రాజకీయ అస్థిరత్వానికి ఫిరాయింపులే కారణం!

Political Party's leaders
Political Party’s leaders

ప్రభుత్వంలో పలుకుబడి తమకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు, ధనసంపాదన లాంటివి ఫిరాయింపులకు దారితీస్తున్నాయి. సంఖ్యాపరంగా శాసనసభలో సాధారణ మెజారిటీకి దగ్గర స్థానాలు పొందితే పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ అధినాయకత్వం నిరంకుశ నిర్ణయాలకు నిరసనగా ఫిరాయింపులు ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు పార్టీ అధికారంలోకిరాదని భావిస్తే ఇతర పార్టీల్లోకి ఫిరాయించడం జరుగుతుంది.

ప్ర జల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానమే ‘ప్రజాస్వామ్యం. స్వార్థ ప్రజాప్రతినిధుల చేత, వారి స్వార్థ ప్రయోజనాల కొరకు వారు ఎంచు కున్న మార్గమే ఫిరాయింపుస్వామ్యం. మనదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి భయంకరమైన సమస్య ప్రజాస్వామ్యానికి పట్టిన మందులేని వ్యాధి వంటి సమస్య. ప్రజలచేత ఒక పార్టీ తరపున ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి గెలిచిన తర్వాత తన స్వలాభంకోసం, స్వార్థంతో తనను నమ్మి ఓట్లు వేసిన ఓటర్లను నమ్మకద్రోహానికి గురి చేసి, విలువలకు తిలోదకాలిచ్చి అవకాశవాదంతో పార్టీలను ఫిరాయించడం వల్ల రాజకీయ అస్థిరత్వం ఏర్పడటంతోపాటు ప్రజా భిప్రాయానికి భంగం వాటిల్లుతోంది. ఇటీవల కాలంలో ఈ సంస్కృతి చాలా విపరీతంగా పెరిగిపోయింది. వీరు చేసే నమ్మక ద్రోహానికి వారు పెట్టుకున్న పేరు ‘నియోజకవర్గ అభివృద్ధి. చట్టం లో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని ఆడిందే ఆటగా పాడిందే పాటగా వీరు చేస్తున్న ఆయారాం గయారాం పనులను అడ్డుకోవడా నికి ఎటువంటి చట్టాలున్నాయి? అసలు ఈ విష సంస్కృతి ఎప్పటి నుండి మన ప్రజాస్వామ్య వ్యవస్థని పట్టి పీడిస్తుంది అనే విషయాన్ని లోతుగా విశ్లేషిస్తే భారత ప్రజాస్వామ్యంలో పార్టీ ఫిరా యింపులు స్వాతంత్య్రం రాకపూర్వమే ప్రారంభమయ్యాయి. భారత ప్రభుత్వ చట్టం (1935) ప్రకారం 1937లో రాష్ట్ర శాసనసభలకు జరిగిన ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో భారత జాతీయకాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో కొంత మంది ముస్లింలీగ్‌ శాసనసభ్యులు భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి, మంత్రివర్గంలో చోటు సంపాదిం చారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952-67 మధ్యకాలంలో కూడా ఉత్తరప్రదేశ్‌ మద్రాసు రాష్ట్రం(తమిళనాడు), కేరళ, రాజస్థాన్‌ లాంటి అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల కారణంగాప్రభుత్వాలు రాజీనామా చేయాల్సి రావడం లేదా మెజారిటీ లేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, పార్టీ ఫిరాయింపుల ద్వారా మెజారిటీ సాధించడం లాంటి సందర్భాలున్నాయి. ఉదాహరణకు మద్రాసు రాష్ట్రంలో మొదటిసాధారణ ఎన్నికల (1952) తర్వాత మెజారిటీ లేకపోయినప్పటికీ గవర్నర్‌ ఆహ్వానంతో రాజగోపాలచారి ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత జరిగిన పార్టీ ఫిరా యింపుల కారణంగా మెజారిటీ పొందారు. మరికొన్ని సందర్భాల్లో పార్టీ ఫిరాయించి మంత్రివర్గంలో స్థానం పొందడమే కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఉదాహరణకు హరియాన. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వా త పరిస్థితి చూసినట్లయితే 1967 సంవత్సరాన్ని ఒక మైలురాయి గా పేర్కొనవచ్చు. 1967లో లోక్‌సభతోపాటు 16 రాష్ట్రాలకు జరి గిన సాధారణ ఎన్నికల్లోకాంగ్రెస్‌ పార్టీ 8 రాష్ట్రాల్లో (కేరళమద్రాసు రాష్ట్రం, పశ్చిమబంగ, బీహార్‌, ఒడిశా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌) మెజారిటీ కోల్పోయింది. అయితే ఎన్నికల్లో మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ అతిపెద్దపార్టీగా అవతరించి రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పార్టీ ఫిరాయింపుల ద్వారా మెజారిటీకి కావలసిన సభ్యుల సంఖ్య ను సాధించుకుంది. పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వంరద్దు కావడం లేదా కొత్త ప్రభుత్వం ఏర్పడటం సాధారణ విషయంగా మారిపోయింది.

