మౌలిక వసతుల కల్పనలో వ్యవస్థీకృత ప్రణాళికలు అవసరం

planning is essential in the provision of infrastructure

దేశంలోని అన్ని వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతమైన పరిపాలన అందించినప్పుడే సామా జిక వ్యవస్థలో సమన్యాయం అందుతుందని చెప్పవచ్చు. ప్రస్తు త పరిస్థితులలో సమాజంలోని అట్టడుగువర్గాలు దయనీయస్థితి లో కొట్టుమిట్టాడుతున్నాయి. తినడానికి తిండి లేక చేయడానికి పనిలేక చాలామంది సమాజంలో మౌలిక వసతులకు దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భారతదేశం ఆర్థిక వనరుల పరిపుష్టితో నిండుకుండలా కనపడే విధంగా ఆర్థికవనరులు సమకూర్చడంలో ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు సామాన్య మానవ్ఞలకు అందడం లేదనే చెప్పవచ్చు. దేశంలో వ్యవసాయ రంగం, పెట్టుబడిదారిరంగం, శ్రామికరంగం, ఇవన్నీ కూడా దేశ ఆర్థికవ్యవస్థను పెంపొందించడానికి పాలుపంచుకునే వర్గాలని చెప్పవచ్చు. సామాజిక వ్యవస్థలో నెలకొన్న అసమానతలను రూపుమాపాలని గత 70 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చెబు తున్న అట్టడుగువర్గాల అభివృద్ధి నేటికీ కూడా నూటికి నూరు శాతం కాలేదని చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు.

మారిన సమాజంలో పెట్టుబడిదారీ వర్గానికి ప్రపంచీకరణ తోడవడం అభివృద్ధి చెందుతున్న దేశాలపై భారత్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కనీస వసతుల కల్పనకు తగిన చర్యలు చేపట్టకపోతే సమాజంలో అట్టడుగు స్థాయిలో జీవిస్తున్న వారు ప్రభుత్వ పథకాలలో ఎక్కడా కనపడకపోవడం గమనిస్తే ప్రభుత్వాలు చేపడుతున్న వసతులు ఏ మేరకు ఉన్నాయో చెప్పవచ్చు. తాజాగా ఆర్థిక మందగమనం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఉంటుందని పేర్కొంటూ జిడిపి వృద్ధిరేటు అంచనా 5.8 నుంచి ఆరు శాతానికి కుదించ బడింది. దీనిద్వారా ఆర్థికవృద్ధి తిరోగమనానికి పయ నిస్తుందని చెప్పడానికి సందేహం లేదు.

పెట్టుబడి రేటు 2.3 శాతానికి, జిడిపివృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టస్థాయికి పడిపోయింది. ఇది రాబో యే రోజులకు గడ్డు పరిస్థితులను తెలియచేసే మొదటి హెచ్చ రిక. ఆర్థిక అసమానతలు మౌలిక సదుపాయాల కల్పనలో లోటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెంపొందించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలలో కనీసం రోడ్లు,మంచినీటి, సాగునీరు, విద్యావైద్య సౌకర్యాలు లేకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు.

గత 70 సంవత్సరాలుగా గ్రామీణ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా సామాన్య మానవ్ఞడు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వాలు చేయూత అం దించడంలో వెనుకబడే ఉన్నాయని చెప్పవచ్చు. సంపద కొంత మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండడంవల్ల సామాన్య మానవ్ఞల జీవన విధానంలో పెద్ద మార్పు కనపడకపోవడం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి రాలేకపో తున్నాయని తెలియచేస్తుంది.పెట్టుబడులను పెంచేందుకు ప్రోత్సాహకాలను ప్రకటించిన వీటిలో ప్రాథమిక కార్పొరేట్‌ పన్ను రేటును 30 నుంచి 22 శాతానికి తగ్గించడం, సదుపా యాలు గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రుణాల పెంపు, గృహ నిర్మాణ ఆర్థిక సంస్థలకు అదే సహాయాన్ని రూ.30వేల కోట్లకు పెంచడం ముఖ్యమైనవి.

రాబోయే ఐదేళ్లల్లో మౌలిక సదుపా యాలరంగంలో కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. వ్యవస్థలో ద్రవ్యచెలామణి లేకుండా పోవడంవల్ల గ్రామీణ ప్రాంత ప్రజలుఅనేక ఇబ్బందులను ఎదు ర్కొంటున్నారు. దేశంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పవచ్చు.

ప్రభుత్వం ముందుగా నల్లధనాన్ని బయటకు తీయాలనే భావనతో చేపట్టిన ఈ సాహసోపేతమైన నిర్ణయంవల్ల గ్రామీణపట్టణ ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. ఆకలికేకలు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. అన్నార్తుల కష్టాలు ఆగిపోయే పరిస్థితులు ఇప్పట్లో కనబడడం లేదు. 117 దేశాల ప్రపంచ ఆకలి సూచి (2019) జాబితాలో భారతదేశం 102వస్థానంలో నిలవడమే మౌలిక వసతులు మెరుగుపరచడంలో భారతదేశ పరిస్థితి ఇందుకు నిదర్శనం. ఆకలి సూచిలో పొరుగుదేశాలు పాకిస్థాన్‌ 94స్థానం, బంగ్లాదేశ్‌ 88స్థానం, నేపాల్‌ 73స్థానం, మయన్మార్‌ 69 స్థానం, శ్రీలంక 66వస్థానంలో ఉండటం గమనార్హం.

1991 నాటి సరళీకరణ విధానాలవల్ల ఆర్థిక అసమానతలు సమాంతరం పెరిగిపోయా యి. ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉంటే మానవ వనరుల లభ్యత కొరతగా ఉంటుంది.మారుతున్న కాలానికి అనుగుణంగా మౌలికవసతుల కల్పన విషయంలో ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌ అంధకారంగా మారుతుంది. ఇప్పటికే వాతావరణంలో వచ్చిన మార్పులు అతివృష్టి, అనావృష్టి కారణంగా ఆహార ఉత్పత్తులు తగ్గిపోయిన విషయాన్ని ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • డాక్టర్‌ ఆదిరెడ్డి

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/