పనీపాటు లేని ఈ ఉత్తభద్రయ్యలెందుకు?

ఒక్కమాట.. ప్రతి శనివారం

Political Leaders
Political Leaders

కష్టపడి వ్యవసాయం, కూలీనాలి చేసుకుంటున్న యువకులు ఈ పదవ్ఞల మోజులో పడుతున్నారు. ఫలితంగా అటు వ్యవసాయం చేయడం, కూలి పనిచేయడం నామోషిగా భావించడం, ఇటు ఈ పదవ్ఞల వల్ల ఆదాయం లేకపోవడంతోపాటు కొత్త అలవాట్లు చేసుకొని విధిలేని పరిస్థితిలో అవినీతికి పాల్పడుతున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఆ దారి పట్టడం, వీరితో కొందరు అధికారులతో చేతులు కలపడంతో అవినీతి, ముఖ్యంగా దళారీ వ్యవస్థ మహావృక్షంగా వేళ్లూనుకుపోతున్నది. రాజకీయ అవినీతి నివారించేందుకు ఏరకమైన అడ్డుకానీ, యంత్రాంగం లేకపోవడమే కాదు. కనీసం అరికట్టే ప్రయత్నాలు కూడా జరగడం లేదు. ఎన్నో కుటుంబాలు ఈ రాజకీయ సుడిగుండంలో చిక్కుకొని చితికిపోతున్నాయి. పార్టీలకు అతీతంగా అందరు నేతలు ఆలోచించాల్సిన తరుణమిది. తమ రాజకీయ అవసరాల కోసం కష్టపడి పనిచేసుకుంటున్న ప్రధానంగా యువతను వట్టిభద్రయ్యలుగా మార్చి సమాజం మీదకు వదిలిపెట్టడాన్ని చరిత్ర క్షమించదు.

