెండువందల కోట్ల రూపాయలకుపైగా నష్టాలకు చేరుకున్నది. ఇలాగే కొనసాగితే నష్టాలు మరింత పెరిగే మాట వాస్తవం. అందుకే ఆర్టీసీని రక్షించి లాభాలవైపు నడిపించేందుకు కొన్ని నిర్దిష్టమైన చర్యలు తప్పవని పాలకులు ఖరాఖండిగా చెప్తున్నారు. అయితే రాయితీలు, సబ్సిడీల రూపంలో ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తే ఈనష్టాలు ఈ స్థాయిలో ఉండవని కార్మికుల వాదన. మన ఆర్టీసీకి అత్యంత సుదీర్ఘచరిత్ర ఉంది. వేలాది కార్మికుల శ్రమ, ప్రజల ఆదరాభిమానాలు దూరదృష్టి కలిగిన కొందరు అధికారులు, నేతలు చేపట్టిన చర్యలు మరికొం దరి త్యాగనిరతితో అంచలంచెలుగా ఎదిగిన రోడ్డురవాణా సంస్థ ఆర్టీసీ నేడు నష్టాలఊబిలో, సమ్మెల బాటలో కొట్టుమిట్టాడుతుం డడం అత్యంత బాధాకరం. రవాణా రంగంలోనే అద్వితీయ ప్రతిభను, అసమానసేవానిరతిని కనబరిచి గిన్నిస్‌ బుక్‌లో రికార్డు సాధించిన మన ఆర్టీసీ రానురాను కనుమరుగైపోతుందేమోనన్న ఆవేదన కలుగుతుంది.

1936లో నిజాం రైల్వేలో రోడ్డు రవాణ ఒక శాఖగా ఉండేది. 1950లో నిజాం రైల్వే భారత్‌రైల్వేలో విలీ నం కావడంతో 1951 అక్టోబరు 31వ తేదీన ఏజెన్సీ పద్ధతిలో రోడ్డురవాణా ప్రత్యేక శాఖగా ఏర్పడింది. 1958 జనవరి 11న ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 16డిపోలు,609బస్సులు, ఐదు వేల ఎనభైఒక్కమంది కార్మికులతో రోడ్డురవాణాసంస్థ అవతరించిం ది. అప్పటి నుండి ప్రజాభిమానం చూరగొంటూ అంచలంచెలుగా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ఇన్ని వేల మంది కార్మికులు అహర్నిశలు కృషి చేస్తూ మరొకపక్క పాలకులు త్రికరణశుద్ధిగా ఆర్టీసీ అభివృద్ధికి ప్రయత్నిస్తుంటే ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్న ఉదయించకతప్పదు.

ఇదే రాష్ట్రంలో ఇదేరోడ్లపై తిరుగుతున్న ప్రైవేట్‌బస్సులపరిస్థితి మూడుపర్మిట్‌లు, ఆరు ట్రిప్పులుగా ఎందుకు విరాజిల్లుతున్నాయి. కారణాలు ఏమిటి? కారకులు ఎవరు? అనేది అన్వేషించాల్సిన అవసరం ఉంది.ఎందరో పాలకపెద్దలు ఈ బస్సుల వ్యాపారంలోకి దిగారు. పేర్లు పెట్టి వారిని ఇబ్బందిపెట్టడం ఎందుకుకానీ గత రెండు మూడుదశాబ్దాలుగా ఒక వ్యూహంప్రకారం ఆర్టీసీని నష్టాలఊబిలో నెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏకంగా 2001లో 24 రోజుల పాటు కార్మికులు ఈ సమస్యపైనే సమ్మె చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కార్మికుల సమ్మెను సమర్థించడమేకాకుండా కేవలం ప్రభుత్వ విధానాల వల్లే ఆర్టీసీ నష్టాలపాలైందని తేల్చిచెప్పారు. అక్రమ వాహనాలను నిరో ధించిఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలుపూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ చేయడంతోపాటు ప్రైవేట్‌ బస్సుల ఆపరేటర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందని కూడా ఆరోపించారు.

