తెలుగు రాష్ట్రాధినేతలపై ఆధ్యాత్మిక కరుణాకటాక్షం

Swaroopa given Blessings to YS Jagan
Swaroopa given Blessings to YS Jagan

నేడు బిజెపిని దృష్టిలో పెట్టుకొని, ప్రతిపక్షపార్టీల నేతలు ఆలయ సందర్శనాలు, మహాత్ముల సాన్నిహిత్యం పెంచుకొన్నారు. ఒకే కులం, మతం ఉన్న జనాభా ఓటర్ల ద్వారా ఎన్నికలలో రాజకీయంగా లబ్ధిపొందటం మన రాజకీయ పార్టీలకు కొత్తకాదు. ప్రస్తుతంలో ఒక అడుగు ముందుకు వేసి, పీఠాధిపతులను ఆలింగనంతో కూడా అభినందనాపూర్వకంగా ఆశీస్సులు పొందుతున్నారు. కొందరు పీఠాధిపతులు పాదపూజల సందర్భంలో కాళ్లు స్మరించడం కూడా అనుమతించరు. కాని మన రాజకీయ ప్రముఖుల పూర్వజన్మ సుకృతి, భాగ్యవిశేషం వల్ల పీఠాధిపతుల దైనందినవ్యవహార శైలి, ఉపన్యాససందేశాలలో మార్పు స్పష్టమవ్ఞతోంది. మీడియా శృతిమించి, దైవవిశ్వాసం ప్రచారం చేస్తోంది. ప్రస్తుత రాజకీయం, మీడియా, న్యాయాధీశంగా ఇంచుమించు అన్ని రంగాలలో ఆధ్యాత్మికత మూడుపువ్ఞ్వలు ఆరు కాయలుగా విలసిల్లుతోంది.

