విద్యావిధానంలో సంస్కరణలు

నేటి రోజుల్లో విద్యా విధానం గాడితప్పి నడుస్తుంది. విద్య అంతిమ లక్ష్యాలను, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి పట్టించు కోకుండా మార్కులు, ర్యాంకుల బాటలో దారి మళ్లింపునకు గురైంది. కంప్యూటర్లకు డేటాలు ఎక్కించినట్లు చదువ్ఞల పేరుతో పాఠాలను విద్యార్థుల బుర్రలకు ఎక్కించడమే పనిగా ఈరోజు విద్యావిధానం నడుస్తుంది. అనుభవాలను, అనుభూతులను మిగిల్చే ప్రయోగాలు కానీ, క్షేత్ర పరిశీలనలు కానీ, కనీసం బోధనసమయంలో బోధనాభ్యసన సామాగ్రి కాని మనం చూసి ఉండం. తరగతి గదిలో కూడా విద్యార్థుల ఆలోచనలు, అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్న సందర్భం కూడా ఎక్కడా మనకు దకలపడదు. అక్కడికి ప్రభుత్వ పాఠశాలలు మాత్రం కొద్దో గొప్పో ప్రయోగ పరిశీలనలకు, కృత్యాధార బోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Reforms in School Education
Reforms in School Education

కానీ ప్రభు త్వాలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసి కనీస సదుపాయాలు కానీ, తగినంత సిబ్బందిని కానీ ఏర్పాటు చేయ కపోగా పూటకొక విధానం, సంవత్సరానికొక ప్రణాళికతో నిత్యం విద్యావిధానాన్ని శస్త్రచికిత్సలు చేసి ఉపాధ్యాయులను అయో మయానికి గురి చేస్తున్నారు. మధ్యాహ్నభోజనం పథకం నుండి బాత్‌రూమ్‌ నిర్వహణ వరకు, జనాభా లెక్కల దగ్గర నుండి గుడ్లు, బియ్యం, లెక్కల దాకా అన్ని ఉపాధ్యాయుడే చూడాలి. ఇవికాక ర్యాలీలు సామాజిక అవగాహన సదస్సులు నిర్వహించాలి. అంతేకాక గంటకో నివేదిక, గడియకో పాఠశాల ప్రణాళిక చొప్పున ఆఫీసుకు పంపిస్తూనే ఉండాలి. ఈ విధంగా ఉపాధ్యాయులు మొత్తం బోధన సమయంలో 60 శాతం ఇటువంటి బోధనేతర పనులకే సరిపోతుంది. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి మరి చెప్పనక్కర్లేదు. పిల్లలకు చదువ్ఞలు చెప్పడం మాట అటుంచి,రికార్డులను తయారు చేసుకోవడం, నివేదికలు పంపించుకోవడంలో గుమస్తాలను మించిపోతున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ విద్యావిధానం ఈ రోజు దినదినగండంగా తయారవ్వడానికి తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా తయారయింది. ప్రజలకు మేలైన విద్యావిధానం సామాజికబాధ్యతగా అందించాల్సిన ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ చేసి చేతులు దులుపుకోవడానికి చూస్తున్నాయి. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి పాఠశాలకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలలో ఇప్పటి వరకు కేవలం 9.5 శాతం మాత్రమే అమలు చేయడం అనేది ఈ దశాబ్దకాలంగా పాలకులు ప్రభుత్వ విద్యావిధానం మీద ఎంత సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారో అర్థమవ్ఞతుంది. ఒకపక్క ప్రభుత్వ విద్యావిధానాన్ని నీరు గారుస్తూనే మరోపక్క ఎటువంటి అడ్డూఅదుపు లేకుండా ప్రైవేట్‌ విద్యావిధానాన్ని పెంచి పోషిస్తున్నారు. చట్టాలను కానీ, నిబంధనలు కానీ పట్టించుకోకుండా షాపింగ్‌ మాల్స్‌ లాంటి భవనాలలో ఏర్పాటు చేసిన విద్యాసంస్థలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు. అక్కడ ఒక ఆటస్థలం కానీ, గ్రంథాలయం కానీ ప్రయోగశాల కానీ ఉండదు.

