బాలల పండుగ కొందరికేనా?

Children's Festival (File)
Children’s Festival (File)

నేడు దేశవ్యాప్తంగా భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ 130వ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా వేడుకలా జరుపుకొంటున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రపంచదేశాలన్నీ నవంబర్‌ 20న బాలల దినో త్సవం జరుపుకొంటాయి. భారతదేశంలో మాత్రం నవంబర్‌ 14నే నెహ్రూ జన్మదినం రోజున చిల్డ్రన్స్‌డేగా నిర్వహిస్తారు. 1964 వరకు మిగతా దేశాలతోపాటు భారతదేశం కూడా నవం బర్‌ 20నే బాలలదినోత్సవం నిర్వహించేది. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత అతనికి పిల్లలపై ఉన్న ఎనలేని ప్రేమకు గుర్తుగా నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్‌ 14ను బాలల పండు గగా చేసుకోవాలని భారతదేశం నిర్ణయించింది.

ప్రధానమంత్రిగా నెహ్రూ వివిధ కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ప్రతి రోజూ కొంతసమయాన్ని పిల్లలతో సరదాగా గడిపేవారు. పిల్ల లపై ఉన్న ప్రేమ,ఆప్యాయత, అనురాగాలకు గుర్తుగా నవంబర్‌ 14ను బాలల దినోత్సవంగా గుర్తించారు. దేశవ్యాప్తంగా పాఠశా లల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రకాల ఆట పాటలు,వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్‌ పోటీలు పెట్టి బహుమ తులు ప్రదానం చేస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు ఆనందోత్సవాలతో పాల్గొంటారు. పాఠశాలల్లో పండుగ వాతావ రణం నెలకొంటుంది. మరోవైపు దేశవ్యాప్తంగా బాలల దినోత్స వానికి లక్షల మంది చిన్నారులు దూరమవ్ఞతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడుదశాబ్దాలు దాటుతున్నా నేటి ఈ పాఠ శాలల ఆవల పిల్లలు వివిధ రకాలపనుల్లో కొనసాగడం దుర దృష్టకరం.భారత సమాజాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మ తల్లో అతి ప్రమాదకరమైంది బాలకార్మిక వ్యవస్థ. నిరుపేద బాలబాలికలు శారీరక, మానసిక అభివృద్ధికి దూరమవ్ఞతూ కనీసం అక్షరాస్యతను, వినోదాన్ని కూడా పొందే అవకాశాన్ని ఇవ్వబడని దౌర్భాగ్యకరమైన పరిస్థితిలోకి నెట్టివేయబడుతు న్నారు. అందరికీ విద్య, నేటి బాలలే రేపటి పౌరులు అనేది అందమైన నినాదాలుగానే మిగిలిపోతున్నవి.

అక్షర జ్ఞానానికి నోచుకోకుండా మధురమైన బాల్యాన్ని భారమైన శ్రమకు బలి పెడుతోన్న బాలలు కోకొల్లలు. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తంమీద ఐదు నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సులో 1.26 కోట్ల మంది బాలకార్మికులుగా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 నుంచి 14 సంవత్సరాల పిల్లల సంఖ్య మొత్తం 25 కోట్ల 96 లక్షలు. అందులో ఒక కోటీ ఒక లక్ష మంది పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారు.

ఐదు నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సువారు మూడు కోట్ల 30 లక్షల మంది బాలకార్మికులుగా ఉన్నారు. ఇప్పటికీ ప్రతి పదిమంది బాలల్లో ఒకరు కార్మికులుగానే ఉన్నారని 2016లో అంతర్జాతీయ కార్మికసంఘం చెప్పింది. పాఠశాలల్లో విద్యా భ్యాసం చేయాల్సిన పసిప్రాయంలోనే ప్రమాదభరితమైన పరి శ్రమల్లో పనిచేస్తున్నారు. పలకబలపం పట్టాల్సిన చేతులు తట్టా బుట్టల మధ్య, పలుగుపారల మధ్య నలిగిపోతున్నవి. పాఠశాల ప్రయోగశాలల్లో రసాయనాలు, రసాయనిక మిశ్రమాలు, వాటి ఫలితాల గూర్చి నేర్చుకోవాల్సిన వారు బాణాసంచా తయారీ కేంద్రాలలో టపాసులలో ప్రమాదకరమైన రసాయనాలు నింపు తున్నారు.

