దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలు

జాతీయ నేర గణాంక విభాగం గణాంకాల నివేదిక

suicide cases
suicide cases

భారతదేశంలో ఆత్మహత్యల సంఘటనలపై జాతీయ నేర గణాంక విభాగం (ఎన్‌సిఆర్‌ బి)గణాంకాల నివేదికను వెల్లడించింది. 2019 సంవత్సరంలో గతేడాది కంటే ఎక్కువ ఆత్మ హత్యలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది.

సగటున రోజుకు 381 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపింది.2019 ఏడాదిలో 1,39,123 మంది ఆత్మహత్య చేసుకోగా,2018లో 1,34,516మంది ఉన్నారు.

వీరిలో 70.2 శాతం మంది పురుషులు, 29.8 శాతం మంది మహిళలు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునేవారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారని వెల్లడించింది.

గత ఏడాది ఇలా ఆత్మహత్యలు చేసుకున్నవారిలో ఎక్కువ శాతం 18 నుండి 30ఏళ్ల మధ్య వయసున్నవారే ఉన్నారు. దేశవ్యాప్తం గా ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 23.4 శాతం రోజు వారీ కూలీలు ఉన్నారు.

నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించిన గణాంకాలు కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి. బలవన్మరణాలకు పాల్పడినవారిలో 15.4 శాతం మంది గృహిణులు ఉన్నారు. ఇక సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ఉన్నారు.

11.6శాతంమంది నిరుద్యోగులు10.2 శాతం మంది ఉన్నట్టు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది.18వేలకు పైగా కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా,తమిళనాడు లో 13వేలు,పశ్చిమబెంగాల్‌12వేలతో రెండు,మూడు స్థానం లో ఉన్నాయి.

తెలంగాణలో 7,675మంది చనిపోగా వీరిలో 2,858 మంది కూలీలని,499 మంది రైతులున్నారని వెల్ల డించింది.ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో 6,465మంది ఆత్మహత్యలు చేసుకోగా,వీరిలో వివాహం తర్వాత ఆత్మహత్యలుచేసుకున్న వారే ఎక్కువగా ఉన్నారని తేలింది.

ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 53.6శాతం ఉరివేసుకోగా,25.8శాతంమంది విషం తాగి, మరో3.8 శాతం మంది నిప్పు అంటించుకొని, 5.2 శాతంమంది నీళ్లలోదూకి ఆత్మహత్యకు పాల్పడగా, ఇంకొంద రు కుటుంబ సమస్యల కారణంగా 32.4 శాతం మంది, వివాహ సంబంధిత సమస్యల కారణంగా5.4శాతం మంది ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తరాఖండ్‌,పశ్చిమబెంగాల్‌, బీహార్‌, పుదుచ్చేరి, ఒడిశా, ఛండీగఢ్‌, మణిపూర్‌,ఢిల్లీలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకపోవడం విశేషం.ఇటీవలికాలంలో కరోనా సమయంలో ఆత్మహత్యల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో గతమార్చి నుంచి కూడా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.

గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఆత్మహత్యలకు పాల్పడేవారిసంఖ్య పెరుగుతున్నది. దీనికి పాశ్చాత్య ప్రభావం, మానవ సంబంధాలు తగ్గడం కారణాలుగా చెప్పవచ్చు.

గతంలో తీవ్రమైన సమస్య ఎదురైన ప్పుడే ఆత్మహత్యలకు ప్రయత్నించేవారు.ఇప్పుడు ప్రతి చిన్న సమస్యకూ ఆత్మహత్యే పరిష్కారమనిభావిస్తున్నారు.

ఒకసారి ఆత్మహత్య ఆలోచనవస్తే కొద్దిసేపే ఉంటుంది.తర్వాత మర్చి పోతారు.కొన్నాళ్ల తర్వాత మళ్లీవస్తుంది.అటువంటి సమ యాన్ని గుర్తించి సాంత్వన చేకూర్చేలా మాట్లాడితే ఆ వ్యక్తిని రక్షించవచ్చని మానసిక నిపుణులు అంటున్నారు.

కావున ఈ సమయాన్ని గుర్తించేఅవకాశం తల్లిదండ్రులు, ఉపాధ్యాయు లు, స్నేహితులకు మాత్రమే ఉంటుంది.ప్రవర్తనలోఏమాత్రం తేడా వచ్చినా వెంటనే కౌన్సిలింగ్‌ చేయడం లేదా మానసిక వైద్యనిపుణుల వద్దకు తీసుకువెళ్లడం చేయాలి.

ఎక్కువమంది తమపై తల్లిదండ్రులు పెద్ద ఆశలు పెట్టుకున్నారని వాటిని నెరవేర్చలేకపోతున్నామనే బాధతోనూ, ప్రేమ విఫలమైందనే ఆవేదన, మాదకద్రవ్యాలకు బానిసలై విచక్షణ కోల్పోయి అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో మానసిక నిపుణులను ఏర్పాటు చేసుకుని వారి సమస్యలను గుర్తించి వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వాలి.

-వాసిలి సురేష్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/