వ్యాయామ విద్య, ఆరోగ్యవిద్య, కళలు అసలే అరుదు. చాలా మంది విద్యార్థులతో కిక్కిరిసిన తరగతి గదులలో ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు పడి చావాల్సిందే! తరగతి గదులలో ఉపాధ్యాయులు ఏకపాత్రాభినయం చేస్తుంటే విద్యార్థులు ప్రేక్షకపాత్ర పోషిస్తుంటారు. విద్యార్థులు మానసికొల్లా సానికి కానీ, శారీరక ఆరోగ్యానికి కానీ అవకాశం ఉండదు. చదివిందే చదవడం, రాసిందే రాయడం పనిగా మార్కులు, ర్యాంకులు భ్రమలలో బతికేస్తుంటారు. మానవీయ, సాంఘిక, నైతిక విలువలు నేర్పే పనేలేదు. స్నేహబంధాలు, బంధుత్వవిలువలు అసలే కద్దు. లోతుగా చర్చించుకుంటే అక్కరకు రానీ, ఈ ప్రైవేట్‌ విద్యావిధానం చదువ్ఞ పేరుతో సమాజాన్ని రెండుగా విభజిస్తుంది. డబ్బులు పెట్టుబడితో ఎగువ మధ్యతరగతి వాళ్లందరూ ప్రైవేట్‌ చదువ్ఞలు చదువ్ఞతున్నారు. సామాజికంగా ఈ రెండు వర్గాల మధ్య ఈ ఇంగ్లీష్‌ విద్యావిధానం ఒక విభజన తీసుకువచ్చి పెట్టని గోడను నిర్మించింది.

ఒకప్పుడు సమాజంలో అన్ని సమూహాలు ఒకే తరహా విద్యావిధానాన్ని అభ్యసించేవారు. వారి మధ్య విద్యాపరమైన అంతరం ఉండేది కాదు. కానీ నేడు ప్రైవేట్‌ విద్యావిధానం ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ చదువ్ఞలు సమాజాన్ని విభజిస్తున్నాయి. ధనిక, పేద వర్గాల మధ్య ఈ చదువ్ఞల అంతరం ఏర్పడి, సమాజంలో పిల్లలందర్నీ కలవకుండా చేస్తుంది. తల్లిదండ్రులు కూడా ఈ విభజనను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారితో స్నేహం చేస్తే చెడిపోతావ్ఞ అన్నట్టుగా భావిస్తున్నారు. తల్లిదండ్రులు భావిస్తున్నట్లు కేవలం ఆంగ్ల మాధ్యమ చదువ్ఞ విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఇవ్వగలదా? ప్రైవేట్‌ చదువ్ఞలు చదివినంత మాత్రాన ఉన్నత స్థానాలను అధిరోహించగలరా? అలా అయితే ఈ రోజు ఇంజినీరింగ్‌ ఇంకా ఇతర టెక్నికల్‌ కోర్సులు చదువ్ఞతున్న విద్యార్థులలో 80శాతం మంది నిరుద్యోగులుగా ఉంటున్నారు అనే విషయాన్ని ఈ సమాజం గుర్తించాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 1990కి ముందు చదివిన వారందరూ ప్రభుత్వ బడుల్లో ప్రాంతీయ మాధ్య

మంలోనే చదివినవారే! భారతదేశ ప్రముఖ గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌, ప్రపంచ మేధావిగా గుర్తించబడిన అంబేద్కర్‌ కూడా తన ప్రాంతీయ భాషలోనే ప్రాథమిక విద్యను చదివి గొప్పగొప్పస్థానాలకు వెళ్లారు. వీళ్లేకాదు జాతి గర్వించదగ్గ గొప్పగొప్ప శాస్త్రవేత్తలు మేధావ్ఞలు, కవ్ఞలు, రచయితలు కళాకారులు అధికశాతం ప్రభుత్వ బడులలో మాతృభాషలో చదివిన వారే. ప్రపంచంలో అభివృద్ధిచెందిన అమెరికా, బ్రిటన్‌, చైనా, రష్యా, జపాన్‌ వంటి దేశాలలో ప్రాథమిక విద్య వారి వారి మాతృభాషల్లోనే సాగుతుంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి ఉద్యోగ అవసరాల కోసం ఆంగ్లమాధ్యమంలో విద్యను ఏర్పాటు చేసినప్పుడు వ్యతిరేకించిన ఈ భారత సమాజం నేడు అదే ఆంగ్ల మాధ్యమం కోసం వెంపర్లాడిపోతుంది. ప్రపంచంలో ఎంతో మంది మేధావ్ఞలు, విద్యాకమిషన్లు చెబుతున్న విషయం ఏమిటంటే ఏ దేశంలోనైనా ప్రాథమిక విద్య వారి మాతృభాషలోనే జరగాలి. అప్పుడే విద్యార్థులకు సరైన విషయావగాహన, విద్యపట్ల ఆసక్తి ఏర్పడుతుంది. అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే జ్ఞానానికి భాషతో సంబంధం లేదు. అది ఏ భాషలోనైనా నేర్చుకోవచ్చు

