ఆన్‌లైన్‌ గేమ్స్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువత

Online Games
Online Games

ఆ న్‌లైన్‌ గేమ్స్‌వల్ల కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటు న్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ప్రజల జీవితాలతో చెలగాట మాడటమే కాక, మరికొన్ని సందర్భాల్లో కాపురాలు కూలుస్తున్నా యి. వాటికి అలవాటుపడుతున్న జనాలు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ వ్యామోహంలో పడి తమను తాము మరిచిపోతున్నారు. తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు కుర్రకారే కాదు మధ్య వయస్కులు కూడా బానిసలు అవ్ఞతుం డడం గమనించవచ్చు. ఆన్‌లైన్‌ జూదం పలు కుటుంబాలలో విషాదం నింపుతున్నాయి. ఆన్‌లైన్‌ జూదానికి అలవాటుపడి ఆస్తులను కూడా అమ్ముకుంటున్నారు. వీటన్నింటికి మూలం మన చేతుల్లో ఉన్న స్మార్ట్‌ఫోన్లు. అంతేకాక చౌకగా లభిస్తున్న మొబైల్‌ ఇంటర్నెట్‌. దీని ద్వారా ఆన్‌లైను జూదానికి, గేములకు బాని సలుగా మారటమే కాక మానసికంగా కృంగిపోతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఏదో సరదా కోసమని, కాలయాపన కోసమని ఖాళీ సమయాల్లో వాటితో కుస్తీపడుతూ చివరకు ఫుల్‌టైమ్‌గా ఆడేస్తున్నారు. సమయ, సందర్భాలు లేకుండా ఆన్‌లైన్‌ గేమ్స్‌ జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇటీవల పెళ్లిపీటల మీద ఓ వరుడు పబ్జీ ఆడుతూ వచ్చిన అతిధులను కూడా పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఏదైనా మితంగా ఉంటే మంచిదే కానీ బానిస అయితే మాత్రం కష్టం. ఇది జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. అదే ధ్యాసగా గేమ్స్‌ ఆడుతున్న వాళ్లల్లో నరాలు బలహీనవ్ఞతున్నా యి. అంతేకాదు మానసిక ప్రవర్తనలో మార్పు వస్తోంది. పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్న సందర్భాలు అనేకం కనబడుతున్నాయి. క్షణకాలం ఫోన్‌ చేతిలో లేకుండా ఉంటే ఏదో పోగొట్టుకున్న వారిలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అందరూ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆన్‌ లైన్‌ జూదం పట్ల జాగ్రత్త పాటించాలి. జీవితాన్ని మధురాను భూతులతో ఆస్వాధించాలే కానీ పిచ్చిపిచ్చి ఆన్‌లైన్‌ గేమ్స్‌తో సమయాన్ని వృధా చేసుకోకూడదు. అంతేకాక ఆన్‌లైన్‌ జూదాలకు ఆన్‌లైన్‌ గేములకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోకూడదు. ప్రభుత్వాలు ఈ ఆన్‌లైన్‌ జూదాలను, గేమ్స్‌లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • ఎ. భారతి