జవాబుదారీతనమే నాయకత్వ లక్షణం

Leadership qualities
Leadership qualities


నా యకుడు పరిపాలనాదక్షుడు అయి ఉండాలి. ప్రజలని ప్రభావితం చేయగలగాలి. ప్రజలను సన్మార్గంలో నడపగలగాలి. నాయకులు అంటే తనతో నడిచేవారిని మంచి పనులు చేయడానికి ప్రభావితం చేయడం, మంచి మనుషులుగా జీవించేలా చేయడం, కష్టపడి పనిచేసి తమ గమ్యాన్ని చేరేలా ఉత్తేజపరచడం చేయాలి. ఎంతటి కష్టమొచ్చినా ప్రతి ఒక్కరికీ ‘తానున్నాననే భరోసా ఇవ్వగలిగిన సత్తా ఉన్నవాడు అసలయిన నాయకుడవ్ఞతాడు. నిస్వార్థపరుడై ప్రజానాయకుడవ్ఞతాడు. జకీయాల్లోకి రావడం గొప్పకాదు. కలకాలం నిలబెట్టుకోవడంలోనే ఉంది గొప్పతనం అంతా. అది ప్రజల గుండెలోతుల్లో చిరస్థాయిగా నిలవగలిగే పనులు చేసినప్పుడే సాధ్యపడుతుంది. భారతదేశంలో 70 శాతంపైగా వ్యవసాయంపై ఆధారపడ్డవారే. అలాంటి రంగం నేడు ఎలా ఉంది? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే పాలకుల వైఫల్యం కాదా? జపాన్‌, జర్మనీ వంటి దేశాల్ని చూస్తే అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లిపోతున్నాయి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపే ప్రజాప్రతినిధులు మనకునేడు అవసరం. ఇప్పటివరకు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే భారత్‌ను చెప్పుకోవాల్సిన దుస్థితిలో మనం ఉన్నాం. అందుకే మనకు సరైన నాయకత్వం అవసరం. ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతోపాటు లబ్ధిదారులకు చేరుతున్నాయా అనే సమీక్ష జరపాలి. అవకాశవాదం, అధికార వ్యామోహంతో సంపాదనే పరమావధిగా ఉండే నాయకులు వద్దు. నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజల బాగుకోసం పాటుపడే నాయకులు కావాలి. ప్రజాసంక్షేం పథకాలను బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంతో పక్కదోవపట్టించే నాయకులు కాకుండా అర్హులందరికి అభివృద్ధి ఫలాలు అందించే నాయకులు అవసరం. పదవిపై ఏమాత్రం వ్యామోహం లేకుండా నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వాడే ప్రజానాయకుడవ్ఞతాడు.