నిత్యం క్వారీల పేలుళ్ల మధ్య బాలలబతుకులు ఛిద్ర మవ్ఞతున్నాయి.బడిలో నల్లబల్లల మీద ఉపయోగించాల్సిన లేత నైన చేతులు హోటళ్లల్లో,రెస్టారెంట్లు, దాబాలు రైళ్లల్లో బల్లలను, నేలను, పాత్రలను శుభ్రం చేస్తున్నాయి. వృక్షాలు, ఆకులు వాటి ఉపయోగాలు తెలుసుకోవడానికి బదులు అడవ్ఞల్లో తునికాకు సేకరణ, బీడీలు చుట్టడం లాంటి పనులు చేస్తున్నారు. పుస్తకాల సంచులు మోయాల్సిన భుజాలు భవన నిర్మాణాల్లో, ఇటుక బట్టీల్లో బతుకుభారాన్ని మోయిస్తున్నాయి. తల్లిదండ్రుల పేదరి కం కారణంగా వారికి సహాయం చేయడానికి, కుటుంబానికి ఆసరాగా నిలవటానికి బాలకార్మికులుగా మారుతున్నారు.

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలంటే విద్య ముఖ్యమైనది. 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం 6-14 సంవత్సరాలలోపు బాలల నిర్బంధ ప్రాథమిక విద్యను 21(ఎ) ఆర్టికల్‌ ప్రకారం ప్రాథమిక హక్కుగా భారతపార్లమెంటు 2010లో చట్టంచేసింది. ఈ చట్టం ప్రకారం బడిఈడు పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండాల్సిందే. నేడు బడిబయట ఉన్న పిల్లలను, బడిమానేసిన వారిని తిరిగి బడిలో చేర్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలు, గనులు లాంటి ప్రమాదకరమైన ప్రదేశాలలో కార్మికులుగా నియమించరాదు.ఆర్టికల్‌ 23 ప్రకారం వెట్టిచాకిరి, స్త్రీ శిశువ్ఞలను నిర్బంధంగా అవమానకరపనులకు ప్రోత్సహించడం నిషేధం.రాజ్యాంగ రక్షణలు, బాలకార్మిక చట్టా లు అనేకం ఉన్నా యధేచ్ఛగా బాలకార్మిక వ్యవస్థ కొనసాగుతూ నే ఉంది.

బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై ప్రభుత్వా లు కఠినవైఖరి అవలంబించాల్సిన అవసరం ఉంది. బాలకార్మిక వ్యవస్థకు కారణమవ్ఞతున్న పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానతలను తొలగించడానికి ప్రభుత్వాలు శక్తివంచనలేకుండా కృషి చేయాలి.తెలంగాణ రాష్ట్రంలో 2014తర్వాత ప్రభుత్వం అనేక రెసిడెన్షియల్‌ పాఠశాలలు నెలకొల్పింది.

వేల మంది పేద విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకంలో సన్నబియ్యం పెట్టడం వల్ల బడిబయట విద్యార్థుల సంఖ్య తగ్గింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో 25శాతం సీట్లను ఉచితంగా కేటా యించడానికి చర్యలు తీసుకోవాలి. బాలలు తమ బాల్యాన్ని బడిలో గడిపినప్పుడే బాలల హక్కులు అమలవ్ఞతున్నాయని అర్థం.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బాలల హక్కులరక్షణకు పాటుప డాలి. అప్పుడే బాలల దినోత్సవానికి సార్థకత చేకూరుతుంది.

-బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/