ప్రకృతి దోషం కాదు, మనిషి చేస్తున్న ద్రోహం

ఒక్కమాట
(ప్రతి శనివారం)

Monsoon

ప్రకృతితోపాటు ప్రభుత్వాలు కూడా ప్రజానీకంతో ఆడుతున్న నాటకాల దుష్ఫలితం ఇదని చెప్పొచ్చు. మైనం ముద్దలాగా వేడి సెగ తగలగానే కరిగిపోయినట్లు తడితగలగానే చెరువ్ఞ కట్టలు తెగిపోవడం, రోడ్లు కొట్టుకుపోవడం, మనిషికి మనిషి చేస్తున్న ద్రోహం. నీటి వనరుల నిర్వహణ రానురాను అధ్వాన్నంగా మారిపోతున్నది. రాష్ట్రరాజధాని నగరంలో ఉన్న చిన్ననీటి వనరులు సగానికిపైగా అదృశ్యమైపోయాయి. ఎవరు ఎక్కడ ఆక్రమించుకుంటున్నా, కుంటలకు తెల్లవారేసరికి గండ్లు పెడుతున్నా ప్రభుత్వమే చూసుకుంటుందనుకుంటున్నారు తప్ప పౌరులెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కుంటలు, చెరువ్ఞలకు గండ్లుపడి గ్రామాలకు గ్రామాలను ముంచుతున్నా చూసేందుకు వాట్సాప్‌లో రికార్డు చేసేందుకు ఉత్సాహపడుతున్నారే తప్ప నీటిలో మునిగిన ఇండ్లల్లో ఉన్నవారికి చేయూతనిచ్చేందుకు ఎవరూ ముందుకురావడం లేదు.

,గుక్కెడు మంచినీటి కోసం ఆకాశం వైపు చూస్తున్న ప్రజానీకాన్ని ప్రకృతి వరదలతో ముంచెత్తి వేస్తున్నది. ఇటీవల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో వరుణ దేవ్ఞడు విరుచుకుపడుతుండడంతో అనేక కుటుంబాలు నిరాశ్రయు లయ్యాయి. కోట్లాది రూపాయల విలువ చేసే పంటలు దెబ్బతి న్నాయి. కృష్ణా,గోదావరిలతో పాటు చిన్ననదులు కూడా పొంగి పొర్లడంతో ఇటు తెలంగాణాలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనే కాక ఎగువనున్న కర్ణాటక,మహారాష్ట్రాల్లో అనేక గ్రామాలు, నగరాలు జలమయ్యమయ్యాయి.గురువారం కురిసిన కుండపోతవాన పుణె నగరాన్ని అతలాకుతలం చేసింది. యధాప్రకారం తెలంగాణా రాష్ట్రరాజధాని నగర ప్రజలపై కూడా వానదేవ్ఞడు తనప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో గత రెండు మూడు నెలల వరకు నీటితడి ఎరుగక బీటలువారిన చెరువ్ఞలు రాత్రికిరాత్రే నిండి పొర్లి గట్టుతెగి కాలనీలకు, కాలనీలనే ముంచె ెత్తాయి. కోట్లాది రూపాయల విలువచేసే రహదారులు దెబ్బతిన్నా యి. మొత్తం మీద నగరంలో జనజీవనం స్తంభించిందనే చెప్పొ చ్చు.తెలంగాణ జిల్లాల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో చిన్ననీటి వనరులకు గండ్లుపడినట్లు సమాచారం.

ప్రకృతితోపాటు ప్రభుత్వాలు కూడా ప్రజానీకంతో ఆడుతున్న నాటకాల దుష్ఫలితం ఇదని చెప్పొచ్చు. మైనం ముద్దలాగా వేడి సెగ తగలగానే కరిగిపోయినట్లు తడి తగలగానే చెరువ్ఞ కట్టలు తెగిపోవడం, రోడ్లు కొట్టుకుపోవడం, మనిషికి మనిషి చేస్తున్న ద్రోహం.నీటి వనరుల నిర్వహణ రాను రాను అధ్వాన్నంగా మారి పోతున్నది. రాష్ట్రరాజధాని నగరంలో ఉన్న చిన్ననీటి వనరులు సగానికిపైగా అదృశ్యమైపోయాయి. ఎవరు ఎక్కడ ఆక్రమించుకుంటున్నా, కుంటలకు తెల్లవారేసరికి గండ్లు పెడుతున్నా, ప్రభుత్వమే చూసుకుంటుందనుకుంటున్నారు తప్ప పౌరులెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