ఆ తర్వాత తెలుగుదేశం కాలంలో కూడా ఆర్టీసీ పరిరక్షణకు సకల చర్యలు తీసుకుంటామని ఆనాటి నేతలు వక్కాణించారు. అయినా నేటికీ కొందరు నేతలు ప్రైవేట్‌ బస్సులను వారి మిత్రుల పేర్ల తోనో, బినామీ పేర్లతోనో, పర్మిట్లతోనో, అసలు పర్మిట్లు లేకుండా నడుపుతున్నారు. తెలుగు దేశం ప్రభుత్వ కాలంలో అనంతపురం జిల్లాలో ఒకసారి ఆర్టీయే అధికారులు అక్రమ రవాణాను కట్టు దిట్టడం చేయడంతో ఆర్టీసీకి రోజుకు పదిలక్షల రూపాయల ఆదాయం పెరిగింది. అలాంటి అధికారులను ప్రశంసించాల్సింది పోయి మందలించారు.

వారి ప్రైవేట్‌ మక్కువకు ఇదోమచ్చుతునక. రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు, లారీలు, ఆటోలు, కార్లు, తదితర ప్రైవేట్‌ వాహనాల వల్ల ఏటా రెండువేల కోట్లకుపైగా ఆర్టీసీ ఆదాయం కోల్పోతుందని అనధికార అంచనా.దీనికితోడు ఇష్టానుసారంగా ఇస్తున్నరాయితీలు సంస్థను కోలుకోనీయడం లేదు.ఇప్పుడు తెలంగాణాలో ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీ రూ.2,200 కోట్లు ఉందని కార్మిక వర్గాలు చెప్తున్నాయి.ఇక రాజకీయసభలకు, సమావేశాలకు ఆర్టీసీ బస్సు లను వినియోగించుకున్న రాజకీయ పార్టీలు చెల్లించాల్సిన బకా యిలు కూడా తక్కువేమీకాదు.

దీనికితోడు లాభాపేక్షకు అతీతంగా మారుమూలు గ్రామాలకు బస్సులు నడుపుతున్న సర్వీసులే సంస్థకు గుదిబండగా మారాయి. ప్రభుత్వం ఆర్టీసీ నుంచి ఇన్ని సేవలు తీసుకుంటూ ప్రైవేట్‌ కంటే ఆర్టీసీ దగ్గర రెట్టింపు పన్నులు వసూలు చేస్తున్నారు. భారతరైల్వేలకు ప్రైవేట్‌రంగంలో నడుస్తున్న విమానాలకు కూడా వాణిజ్యపన్నులో సబ్సిడీ ఇస్తూ ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. ఆర్టీసీ విషయంలో ఎందుకు వివక్ష చూపు తున్నారనే కార్మిక వాదనలో అర్థం ఉంది. నష్టాలకు ఇలా ఎన్నో కారణాలున్నాయి. ఇక ఆ సంగతి అలా వదిలిపెడితే సమ్మె నేడు ఆరో రోజుకు వచ్చింది. బహుశా ఇప్పట్లో విరమించే అవకాశం కన్పించడం లేదు. 48వేల మంది ఉద్యోగులు సెల్ఫ్‌డిస్మిస్‌తో ఉద్యోగాలు కోల్పోయినట్లు ప్రభుత్వం చెప్తున్నది.

సమ్మె చట్టవిరు ద్ధమని కొందరు పాలకపెద్దలు స్పష్టం చేస్తున్నారు. ఈ సమ్మెలు, నిరసన కార్యక్రమాల ఆవిర్భావానికి ఎంతో సుదీర్ఘచరిత్ర ఉంది. రాజులు, సంస్థానాలు, పెత్తందారుల దోపిడీలకు గురవ్ఞతూ కట్టుబానిసలుగా బడుగుజీవ్ఞలు జీవనం సాగిస్తున్న రోజుల్లో 1853లో ఆంగ్లేయులు ఇండియాలో రైలు మార్గం వేయడంతో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఆరంభమై వాటితో పాటు ఈ కార్మికవర్గం పుట్టింది. 1857లో విద్యుత్‌చక్తితోపాటు పారిశ్రామిక రంగం పెరగడంతో కార్మికవర్గం కూడా ఊపందుకుంది. అప్పట్లో కార్మికుల ప్రయోజనాలను ఉద్దేశించిన చట్టాలు ఏమీలేవ్ఞ. యజమాని చెప్పిందే వేదం. 16 నుంచి 18 గంటలు పనిచేయాల న్నా చేయాల్సిందే. 1858లో దేశంలో బ్రిటిష్‌ ప్రత్యక్షపాలన ప్రారంభంకావడంతో భారతీయ కార్మికుల కోసం 1859లో ‘వర్క్‌ మెన్‌ బ్రీచ్‌ ఆఫ్‌ యాక్ట్‌, 1881లో ఫ్యాక్టరీ చట్టం అమలులోకి వచ్చింది.

