వ్యర్థాల నియంత్రణలో నిర్లక్ష్యం

ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను అత్యధికంగా వినియోగించే కంపెనీల పాత్రను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ నియమాలు రూపొందించినా పర్యవేక్షణా లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఈ వ్యర్థాల సేకరణ నేటికీ అసంఘటిత రంగంలోనే ఎక్కువగా జరుగుతోంది. దీనితో ఆ రంగంలో పాలుపంచుకునే కార్మికుల ఆరోగ్యభద్రత గాలిలో దీపంగా మారింది. సురక్షితం కాని పద్ధతులు, ప్రక్రియల్లో పాలుపంచుకుంటూ వ్యర్థాల ద్వారా వచ్చే పదార్థాల ప్రభావానికి లోనయ్యి దీర్ఘకాలిక జబ్బులతో సతమతమవ్ఞతున్నారు.

E-Waste

భారతదేశ ఆర్థికాభివృద్ధిలో మందగమనం కారణంగా నేడు అత్యధిక భాగం నగరాలు, మహానగరాలు కనీస సౌక ర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆర్థిక అసమానతలు గ్రామాల్లో కంటే ప్రస్తుతం పట్టణాల్లో కొట్టొచ్చినట్లు కనపడటం దేశ ప్రగతికి ఏమాత్రం మంచిదికాదు. నేడు మహానగరాలనే కాక నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికా రులు, ప్రజాప్రతినిధుల అవినీతి పెచ్చరిల్లి సుసంపన్నంగా ఉండా ల్సినటువంటి పట్టణాలు మురికివాడలుగా రూపాంతరం చెందుతు న్నాయి. ప్రకృతి ధర్మాలను విస్మరించి అమలుపరుస్తున్న విధ్వంస కర అభివృద్ధి విధానాల ఫలితంగా ఎదురవ్ఞతున్నటువంటి సమ స్యలను మనం నిరంతరం చూస్తూనే ఉన్నాయి.

పర్యావరణ సం రక్షణ అనేది తరతరాలుగా భారతీయుల జీవన విధానంలో భాగం గా ఉండేది. పూర్వకాలం నుండి వచ్చిన జ్ఞానసంపదను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఉత్పన్నమవ్ఞతున్నటువంటి దుష్ఫలితాలను రూపుమాపాలంటే మన విధానాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంది. వాతావరణ మార్పుల కారణంగా నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటుకు లోనయ్యే వీలుందని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

మరీ ముఖ్యంగా మహానగరాలపైన దీని ప్రభావం అధికంగా ఉంటుందని తేల్చడం రానున్న సవాళ్లకు హెచ్చరికగా తీసుకోవాల్సి ఉంది. నేడు పర్యావరణ సమతుల్యం దెబ్బతిని అనేక విపత్తులు ఎదుర్కొంటున్న ప్రజానీకానికి ప్రధాని మోడీ ప్రకృతితో మమేకం అవ్వడం ద్వారానే 21శతాబ్ధి సవాళ్లను ఎదుర్కొంటామని చెప్పడం శుభపరిణామం.

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడంతోపాటుగా, సేకరణ, పునఃశుద్ధి, పునర్‌ వినియోగం వంటి వాటికి నూతన ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపు నివ్వడం ద్వారా హద్దుఅదుపు లేకుండా పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వినియోగంపై దృష్టి కేంద్రీకృతమైంది. అధిక సాంద్రత కలిగిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేపడుతున్నా ఆధునిక జీవన విధానం లో భాగంగా ముఖ్యంగా నగరాల్లో పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ సంచుల ను కట్టడి చేయడానికి దీర్ఘకాలిక కార్యాచరణతో ముందుకు నడవాల్సి ఉంది.

అరిటాకులు మాని ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులు, సీసాల వినియోగం మూలంగా ఇటు పర్యావరణానికే కాక ప్రజలఆరోగ్యం సైతం ప్రమాదంలో పడింది. పెరిగిపోతున్న ఎలక్ట్రానిక్‌,ఎలక్ట్రిక్‌ వ్యర్థాలపై కూడా ప్రభుత్వాలు తగు దృష్టి పెట్టే సమయం ఆసన్న మైంది. వాడిపడేసిన చరవాణులు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు వంటి గృహోపకరణాలు, కంప్యూటర్‌ వ్యర్థాలు నేడుఅనేక రకాల కాలుష్యానికి కారకులుగా ఉన్నాయి.

పట్టణ ప్రాంతాల నుండే ఈ వ్యర్థాలు పోగుపడుతున్నందున స్థానిక సంస్థలు, ఉత్పత్తిదారులు, వినియోగదారులను సమన్వయపరిచి సమగ్ర కార్యాచరణ దిశగా అడుగులు వేయాల్సిఉంది. వినియోగదారులకు సరైన అవగాహన కొరవడి నేడు రోజువారి గృహవ్యర్థాలతోపాటు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల ను కూడా పడేయటం జరుగుతోంది. 2011 నాటి ఈ-వేస్ట్‌ మేనే జ్‌మెంట్‌ అండ్‌ హ్యాండ్లింగ్‌ రూల్స్‌ప్రకారం అమల్లోకి వచ్చినా తిరిగి తీసుకోవడం, వినియోగదారులు నిరుపయోగంగా మారిన తమ గృహోపకరణాలను ఎవరికి అప్పగించాలో వంటి సమాచా రాన్ని ఆయా ఉత్పత్తి చేసిన సంస్థలు తమ ఉత్పత్తులపై పొందు పరచడం, వ్యర్థసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిఉన్నా అమలు విషయానికి వస్తే తూతూ మంత్రంగా సాగింది.

