కరోనా కట్టడిలోనూ కిమ్‌ నియంతృత్వం!

దేశం : ఉత్తరకొరియా

Kim
Kim

కరోనా మహమ్మారి విశ్వవ్యాప్తంగా ఉధృ తం అవుతున్న నేపథ్యంలోకొన్ని దేశాలు నియంతృత్వ పోకడలతో కట్టడి కార్యాచరణ అమలు చేస్తున్నాయి.

అరబ్‌దేశాల్లో తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తి చెంద కుండా పదిలక్షలవరకూ జరిమానా, పదేళ్లపాటు జైలుశిక్ష వంటి చట్టాలను కూడా అమలుచేసారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినా అందుకు భారీ జరిమానాలు చెల్లించాలన్న దేశాలు ప్రపంచం లో ఎన్నో ఉన్నాయి.

ఎక్కువగా నియంతృత్వ పోక డలు ఇప్పటికీ కొనసాగిస్తున్న దేశాల్లో ఇప్పుడు ఉత్తరకొరియా ముందువరుసలో ఉంటుందని చెప్పాలి. ఆ దేశాధినేత కిమ్‌జాంగ్‌ ఉన్‌ ఏం చేసినా అది ప్రపంచవ్యాప్తంగా సంచలనమే అవుతుంది. తాజాగా సరిహద్దులన్నింటినీ మూసివేయాలని ఆదే శాలు జారీచేసారు.

అక్రమంగా తమదేశంలోకి వచ్చినవారెవరైనాసరే కాల్చిపారేయండని మిలిటరీ అధికారులకు ఆదేశాలు జారీచేసేసారు. ఇటీవలి కాలం వరకూ కిమ్‌జాంగ్‌ మరణశయ్యపై ఉన్నారని, ఆయనకు శస్త్రచికిత్సలు జరిగాయని, ఇప్పట్లో రావ డం కష్టమేనని,అసలు ఉన్నారోలేదోనన్న సందేహా లతో ప్రపంచదేశాలు కొట్టుమిట్టాడాయి.

అనుకున్నట్లుగానే తన సోదరి కిమ్‌ యోజాంగ్‌కు కీలక బాధ్యతలన్నీ అప్పగించేసారు.ఇక ఇప్పుడు అన్ని దేశాల తరహాలోనే ఉత్తరకొరియాలో కూడా కరోనా కట్టడి కీలకంగాచేపట్టాల్సి వచ్చింది. తొలినాళ్లలోనే వైద్యులకుసైతం హెచ్చరికలు చేసిన కిమ్‌ ఇప్పుడు సరిహద్దుల నుంచి ఎవరు అక్రమంగా ప్రవేశించినా కాల్చివేయాలన్న ఆదేశాలు ఆదేశ ప్రజల్లో ప్రాణ భయాన్ని మరింత రెట్టింపుచేసాయి.

గతడిసెంబరు నుంచి వైరస్‌ వ్యాప్తి విశ్వవ్యాప్తమైన సంగతి తెలి సిందే. ఆదేశాల్లో ఉత్తరకొరియాకుసైతం ఎలాంటి మినహాయింపులులేవు. కరోనా వైరస్‌ తమవద్దకు రానేరాదని, తమదేశంలో లేనేలేదని ముందు కిమ్‌ జాంగ్‌ప్రకటించారు.

తదనంతరం దేశంలో ఆనవాళ్లు బైటపడటంతో అధికారులకు తక్షణమేఆదేశాలు జారీ చేసి వైరస్‌తో ఎవరు మృతిచెందినా వారితోపాటు చికిత్సలో వైఫల్యం చెందిన వైద్యులను కూడాకాల్చి వేస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వణికిపోయింది.

ఏప్రిల్‌లోనే ఇద్దరు సీని యర్‌ అధికారులను తొలగించారు. పార్టీ వైస్‌ఛైర్మన్‌ రిమాన్‌గాన్‌, పాక్‌థా§్‌ు డాక్‌లను అవినీతిపేరిట తొలగించారు. గగనతలాన్నిసైతం నిషేధించాలని, చైనాసరి హద్దులను పూర్తిగా మూసివేయాలని ఆదేశిం చిన కిమ్‌జాంగ్‌ ఎవరు అక్రమంగా ప్రవేశించినా వారిని కాల్చివేయాలని జారీచేసిన ఉత్తర్వులతో ఇరుదేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రి క్తతలు నెలకొన్నాయి.

చైనానుంచి ఇబ్బడి ముబ్బడిగా పర్యాటకులు వచ్చిపోతుంటారు. ఉత్తర కొరియాకు మిత్రదేశంగా వ్యవహరిస్తున్న చైనానుంచే ఎక్కువ రాకపోకలు సాగుతాయి.