పప ని లేదు, అధికారాలు అసలే లేవ్ఞ, కూర్చోనేందుకు ఒక కుర్చీ కూడా లేదు, చివరకు కేరాఫ్‌ అడ్రసు లేని పద వ్ఞల కోసం జరుగుతున్న పోరాటం,వెచ్చిస్తున్న ధనం,పంపిణీ చేస్తున్న మద్యం పరిశీలిస్తే ఆవేదనే కాదు ఆందోళన కూడా కలు గుతుంది. గాంధీజీ కలలుగన్న గ్రామస్వపరిపాలనకు తూట్లు పొడి చేందుకు గత రెండు,మూడు దశాబ్దకాలంగా ప్రయత్నాలు జరుగు తూనే ఉన్నాయి. గ్రామీణ వికాసానికి సంబంధించి నిధులు, నిర్ణ యాధికారం ఆయా ప్రాంత ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల కు పరిమితమై ఉంటే అక్కడ అవసరాలను బట్టి అవి సద్వి నియోగం అయ్యే అవకాశాలు ఉంటాయనే మన పెద్దలు పదే పదే చెప్పేవారు. అందులో కొన్ని పొరపాట్లు,అవకతవకలు జరిగినా మంచి ఫలితాలు సిద్ధించడమే కాదు, సమర్థవంతమైన, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకులు తయారయ్యేవారు. గ్రామస్థాయి నుండి అంచలంచెలుగా జాతీయస్థాయికి ఎదిగిన వారిలో ఎందరో మహానేతలున్నారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. కేవలం డబ్బు వెదజల్లో లేక మద్యం పంపిణీ చేసో ఎన్నికల్లో గెలిచి నాయకులమైపోదా మనుకునే వారిసంఖ్య పెరిగిపోవడంతో అసలు ప్రజాస్వామ్యామే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఐదువేల ఎనిమిదివందల యాభైఏడు ఎంపిటిసి స్థానాలుండగా అందులో వివిధ కారణాల వల్ల నలభై చోట్ల ఎన్నికలు జరగడం లేదు. ఇక జెడ్పిటిసి స్థానాల్లో ములుగుజిల్లాలోని మంగం పేట జెడ్పిటిసి స్థానానికి తప్ప మిగిలిన 538 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మూడు దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికలు శుక్రవారంతో రెండో దశ పూర్తి అయింది. ఈ నెల 14వతేదితో మూడో దశ ముగుస్తుంది. ఈ ఎన్నికల కోసం అభ్యర్థులు పెడుతున్న ఖర్చు విస్మయం కలిగిస్తున్నది. చివరకు స్థిరాస్తులు అమ్ముకొనో, తలతాకట్టు పెట్టి, అప్పోసప్పో చేసో లక్షలాది రూపాయలు గుమ్మరిస్తున్నారు. క్వింటాళ్ల కొద్ది మాంసం, మద్యంతో విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయిలో గతంలో మూడంచెల విధానంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎంతో పకడ్బందీగా పనిచేసేది. ఎవరి విధులు, నిధుల కేటాయింపు వారికి ఉండేది. గాంధీ మహాత్ముడు ప్రవచించిన గ్రామస్వరాజ్యం లక్ష్యంలో స్థానిక సంస్థ పటిష్టత అన్నది ఒక ముఖ్యాంశం. భారత రాజ్యాంగంలో కూడా స్థానిక సంస్థలకు అవసరమైన అధికారాలు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టంగా సూచించారు. 1952లో మొదటి పంచవర్ష ప్రణాళిక ద్వారా ప్రారంభమైన ఈ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు వివిధ కమిటీల పరిశీలనలు, అధ్యయనాల అనంతరం గ్రామీణాభివృద్ధికి నిర్ణయాలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకే ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందుకు మూడంచెల విధానమే బాగుంటుందని అశోక్‌మెహతా కమిటీ సూచన మేరకే దేశంలో మొదట రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1964లో పంచాయతీరాజ్‌ చట్టం అమలులోకి వచ్చింది.ఆ తర్వాత అనేక కమిటీలు, అధ్యయనాలతో మార్పులు, చేర్పులతో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం ఉండటంతో దేశవ్యాప్తంగా ఒకేతరహా పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమలులో ఉండాలనే ఉద్దేశ్యంతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. 1994 మే 30వతేదీ నుండి ఈ శాసనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలు లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారమే ఐదంచెల విధానాన్ని ప్రవేశ పెట్టారు. ప్రాదేశిక నియోజకవర్గాలను, ఎంపిటిసిలు, జెడ్పిటిసిలని కొత్త పదవ్ఞలు సృష్టించారు. ఒకపక్క వార్డుమెంబర్లు, సర్పంచులు ఉండగా వీరు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారో, అసలు వారు ఏమి చేయాలో వారికే తెలియకుండాపోయింది. ఇది ఓవర్లాపింగ్‌ అవ్ఞతుందని ఎంతో మంది ఎన్ని రకాలుగా చెప్పినా ప్రభుత్వం అంగీకరించలేదు. వీరికి ఏ బాధ్యత అప్పగించాలో కూడా ప్రభుత్వానికి అర్థంకాకుండాపోయింది. ఇప్పటికీ వారు ఎక్కడ కూర్చోవాలో, వారు ఏ కార్యాలయంలో,ఏ కార్యక్రమాలు నిర్వ హించాలో కూడా నేటికీ నిర్ణయించలేకపోతున్నారు. కేవలం సమా వేశాలకు హాజరవ్ఞతూ ఆనాటి నుంచి నేటి వరకు కాలం గడుపు తున్నారే తప్ప వారికి నిర్దిష్టమైన విధులు లేకుండా పోయాయి. ఇలాంటి