. ఏ మాధ్యమాలైన చదవచ్చు. జ్ఞానం అబ్బి తీరుతుంది. ఏ భాషలో చదివినా రెంరెండ్ల్రు నాలుగే కదా! ఈపాటి ఆలోచన కూడా లేని ఈ సమాజం ఆంగ్ల విద్యకోసం అర్రులు చాస్తుంది. విద్యాపరి శోధనా సంస్థలలో పనిచేస్తున్న మేధావ్ఞలు సైతం ఈ రోజు ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేయడం కడుశోచనీయం. ప్రాథమిక ఉన్నత తరగతులలో ఆంగ్ల మాధ్యమంలో చదివినా ఇంటర్మీడియేట్‌ స్థాయిలో విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవడానికి తగినన్ని కళాశాలలు లేకపోవడం సుమారు 70 శాతం మంది విద్యార్థులు కార్పొరేట్‌ కళాశాలల బాట పడుతున్నారు

. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రోజుల్లో మంచి మేలురకమైన విద్య అనే సంకుచిత భావంతో ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్య కోసం సమాజం వెంపర్లాడుతుంది. చదువ్ఞల పేరుతో పసి పిల్లలను కూడా నిర్దాక్షణ్యంగా బందీఖానాల వంటి హాస్టళ్లలో పడేస్తున్నారు. తల్లిదండ్రులు ప్రేమకు అప్యాయతలకు దూరమై, సామాజిక వైరుధ్యాలను గుర్తించలేక ఏ విషయంలో ఎలా స్పందించాలో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియక జీవితంలో ఎదురైన చిన్న చిన్న కష్టాలకు సైతం చలించిపోతున్నారు. చదువ్ఞలు సమస్యకు పరిష్కారం కావాలి కానీ చదువ్ఞలే సమస్యగా మోయలేని భారంగా మారుతుంటే విద్యార్థులు ఆ ఒత్తిడిని భరించలేక తనువ్ఞ చాలిస్తున్నారు.ఏదేశంలోనైనా ప్రజలందరు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిచెందాలన్నా, దేశం ప్రగతి పథంలో నడవాలన్నా ఎటువంటి అరమరికలు లేని విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, ప్రజాపంపిణీ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే నిర్వహించాలి. అప్పుడే ప్రజలందరికీ సమిష్టి ప్రయోజనం చేకూరి ఎటువంటి విభేదాలు లేని జాతి నిర్మాణం జరుగుతుంది. ఏ దేశంలోనైనా జాతి నిర్మాణానికి విలువలు కలిగిన విద్యార్థులను తయారు చేయాలంటే అందరికీ అందుబాటులో మేలైన విద్యావిధానం ఉండాలి. అది ప్రజలందరికీ ఉచితంగా అందాలి. బడి అనేది ఒక వ్యవస్థ. మానవ్ఞలు పోగు చేసుకున్న జ్ఞానాన్ని, చరిత్రను, సంస్కృతిని ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తుంది. బడి జాతి భవిష్యత్తుకు, దేశ నిర్మాణానికి మూల ప్రమాణం.ఒక సమాజం ఎలా నిర్మించబడుతుందో, ఎలాంటి భవిష్యత్తును తయారు చేసుకుంటుందో పాఠశాలను చూసి చెప్పవచ్చు.

క విధంగా చెప్పాలంటే ప్రభుత్వ విద్యావిధానం ఈ రోజు దినదినగండంగా తయారవ్వడానికి తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా తయారయింది. ప్రజలకు మేలైన విద్యావిధానం సామాజికబాధ్యతగా అందించాల్సిన ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ చేసి చేతులు దులుపుకోవడానికి చూస్తున్నాయి. విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి పాఠశాలకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలలో ఇప్పటి వరకు కేవలం 9.5 శాతం మాత్రమే అమలు చేయడం అనేది ఈ దశాబ్దకాలంగా పాలకులు ప్రభుత్వ విద్యావిధానం మీద ఎంత సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారో అర్థమవ్ఞతుంది. ఒకపక్క ప్రభుత్వ విద్యావిధానాన్ని నీరు గారుస్తూనే మరోపక్క ఎటువంటి అడ్డూఅదుపు లేకుండా ప్రైవేట్‌ విద్యావిధానాన్ని పెంచి పోషిస్తున్నారు. చట్టాలను కానీ, నిబంధనలు కానీ పట్టించుకోకుండా షాపింగ్‌ మాల్స్‌ లాంటి భవనాలలో ఏర్పాటు చేసిన విద్యాసంస్థలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు

. అక్కడ ఒక ఆటస్థలం కానీ, గ్రంథాలయం కానీ ప్రయోగశాల కానీ ఉండదు. వ్యాయామ విద్య, ఆరోగ్యవిద్య, కళలు అసలే అరుదు. చాలా మంది విద్యార్థులతో కిక్కిరిసిన తరగతి గదులలో ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు పడి చావాల్సిందే! తరగతి గదులలో ఉపాధ్యాయులు ఏకపాత్రాభినయం చేస్తుంటే విద్యార్థులు ప్రేక్షకపాత్ర పోషిస్తుంటారు. విద్యార్థులు మానసికొల్లా సానికి కానీ, శారీరక ఆరోగ్యానికి కానీ అవకాశం ఉండదు. చదివిందే చదవడం, రాసిందే రాయడం పనిగా మార్కులు, ర్యాంకులు భ్రమలలో బతికేస్తుంటారు. మానవీయ, సాంఘిక, నైతిక విలువలు నేర్పే పనేలేదు. స్నేహబంధాలు, బంధుత్వవిలువలు అసలే కద్దు. లోతుగా చర్చించుకుంటే అక్కరకు రానీ, ఈ ప్రైవేట్‌ విద్యావిధానం చదువ్ఞ పేరుతో సమాజాన్ని రెండుగా విభజిస్తుంది. డబ్బులు పెట్టుబడితో ఎగువ మధ్యతరగతి వాళ్లందరూ ప్రైవేట్‌ చదువ్ఞలు చదువ్ఞతున్నారు. సామాజికంగా ఈ రెండు వర్గాల మధ్య ఈ ఇంగ్లీష్‌ విద్యావిధానం ఒక విభజన తీసుకువచ్చి పెట్టని గోడను నిర్మించింది. ఒకప్పుడు సమాజంలో అన్ని సమూహాలు ఒకే తరహా విద్యావిధానాన్ని అభ్యసించేవారు. వారి మధ్య విద్యాపరమైన అంతరం ఉండేది కాదు. కానీ నేడు ప్రైవేట్‌ విద్యావిధానం ముఖ్యంగా ఆంగ్ల

మాధ్యమ చదువ్ఞలు సమాజాన్ని విభజిస్తున్నాయి. ధనిక, పేద వర్గాల మధ్య ఈ చదువ్ఞల అంతరం ఏర్పడి, సమాజంలో పిల్లలందర్నీ కలవకుండా చేస్తుంది. తల్లిదండ్రులు కూడా ఈ విభజనను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారితో స్నేహం చేస్తే చెడిపోతావ్ఞ అన్నట్టుగా భావిస్తున్నారు. తల్లిదండ్రులు భావిస్తున్నట్లు కేవలం ఆంగ్ల మాధ్యమ చదువ్ఞ విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఇవ్వగలదా? ప్రైవేట్‌ చదువ్ఞలు చదివినంత మాత్రాన ఉన్నత స్థానాలను అధిరోహించగలరా? అలా అయితే ఈ రోజు ఇంజినీరింగ్‌ ఇంకా ఇతర టెక్నికల్‌ కోర్సులు చదువ్ఞతున్న విద్యార్థులలో 80శాతం మంది నిరుద్యోగులుగా ఉంటున్నారు అనే విషయాన్ని ఈ సమాజం గుర్తించాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే 1990కి ముందు చదివిన వారందరూ ప్రభుత్వ బడుల్లో ప్రాంతీయ మాధ్యమంలోనే చదివినవారే! భారతదేశ ప్రముఖ గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌, ప్రపంచ మేధావిగా గుర్తించబడిన అంబేద్కర్‌ కూడా తన ప్రాంతీయ భాషలోనే ప్రాథమిక విద్యను చదివి గొప్పగొప్పస్థానాలకు వెళ్లారు. వీళ్లేకాదు జాతి గర్వించదగ్గ గొప్పగొప్ప శాస్త్రవేత్తలు మేధావ్ఞలు, కవ్ఞలు, రచయితలు కళాకారులు అధికశాతం ప్రభుత్వ బడులలో మాతృభాషలో చదివిన వారే. ప్రపంచంలో అభివృద్ధిచెందిన అమెరికా, బ్రిటన్‌, చైనా, రష్యా, జపాన్‌ వంటి దేశాలలో ప్రాథమిక విద్య వారి వారి మాతృభాషల్లోనే సాగుతుంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి ఉద్యోగ అవసరాల కోసం ఆంగ్లమాధ్యమంలో విద్యను ఏర్పాటు చేసినప్పుడు వ్యతిరేకించిన ఈ భారత సమాజం నేడు అదే ఆంగ్ల మాధ్యమం కోసం వెంపర్లాడిపోతుంది. ప్రపంచంలో ఎంతో మంది మేధావ్ఞలు, విద్యాకమిషన్లు చెబుతున్న విషయం ఏమిటంటే ఏ దేశంలోనైనా ప్రాథమిక విద్య వారి మాతృభాషలోనే జరగాలి. అప్పుడే విద్యార్థులకు సరైన విషయావగాహన, విద్యపట్ల ఆసక్తి ఏర్పడుతుంది. అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే జ్ఞానానికి భాషతో సంబంధం లేదు. అది ఏ భాషలోనై