ఇది భారతదేశంలో అవతరించిన తొలిచట్టం. దీంతో కార్మికులకు కొంత స్వేచ్ఛ లభించింది.కానీ ఆశించినమేరకు పరిస్థి తులు మెరుగుపడలేదు.చట్టపరంగా సంఘాలు ఏర్పాటు చేసుకునే అవకాశం లేకపోయినా ‘లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌కుబ్రిటిష్‌ పాలకులు ప్రవాస శిక్ష విధించడంతో ముంబాయిలో కార్మికలోకం సంఘటితమై తీవ్ర నిరసన తెలిపింది. సంఘటిత నిరసన సమ్మె ఆరంభం అలా జరిగింది.ఆ తర్వాత ధరలు విపరీతంగా పెరిగినా జీతాలు పెంచకపోవడంతో 1919లో దేశంలో మొదటిసారి వేత నాల కోసం సమ్మె ప్రారంభమైంది. 1920లో ‘ట్రేడ్‌ డిస్ప్యూట్‌ యాక్ట్‌ అమలులోకి వచ్చింది.అదే ఏడాది అక్టోబరు 30 లాలాలజ పతిరా§్‌ు నాయకత్వంలో ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ఏర్పాటైంది.

1926లో కొత్త కార్మికచట్టానికి రూపకల్పన చేశారు. అయితే అంతకుముందున్న ట్రేడ్‌ యూనియన్‌ యాక్ట్‌ కొన్ని మార్పులు చేయాలని తలపెట్టడంతో 1929 ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో భగత్‌సింగ్‌ బాంబు విసిరి వ్యతిరేకత తెలి పారు. స్వాతంత్య్రం అనంతరం ఇదే చట్టం పారిశ్రామిక వివాదాల చట్టంగా రూపాంతరం చెందింది. ఇలా ఎందరో మహానుభావ్ఞలు అవిరామకృషి, త్యాగాలతో ఈసమ్మె, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టే హక్కు లభించింది.

కానీ ఆనాటి సమ్మెలకు ప్రజల మద్దతు ఉండేది. ఇప్పుడు కార్మికులు ఎన్నుకున్న సమయం ముఖ్యంగా తెలంగాణలో అత్యంత ముఖ్యమైన దసరా పండుగ రోజులు కావ డంతో ప్రజలు పడినా, పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావ్ఞ. రోజూ లక్షలాదిమందికి సేవలు అందిస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షం గానో ఎంతో మందికి జీవనాధారంగా ఉన్న ఆర్టీసీని ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయడం క్షంతవ్యంకాదు. అలాగే కార్మికులు కూడా విశాలదృక్పథంతో ఆలోచించాలి.ఇన్నాళ్లు,ఇన్నేళ్లు తామంతా అహోరాత్రులు కష్టపడి నిర్మించుకున్న ఈ సౌధాన్ని కూలదోయ డం ఏమాత్రం సమంజసంకాదు.మునిగిపోతున్న ఆర్టీసీని అటు ప్రభుత్వం,ఇటు కార్మికులు చర్చలద్వారా సమస్యను పరిష్కరించు కొని కలిసికట్టుగా ఆదుకోవాలి.

కార్మికుల డిమాండ్లను పరిశీలించా ల్సిందే. కానీ అదే సమయంలో అవి ఎంతవరకు సమంజసమో విజ్ఞతతో ఆలోచించాలి. ప్రభుత్వం కూడా బెట్టుచేయకుండా మెట్టుదిగాలి. రెండుపక్షాలూ పట్టుదలకుపోతే కోడెల కొట్లాటలో దూడెల కాళ్లు విరిగినట్లుగా తయారవ్ఞతుంది. ప్రజావిశ్వాసం కోల్పోతే ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకం అవ్ఞతుంది.

Damerla Saibaba

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/