పుడమి విపత్తును సంఘటితంగా నివారిద్దాం

The Earth

ప్రకృతి, భూమి, పంచభూతాల విధ్వంసాన్ని అరికట్టడం,కాలుష్య నివారణకు వెనువెంటనే పూనుకోవాలి. నిర్లక్ష్యంచేస్తే రాబోవ్ఞతరాలకు మనమే చేతులారానష్టంచేసిన వారమవ్ఞతాం. భూగోళానికి భంగం వాటిల్లేలా, పర్యావరణానికి ప్రమాదం చుట్టుముట్టేలా ప్రణాళికరహిత పారిశ్రామికీకరణ,వ్యర్థాల వలన వాయు, జల, నేల కాలుష్యాలకు మానవ్ఞలలో జడలు విప్పుకున్న స్వార్థమేనని తెలిసిపోతుంది. వాతావరణ మార్పులవల్ల మితిమీరిన ఎండలతో భరించలేని వేడి,అకాలవర్షాలు, రుతువ్ఞలు గాడితప్పడం, వరదలు ప్రళయగర్జనలు, భూకంపాలు, కొత్త వైరస్‌లు, మంచుతుఫానులతో తీవ్ర సంక్షోభం ఏర్పడబోతుందని తెలుస్తుంది. పాలకులు భూమిని, పర్యావరణాన్ని చల్లగా, పదిలంగా ఉండేలా ప్రజలంతా ప్రకృతి సమ్మతమైన జీవన వైవిధ్యాలు పాటించాలి.

ప్ర పంచంలో మనిషిని, మనిషిలా చూసేది భూమి ఒక్కటే. మట్టి కాళ్లను ముద్దాడుతుంది.నీరు దాహాన్ని తీరుస్తుంది. వాయువ్ఞ ప్రాణాన్నిస్తుంది.అగ్ని ఒకేలా వెలుగునిస్తుంది.ఈసృష్టిలో శాశ్వతమైన పంచభూతాలకు లేని గర్వం, స్వార్థం అశాశ్వతమైన జీవికి మనిషికి ఎందుకు ఈ దుర్మార్గపు పనులు.అవసరానికి మిం చిన ఆశలు, ఆశలకుమించిన దురాశలు,సహజత్వాన్ని మరిచిపోతూ కాలుష్యాన్ని పెంచుతూ పోవడమే మనిషి దురదృష్టం.

ఎంత శాస్త్రసాంకేతిక జ్ఞానం సంపాదించుకున్నా ప్రకృతి ముందుఏపాటి? తెలివితో భూమిపై గుంటలు తవ్వగలం, పూడ్చగలం, గుట్టలుగా పేర్వగలం. కానీ మట్టిని సృష్టించలేం. మేధో సంపత్తితో ఎన్ని అద్భుతాలు ఆవిష్కరించినా ‘సాలెగూడు లాంటిదే. ఆధునిక శాస్త్ర సాంకేతికతపై చిన్నచూపు కానేకాదు. నేలవిడిచి సాము చేయరా దని, సహజ వనరులను తిరిగి సృష్టించలేమని భావన. ప్రకృతిలో విలువైనవి, అందమైనవన్నీ ఉచితమే. ఈ ప్రకృతి సోయగాలు మనిషికి స్ఫూర్తి నింపాలి. జీవరాశికి ప్రకృతి ప్రసాదించిన వరమే కాలం.

