ఆర్‌సిఇపి ఒప్పందంపై వ్యతిరేకత

Opposition to the RCEP agreement

ప్రాంతీయసమగ్ర ఆర్థిక భాగస్వా మ్యం (ఆర్‌సిఇపి) ఒప్పంద చర్చల నుండి భారతదేశం బయట కురావాలి. ఈ ఒప్పందంలో రాష్ట్రా ల హక్కులను హరించే షరతులు ఉన్నాయి. కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర శ్రామి కులు ఉపాధిని కోల్పోతారు. పాల ఉత్పత్తిదారులైన రైతులు, తోట పండించే రైతులు పేద రైతాంగ ప్రయోజనాలను గాలికొదిలేసి కేంద్రం ఈ ఒప్పందాన్ని అంగీకరించేందుకు తయారైంది. ఈ చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఏవో కొన్ని ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఏషియాన్‌ స్వేచ్ఛావాణిజ్య ఒప్పంద చర్చలకు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన సూత్ర ధారి. ఈ ఒప్పందాన్ని ఆటోమొబైల్‌ (కార్లు, స్కూటర్లు తదితరలు) బట్టల పరిశ్రమదారులు, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలు వ్యతిరేకిస్తున్నాయి.

వామపక్ష కేరళ శాసనసభే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానించింది. తెలంగాణ రాష్ట్రానికి తీవ్రనష్టం కలిగించే ఈ ఒప్పందాల పట్ల టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరసించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.భారతదేశంలో దాదాపు 10కోట్ల మంది రైతులు పాడి ఉత్పత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరితో పేదరైతులే ఎక్కువ.

భూమిలేని నిరుపేద సాగు రైతుల జీవనానికి కూడా పాడి ఉత్పత్తులు చాలా ముఖ్యం. ఆర్‌సిఇపి ఒప్పందం వల్ల సంక్షోభంలో ఉన్న భారత రైతుల పాడి ఉత్పత్తు లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల పాల ఉత్పత్తుల దిగుమతులతో పోటీపడాల్సి వస్తుంది. ఈ రెండు దేశాలు తమ దేశంలో అధిక ఉత్పత్తి అవ్ఞతున్న పాలను అతిపెద్ద పాలమార్కెట్‌ గల భారత దేశానికి ఎగుమతి చేసి పెద్ద ఎత్తున లాభాల్ని పొందటానికి వేచి చూస్తున్నారు. న్యూజిలాండ్‌ దేశం తాము ఉత్పత్తి చేస్తున్న పాల పొడిలో 93.4 శాతం, వెన్న 94.5 శాతం, చీజ్‌(పన్నీర్‌)లో 83.6 శాతం ఎగుమతి చేస్తున్నాయి. పాలపొడిపై ఇప్పుడు దిగుమతి సుంకం 60 శాతం, వెన్నపై 40 శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తే ఈ దేశాల పాల ఉత్పత్తులు దిగుమతి అయితే మన చిన్నపాడి ఉత్పత్తిదారుల జీవితాలను విచ్ఛిన్నం చేస్తాయి. వీరు జీవనాధారం కోల్పోతారు.

పాలవెల్లువ ద్వారా సాధించిన పాడి పరిశ్రమఅభివృద్ధిని ఆర్‌సిఇసి ఒప్పందం వల్ల కోల్పోవలసి వస్తోంది. దేశంలో వివిధ పంటల ఆధారంగా కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు జీవిస్తున్నారు. భారత దేశంలో దాదాపు 20 లక్షల హెక్టార్లతో తోటలు పెంచబడుతున్నా యి. ఇవికాక నూనెగింజల పంటలు మరో 250 లక్షల హెక్టార్ల లో పెంచబడుతున్నాయి. వీటికితోడు 21లక్షల హెక్టార్లలో కొబ్బరి చెట్లు పెంచబడుతున్నాయి. అంతేకాక వేరుశనగ, ఆయిల్‌పామ్‌, ఆవాలు, పొద్దుతిరుగుడు, సోయాబిన్‌ తదితర నూనెగింజల ఉత్ప త్తిదారులు కూడా ఆర్‌సిఐసి ఒప్పందం వల్ల భారీగా నష్టపోవాల్సి వస్తుంది. చౌక పామాయిల్‌ దిగుమతులతో వేరుశనగ, సోయా చిక్కుడు రైతుల దుస్థితి మన కళ్లకు కనిపిస్తూనే ఉంది.

భారత్‌, శ్రీలంక స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంజరిగిన డిసెంబర్‌ 1998నుండి (ఇది మార్చి2000 నుండి అమలులోకి వచ్చింది)కేరళలోని తోటల రంగంలో రైతులు, కార్మికులు భారీగా నష్టపోతున్నారు. టీ పౌడ రు, మిరియాలు, (సుగంధద్రవ్యాలు) కాఫీ, రబ్బరు, యాలుకలు, కొబ్బరి, తదితరఉత్పత్తుల రైతులు భారీగానష్టపోయి రుణఊబిలో పడి ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ పంటల ఉత్పత్తులన్నీ అసమాన అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీని ఎదు ర్కోవాల్సివచ్చింది. ఈ దుష్ఫలితాలు కళ్లకు కనిపిస్తున్నప్పటికీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉన్న బిజెపి 2009లో ఈ ఒప్పందాన్ని చేసుకుంది.తద్వారా భారతదేశంలోకి చౌకతోట ఉత్పత్తులు,సుగంధద్రవ్యాలు, నూనెగింజలు, ఇండోనేషియా, వియత్నాం,మలేషియా థాయిలాండ్‌ తదితర దేశాల ఉత్పత్తులకు పెద్దఎత్తున దిగుమతులు జరుగుతున్నాయి. ఇవి రైతులకు మరణ శాసనంగా మారుతున్నాయి.

ఆదాయం తగ్గించే కాలంలోనే ఉపాధి కోల్పోయి నిరుద్యోగం పెంచే నిర్ణయాలు, నెమ్మదించిన భారత ఆర్థికాభివృద్ధి సమయంలోనే చేసుకునే ఆర్‌సిఇపి ఒప్పందం దుష్ఫ లితాలు ఊహకు అందని విధంగా దిగజారుతాయి.బిస్కెట్లు, మోటారు కార్ల అంతర్గతఅలంకరణ సామగ్రి మరింతగా కుంగి పోతాయి. కంపెనీలు, దుకాణాలను బంద్‌చేయడమో లేదా ఉద్యో గుల్ని తీసివేయడమో జరుగుతుంది.ఆర్‌సిఇపి దేశాలతోపెద్దఎత్తున వాణిజ్యలోటున్న సమయంలో ఆర్‌సిఇపి స్వేచ్ఛా ఒప్పందానికి సంతకం అంటే భారత ప్రజల సామాజిక, ఆర్థికస్థితిగతులను మరింతగా క్షీణింప చేసేందుకు అంగీకరించడమే. ఈ ఒప్పందం ఉద్యోగకల్పనకు ఎలా తోడ్పడుతుందో వివరించాలి.

మూడ్‌శోభన్‌, (రచయిత: తెలంగాణ రైతు సంఘం రాష్ట్రనాయకులు)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/