సామాజిక స్పృహలేని జీవితం వ్యర్థం!

Social Awareness
Social Awareness

నేటి సమాజంలో మానవుల మనుగడ గురించి పరిశీ లిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలను వెలికితీయవచ్చు. అందులోసారాన్ని చూస్తే ఏడ్వాలో, జాలిపడాలో, ఆశ్చ ర్యానికి లోనయ్యే పరిస్థితులు దాపు రించాయి. సగటు మనిషికి కావాల్సి న అత్యవసరమైనవి కూడు, గుడ్డ, గూడు అనేవి సాధారణం.

మనం అభివృద్ధిలోకి దూసుకుపోతున్నాం కాబట్టి ఇవన్నీ అందరికీ అందు బాటులో ఉన్నాయనుకుందాం.(ఇవికూడా లేని మనుషులు మన సమాజంలో ఉన్నారన్నది వాస్తవం) మానవ మనుగడ అనేది క్రమంగా పరిణామం చెందుతూ వస్తుంది. ఎన్నో మార్పులు, మరెంతో ప్రగతి. కానీ ఎన్ని తరాలు మారుతున్నా అసలైన జ్ఞానా న్ని పొందలేకపోతున్నారు కొందరు. కులాలు, మతాలనే ప్రస్తావన లేని ఆదిమ సమాజం నుండి నేడు ఎన్నోకులాల, మతాలకు పుట్టి నిళ్లయింది. అందులో ఆధిపత్య కులాలని, నిమ్న కులాలనేపేరుతో బేధాలు, అవమానాలు, అస్పృశ్యత, చీదరింపులు, బలత్కారాలు, బెదిరింపులనేవి సహజంగా మారిపోవడం. వాటిని రూపుమాపడా నికి ఎందరో సంఘసంస్కర్తలు పోరాడటం చరిత్రలో చవిచూశాం. అయినా సమాజంలో సమానత్వమనేది అనుకున్నంత మేరలో జరి గిందనుకుంటే పప్పులో కాలేసినట్టే. దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారో, స్వాతంత్య్రం అనంతరం డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాం గంపట్ల నిమ్న వర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నా అది పూర్తి స్థాయిలో ఆచరణలో అమలుకావడం లేదన్నది జగమెరిగిన సత్యం.

సమాజంలోని ప్రతి ఒక్కరికీ సామాజిక స్పృహ, సేవాతత్వం కలిగిఉన్నప్పుడే సమాజం నిర్మితమవ్ఞతుంది. పుట్టుకతోనే ధనవంతుడుగా పుట్టి, ఎలాంటి బాధలు, కష్టాలు లేకుండా సుఖంగా జీవించేవారు కొందరైతే, అందులో కష్టపడేవారు కొంత మంది ఉండవచ్చు. పుట్టుకతోనే దారిద్య్రంలో పుట్టి, అష్టకష్టాలు పడుతున్నవారు కొందరైతే, అందులో కష్టపడి పైకి వచ్చినవారు కొంత మంది ఉండవచ్చు. సంపాదనేది మన అవసరాలను తీర్చి, భవిష్యత్‌లో కష్టాలు తీర్చేవరకు పొందితే బాగానే ఉంటుంది. కానీ లెక్క పెట్టలేనంతగా, తరతరాలకు తరగని ఆస్తిగా సంపాదించినా చివరికి తనకు మిగిలేది ఏడు అడుగుల స్థలం లేదా బండెడు కట్టెలు మాత్రమే. ఇంకా ఇప్పుడు మనం సంపాదించిన సాంకేతిక పరిజ్ఞానంతో యంత్రాల సహాయంతో శవాన్ని కాల్చి బూడిదను చేతులో పెడుతున్నారు. అలాంటప్పుడు తన అనుచరులకో, బంధువ్ఞలకో, మిత్రులకో, అష్టకష్టాలు పడుతున్న పేదవారికో ఈ సమాజానికి కొంతసేవ చేసే మనస్సుంటే అతని పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పటికీ చరిత్రలో భూదానోద్యమంలో భాగంగా దానాలు చేసిన ధనవంతులు గురించి చదువ్ఞతుంటాం. తమ ఆస్తులను ప్రజలకు అకింతం చేయడమేకాకుండా తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా నిస్వార్థగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని అమరులైన సమరయోధులెందరో ఉన్నారు.

ఈ పరిణామ క్రమంలో భాగంగా వచ్చిన మార్పులు చూస్తే స్వార్థపూరిత ఆలో చనలు ఎక్కువై, అవినీతికిపాల్పడటం, సేవాగుణం లేకపోవడం, ఆస్తులు, అంతస్థులకే అధిక ప్రాధ్యాతనిస్తూ, సామాజికస్పృహ అనే పదాన్నే తమ నిఘంటవ్ఞలో నుండి తీసివేయడమనేది చాలా బాధాకరం. అందరు అలాగే ఉంటే సమాజ మనుగడే కష్టతరమవ్ఞతుంది. కానీ ఎక్కువ మోతాదులో ధనవంతులు అలాగే ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వాతంత్య్రానికి పూర్వం సంఘసంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధులు ఇలా ఆలోచిస్తే ఇలాంటి స్వేచ్ఛాపూరిత సమాజంలో బతికేవారమా? కటిక పేదరికంలో పుట్టి, అష్టకష్టాలు పడి, రాజ్యాంగ పరంగా వచ్చిన రిజర్వేషన్స్‌ ఫలితంగా అదృష్టాలు కలిసొచ్చి ఉన్నత పదవ్ఞలలో ఉన్న వారెందరో ఉన్నారు.

అలాగే వివిధ ప్రభుత్వ కొలువ్ఞలలో ఆశీనులైన వారెందరో ఉన్నారు. సరిపోయేంత ధనార్జన లభించాక, సాటి మనుషులు కష్టాలలో ఉన్నవారికి తమకు తోచిన సహాయ, సహకారాలు అందించడానికి పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడున్న పరిస్థితుల కారణంగా బడుగు, బలహీన కులాల వారికి రిజర్వేషన్స్‌ కల్పిస్తే అవి కొందరికే పరిమితమైపోతున్నాయి. ఉదాహరణకు ఒక కులంలో పుట్టిన ఒకరు కష్టపడి చదివి ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తే వారి పిల్లలు గొప్ప గొప్ప విద్యాసంస్థలలో చదువ్ఞకొని, వారికున్న రిజర్వేషన్స్‌ను ఉపయోగించుకొని ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటున్నారు. కానీ అదే కులానికి చెందిన పేదవారి పిల్లలు మాత్రం పోటీలో నిల్వలేక ఆయా స్థానాలను చేరుకోవడం లేదు. ఇంకొంత మంది వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువ్ఞను మధ్యలో ఆపేయడమా లేదా బడికే వెళ్లకపోవడమా జరుగుతుంది.

కులాలపరంగా కాకుండా ధనవంతు లు ఇంకా ధనవంతులవ్ఞతున్నారు. పేదవారు పేదవారిగానే మిగిలిపోతున్నారు. ఈ విషయంపై మేధావ్ఞలు, అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-పోలం సైదులు