బడిబాట సక్సెస్‌కు పాటుపడేదెవరు?

School Children in Badi Baata Rally
School Children in Badi Baata Rally

విద్యార్థుల జీవితాలలో వెలుగురేఖలు ప్రసాదించాల్సిన విద్యారంగం వ్యాపారంగా మారడంతో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చుకొని కొందరు వ్యక్తులు తమ వ్యాపారాన్ని మూడుపువ్ఞ్వలు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ప్రతిసంవత్సరం ప్రభుత్వ పాఠశాలలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆసక్తి సన్నగిల్లిపోయి అప్పులు చేసి అసౌకర్యాలున్న ప్రైవేట్‌బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్‌ నెలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తున్నది. 10 నెలలు బడికి వెళ్లి ఏమి వెలగబెట్టారని పోషకులు బడిబాటలో బడిపంతుళ్లను ప్రశ్నిస్తే జవాబు చెప్పలేక పారిపోతున్న సంఘట నలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం గరీబోల్ల బడిఈడు పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలట బడిపంతుళ్లు. ఇతర సర్కారి ఉద్యోగులు, లెక్చరర్లు, శాసనసభ్యులు, పార్లమెంట్‌సభ్యులు, శాసనమండలి సభ్యులు, సివిల్‌ సర్వీస్‌ అధికారులు మాత్రం తమ పిల్లలను ప్రైవేట్‌ బడుల్లో చేర్పిస్తారట. ఇదేం పద్ధతి.ఇదేమి నిబంధన? ఇదేమి న్యాయం? ఇది ద్వంద నీతి కాదా? నాణ్యమై న విద్యను అందిస్తామనే నమ్మకం ఉన్నట్లయితే సర్కారు స్కూళ్ల లో (టీచర్ల)పిల్లలను ఎందుకుచేర్పించడం లేదనిప్రశ్నిస్తున్నారు. గతంలో బడిబాట కార్యక్రమానికి కొత్త అడ్మిషన్లు నమోదు కాక తలతోక బాదు కున్న సందర్భాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణరాష్ట్రంలో గ్రామా లు, పల్లెటూర్లలో, శివారుగ్రామాలలో ఉన్న మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలు అన్నీ విద్యార్థులు లేక వెలవెలపోతున్నా యి. సింగిల్‌ టీచర్‌, డబుల్‌ టీచర్లు,10లోపు సంఖ్య విద్యార్థు లతో నెలకు అరవైవేల జీతాల చొప్పున ఠంచన్‌గా పొందుతున్నా రు. ప్రతివ్యక్తి తమ పిల్లలను సర్కారు బడుల్లో మాత్రమే చదివిం చాలని నిబంధనల తీసుకువస్తే సర్కారు బడులు కళకళలాడుతా యి. ప్రైవేట్‌ బస్సులను పల్లెటూర్లకు రాకుండా గ్రామస్తులందరూ ఏకమై నిరోధిస్తే బడులు బతికి బట్ట గడతాయి.చదువంటే కేవ లం శ్రవణం,భాషణం,లేఖనం,పఠనం అని విద్యాశాఖ అధికారులు సెలవిస్తున్నారు.కాని చాలామందికి పఠనంవస్తే లేఖనంరాదు. లేఖ వస్తే పఠనం రాదు. విద్యార్థి బడికి వస్తే పంతులు బడికిరాదు. ఒకవేళ వచ్చినా టీచింగ్‌, లర్నింగ్‌ మెటీరియల్‌ ద్వారా పాఠాలు చెప్పరు. పెద్ద లోపంఏమి టంటే మండలస్థాయిలో విద్యాపర్య వేక్షణ లేకుండాపోయింది.బడికివెళ్లినా,వెళ్లకపోయినా పట్టించుకునే వారులేరు. కారణం రాష్ట్రంలోని మండల విద్యాధికారి పోస్టులన్నీ ఇంఛార్జీలదే.గత మూడేళ్లుగా రాష్ట్రంలో జిల్లాఉపవిద్యాధికారిపోస్టు లను నిర్వీర్యంచేశారు.ఆపోస్టులే ప్రస్తుతం లేవ్ఞ. ఇప్పుడు రాష్ట్రం లో విద్యాశాఖ మానిటరింగ్‌ లేదు. పర్యవేక్షణ లోపించింది.

  • రావుల రాజేశం