1967లో మార్చి- డిసెంబరు మధ్య ఉన్న తొమ్మి ది నెలల కాలంలో మొత్తం 3447 మంది శాసనసభ్యుల్లో 314 మంది అంటే దాదాపు 9 శాతం మంది పార్టీ ఫిరాయించారు. 1972-77మధ్యకాలంలో 10 రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీ ఫిరాయిం పుల మూలంగా రాజీనామా చేయాల్సివచ్చింది. మేధావ్ఞల అంచ నా ప్రకారం ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న శాసనసభ్యుల్లో దాదాపు 1/5వ వంతు మంది పార్టీ ఫిరాయించినవారు ఉన్నారు. వెయ్యికి పైగా పార్టీ ఫిరాయింపు సంఘటనలు ఉన్నాయి. 2016లో ఉత్తరా ఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరతకు పార్టీ ఫిరా యింపులే కారణమయ్యాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో 45 మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులకు 44 మంది ముఖ్యమంత్రితో సహాపీపుల్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో విలీనమయ్యారు. ప్రస్తుతం తెలం గాణాలో కూడా 12 మంది కాంగ్రెస్‌ శాసనసభ సభ్యులు తెలం గాణ రాష్ట్రసమితిలో విలీనం అవ్వడం అందుకు నిరసనగాకాంగ్రెస్‌ పెద్దలు ఆమరణ నిరాహారదీక్షకు దిగడం అదేవిధంగా ఆంధ్రరాష్ట్ర విషయానికి వస్తే అక్కడ ఉన్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోకి అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది సభ్యులను అధికార పార్టీలో చేర్చుకొని వారిలో కొంత మందికి మంత్రి పదవ్ఞలు ఇవ్వడం దేశ ప్రజలందరికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి సుపరిచితమే.

మార్చి- డిసెంబరు మధ్య ఉన్న తొమ్మి ది నెలల కాలంలో మొత్తం 3447 మంది శాసనసభ్యుల్లో 314 మంది అంటే దాదాపు 9 శాతం మంది పార్టీ ఫిరాయించారు. 1972-77మధ్యకాలంలో 10 రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీ ఫిరాయిం పుల మూలంగా రాజీనామా చేయాల్సివచ్చింది. మేధావ్ఞల అంచ నా ప్రకారం ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న శాసనసభ్యుల్లో దాదాపు 1/5వ వంతు మంది పార్టీ ఫిరాయించినవారు ఉన్నారు. వెయ్యికి పైగా పార్టీ ఫిరాయింపు సంఘటనలు ఉన్నాయి. 2016లో ఉత్తరా ఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరతకు పార్టీ ఫిరా యింపులే కారణమయ్యాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో 45 మంది కాంగ్రెస్‌ పార్టీ సభ్యులకు 44 మంది ముఖ్యమంత్రితో సహాపీపుల్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో విలీనమయ్యారు. ప్రస్తుతం తెలం గాణాలో కూడా 12 మంది కాంగ్రెస్‌ శాసనసభ సభ్యులు తెలం గాణ రాష్ట్రసమితిలో విలీనం అవ్వడం అందుకు నిరసనగాకాంగ్రెస్‌ పెద్దలు ఆమరణ నిరాహారదీక్షకు దిగడం అదేవిధంగా ఆంధ్రరాష్ట్ర విషయానికి వస్తే అక్కడ ఉన్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోకి అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది సభ్యులను అధికార పార్టీలో చేర్చుకొని వారిలో కొంత మందికి మంత్రి పదవ్ఞలు ఇవ్వడం దేశ ప్రజలందరికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి సుపరిచితమే.

ఈ సంస్కృతి రాష్ట్రాలకే పరిమితమైంది అనుకుంటే పొరపాటే. కేంద్రంలో కూడా ఈ సంస్కృతిని గమనించవచ్చు. 1990-98 మధ్యకాలంలో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగాయి. 1990లో పి. చంద్రశేఖర్‌ ప్రధానమంత్రి కావడానికి, 1991లో పి.వి నరసింహారావ్ఞ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1995 నాటికి మెజారిటీ సాధించడానికి పార్టీ ఫిరాయింపులే కారణం. ప్రభుత్వంలో పలుకుబడి తమకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు, ధనసంపాదన లాంటివి ఫిరాయింపులకు దారితీస్తున్నాయి. సంఖ్యాపరంగా శాసనసభలో సాధారణ మెజారిటీకి దగ్గర స్థానాలు పొందితే పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ అధినాయకత్వం నిరంకుశ నిర్ణయాలకు నిరసనగా ఫిరాయింపులు ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు పార్టీ అధికారంలోకిరాదని భావిస్తే ఇతర పార్టీల్లోకి ఫిరాయించడం జరుగుతుంది.