ఆ కాలం పేదవానికైనా, ధనికునికైనా సమానమే. పేద, ధనిక, అనే తేడా లేకుండా పుడిమిపై విపత్తుకు కారకుడవ్ఞతు న్నాడు.ఈ తీరు మారాలి. ప్రకృతికి, పర్యావరణానికి మనిషి చేస్తున్న విధ్వంసం మూలంగా భవిష్యత్తులో మానవ మనుగడ ప్రశ్నార్థకం కానున్నదని తెలుస్తుంది. భూగోళం అత్యయిక పరిస్థితి లోకి వెళ్లిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్వార్థ మానవాళి పోకడలు పెచ్చరిల్లిపోతున్నాయి. కాలుష్యం కారణంగా వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం ఒకవైపు ముంచుకొస్తుంటే ఈ పరిణా మాల వల్ల కార్బన్‌ డై ఆక్సైడ్‌ను ఇంతకాలం నియంత్రిస్తున్న అడ వ్ఞలు, ఇప్పుడు అదే వాయువ్ఞను ఉత్పత్తి చేసే స్థానాలుగా మారు తున్నాయి.

మానవ ప్రమేయంతో ఏర్పడుతున్న కాలుష్యంకారణంగా భూమిపై 9 రకాల శాశ్వత నష్టాలు సంభవిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పెరుగుతున్న కాలుష్యం, భూతాపం, వాతావరణంలో గణనీయమైన మార్పులకు దారితీస్తుంది.గత 50 ఏళ్లుగా పర్యావ రణపరంగా నెలకొన్న వాతావరణ మార్పుల వల్ల పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో తీవ్రవ్యత్యాసం, మారుతున్న వర్షపాత తీరుతెన్నుల ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం తక్ష ణమే మేల్కొనాలి. ఉద్గారాల నియంత్రణకు పాలకులు కఠిన చర్య లకు పూనుకోవాలి.

ప్రపంచ దేశాల పాలకులు (సమాజం) కూడా మేల్కొనకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం ఖాయం. పరిశో ధకులు, శాస్త్రవేత్తలు గుర్తించిన మార్పులు ఏమిటంటే అమెజాన్‌ అడవ్ఞలు అంతరిస్తుండడం, ఆర్కిటిక్‌ సముద్రం మంచు కరుగు తుండడం,అట్లాంటిక్‌ తదితర సముద్రాల్లో జీవజాలం అంతరిస్తుం డడం, గ్రీన్‌లాండ్‌, పశ్చిమ, తూర్పు అంటార్కిటికాలో మంచు పలకలు తగ్గడం, భూమిపై మంచు శిలలు (పెర్మాప్రాస్ట్‌) కనుమ రుగవ్ఞతుండడం, ఉత్తరార్థగోళంలోని అడవ్ఞలు నాశనమవ్ఞతుండ డం. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు1.1 డిగ్రీలమేర పెరిగాయి.2040 నాటికి ఇవి 1.5 డిగ్రీలు దాటవచ్చు.

అదే జరిగితే మంచుకరిగి, సముద్ర మట్టాలు 10 శాతం పెరుగు తాయి. ఫలితంగా తీర ప్రాంతాలు నీటమునుగుతాయి.భూగోళంపై వాతావరణ మార్పుల ప్రభావంవల్ల సంభవిస్తున్న వ్యాధులపై అవగాహన కల్పిస్తూ, నివారణ చర్యలకు పూనుకోవాలి. వాతావ రణ మార్పుల వలన వచ్చే ఉపద్రవం నుండి మానవాళిని కాపాడుకోవడానికి, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించి సంపూర్ణ ఆయురారోగ్యంగా ఉండటానికి పూనుకోవాలి. ఉమ్మడిగా కార్యా చరణను వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి చిత్తశుద్ధితో మొదలెట్టాలి.

తక్షణమే ప్రపంచదేశాల సదస్సును ఏర్పరచి ప్రకృతి, భూగోళ పరిరక్షణకు ప్రణాళికబద్ధంగా అమలయ్యేలా కఠిన నిబం ధనలు అమలుచేయాలి. అసంఖ్యాకమైన జనాభా, వైద్య, ఆరోగ్య సదుపాయాల్లో తీవ్ర అసమానతలు, పేదరికం, పోషకాహార లోపంలాంటి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశం లో వాతావరణ మార్పుల ప్రభావం ఉంటుందని తెలుస్తుంది. విశ్వంలో జీవరాశులకు అనువైనది భూమియే కదా! పంచభూతాల ను స్వార్థ మానవాళి విధ్వంసం చేయడం వలన ప్రకృతి సంపద అంతా వ్యాపారమైంది.

