స్కూల్‌ బ్యాగ్‌ బండెడు బరువు

కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి రాష్ట్ర, జిల్లా పాఠశాల విద్యాశాఖ తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. 2015లో కూడా బ్యాగుల బరువ్ఞ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలు ఎక్కడాకూడా అమలు కాలేదు. కానీ గత మేలో మద్రాస్‌ హైకోర్టు పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు నియంత్రణపై ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ స్కూలు బ్యాగుల బరువ్ఞ తగ్గించే చర్యలు చేపట్టింది.

School chilldren with Heavy weight bags
School chilldren with Heavy weight bags


ఎ ల్‌కెజి చదివే పిల్లవాడు ఆరు కిలోల బ్యాగు మోయలేక అడుగులో అడుగేసుకుంటూ వెళ్తుంటే ఎవరికైనా మనసు చివ్వుక్కుమంటుంది. పిల్లల బాధ చూడలేక చాలా మంది తల్లిదండ్రులు స్కూల్‌ దాకా బ్యాగులు మోసుకెళ్లి దిగబెట్టి వస్తున్నారు. పిల్లల పుస్తకాల బరువ్ఞ తగ్గించే దిశగా కేంద్రం నూతన విద్యావిధానంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. అంతేకాక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం ‘నో బ్యాగ్‌ డేగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తుంది. చిన్నారులపై స్కూలు బ్యాగుల మోత తగ్గించే దిశగా కేంద్ర మానవ వనరుల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకటి, రెండో తరగతి విద్యార్థుల బ్యాగు బరువ్ఞ కిలోన్నర లోపు మాత్రమే ఉండాలని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. అలాగే మూడు నుంచి ఐదు తరగతి వరకు రెండు నుంచి మూడు కిలోలు, 6,7 తరగతులకు 4 కిలోలు, 8,9 తరగతులకు 4.5 కిలోలు, పదోతరగతి విద్యార్థులకు ఐదు కేజీల కంటే ఎక్కువ బరువ్ఞ ఉండకూడదని స్పష్టమైన ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. స్కూలు బ్యాగుల మోత పరిమితి తగ్గిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. అంతేకాదు 1,2వ తరగతుల చిన్నారులకు హోంవర్క్‌ ఇవ్వొద్దని కూడా మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. అసలు క్లాస్‌ 1,2 విద్యార్థులకు భాషలకు సంబంధించి సబ్జెక్ట్‌తో పాటు లెక్కలు మాత్రమే బోధించాలని తేల్చి చెప్పింది. అలాగే మూడు నుంచి ఐదో తరగతి వరకు భాషలకు సంబంధించిన సబ్జెక్టుతో పాటు సైన్స్‌, లెక్కలు ఉండాలని ప్రభుత్వం తాజా సర్క్యులర్‌లో చెప్పింది. అదనపు పుస్తకాలు, ఇతర మెటీరియల్‌ తీసుకురావాల్సిందిగా పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని పాఠశాలలు ఇంటిపని, స్కూలు బ్యాగుల బరువ్ఞకు సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. గైడ్లు, కంప్యూటర్‌, డ్రాయింగ్‌ బుక్స్‌, స్క్రాప్‌ బుక్‌, డైరీలని స్కూల్‌ బ్యాగుల్లో కిలోల కొద్దీ పుస్తకాలు మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు ఆరు నుంచి 12 కిలోల బరువైన బ్యాగులు, ఉన్నత పాఠశాల విద్యార్థు లు 15నుంచి 20కిలోల బ్యాగులను ప్రతిరోజూ వీపుమీద మోస్తు న్నట్టు విద్యాశాఖ సర్వేలో తేలింది. రోజూ ఇంతింత బరువ్ఞలు మోయడం, ఐదారు ఫ్లోర్స్‌ఎక్కి క్లాస్‌రూమ్‌ దాకా వెళ్లడం కారణం గా చాలామంది పిల్లలు వెన్నునొప్పి,జాయింట్‌ పెయిన్స్‌ బారినప డుతున్నారు. ఇది విద్యార్థుల శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. ఆరు, ఏడు తరగతులకు మూడు లాంగ్వేజ్‌ పుస్త కాలతోపాటు మ్యాథ్స్‌, సైన్స్‌,సాంఘికశాస్త్రంసహా మొత్తం ఆరు పుస్తకాలే ఉండాలి. ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు ఈ ఆరుపుస్తకాలకు తోడు జీవశాస్త్రం కలుపుకొని ఏడుబుక్స్‌ ఉండాలి. ప్రతి సబ్జెక్టుకు 200 పేజీల నోట్‌బుక్‌ మాత్రమే ఉపయోగించాలి. వాటిని ఎఫ్‌ఏలకు, స్లిప్‌ టెస్టులకు వినియోగించాలి. ఇవి కూడా రోజూ తీసుకురావాల్సిన అవసరం లేదు. పాఠ్యాంశాల చివరన ఉన్న ఎక్సర్‌సైజ్‌లను ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలల్లోనే పూర్తి చేయించాలి. ఇందుకోసం ప్రత్యేక పీరియడ్లను కేటాయించా లి. ఆరు నుంచి పదో తరగతుల విద్యార్థులకు క్లాస్‌వర్క్‌, హోం వర్క్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు ఒక్కోరోజు కేటాయించేలా లేదా ఒక రోజు మూడు సబ్జెక్టులు ఉండేలా ప్రణాళిక ఉండాలి. ఏ సబ్జెక్టుకు ఏ రోజు అనేది ఉపాధ్యాయుల సమావేశంలో చర్చించి నిర్ణయిం చాలి.నిబంధనల ప్రకారం పుస్తకాల సంచిబరువ్ఞ ఆ విద్యార్థి శరీర బరువులో పదోవంతు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనలు పాట ిస్తున్న పాఠశాలలు చాలా తక్కువ. ఫలితంగా వయసుకు మించిన పుస్తకాల భారాన్ని మోస్తూ సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి విద్యార్థులు నీరసించిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాలను అనుసరించి రాష్ట్ర, జిల్లా పాఠశాల విద్యాశాఖ తప్పనిసరిగా నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. 2015లో కూడా బ్యాగుల బరువ్ఞ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలు కూడా ఎక్కడా అమలుకాలేదు. కానీ గత మేలో మద్రాస్‌ హైకోర్టు పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువ్ఞ నియంత్రణపై ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ స్కూలు బ్యాగుల బరువ్ఞతగ్గించే చర్యలు చేపట్టింది. సర్కార్‌ బడుల్లో చాలా మేలు. ఆరు నుండి పదోతరగతులు స్టేట్‌ సిలబస్‌ కొనసాగిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు భారీ పాఠశాల సంచులు తీసుకురావడంలేదు. ఏదిఏమైనా పిల్లలపై స్కూల్‌ బ్యాగ్‌ బరువ్ఞ తగ్గించాలి.లేనియెడల వారిపై శారీరకంగా ఆరోగ్యరీత్యా ప్రభావం ఏర్పడుతుంది. వెన్ను ముక వక్రత ఏర్పడును. ఇలాంటి ఆదేశాలు పాఠశాలల ప్రారంభం లోఇస్తే యాజమాన్యాలకు వెసులుబాటు ఉంటుంది.దానికి తగ్గట్టు వారు మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆదేశాలు ఇచ్చాం మా పని అయిపోయింది అని కాకుండా ఖచ్చితమైన వ్యవస్థను ఏర్పాటు చేసి తమ ఆదేశాలు ఖచ్చితంగా అమలు అయ్యేలా చూడాల్సిన గురుతర బాధ్యతను కూడా వాటిపైనే ఉన్నాయన్న సంగతిని మరువద్దు. ఏదిఏమైనా స్కూల్‌కు వెళ్లడం వారి పాలిట శాపంగా మారకూడదు. అందుకు ప్రభుత్వం, విద్యానిపుణులు కలిసి కూర్చుని చర్చించి పరిష్కారం ఆలోచించాలి. భావి భారత పౌరుల జీవితం అంధకారమయం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తించుకోవాలి.

  • కాళంరాజువేణుగోపాల్‌