అటువంటి మార్పును తెచ్చే నాయకుడు రావాలి. సమాజంలో పేద, ధనిక, కుల, మత, విద్వేషాలు ఉన్నాయంటే అది పాలకులు తమ స్వార్థానికి సృష్టించినవే. ప్రజాభీష్ట పాలన అంటే ఎలాంటి తారతమ్యాలు లేకుండా చూడడమే. పొరుగు దేశాలతో పోలిస్తే మనదేశం వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం లంచగొండితనం. ఉన్నవాడు లంచం ఇచ్చి పనులు చేసుకుంటున్నాడు. పేదవాడు మరింత పేదరికంలో మగ్గుతున్నాడు. పాలకవర్గాలు సైతం దీనిని ప్రోత్సహించడం మన దౌర్భాగ్యం. సమాజంలో ఈ పరిస్థితి మార్చే నాయకత్వం రావాలి. మహిళలపై దాడులు, లైంగిక హింస పెరుగుతున్న నేడు మహిళల్లో అభద్రతా భావం నెలకొని ఉంది. మహిళా భద్రతకు ప్రాధాన్యమిచ్చే నాయకుడై ఉండాలి. ఎల్లవేళలా ప్రజల మధ్యన ఉంటూ వారి అవసరాలను తెలుసుకొని వారి అభివృద్ధి కోసం అవకాశాలు, మౌలిక వసతులు కల్పించాలి. ప్రజానాయకుడు ప్రజలందరికి జవాబుదారీగా ఉండాలి. ఎన్నికల వేళ ఓటర్లనుడబ్బు, మద్యంతో ప్రలోభపరిచే నాయకుల అవసరం లేదు. ఏ పనిచేయాలన్నా తమకి కమిషన్‌ ఎంత అని అడిగే నాయకులు కాకుండా, ప్రజాసంక్షేమం, దేశాభివృద్ధికి పాటుపడే నిస్వార్థపరుడైన ప్రజానాయకుడి అవసరం ఎంతగానోఉంది. రిజర్వేషన్లను సరిగ్గా అమలు పరచాలి. విద్య, ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో అవకాశాలు ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకుండా అందరికీ సమానంగా కల్పించి సామాజిక న్యాయం జరిగేలా చూసే నాయకుడు కావాలి. ఈ దిశగా ఆలోచించే నాయకగుణం ఉండాలి. చట్టాలను పకడ్బందీగా అమలుపరిచే నాయకత్వమే మనకు లేదు. చట్టాల్లో ఉన్న లొసుగులతో దుర్మా ర్గులు కూడా ఎలాంటి శిక్షలు లేకుండా దర్జాగా సమాజంలో తిరుగుతున్నారు. ముఖ్యంగా యువతులపై జరుగుతున్న దుస్సంఘటనలు బాధాకరం. నిందితులను పట్టుకొని శిక్షిస్తున్న దాఖలాలు బహుస్వల్పం. ఒకవేళ పట్టుకొని జైలుకు పంపించినా మళ్లీ బెయిల్‌పై వచ్చి తమకేంటి అడ్డు అన్న రీతిలో తిరుగు తున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వంగా చెప్పుకుంటున్నామే తప్ప నేడు మహిళలకు జరుగుతున్న అన్యా యాలను ఈ నేతలు అరికట్టలేకపోతున్నారు. మహిళా భద్రతకు ప్రాధాన్యమిచ్చే నాయకత్వం కావాలి. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలు పెట్టే గెలవచ్చన్న రాజకీయ వ్యవస్థ నశించాలి. జవాబుదారీతనమే నాయకత్వ లక్షణం కావాలి. సమాజంలో ప్రజలందరికి జవాబుదారీగా ఉండడమే నిజమైన నాయకుడి లక్షణం. కానీ అలాంటి నాయకుడు ఈ రోజుల్లో కరువయ్యాడు. సమాజానికి, రాజకీయాలకు మధ్య అంతరాన్ని పెంచేశారు. ఏదో ఎన్నికలప్పుడు తప్ప ప్రజలతో రాజకీయ నాయకులు సత్సంబంధాలు నడపడం మానేశారు. దీంతో ప్రజలు కూడా రాజకీయ నాయకులపై అసహ్యం పెంచుకుంటూ పోతున్నారు. ప్రజలు పట్టించుకోవడం లేదు కదా అని మేం చెప్పిందే వేదం, మేమే కింగ్‌లం అన్న స్థాయికి నాయకులు వెళ్లిపోయారు. ఏ పనిచేయాలన్నా తమకు కమిషన్‌ రావాల్సిందే అన్న ధోరణి పెరిగిపోయింది. అంతటితో ఆగకుండా అరాచకా లకూ, అవినీతికి, స్కాములకు పాల్పడుతున్నారు. ఆర్థిక నేరస్తు లకు అండగా నిలిచి అవినీతిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ సంస్థల ను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్‌సంస్థలకు కొమ్ముకాస్తున్నారు. ఇటీవల దేశంలో జరిగిన స్కాములే ఇందుకు నిదర్శనం. ఈ ధోరణి దేశాభివృద్ధికి పెద్ద అవరోధంగా మారుతోంది. అందర్ని సమదృష్టితో పాలించే నాయకత్వం వస్తే బాగుంటుంది.

  • వి.సురేష్‌