భా రతీయత, ఆధ్యాత్మిక సంస్కృతి ప్రాతిపదికగా దేశ ప్రజాస్వామ్య రాజ్యాధికారం, అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలో పార్ల మెంటులో కాషాయ అంబరాలు కాంతులీనుతున్నాయి. పార్లమెంటు సభ్యుల ప్రమాణస్వీకారం సందర్భాలలో జై రామ్‌ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. పూర్వం కూడా రాజకీయరంగంలో ఆధ్యాత్మిక కాంతులు ప్రసరించడం, ప్రభావితం చేయడం లేకపోలేదు. తామరాకు మీద నీటిబొట్టులా, సర్వసంఘపరిత్యాగులైన ఆధ్యాత్మిక సత్పు రుషులు, యోగిపుంగవ్ఞలు, బాబాలు, మఠాధిపతులు జనజీవన శ్రేయస్సు, లోకహితం కోసం ఏ మతానికి చెందినవారైనా పరోక్షంగా జనజీవనాన్ని ప్రభావితం చేయడమేకాకుండా అధికార రాజకీయ పార్టీల నాయకులకు, ఉన్నతోద్యోగులకు ఆశీస్సులు అందచేస్తూ ధర్మనిర్దేశం చేసేవారు. కాని ప్రస్తుత భారతీయ జనతాపార్టీ దేశాధికారం చేపట్టిన తరువాత యోగులు, సాధ్విలు, ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధించి చట్టసభలలో ప్రవేశించే అవకాశాలు లభిస్తున్నాయి. పైగా 2014 సార్వత్రికం నుంచి రాజకీయ పార్టీల నేతల వ్యవహార శైలిలో మార్పు కొట్టొచ్చినట్టు కనపడుతోంది. 1947 స్వాతంత్య్రానంతరం ఉద్భవించిన ఇండియన్‌ యూనియన్‌, పాకిస్థాన్‌ ఇస్లామిక్‌ తరహాలో హిందూస్థాన్‌గా ఒకే దేశ నినాదం, జాతీయత తెరపైకి వచ్చింది. నేడు బిజెపిని దృష్టిలో పెట్టుకొని, ప్రతిపక్షపార్టీల నేతలు ఆలయ సందర్శనాలు, మహాత్ముల సాన్నిహిత్యం పెంచుకొన్నారు. ఒకే కులం, మతం ఉన్న జనాభా ఓటర్ల ద్వారా ఎన్నికలలో రాజకీయంగా లబ్ధిపొందటం మన రాజకీయ పార్టీలకు కొత్తకాదు. ప్రస్తుతంలో ఒక అడుగు ముందుకు వేసి, పీఠాధిపతులను ఆలింగనంతో కూడా అభినందనాపూర్వకంగా ఆశీస్సులు పొందుతున్నారు. కొందరు పీఠాధిపతులు పాదపూజల సందర్భంలో కాళ్లు స్మరించడం కూడా అనుమతించరు. కాని మన రాజకీయ ప్రముఖుల పూర్వజన్మ సుకృతి, భాగ్యవిశేషం వల్ల పీఠాధిపతుల దైనందినవ్యవహార శైలి, ఉపన్యాససందేశాలలో మార్పు స్పష్టమవ్ఞతోంది. మీడియా శృతిమించి, దైవవిశ్వాసం ప్రచారం చేస్తోంది. ప్రస్తుత రాజకీయం, మీడియా, న్యాయాధీశంగా ఇంచుమించు అన్ని రంగాలలో ఆధ్యాత్మికత మూడుపువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది.
రాజకీయాల్లో మత విశ్వాసం
యధా రాజా తథా ప్రజా నానుడి సర్వత్రా వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు రాజకీయ పార్టీలు సిద్ధాంత ప్రాతిపదికన కమ్యూనిజం, ప్రజాస్వామ్య సోషలిజం చిలకపలుకులు వల్లించేవారు. జవహర్‌లాల్‌ నెహ్రూ దేశ ప్రధానిగా వ్యక్తిగతంగా కఠోర సామ్యవాదిగా, మతానికి అతీతమైన వ్యవస్థను పాదుకొల్పారు. దేవాలయ సందర్శనం కూడా లేదు. తన మతం, దైవారాధన పూర్తిగా వ్యక్తిగతం. సామాజికపరం కాదు. జాతిపితగా, గాంధీజీని భక్తి ప్రపత్తులతో ఆరాధించినా, మతం రాజకీయాలలోకి చొచ్చుకువచ్చే అవకాశాలను నెహ్రూ నిర్మొహమాటంగా అంగీకరించలేదు. తొలితరం జాతినేతలలో తిలక్‌, మాలవ్యా, అరబింద్‌ఘోష్‌, గాంధీజీ,గుల్జారీలాల్‌నందా, కె.ఎమ్‌.మున్షీ, సావర్కార్‌, శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ, దీనదయాళ్‌ ఉపాధ్యాయ వంటి పలువ్ఞరిలో కొందరు సంపూర్ణంగా, కొందరు పాక్షికంగా హిందూమత ఔన్నత్య విలువలు జాతికి నాడు అవసరమని భావించారు. ఇండియా, పాకిస్థాన్‌లుగా, అఖండ భారతావని విభజన సృష్టించిన తొలినాళ్ల మత విద్వేష పరిణామాలు, ఉక్కుమనిషి వజ్రసంకల్పుడైన సర్దార్‌పటేల్‌ దీక్షాదక్షతలను తెరపైకి తెచ్చాయి. ప్రస్తుత దేశప్రధాని మోడీకి, అందుకే నెహ్రూకంటే పటేల్‌, స్వదేశీజాతి నేతగా ఆరాధ్యనీయులయ్యారు. 70ఏళ్ల దేశ రాజకీయ ప్రస్థానంలో పాకిస్థాన్‌ ప్రబలశత్రువ్ఞగా, ఉగ్రవాద మారణహోమం తిప్పికొట్టే సమరత్వశక్తి, యుక్తులు ప్రధానులకు శిరోధార్యం అయ్యాయి. క్రమేపీ కమ్యూనిస్టు భావజాలం, రాజకీయరంగంపై కనుమరుగవటంతో ప్రస్తుత రాజకీయవేత్తలు బాహాటంగా మతవిశ్వాసాలను ప్రోత్సహించక తప్పటం లేదు. జాతీయస్థాయి పార్టీగా, సుదర్ఘీకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ అధికారశక్తిగా భారతీయజనతా పార్టీని ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ ఊహించని విజయపథంవైపు నడిపించారు. 2014 వరకు ఉత్తరభారత ఆధిపత్యపార్టీ అయిన బిజెపి 2019 నాటికి దక్షిణావనిలో సమర్థవంతంగా కాలుమోపింది. రానున్న నాలుగైదేళ్లలో మరింత బలం పుంజుకొని, ఏ ప్రాంతీయ పార్టీ లేదా సంకీర్ణ కూటమిపై ఆధారపడవలసిన అగత్యం లేకుండా దేశ సార్వభౌమాధికారాన్ని ఏకపక్షంగా చేజిక్కించుకొనే వ్యూహాలు ముందుకొస్తున్నాయి.
ముఖ్యమంత్రులతో స్వామిజీ

