కార్పొరేట్‌ క్రమశిక్షణకు విద్యార్థులు బలి

వ్యాపారాలు వేరు విద్య, వైద్యం వేరు. కాని నేడు ఈ రెండు దేశంలోనేకాక రాష్ట్రా లలో కూడా మంచి లాభాలను ఆర్జించే ఆర్థిక వనరులు. మరీ ముఖ్యంగా విద్య. తల్లిదండ్రులు వారి పిల్లలను డాక్టరో, ఇంజినీరో చేయాలనే సంకల్పమే కార్పొరేట్‌ సంస్థలకు వరంగా మారింది.

Children faces pressure from  corporate school rules
Children in Corporate school class Room (File)

కార్పొరేట్‌ క్రమశిక్షన పేరుతో విద్యార్థులకు ఓ ఆదివారం ఉండ దు, ఓ పండగ ఉండదు. క్రీడలుండవ్ఞ. సాంస్కృతిక కార్యక్ర మాలు ఉండవ్ఞ. ప్రతిక్షణం చదువే. వేల మంది విద్యార్థులు హాస్టళ్లలో జైలు జీవితం కన్నా దుర్భర పరిస్థితి ఎదుర్కొంటు న్నారనేది జగమెరిగిన సత్యం. కన్నతల్లిదండ్రులే తమ పిల్లలను వారానికో, నెలకో ఒక్కసారి ఐదు నిమిషాలు కలిసి రావలసిన పరిస్థితి వారు ‘కొని తెచ్చుకుంటున్నారు.

ర్యాంకులే విద్యార్థుల జీవితాలను నిలుపుతాయనే భ్రమలో చాలా మంది తల్లిదండ్రు లు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు నిరంతరం పోటీపడుతూ, ఈ నాటకీయ చదరంగంలో వారిని పావ్ఞలుగా మారుస్తున్నారు. చాలా మంది విద్యార్థులు రోజులో ఏదో ఒక క్షణంలో శారీర కంగా, నీరసిస్తూ మానసికంగా కుంగిపోతున్నారనేది ఏ మాత్రం సందేహం లేదు. ఈ విషయాలు ఎవరు పట్టించుకోరు. ఎందు కంటే ఇవేవీ ర్యాంకులు సాధించలేవ్ఞ కదా? విద్యార్థి పరుగు పందెంలో నిలబడ్డాడు. పరిగెత్తాక తప్పదు. ఆగితే తన పరిస్థితి ఏమిటో దిక్కతోచదు. అందుకే అలా. ఇలాంటి అనారోగ్యకర మైన పరిస్థితిలో గతంలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యా ప్రయత్నం చేసిన సంఘటనలు చేసాం. దీనికి కారణం ఏమిటో తెలియదు అంటే హాస్యాస్పదమే అవ్ఞతుంది. విద్యావ్యవస్థలో అతి ముఖ్యమైన స్థాయి ప్రాథమికస్థాయి. ఈ స్థాయిలోనే కార్పొరేట్‌ స్థాయి ప్రబలిపోతున్న తరుణంలో విద్యార్థి భవిష్యత్తు ఎలా ఉంటుందో విద్యతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరమున్నది. ఇలాంటి అనారోగ్యకరమైన పోటీ ప్రపంచం నుండి నైపుణ్యాలు కలిగిన ఆహ్లాదకరమైన విద్యావ్యవస్థను ఏర్పరుచుటకు కృషి చేయాలి.విద్యార్థికి ఈ ప్రాథమిక స్థాయిలో సబ్జెక్టుల పట్ల కీలక భావనలు, క్షేత్రస్థాయి విషయాలను నేర్చుకునే సామర్థ్యం అప్పుడప్పుడే మొదలవ్ఞతుం టుంది.

ఇలాంటి సమయంలో ఐఐటి, ఎంసెట్‌, ఎఐఇఇఇ లాంటివి దేశంలో, రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పరీక్షలకు కోచింగ్‌లు ఇస్తాం అంటే తల్లిదండ్రులు ఎలా నమ్మతున్నారో అర్థంకావడం లేదు. ఈ వాతావరణం ప్రాథమికస్థాయి నుండి మొదలై ఇంటర్‌స్థాయిలో చాలా బలంగా వ్యాపించి ఉన్నది. మంచి ఆర్థిక కార్యకలాపంగా ఇంటర్‌ విద్య, కార్పొరేట్‌లో నిలిచిందనేది సత్యం. తద్వారా వ్యాపార దృష్టితో విద్యను చూడటం వల్ల మంచి మానవత విలువలు కలిగిన, ఉన్నత ఆశయాలు కలిగిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, లెక్చరర్‌లకు వారి మనస్సుకు, యాజమాన్యాలు వారి స్వంత కార్పొరేట్‌ నిబంధనలతో బందిస్తున్నారనేది నిజం. ఈ నిబంధన చట్రంలో అటు విద్యార్థులు, ఇటు బోధన సిబ్బంది బాధలు ఎదుర్కొంటున్నది వాస్తవం. నిజానికి విద్యార్థుల నుండి కోరవలసినది విద్యార్థి అన్ని అంశాలలో సమగ్రమైన విషయాత్మక, పరిశీలణాత్మక అభివృద్ధి చెందాలి. ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేట్‌ సంస్థ అయినా ఎక్కడ చదువ్ఞతున్నా విద్యార్థి విద్యార్థే కాబట్టి షెడ్యూల్‌ అనేది పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా విద్యార్థులకు తరగతులను నిర్వహించే వారిపట్ల కఠినంగా వ్యవహరించవలసి ఉంది. విద్యార్థులకు క్రీడలను పాఠశాలలు అందిస్తున్నాయా? లేదొ? అనే అంశాన్ని కూడా పర్యవేక్షించాలి.

  • సూరం అనిల్‌