Monsoon

కుంటలు, చెరువ్ఞలకు గండ్లుపడి గ్రామాలకు గ్రామాలను ముంచు తున్నా చూసేందుకు, వాట్సాప్‌లో రికార్డు చేసేందుకు ఉత్సాహ పడుతున్నారే తప్ప నీటిలో మునిగిన ఇండ్లల్లో ఉన్నవారికి చేయూతనిచ్చేందుకు ఎవరూ ముందుకురావడంలేదు. గ్రామాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగాలేదు.గతంలో వరదలు ఎక్కువై నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకున్నప్పుడు ఎప్పటికప్పుడు పరి శీలిస్తే ‘నీరడికాడు అనే అట్టడుగుస్థాయి ఉద్యోగి ప్రజలను, ప్రభు త్వాన్ని అప్రమత్తం చేసేవాడు. ఆ హెచ్చరిక ఆధారంగా,తూముల ద్వారానో, మత్తడి (అలుగు) స్థాయిని తగ్గించి ఒక క్రమపద్ధతిలో నీటిని బయటకు పంపేందు కు ఏర్పాటు చేసి చెరువ్ఞను దక్కిం చుకునేవారు. ఇలాంటి సంఘటన ఒకటి నేను వరంగల్‌ జిల్లాలో వర్ధన్నపేటలో ఉండగా 1976 ప్రాంతంలో జరిగింది. ఆ రోజు వాస్తవంగా గ్రామంలో పెద్దగా వర్షం లేదు. మామూలు జల్లులు పడుతున్నాయి.అర్థరాత్రి నా మిత్రుడు మోహన్‌రావ్ఞ వచ్చి చెరువ్ఞ దగ్గర ప్రమాదం ఉందని, ఈ విషయం నీరడికాడు వచ్చి పట్వా రీకి చెప్పాడని, ఆయన హుటాహుటిగా రైతులతోకలిసి చెరువ్ఞ కట్టవద్దకు వెళ్తున్నట్లు చెప్పాడు.ఆ విషయం నాకు నమ్మశక్యం కాలేదు. అంతగా పెద్దగా వర్షాలు లేవ్ఞ కదా! రోడ్లల్లో నీరు కూడా సరిగ్గారాలేదు. అయినా ఈ అర్థరాత్రి చెరువ్ఞకట్ట వద్దకు వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించాను.నా ప్రశ్నకు జవాబుచెప్పే పరిస్థితిలోఆయన లేరు. సాధ్యమైనం త త్వరగా వీలైనంత ఎక్కువ మందికి సమా చారం అందించి వారిని తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. నాకు ఆ రాత్రి వెళ్లడం ఇష్టంలేకపోయినా అందరి ఆతృత,ఆందోళన చూసి వెళ్లకపోతే బాగుండదనే అభిప్రాయంతో వారివెంట అర్థ రాత్రి చెరువ్ఞ కట్టకు చేరుకున్నాను.అక్కడ అప్పటికే ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఏ పరిస్థితుల్లోనూ కట్ట తెగకుండా కాపాడుకోవాలనే ఏకైక ధ్యేయంతో వారంతా పోరాడుతున్నారు.

గడ్డిమోపులు తెచ్చివేసే వారు కొందరు అయితే, అక్కడున్న చెట్లు కొట్టి అడ్డంవేసి దానిపై మరికొందరు మట్టిపోస్తున్నారు.ఇంకొందరు మత్తడివైపు వెళ్లి రాళ్లు తొలగించి మట్టాన్ని తగ్గిస్తున్నారు.ఇందులో చిన్నాపెద్ద అని లేదు.ఎవరికి తోచిన విధంగా వారు మట్టాన్ని తగ్గించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతంలో అది పెద్ద చెరువ్ఞ, రెండువేల ఎకరాల వరకు రెండు పంటలకు నీరందించగలిగిన నీటి సామర్థ్యనిల్వ ఉన్న పురాతన చెరువ్ఞ అది.ఆ చెరువ్ఞకు గండిపడితే కోట్లాదిరూపాయలపంటలు పోవడమేకాకుండా కింది ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు ఆ కింద ఉన్న అనేక చెరువ్ఞల్లోకి ఈ నీరు ప్రవేశించి ఆ చెరువ్ఞ కట్టలను కూడా తెంచివేస్తుంది. వేలాది ఎకరాల పంటభూములు కోతకు గురికికావడం, ఇసుకమేటలు వేయడంతో బీడుభూములుగా మారి పోతాయి. ఈ కారణాలే తెల్లవారే వరకు నిర్విరామంగా ఆ గ్రామ స్తులను ప్రకృతితోపోరాటానికి పురికొల్పాయి.