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో వైఎస్సార్‌సిపి, టిఆర్‌ఎస్‌ అధినేతలు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఐక్యశంఖారావం పూరించారు. ముఖ్యమంత్రిగా బుడిబుడి అడుగులు వేస్తున్న జగన్మోహన్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సుహృద్భావ పూర్వకంగా చేయూత అందిస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఆశీఃపూర్వక సాన్నిహిత్యం లభించటం ప్రస్తుతం విశేష చర్చనీ యాంశం. తెలంగాణలో ఎన్నికలలో భారతీయ జనతాపార్టీని సుప్రతిష్టం చేసే సత్సంకల్పదీక్షతో శ్రీ పీఠం పీఠాధిపతి స్వామీ పరిపూర్ణానంద ప్రత్యక్షరాజకీయాలలో స్వయంగా పాల్గొన్నా ఫలితం దక్కలేదు. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వామి స్వరూపానంద కూడా దేవాలయ వ్యవస్థ ఉజ్జ్వలతను సంరక్షించాలని, ప్రతి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు ధర్మయుక్త క్రమంగా నిర్వహించాలని, దేవాలయాల ఆస్తులు, భూములు ఆక్రమణలకు, అవినీతికి గురికాకుండా రక్షించాలని కంకణధారులైన స్వామీజీగా తెలుగునాట అసంఖ్యాక భక్తులకు ఆరాధ్యనీయులు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని శారదాపీఠం ఇంచుమించుగా అహర్ని శలు ఉద్యమించి పరోక్ష విజయంతో ఆధ్యాత్మిక ప్రతిష్టనిల బెట్టుకొంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ యాదాద్రి, వేములవాడ ఆలయాల అద్భుత సేవలు, అయుతచండీ, రాజశ్యామల యాగాలు స్వామీజీ ఆశీఃపూర్వక కరుణా ప్రసన్న తను ఏనాడో పొందిన ధన్యులు. ఇద్దరు ముఖ్యమంత్రులకు స్వామీ స్వరూపానంద భగవదాశీస్సులు సంపూర్ణంగా లభిస్తు న్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ఏనాడో ఆధ్యాత్మి కంగా రాష్ట్రాన్ని సౌభాగ్యవంతంగా, దైవకృప కరుణా కటాక్షాల ను ప్రసరింపచేసే దృష్టితో సత్కృషి ఐహిక, పారమార్థికంగా కొనసాగిస్తున్నారు. వై.ఎస్‌.ఆర్‌ తనయునిగా అవిశ్రాంత పోరా టంతో అశేష ఆంధ్ర ప్రజల విశేష ప్రేమాభిమానాలు పొంది, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రచరిత్రను మలుపు తిప్పిన వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఒక విశేష పార్శ్వం నిక్షిప్తమై వెలుగు చూసింది. అదే శారదాపీఠాధిపతి ముఖ్యమంత్రి జగన్‌పై ప్రసరింపచేస్తున్న అపారకరుణా కటాక్షం.

– జయసూర్య, సీనియర్‌ జర్నలిస్టు