వీరి రాకవల్ల వైరస్‌ మరింత పెరుగుతుందన్న భావనతోనే కిమ్‌ సరి హద్దులు మూసేసి అక్రమంగా వచ్చినవారిని కాల్చి వేయాలని ఉత్తర్వులు జారీచేసారని దక్షిణకొరియా సరిహద్దుల్లో మకాంవేసిన అమెరికా సైనిక అధికా రులు పేర్కొంటున్నారు.

అంతర్జాతీయ రైళ్లు విమానసర్వీసులను సస్పెండ్‌ చేసారు. పర్యాటకు లపై పూర్తినిషేధం విధించింది.వాస్తవానికి మిలిటరీ చట్టాలను కఠినంగా అమలుచేసే కిమ్‌జాంగ్‌ ప్రకటించినట్లుగా తొలినాళ్లలో ఉత్తరకొరియాలో వైరస్‌ అంతగా లేదు.

రానురాను మరింతగా విజృంభించింది. దీనితో చైనా, దక్షిణకొరియా సరిహద్దులను మూసివేసింది. తొలినాళ్లనుంచి కూడా వైరస్‌పై ఆ దేశప్రజల్లో కొంతమేర విస్తృత ప్రచారమే జరిగింది. జిడిపి తలసరి ఆదాయం ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే కొరియా కరోనా కట్టడిలో కిమ్‌ నియంతృత్వవైఖరి కొంత పనిచేసిందని నిపుణులు చెపుతున్నారు.

ముందు మా దేశంలో అసలు కేసులే లేవని చెప్పిన కిమ్‌ ఆ తర్వాత అంగీకరించకతప్పలేదు. కరుడుగట్టిన నియంత అయిన కిమ్‌ ఇపుడు అదే నియంతృత్వ సిద్ధాంతాలను కరోనా కట్టడికి వినియోగిస్తున్నట్లు సరిహద్దుల్లో మకాంవేసిన అమెరికా బలగాలు చెపుతున్నాయి. అనుకున్నట్లుగానే అదే సిద్ధాంతాన్ని కరోనా కట్టడికి ఇపుడు కిమ్‌ వినియోగిస్తున్నాడు.

అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులను తీవ్రంగా పరిగణించిన కిమ్‌ చైనానుంచి తమ దేశం లోకి ప్రవేశిస్తున్న కరోనా సోకి వస్తున్న సందర్శకులను కాల్చి చంపేయాలని ఆదేశాలిచ్చినట్లు అమెరికా సైనిక కమాండర్‌ ప్రకటించడం చూస్తే కిమ్‌ ఆదేశాలు ఆ దేశంలో అమలవుతున్నట్లే.

ఉత్తరకొరియా చైనాకు పక్కనే ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఒక్కకేసును కూడా ధృవీకరించలేదు. అసలు వైరస్‌ లేదనే కిమ్‌ ప్రకటించాడు. జనవరినుంచి సరిహద్దులను మూసివేసిన ఉత్తర కొరియా అత్యవసర పరిస్థితిని అత్యంత పీక్‌స్థాయిలో అమలుచేస్తోంది.

సరిహద్దుల మూసివేత కారణంగా స్మగ్లింగ్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగిందని అమెరికా సైనిక బలగాల కొరియా కమాండర్‌ సైతం ధృవీకరించారు. చైనా సరిహద్దుకు ఒకటిరెండు కిలోమీటర్ల దూరంవరకూ ఉత్తరకొరియా బఫర్‌జోన్‌ ఏర్పాటుచేసింది.

ప్రత్యేక ఆపరేషన్స్‌ బలగాలు, స్ట్రైక్‌ఫోర్స్‌ను చైనా సరిహద్దుల్లో మొహరింప చేసింది. చైనానుంచి అక్రమంగా వచ్చేవారిని అక్కడికక్కడే కాల్చిచంపేయాలని అందుకోసమే ఈ బలగాలను అక్కడ మొహరింపచేసిందని సమాచారం.

సరిహద్దులు మూసివేతతో చైనానుంచి కొరియాకు దిగుమతులు 85శాతం క్షీణించాయి. మరోపక్క టైఫూన్‌ మసక్‌తో తలమునకలవువ్ఞతున్న ఉత్తర కొరియాలో కరోనా కట్టడికి కిమ్‌ జారీచేసినా ఆదేశాలు సర్వత్రా ప్రాణభయం పెంచాయి.

  • గన్ని మోహన్‌

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/