అణువిద్యుత్‌ కేంద్రాలను రద్దుచేయాలి

Nucllear power plant

నల్లమల అడవుల్లోని టైగర్‌ రిజర్వుఫారెస్టులో నాలుగువేల భారీబోర్లు వేసి 21వేల ఎకరాల భూమిలో నమూనాల సేకరణకు కేంద్ర అణుశక్తి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అమ్రాబాద్‌ పులుల రిజర్వుఫారెస్టులో 83 కిలోమీటర్ల విస్తీర్ణం లో యురేనియం నిల్వలు కొనుగొనేందుకు అనుమతించాలని కేంద్ర అణుశక్తి సంస్థ ఇటీవల తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖను కోరింది. యురేనియం నిక్షేపాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికంగా ఉన్నట్లు ఆటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది. కొన్నేళ్ల క్రితమే అన్వేషణ చేసి యురేనియం నిల్వలు ఉన్నట్లు తెలియచేసింది.

నాణ్యమైన యురేనియం నిల్వలు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టులో ఉన్నట్లు కేంద్ర అణుశక్తి సంస్థ 2016కు ముందే దరఖాస్తు చేసింది. యురేనియం నిల్వల నమూనాల సేకరణకే నాలుగువేల బోర్లు టైగరు రిజర్వు ఫారెస్టులో వేయాలనడం న్యాయంకాదు. పవన, సౌర విద్యుతు వంటి చౌక విద్యుత్‌ను తయారు చేస్తుంటే ఖరీదైన అణువిద్యుత్‌ను భారత్‌ ప్రత్యేకంగా ఉత్పత్తి చేయడం శోచ నీయం. దేశవ్యాప్తంగా యురేనియం తవ్వకాలు, యూరేనియం శుద్ధి చేపట్టాలంటే స్థానిక ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. దేశానికి విద్యుత్‌ అవసరాలు పెరు గుతున్నాయని మనుషుల జీవితాలను, పశువ్ఞలు, జంతు వ్ఞలు, పక్షులు ఇతరజీవరాశులను పణంగా పెట్టి అత్యంత ప్రమాదకరమైన అణువిద్యుత్‌ కోసం ప్రయత్నించడం సమంజ సంకాదు. అణువిద్యుత్‌ కేంద్రాల కింద భూభాగంలో భూకంపాలు వస్తే అన్ని రాష్ట్రాలు సర్వనాశనం అవ్ఞతాయి. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ యూరేనియం నిల్వల తవ్వకాలను వెంటనే ఆపివేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు యురేనియం తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయకూడదు. ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దు.

  • పి.గంగునాయుడు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/