ఎన్నికలైన వెంటనే ఎన్నికైన స్వతంత్ర సభ్యులు ఏదో ఒక పార్టీలోకి ముఖ్యంగా అధి కార పార్టీలోకి ఫిరాయించడం జరుగుతుంది.పార్టీ ఫిరాయింపులను ప్రజలు పెద్ద తప్పుగా భావించకపోవడం, తిరిగి ఎన్నుకోవడం, ఇవికాకుండా పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, పార్టీలో ప్రజాస్వామ్యం లోపించడం, ముఠా రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు లాంటివి కూడా కారణమవ్ఞతున్నాయి. ఇటువంటి ప్రజాస్వామ్య అపహాస్య ఫిరాయింపుల నిరోధానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ 1967లో వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులతో వై.బి చవాన్‌ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. 1973లో కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధానికి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించి నప్పటికీ అది చట్టంగా ఆమోదం పొందకముందే 1977లోలోక్‌సభ రద్దయింది. 1977లో కేంద్రంలో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక కేబినెట్‌ కమిటీని నియమించి, 1978లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ అది చట్టం కాలేదు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, సవరణ చట్టం పార్టీ ఫిరా యింపుల నిరోధానికి 1985లో రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో మొదటి సారిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించారు. దీనికి సం బంధించి రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ను చేర్చారు. దీన్నే ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటారు. రాజ్యాంగంలోని 102 (2), 191(2) ప్రకరణలు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభ్యుల అనర్హతకు సంబంధించిన వివరాలను తెలియచేస్తాయి.

2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్‌లోని పార్టీ ఫిరా యింపుల నిరోధక చట్టానికి మరికొన్ని సవరణలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం ప్రకారం పార్లమెంటు,రాష్ట్రాల శాసన సభ్యులు అనర్హతకు గురయ్యే కారణాలు ఒక పార్టీ తరపున టికెట్‌ పొంది ఎంపికైన శాసనసభ్యుడు ఆ పార్టీకి స్వచ్ఛందంగారాజీనామా చేసినప్పుడు. పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా సభ్యులు గైర్హా జరైనా,అదేవిధంగా పార్టీ విప్‌కువ్యతిరేకంగా ఓటువేసినా సభ్యత్వా న్ని కోల్పోతారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికైన శాసనసభ్యులు ఏదైనా పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దవ్ఞతుంది. పార్లమెంటు, రాష్ట్రశాసన సభలకు నామినేట్‌ అయిన సభ్యులు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్ద వ్ఞతుంది. నామినేటెడ్‌సభ్యులు నామినేటైన రోజు నుంచి ఆరు నెలల్లోపు ఏదైనా రాజకీయ పార్టీ లో చేరితే వారి సభ్యత్వం రద్దు కాదు. పార్టీ ఫిరాయింపుల నిరో ధక చట్టం ప్రకారం అనర్హతలు కొన్ని సందర్భాల్లో వర్తించవ్ఞ. అవి ఏమిటంటే ఒక రాజకీయపార్టీ మొత్తం శాసనసభ్యుల్లో 2/3వంతు మంది మరో రాజకీయ పార్టీలో చేరినా లేదా స్వతంత్రంగావేరొక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నా వారికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని అనర్హతలు వర్తించవ్ఞ. లోక్‌సభ స్పీకర్‌,డిప్యూ టీ స్పీకర్‌, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌, రాష్ట్ర విధాన సభస్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌,విధాన పరిషత్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లు తమ పద వికి రాజీనామా చేసినా లేదా పదవీకాలం ముగిసిన తర్వాతవేరొక రాజకీయ పార్టీలోకి చేరినా వారి శాసనసభ్యత్వం రద్దుకాదు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట ప్రాతిపదికన శాసనసభ్యుల సభ్య త్వాన్ని రద్దు చేసే అధికారం సభాధ్యక్షులకు ఉంటుంది.

సంబంధి త పార్టీ అధ్యక్షుడి ఫిర్యాదు మేరకు సభాధ్యక్షులు సభ్యత్వాన్ని రద్దుచేస్తారు. సభాధ్యక్షులదే తుదినిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు.1993లో ఒక కేసులో సుప్రీం కోర్టు ఈ సెక్షన్‌ను కొట్టివేసింది. సభాధ్యక్షులదే తుదినిర్ణయం కాదని, అది న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు నిర్ణయమే తుదినిర్ణయం అని తీర్పుచెప్పింది.2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారాపార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టారు. కేంద్రంలో ప్రధానమంత్రిసహా కేంద్ర మంత్రిమండలి సంఖ్య లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో 15 శాతానికి మించరాదు. అయితే రాష్ట్రాల విషయంలో మంత్రి మండలిసంఖ్య 12కు తగ్గకూడదు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించిన పార్లమెంటు లేదా శాసనసభ్యులు మంత్రులుగా నియమించడానికి అనర్హులు.

  • సుంకర నరేష్‌, హైకోర్టు న్యాయవాది