ఉన్నత విద్యా రంగంలో కీలక సంస్కరణల ఆవశ్యకత

మానవ వనరుల శాఖ వార్షిక నివేదిక

Higher Education Sector
Higher Education Sector

దేశంలో ఉన్నత విద్య ఉసూరుమంటుంది. ఐక్యరాజ్య సమితి గత సెప్టెంబరు నెలలో విడుదల చేసిన మానవ వనరుల సూచికలో 193 దశల పట్టికలో భారత్‌ 130వ స్థానం లో నిలవడం బాధాకరం.

ప్రపంచంలోని 300 అత్యుత్తమ విశ్వ విద్యాలయాల జాబితాలో ఐఐటి ముంబయి, ఐఐఎస్‌సి బెంగు ళూరు మినహా ఏ విశ్వవిద్యాలయానికి చోటు దొరకకపోవడం దురదృష్టకరం.

ఉన్నత విద్యకోసం ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేత్రస్థాయిలో ఆశించిన అభివృద్ధి కానరావడం లేదన్నది నిర్వివాదాంశం.

2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఐటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌, రొబోటిక్స్‌, క్లేడీకంప్యూటింగ్‌ వంటి రంగాలలో లక్షలాది ఉద్యోగాలకు రూపకల్పన జరుగుతున్న, వాటికి అందిపుచ్చుకునే నైపుణ్యం, శాస్త్ర పరిజ్ఞానం కేవలం 10 శాతం విద్యార్థులకు కూడా లేదని ఇటీవల అస్సాబా§్‌ు, ఫిక్సి వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మానవవనరుల శాఖ వార్షిక నివేదిక ప్రకారం దేశంలో ఏటా 90 లక్షల మంది ఉన్నత విద్యను అభ్యసిస్తుండగా, రెండు లక్షలమంది ఎంఫిల్‌, పిహెచ్‌డిలు పూర్తి చేస్తున్నారు.

మొత్తం 50 లక్షల మంది ఇంజినీరింగ్‌, ఫార్మసీ వంటి సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు.

ఈ మొత్తంలో కేవలం 12శాతం మందికి మాత్రమే ఆశించి ఉద్యో గాలు లభ్యమతుండగా, 32.5 శాతం మంది జీతం వస్తేచాలు అన్న చందాన ఏదో ఒక ఉద్యోగంలో పడిపోతున్నా రు.

ఇప్పటికే దేశంలో ఆరున్నర కోట్లమంది నిరుద్యోగులుగా వున్నారని, 2018 నాటికి గత 45 సంవత్సరాలలో అత్యధిక నిరుద్యోగిత శాతం (8.19)తో లోపించి సగటు కంటేఎంతో ఎక్కువని ఇటీవల అంత ర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల తెలియజేస్తున్నాయి.

పరిశోధన రంగంలో స్కాలర్లకు వేతనాలు 25 శాతం పెంచినా దేశంలో పరి శోధనలు అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే ఎంతో నాసిరకంగా వ్ఞన్నాయని సర్వత్రా అభిప్రాయాం వ్యక్తం అవుతోంది.

వృత్తి విద్య అభ్యసించేవారిలో నైపుణ్యత కొరత తీవ్రంగా బాధిస్తోందని ఫిక్కి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పట్టభుద్రులలో ఉద్యోగ సమ ర్థతను పెంచడం, ఉద్యోగ సమర్థత కలిగిన వారికి ఉపాధి కల్పిం చడం ఎంతో కీలకం కానీ ప్రస్తుత విద్యావిధానంలో ఇటువంటి ప్రయత్నాలు జరగడం లేదు.

విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక రంగాలమధ్య అనుసంధానం ఎంతో అవసరం. యువకులలో నైపుణ్యవృద్ధికి, స్వయం ఉపాధి కల్పనకు నిర్ధేశించిన స్కిల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు.

కాలం చెల్లిన పాఠ్యంశాల స్థానంలో ప్రస్తుతం పారిశ్రామిక రంగానికి అనువైనవి అయిన నూతన సిలబస్‌ను తక్షణం ప్రవేశపెట్టాలి.

విద్యార్థులలో చిన్ననాటి నుండి సృజనాత్మకత, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, విద్యాసంస్థలలోని అధ్యాపకులకు పరిశ్రమలలో కన్సల్టెన్సీ ప్రాజెక్టులు చేపట్టడం వంటి కీలక చర్యలు చేపట్టాలి. ప్రాథమిక విద్యారంగంలో కూడా కీలక సంస్కరణలు చేపట్టాలి.

మార్కుల, పర్సంటేజీల సాధన, బట్టీపట్టి పరీక్షలు రాసే విద్యావిధానానికి స్వస్తి పలకాలి.

  • సి.హెచ్‌.ప్రతాప్‌

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/