ఎట్టకేలకు వారు లక్ష్యాన్ని సాధించారు.ప్రాణాలకు తెగించి వారు చేసిన పోరాటానికి ప్రకృతికూడా తలవంచింది. ఉదయం ప్రభుత్వ అధికారులు వచ్చి ఇసుక బస్తాలు వేసి మరింత భద్రత కల్పించారు. ఆ రాత్రి అంత పెద్దసంఖ్యలో గ్రామస్తులు అక్కడికి వెళ్లకపోతే ఖచ్చితంగా చెరువ్ఞ దక్కేది కాదు. చెరువ్ఞ పరిస్థితి అర్థరాత్రి ఎందుకు చెప్పాలి. ఉద యం చెప్పొచ్చు కదా ఈ నీరడికాడు అనుకున్నా పరిస్థితి చేయి దాటిపోయేది. ఇక్కడ నాకు ఒక అనుమానం వచ్చింది. నీరడికాడు ఇంజినీరింగ్‌ చదవలేదు. సాంకేతిక పరిజ్ఞానం అంతకన్నా లేదు. కనీసం చదవడం, రాయడం కూడా సరిగ్గారాదు. ముందుగా చెప్పినట్లు ఆ రోజు పెద్దగా వర్షం కూడా లేదు. చెరువ్ఞ పరిస్థితి ఎలా ఊహించగలిగాడు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ చెరువ్ఞ కట్టవద్దకు ఎందుకు అర్థరాత్రి వెళ్లాడు? తదితర ప్రశ్నలు నన్నువేధించాయి. రెండు రోజుల తర్వాత ఆ నీరడికాడు వద్దకు వెళ్లి విషయాన్ని ప్రస్తావించాను. బాధ్యత, కామన్‌సెన్స్‌ ఆలా చేయించగలిగాయని తెలుసుకొని విస్తుపోయాను. వర్షాకాలం కావడంతో వచ్చిపోయే గ్రామస్తుల నుంచి పైన ఉన్న చెరువ్ఞల్లో నీటి మట్టాన్ని గురించి తెలుసుకుంటున్నాడు. పై ప్రాంతాల్లో బాగా వర్షాలు పడటంతో అలుగులు పారుతున్నాయని, నీరు వదిలిపెడుతున్నారని తెలియగానే ఆ నీరు తమ చెరువ్ఞల్లోకి ప్రవేశిస్తుందని తెలుసు కనుక వర్షపు జల్లును లెక్కచేయకుండా ఆ రాత్రి చెరువ్ఞకట్టవద్ద కాపలాకాస్తున్నారు.

కొండగుర్తుల ద్వారా నీటిస్థాయిని గుర్తించే అనుభవం ఉన్న ఆయన రాత్రి తొమ్మిది గంటలకు క్రమేపీ పెరిగిపోతున్న నీటి మట్టాన్ని గమనించాడు. చెరువ్ఞ నిండడం, ఒకటి రెండు ప్రాంతాల్లో నీటి అలలు కట్టను దాటి బయటపడుతున్నాయి. చేయిదాటిపోతుందని గ్రహించి వెంటనే గ్రామానికి పరుగెత్తికెళ్లి విషయాన్ని చేరవేశాడు. అప్రమ త్తమైన ప్రజలు రక్షించుకున్నారు. చెరువ్ఞ ప్రమాదంలో ఉందని పోయి కాపాడమని ఏ నేతలు, అధికారులు ఆదేశించలేదు. ఆ చెరువ్ఞ తమది. ఆ చెరువ్ఞ ఆధారంగా వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయనే స్పృహ వారిని పరిగెత్తించేలా చేశాయి.

కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఎవరూ పట్టించుకునేవారు లేరు. చెరువ్ఞలు తెగినా, కుంటలు తెగినా, తమ ఇళ్లను నీళ్లు ముంచుతాయని తెలిసినా అదంతా పాలకుల బాధ్యతేనని, ప్రభు త్వమే చేసుకుంటుందనే భావన పెరిగిపోతున్నది. తమ కాలనీలో ఇండ్ల చుట్టూ మోకాల్లో గుంతలు ఏర్పడి మురికి కూపాలుగా మారి దోమలకు ఆవాసులుగా తయారై డెంగ్యూ,మలేరియా లాంటి విషజ్వరాలతోపాటురకరకాల వ్యాధులను వ్యాప్తి చేస్తున్నా, ఆస్పుత్రులకు వెళ్లి చికిత్స కోసం లక్షలాదిరూపాయలు ఖర్చు పెట్టడానికి వెనుకాడరు కానీ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకొనేందుకు ఏమాత్రం చర్యలు తీసుకోరు. పరిశుభ్రత, వాతావరణ కాలుష్యనివారణ లాంటి కార్యక్రమాల్లో ఆయాగ్రామాల ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు పల్లె ప్రగతి,స్వచ్ఛభారత్‌ లాంటి వివిధ కార్యక్రమాల ద్వారా పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటిలో సామాన్యులు స్వచ్ఛందంగా పాల్గొన డం లేదనే చెప్పొచ్చు.

ఇక ఆ విషయాలు అలా వదలి పెడితే ఇప్పటికే ఎగువనున్న రాష్టాల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా ఉన్నాయి. మరొక పక్క వర్షాలు భారీగానే కురుస్తున్నాయి.దీంతో ఆ నీరంతా కిందికే వదలిపెడతారు.ఒక్క శ్రీరాంసాగర్‌ తప్ప మిగిలిన ప్రాజెక్టుల్లో నీరు దాదాపు పూర్తిస్థాయిలో ఉంది. శుక్రవారం రాత్రి వరకు శ్రీరాంసాగర్‌లోకి 70టిఎంసిలకు నీటి మట్టం చేరుకోచ్చునని అంచనా వేస్తున్నారు. వర్షాలు మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.2009లో కృష్ణా,దాని ఉపనది కుందూ ఎంతటి బీభత్సం సృష్టించిందో తెలియంది కాదు. పాలకులు అధికారులు అప్రమత్తంగా ఉండటమేకాక ఆయా ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాల్సిన సమయమిది.

-దామెర్ల సాయిబాబ

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/