పనిలేని, కుర్చీ కూడా లేని ఈ పదవ్ఞల కోసం జరుగు తున్న ఈ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు, మద్యం పంపిణీవిస్మయం కలిగిస్తున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచును ఉత్సహ విగ్రహంగా మార్చారు. వనరక్షణ సమితులు, విద్యాకమిటీలు, సాగునీటి సంఘాలు, ఆస్పత్రి కమిటీలు వంటివి పెద్దఎత్తున ప్రవే శపెట్టడంతో పల్లకి ఎక్కే వారిసంఖ్య అపరిమితంగా పెరిగిపోయిం ది. వీధికో నాయకుడు, ఇంటికో జెండాగా గ్రామాల్లో పరిస్థితి తయారైంది. అధికారం, ఆదాయం లేని ఈ కమిటీలకు కూడా పోటీ పెరిగి ముఠాలు, ఘర్షణలు జరిగి పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. సరస్వతీనిలయాలుగా బాసి ల్లవలసిన పాఠశాలలు కూడా విద్యాకమిటీల పుణ్యమా అని వివా దాలకు వేదికలుగా మారి గురువ్ఞలకు విలువ లేని వాతావరణం ఏర్పడింది. పోని ఎంపిక అయిన వారు ఐక్యంగా ఉండి గ్రామా భివృద్ధికి పాటుపడు తున్నారంటే అది కూడా లేదు. తాతపోతే బొంత ఎవరికి?అన్నట్లు వారిలో వారు పోట్లాడుకుంటున్నారు. మరొకపక్క రాజ్యాంగ సవరణ ప్రకారం ఐదంచెల విధానం ఏర్పరిచామని చెప్పుకొనే పెద్దలు అదే రాజ్యాంగంలో స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన అధికారాలలో ఇప్పటికీ సగం కూడా ఇవ్వలేదు. దీంతో సర్పంచులు, ఉపసర్పంచులు దిష్టి బొమ్మలు గానే ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో చూస్తే మండల అధ్యక్షుడు,జిల్లా పరిషత్‌ అధ్యక్షులకు మాత్రమే నిధులు, విధులు, ఒక ఆఫీసు, ఒక కుర్చీ ఉంటుంది. ఇక జెడ్పిటిసిలు, ఎంపిటిసిలకు మాత్రం నిధుల సంగతి దెవ్ఞడెరుగు. కూర్చోడానికి కుర్చేకాదు కేరాఫ్‌అడ్రస్‌ కూడా లేదు. ఇక రాజకీయ పార్టీల్లో పదవ్ఞలకు అంతేలేకుండా పోయింది. బూత్‌ కమిటీలు మొదలుకొని గ్రామకమిటీలు,మండల కమిటీ, జిల్లా కమిటీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే లక్షలాది మంది నాయకులు పుట్టుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, తెలుగుదేశం, బిజెపి, కమ్యూనిస్టు, చిన్నాచితక పార్టీలు అన్నీ కలిపితే గ్రామస్థాయిలో రాజకీయ పార్టీల నేతల సంఖ్య చూస్తే లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇంతమంది నాయకులు అవసరమా? అందరికి పని ఉందా? రాజకీయ పార్టీల సభలకు, సమ్మెలకు, ప్రముఖుల మహోపన్యాసాలు వినడానికి జనాన్ని తరలించుకొచ్చే పనికి మాత్రం వీరు ఉపయోగపడుతున్నారు. కానీ పని, ఆదాయం లేని ఈ పదవ్ఞల కోసం ఎందుకు మొగ్గు చూపుతున్నారనే ప్రశ్న ఉదయించకతప్పదు. గతంలో పరిస్థితి వేరేగా ఉండేది. సర్పంచు కావాలనుకున్నా, ఎమ్మెల్యే కావాలను కున్నా కొంత వెనకాముందు ఆలోచించేవారు. కొంత అనుభవం, తమ స్థాయి మరచి ఆశపడేందుకు జంకేవారు. మొదటిసారి సర్పంచ్‌ అయినవారు మండలాధ్యక్షుడు, ఎమ్మెల్యే కావాలని మనసులో ఉన్నా ఆ కోరికను బయటపెట్టేందుకు ముందు వెనుక ఆలోచించేవారు. కానీ పరిస్థితులు కలిసి వచ్చి అలా అయినవారు ఉండవచ్చు. అలాంటి వారి సంఖ్య వేళ్ల మీద లెక్కించవచ్చు.కానీ ఇందిరా కాంగ్రెస్‌, తెలుగుదేశం, తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత పరిస్థితిలో మార్పువచ్చింది. ఊహించనివిధంగా టిక్కెట్లు ఇవ్వడంతో కనీసం సర్పంచుగా గెలవలేని వారు కూడా ఏకంగా ఎమ్మెల్యేలే కాదు, మంత్రులు కూడా అయ్యారు.ఇందులో కొందరు అప్పటివరకు సాధారణ జీవితం గడిపి పదవ్ఞలు రాగానే అన్నివిధాలుగా పెరిగిపోయారు. యువత కూడా ఆవైపు చూడడం ఆరంభమైంది. దీంతో కష్టపడి వ్యవసాయం, కూలీనాలి చేసుకుం టున్న యువకులు ఈ పదవ్ఞల మోజులో పడుతున్నారు. ఫలి తంగా అటు వ్యవసాయం చేయడం,కూలి పనిచేయడం నామోషి గా భావించడం, ఇటు ఈ పదవ్ఞల వల్ల ఆదాయం లేకపోవడంతో పాటు కొత్త అలవాట్లు చేసుకొని విధిలేని పరిస్థితిలో అవినీతికి పాల్పడుతున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఆ దారిపట్టడం, వీరిలో కొందరు అధికారులతో చేతులు కలపడంతో అవినీతి, ముఖ్యంగా దళారీ వ్యవస్థ మహావృక్షంగా వేళ్లూనుకుపోతున్నది. రాజకీయ అవినీతి నివారించేందుకు ఏరకమైన అడ్డుకానీ, యంత్రాంగం లేకపోవడమే కాదు. కనీసం అరికట్టే ప్రయత్నాలు కూడా జరగడం లేదు. ఎన్నో కుటుంబాలు ఈ రాజకీయ సుడిగుండంలో చిక్కుకొని చితికిపోతున్నాయి. పార్టీలకు అతీతంగా అందరు నేతలు ఆలోచించాల్సిన తరుణమిది. తమ రాజకీయ అవసరాల కోసం కష్టపడి పనిచేసుకుంటున్న ప్రధానంగా యువతను వట్టిభద్రయ్యలుగా మార్చి సమాజం మీదకు వదిలిపెట్టడాన్ని చరిత్ర క్షమించదు.

  • దామెర్ల సాయిబాబ