2016 సవరించిన నియమనిబంధనల ప్రకారం (విస్తృత ఉత్పత్తిదారుల బాధ్యత) సూత్రాలను దృష్టిలో ఉంచుకుంటూ ఉత్పత్తిదారులు వ్యర్థాలకు సంబంధించి వ్యర్థసేకరణ, పునఃశుద్ధి లక్ష్యాలను అమలుపరచడం, వ్యవస్థీకృత ఏర్పాట్లను పటిష్టం చేయడంతో పాటుగా ఉత్పత్తి సంస్థలు గుర్తింపు పొందిన సంస్థల సహకారంతో సేకరణ, నిర్వహణ, పునఃశుద్ధి ప్రక్రియలను సమన్వయంపరచడం వంటి వాటిని అమలు పరచాల్సి ఉన్నా లాభార్జనే ధ్యేయంగా నడిచే వ్యాపార సంస్థలు నామమాత్రంగా అమలుపరుస్తున్నాయి.

ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను అత్యధికంగా వినియోగించే కంపెనీల పాత్రను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ నియమాలు రూపొందించినా పర్యవేక్షణా లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతు న్నాయి. ఈ వ్యర్థాల సేకరణ నేటికీ అసంఘటిత రంగంలోనే ఎక్కువగా జరుగుతోంది. దీనితో ఆ రంగంలో పాలుపంచుకునే కార్మికుల ఆరోగ్యభద్రత గాలిలో దీపంగా మారింది. సురక్షితం కాని పద్ధతులు, ప్రక్రియల్లో పాలుపంచుకుంటూ వ్యర్థాల ద్వారా వచ్చే పదార్థాల ప్రభావానికి లోనయ్యి దీర్ఘకాలిక జబ్బులతో సతమతమవ్ఞతున్నారు.

చెత్త సేకరణ పద్ధతుల్లోని లోపాలను పునఃసమీక్షించుకొని తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడం జరుగుతున్నా నిర్వహణ, సేకరణ విషయాల్లోని డొల్లతనం కార ణంగా అన్నిటినీ కలిపి డంపింగ్‌ చేస్తుండడం వలన సమీప ప్రాం తాల్లో కాలుష్యం పెరిగిపోతుంది. పొడిచెత్త ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వీలున్నా అధిక వ్యయాలు మూలంగా కొన్ని ప్రాంతాలకే ఇది పరిమితమైంది.పాడైపోయిన కూరగాయలను ఇళ్లు, మార్కెట్ల ద్వారా సేకరించి కంపోస్ట్‌గా మార్చి దేశంలోని కొన్ని నగర పాలక సంస్థలు కేజీల లెక్కన అమ్ముతున్నాయి.

పారిశ్రామిక వ్యర్థజలాలు శుద్ధిప్రక్రియకు నోచుకోకుండా నేరుగా దగ్గర్లోని నదుల్లో కలవడం యధేచ్ఛగా సాగిపోతుంది. గంగానది పరీవాహక ప్రాంతాల్లో ఎటువంటి పర్యవేక్షణా ఏర్పాట్లు లేక వ్యర్థజలాలను పరిశ్రమలు నేరుగా గంగానదిలోకి వదులుతుండడం తో నీటి కాలుష్యం పెరిగిపోతున్నది. స్వచ్ఛభారత్‌లో భాగంగా చేసిన అవగాహన కార్యక్రమాల ఫలితంగా నేడు గ్రామీణ ప్రాంతా ల్లోనే కాక నగరాల్లో కూడా పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయాల్లో ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పుస్పష్టంగా కనబడుతోంది. మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటుగా వాటికి నిరంతర నీటి సర ఫరా విషయమై కొత్త ఇబ్బందులు ఎదురవ్ఞతున్నాయి.

హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఏళ్ల నాటి డ్రైనేజీ వ్యవస్థ పెరిగిపోతున్న డిమాండ్‌ను అందుకోలేక రోడ్లపై కాల్వల్లా పారుతున్న వ్యర్థజలా లతో అనేక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నగరానికి ఆనుకుని ఉన్న అనేక నగర పాలక సంస్థల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో కార్మికులను నియమించుకుంటూ పోతుం డడంతో జవాబుదారీతనం కుంటుపడింది. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా కార్మికుల సంఖ్యను వాస్తవానికి ఎక్కువగా చూపి బిల్లులు ఎగరేసుకుపోవడం పరిపాటిగా మారింది. తత్ఫలితంగా వర్షాకాలం నాటికి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విలయతాండవం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

కాయకష్ట చేసి నగరాల్లో దినసరి కూలీలుగా జీవిస్తున్నవారు ఆరోగ్య ఖర్చుల మూలంగానే పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. పెద్దనగ రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఆస్పత్రుల్లో పరిశుభ్రత లోపించి వ్యాధులు ప్రబలుతున్నా యి. నగరాల్లోని ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రక్షాళించడం తక్షణ అవసరంగా మారింది.

హెల్త్‌, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్ల నిర్లక్ష్యం కారణంగా నేడు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజల ఆరోగ్యం దెబ్బతింటూ వారు అనేక పనిదినాలను కోల్పోవలసి వస్తుంది. గ్రామీణ ప్రజానీకంతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ఆరోగ్య అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న సుమారురెండు కోట్ల పట్టణ పేద కుటుంబాలకి ఆరోగ్య భద్రత కల్పించినట్లయింది. వ్యాధిగ్రస్థ భారత్‌ను ఆరోగ్యభారత్‌గా మార్చాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. నూతన ఆస్పత్రుల ఏర్పాటుతో పాటుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులను ఈ పథకంలో భాగం చేయడం జరుగుతుంది.

  • సముద్రాల వంశీకృష్ణ

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/