అన్నదాతకు ఆదాయ భద్రత కల్పించాలి

సంక్షోభంలో వ్యవసాయం :
ఉత్పత్తికి, డిమాండ్‌కు మధ్య సమన్వయం జరగాలి

దేశ స్థూలజాతీ యోత్పత్తిలో వ్యవసాయం 16శాతం ఆక్రమిస్తోందనేది నిర్వివాదాంశం. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సరైన అవగాహన లేక పోవడం వ్యవసాయదారుల సమస్యలకు మూలకారణం.

farmers problems
farmers problems

పంటలు పండించే విధానంలో ఒకప్పటికీ నేటికీ అనేక మార్పులు వచ్చాయి. కొత్త పద్ధతులు ఆవిష్కరించాయి. సాధనలో సవాళ్లను అధిగమించి ఆదాయ భద్రత, మెరుగైన జీవన ప్రమాణాలను సాధించేందుకు రైతుస్థాయిలోనే సుస్థిర ప్రయత్నాలు సాగుతున్నాయి.

వ్యవసాయ ఆదాయాలు పెరగడానికి నగదు బదిలీలు, రుణమాఫీలు వంటివి మాత్రమే సరిపోవ్ఞ. వ్యవసాయరంగాన్ని కూడా పరిశ్రమల స్థాయికి తీసుకురావడం మీదే ఆ రంగం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఓటు రాజకీయాలని రాజ్యమేలుతున్న కాలంలో రైతు కేవలం ఎన్నికల ప్రణాళికకే పరిమితమవ్ఞతున్న దశ.

దేశంలో 60 నుంచి 70 మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధరరాదు. కొనుగోలుదారుడికీ అందుబాటులో ఉండదు. మనదేశంలో ఎక్కువ భాగం సన్నకారు రైతులే ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతి సీజన్‌లోనూ మార్కెట్‌ యార్డుల్లో దళారీల ప్రమే యంపై ఇబ్బడిముబ్బడిగా ఆరోపణలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

మార్కెట్‌ కమిటీలు 2006 చట్టాన్ని సవరించి ధాన్యం సేకరణలో ప్రైవేట్‌ భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ధాన్యసేకరణ తరిగిపోయింది. 2018లో 10,349 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు జీవితంలో పోరాడలేక ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఇందులో 5,783 మంది రైతులు కాగా, 4586 మంది వ్యవసాయ కార్మికులుగా తెలిపింది.

అనేక దశాబ్దాల నుంచి పరిశ్రమలు, సేవారంగాలకు లభిస్తున్నంత ప్రాధాన్యం వ్యవసాయరంగానికి లభించడం లేదు. పరిశ్రమలు, సేవారంగాలలో ఆదాయంతో పోలిస్తే వ్యవసాయరంగం నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువనే అభిప్రాయం పాలకుల్లో నెలకొని ఉంది. నీటి పారుదల సౌకర్యాలలో వచ్చే దిగుబడి కంటే వర్షాల మీద ఆధారపడి పొలాల నుంచి వచ్చే దిగుబడి చాలా తక్కువ. దేశంలో గత నాలుగేళ్లుగా ఆహార ధాన్యాల దిగుబడులు పెరుగు తున్నా తలసరి లభ్యత పెరగడం లేదు.

జనాభా పెరుగుదలకు అనుగుణంగా పంట దిగుబడులు పెంచే పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి. పొలాల్లోనే వర్షపు నీటి నిల్వలకు పెద్దగుంతలు నిర్మించడం, వాగులు, వంకల్లో అడ్డుకట్టల నిర్మాణం తదితర పనుల ద్వారా వాననీటిని నిలువరించడం వంటి పనులకు రాయితీలు కల్పించాలి. సరైన వ్యవసాయ పద్ధతులు అందరికీ తెలియచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దళారుల చేతివాటాన్ని నివారించేలా కృషి చేయాలి.

సరైన గిట్టుబాటు ధరను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. నకిలీవిత్తనాలు, రసాయనిక ఎరువ్ఞలు మందుల వాడకం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలి. సబ్సిడీ విత్తనాలను, ఎరువ్ఞలను పంటమార్పిడి పద్ధతులను అందుబాటులోకి తేవాలి. సమర్థవంత మైన, స్థిరమైన ఉత్పాదక దిశలో భారత వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. కొత్తకొత్త వంగడాలు, రసాయన విత్తనాలు, ఎరువ్ఞల వాడకాన్ని తగ్గించడం తదితర అంశాలకు సంబంధించి ప్రయోగాలు, అధ్యయనాల కోసం బడ్జెట్‌లో ఇతోధికంగా కేటాయింపులుండాలి.