జలంకోసం భూమిపై నిలువెల్లా తూట్లు పొడుస్తూ (బోర్లు వేస్తూ)భూ అంతర్గత పొరలను అంతమొందిం చనున్నారు.దీనిమూలంగా భూకంపాలు వస్తున్నాయి. అడవ్ఞలను, గుట్టలను,సహజ సంపదలన్నింటిని స్వార్థబుద్ధితో చాపచుడుతున్నా రు. తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నామన్న సంగతి తెలుసుకోలేకపోతున్నారు.పంచభూతాలను పరిమితిగా వాడుకుంటే అందరి కోరికలు తీరుతాయి. పర్యావరణానికి ఎలాంటిహాని జర గదు. భావితరాలకు మేలుచేసిన వారవ్ఞతారు. సకల జీవకోటికి భూమి ఆధారం.

ఈ స్థితిలో భూమిలేని క్షణం ఊహించజాలం. పంచభూతాల నుండి మనిషి నేర్చుకునేది చాలాఉంది. సహనం, కనికరం ఉండాలి. నిప్పులాగా అన్యాయాలను దగ్ధం చేయాలి.గాలి జీవకోటికి ప్రాణవాయువ్ఞనిచ్చినట్లు ఇతరులకు మేలుచేసే గుణం కలిగిఉండాలి. భూతాపం పెరుగుతున్నందువలన వాతావరణంలో గణనీయమైన మార్పులకు కారణమవ్ఞతుంది.ప్రధానంగా కాలుష్యం పెచ్చరిల్లి ప్రపంచ భవిష్యత్తు, పౌరసమాజం పెనుముప్పుకు దారితీయబోతున్నట్లుందని నిపుణుల హెచ్చరికలనుండి అప్రమత్తం తో ఉండాలి.

భూతాప నియంత్రణ చేయడంలో ప్రపంచదేశాలు విఫలమైతే మనిషిమనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉంది.ఈ విపత్కర పరిణామాలకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తి నుండి ప్రపంచదేశాలన్నీ సంఘటితంగా ప్రకృతి, భూమి, పంచభూతాల విధ్వంసాన్ని అరికట్టడం,కాలుష్య నివారణకు వెనువెంటనే పూనుకో వాలి. నిర్లక్ష్యంచేస్తే రాబోవ్ఞతరాలకు మనమే చేతులారానష్టంచేసిన వారమవ్ఞతాం.

భూగోళానికి భంగం వాటిల్లేలా, పర్యావరణానికి ప్రమాదం చుట్టుముట్టేలా ప్రణాళికరహిత పారిశ్రామికీకరణ,వ్యర్థాల వలన వాయు, జల, నేల కాలుష్యాలకు మానవ్ఞలలో జడలు విప్పుకున్న స్వార్థమేనని తెలిసిపోతుంది.వాతావరణ మార్పులవల్ల మితిమీరిన ఎండలతో భరించలేని వేడి,అకాలవర్షాలు, రుతువ్ఞలు గాడితప్పడం, వరదలు ప్రళయగర్జనలు, భూకంపాలు, కొత్త వైరస్‌లు, మంచుతుఫానులతో తీవ్ర సంక్షోభం ఏర్పడబోతుందని తెలుస్తుంది. పాలకులు భూమిని, పర్యావరణాన్నిచల్లగా, పదిలంగా ఉండేలా ప్రజలంతా ప్రకృతి సమ్మతమైన జీవన వైవిధ్యాలు పాటించాలి.పర్యావరణానికి విధ్వంసం కలిగించని విధంగా అభివృద్ధి రూపొందించుకోవాలి.

  • మేకిరి దామోదర్‌

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/