మహోన్నత నాయకుడు మోడీ!

‘వార్తల్లోని వ్యక్తి’- ప్రతి సోమవారం

PM MODI
PM MODI

సెప్టెంబర్‌ 17వ తేదీ ప్రధాని మోడీ జన్మదినోత్సవం. నిరాడంబరుడైన మోడీ తన జన్మదినోత్సవాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా జరుపుకున్నారు. వారిది వెనుకబడిన ‘ఘాంచివర్ణం. ఆర్గురి సంతానంలో మూడవ వాడు.ఆయన తండ్రిపేరు దామోదర్‌ మూల్‌చంద్‌. ఆ దంపతుల ఆర్గురి సంతానంలో మోడీ మూడవ వాడు.

చిన్నతనంలో మోడీ వాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద తండ్రి నిర్వహించే ‘టీ దుకాణంలో టీ అమ్మేవాడు. 1967లో ఆయన వాద్‌నగర్‌ పాఠశాలలో విద్యను పూర్తి చేశాడు.ఆయన సగటు విద్యార్థి అని, కాని చర్చాకార్యక్రమా లలో చురుకుగా పాల్గొనేవాడని, నాటక ప్రదర్శనలలో పాల్గొనేవా రని ఉపాధ్యాయులు చెబుతారు.

ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఆయన ప్రదర్శించిన ఆ ఆసక్తి ఆయన ప్రస్తుత రాజకీయాలకు మూలకారణమని, ఆయన ఉపాధ్యాయుడొకరు చెప్పారు. ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఆయనకు ఆర్‌.ఎస్‌.ఎస్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి.

వివాహం

‘ఘాంచీకుల సంప్రదాయానుసారం ఆయనకు బాల్యంలోనే వివాహమైనది. 13 సంవత్సరాల జశోదాబెన్‌ చిమన్‌లాల్‌తో వివాహం జరిగింది. అప్పటికి ఆయనకు 18 సంవత్సరాలు. కాని, ఆయన పర్యాటక జీవితాన్ని సాగించాలని నిర్ణయించు కోవడం వల్ల భార్యతో కొద్దికాలం మాత్రమే సహజీవనం నెరపారు. ఆ చిరకాలంలోనే ఇరువ్ఞరు వైరైపోయారు.

2002లో రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో దాఖలు చేసిన పత్రాలలో తన వైవాహిక జీవితాన్ని గురించి తాను ఒంటరినని పేర్కొన్నారు. అందువల్ల, తాను అవినీతికి పాల్పడే అవకాశం లేదని చెప్పారు. అయితే 2014లో లోక్‌సభ ఎన్నికలలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తాను జశోదాబెన్‌కు జీవిత భాగస్వామినని పేర్కొన్నారు.

తిరిగి ‘టీ’ కొట్టు

ఆయన ఆ తరువాత వివిధ ఆశ్రమాలు సందర్శించి దేశ పర్యటన చేశారు.చివరికి అహమ్మదాబాద్‌ వచ్చి, తన పినతండ్రి నిర్వ హించే టీకొట్టులో పనిచేశాడు. కొంతకాలం గుజరాత్‌ రాష్ట్ర రోడ్‌రవాణ కార్పొరేషన్‌లో పనిచేశారు. ఆ తర్వాత ఆర్‌.ఎస్‌.ఎస్‌లో పనిచేసిన తర్వాత ఆయనకు గుజరాత్‌ రాష్ట్ర విద్యాపరిషత్‌ నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ఆ హోదాలో ఆయన ఎమర్జెన్సీ కాలంలో ఆందోళనోద్యమాలు నిర్వహించారు.

1978లో మోడీ ఢిల్లీ విద్యాలయం దూరవిద్యావిధానం ద్వారా రాజనీతిశాస్త్రంలో పట్టభద్రులైనారు. 1983లో ఆర్‌.ఎస్‌.ఎస్‌లో ప్రచారక్‌గా కొనసాగుతూనే గుజరాత్‌ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతిశాస్త్రంలో ‘మాస్టర్స్‌ డిగ్రీ సాధించారు.

మారువేషాలలో మోడీ

1975లో ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు మోడీ గుజరాత్‌లో మారువేషాలలో పోలీసులకు దొరుక్కుండా తిరిగారు. జయప్రకాశ్‌నారాయణ్‌ నాయకత్వంలో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.

1985లో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఆయనను భారతీయ జనతా పార్టీలో ప్రవేశపెట్టింది. 1991లో బిజెపి నాయకుడు మురళీమనోహర్‌జోషి తలపెట్టిన ‘కన్యాకుమారి-శ్రీనగర్‌ ఐక్యతాయాత్రలో ప్రముఖపాత్ర నిర్వహించిన మోడీకి చాలా మంచి పేరు వచ్చింది. దానితో ఆయనకు ప్రధాన రాజకీయ స్రవంతిలో ప్రముఖపాత్ర లభించింది. 1995లో గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయంలో ఆయన ప్రముఖపాత్ర వహించారు.

ఇక ఆయన అంచెలంచెలుగా ఎదగసాగారు. 1986లో మోడీ భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికవటంతో ఢిల్లీకి బదిలీ అయ్యారు. అక్కడి నుంచి మోడీ వెనుదిరిగి చూడలేదు. 1991లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మూడుసార్లు ఎన్నికైనారు.

ఆ పదవిలో తిరుగులేని పేరు సంపాదించారు. అప్పటిలో 2014లో ప్రధాని పదవికి ఎల్‌.కె. అద్వానీ కాగలరని భావించారు. కానీ మోడీకి ఎదురులేకపోయింది.

ఆయన ధాటికి అప్పుడు ఏ పార్టీ ఎదురురాలేకపోయింది! అది మోడీ ప్రస్థానం ఆయన వయస్సు 70 సంవత్సరాలు.

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబరావు, (‘పద్మశ్రీ’అవార్డు గ్రహీత)

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/