పంటలు, పశుసంపద ఉత్పాదకతను మెరుగుపర్చడం వినియోగ సామర్థ్యాన్ని పెంచడం ఉత్పత్తి ఖర్చులో ఆదా చేయడం పంటల సాంద్రతపెంచడం, అధిక విలువగల పంటలవైపు మొగ్గుచూపడం, రైతులకు వచ్చే ఆదాయాలను పెంచడం వ్యవసాయం నుంచి వ్యవసాయేతర వృత్తులకు మళ్లించడం ముఖ్యం.

2017-18లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 28.5 కోట్ల టన్నులు ఉంటే 2018-19కి 28.34 కోట్ల టన్నులకు పడిపోయింది. రైతులు ఉత్పత్తివ్యయంలో ఎంత ఆదా చేసినా వాస్తవంగా వారికి వచ్చే ఆదాయంలో ఎలాంటి మెరుగుదల కన్పించడం లేదు.

స్వామినాథన్‌ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలి. మద్దతు ధరలు అమలు కాకపోవడం వల్ల రైతులు ఏటా మూడు లక్షల కోట్లు నష్టపోతున్నారు. వ్యవసాయం లో విత్తనం కొనుగోలు, ఎరువ్ఞలు, మందులు, కూలీలు, అన్నిం టికీ డబ్బు అవసరం. నకిలీ విత్తనాలు, ఎరువ్ఞలు, పురుగుమందు ల పేరుతో రైతులు అడుగడుగునా మోసపోతూనే ఉన్నారు.

పొలం గట్టు చేరని ప్రభుత్వ ఆర్థిక విధానాలు, అమలు కాని రుణమాఫీ, అందీ అందని పథకాలతో సాగు చేస్తున్న రైతుల బతుకు అగమ్య గోచరంగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు కుటుంబ పోషణ పిల్లల చదువ్ఞ పెళ్లిళ్లకు భూమిని అమ్ముకోవాల్సి వస్తుంది. వీరి అవసరాలే ఆసరాగా చేసుకొని రియల్‌ వ్యాపారులు అధిక డబ్బు ఆశ చూపించి పంట భూములను బీడు భూములుగా మార్చి కంచెలు వేస్తున్నారు.

పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పచ్చని పంట పొలాలు పెద్దపెద్ద ఫ్యాక్టరీలుగా, సంస్థలుగా, ప్లాట్లుగా దర్శనమిస్తున్నాయి. తినేవాడి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. పండించేవారి సంఖ్య మాత్రం రోజురోజుకు తగ్గుతోంది. సరైన పంటలను గుర్తించి రైతులను ఆ దిశగా ప్రోత్సహించడానికి ప్రకృతివైపరీత్యాల వల్ల వచ్చే నష్టాల నుంచి రైతులను ముందే కాపాడటానికి భూసారాన్ని పరీక్షించి మెరుగుపరచడానికి, నీటిపారుదల సౌకర్యాలను విస్తరించడానికి, భూగర్భజలాలను అందుబాటులోకి తేవడానికి పెద్దఎత్తున ప్రయ త్నాలు జరగాలి.

వ్యవసాయాన్ని గిట్టుబాటు వ్యాపారంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెట్టుబడులు పెట్టాలి. రైతుల కోసం, గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కామర్స్‌ వ్యవస్థ ఏర్పాటు చేసి రైతులు తమ ఉత్పత్తులకు సరైన మార్కెట్‌ సౌకర్యాల పొందడానికి పథకా లు సిద్ధం చేస్తోంది. ఉత్పత్తికి, డిమాండ్‌కు మధ్య సమన్వయం ఉండేవిధంగా ధరల నిర్ణయం కూడా జరగాల్సి ఉంటుంది.

వ్యవసాయ రంగంలో సాంప్రదాయక విధానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొనే విధంగా రైతులను ప్రోత్సహించాలి. పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించడానికి నిర్దిష్టమైన ప్రణాళికతో వ్యవసాయరంగాన్ని అభివృద్ధిపరచాలి.

రైతులే తాము పండించిన పంటలను అమ్ముకునే విధంగా వారినే వ్యాపార భాగస్వాములుగా తీర్చిదిద్దే విధంగా కొత్త చట్టాలు నిబంధనలు తీసుకురావాలి. రైతులకు వడ్డీ వ్యాపారం నుండి ప్రైవేట్‌ వ్యాపార సంస్థల నుండి విముక్తి లభించనిదే వారి బతుకులు బాగపడవు.

-ఆర్‌విఎం.సత్యం

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/