నా నేర్చుకోవచ్చు. ఏ మాధ్యమాలైన చదవచ్చు. జ్ఞానం అబ్బి తీరుతుంది. ఏ భాషలో చదివినా రెంరెండ్ల్రు నాలుగే కదా! ఈపాటి ఆలోచన కూడా లేని ఈ సమాజం ఆంగ్ల విద్యకోసం అర్రులు చాస్తుంది. విద్యాపరి శోధనా సంస్థలలో పనిచేస్తున్న మేధావ్ఞలు సైతం ఈ రోజు ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేయడం కడుశోచనీయం. ప్రాథమిక ఉన్నత తరగతులలో ఆంగ్ల మాధ్యమంలో చదివినా ఇంటర్మీడియేట్‌ స్థాయిలో విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవడానికి తగినన్ని కళాశాలలు లేకపోవడం సుమారు 70 శాతం మంది విద్యార్థులు కార్పొరేట్‌ కళాశాలల బాట పడుతున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రోజుల్లో మంచి మేలురకమైన విద్య అనే సంకుచిత భావంతో ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్య కోసం సమాజం వెంపర్లాడుతుంది. చదువ్ఞల పేరుతో పసి పిల్లలను కూడా నిర్దాక్షణ్యంగా బందీఖానాల వంటి హాస్టళ్లలో పడేస్తున్నారు

. తల్లిదండ్రులు ప్రేమకు అప్యాయతలకు దూరమై, సామాజిక వైరుధ్యాలను గుర్తించలేక ఏ విషయంలో ఎలా స్పందించాలో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియక జీవితంలో ఎదురైన చిన్న చిన్న కష్టాలకు సైతం చలించిపోతున్నారు. చదువ్ఞలు సమస్యకు పరిష్కారం కావాలి కానీ చదువ్ఞలే సమస్యగా మోయలేని భారంగా మారుతుంటే విద్యార్థులు ఆ ఒత్తిడిని భరించలేక తనువ్ఞ చాలిస్తున్నారు.ఏదేశంలోనైనా ప్రజలందరు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిచెందాలన్నా, దేశం ప్రగతి పథంలో నడవాలన్నా ఎటువంటి అరమరికలు లేని విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, ప్రజాపంపిణీ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే నిర్వహించాలి. అప్పుడే ప్రజలందరికీ సమిష్టి ప్రయోజనం చేకూరి ఎటువంటి విభేదాలు లేని జాతి నిర్మాణం జరుగుతుంది. ఏ దేశంలోనైనా జాతి నిర్మాణానికి విలువలు కలిగిన విద్యార్థులను తయారు చేయాలంటే అందరికీ అందుబాటులో మేలైన విద్యావిధానం ఉండాలి. అది ప్రజలందరికీ ఉచితంగా అందాలి. బడి అనేది ఒక వ్యవస్థ. మానవ్ఞలు పోగు చేసుకున్న జ్ఞానాన్ని, చరిత్రను, సంస్కృతిని ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తుంది. బడి జాతి భవిష్యత్తుకు, దేశ నిర్మాణానికి మూల ప్రమాణం.ఒక సమాజం ఎలా నిర్మించబడుతుందో, ఎలాంటి భవిష్యత్తును తయారు చేసుకుంటుందో పాఠశాలను చూసి చెప్పవచ్చు.

  • మాణిక్యం దుర్గారావు