మానవ రవాణాకు అడ్డుకట్ట పడేనా?

Human trafficking

దక్షిణాసియాలో ప్రతి సంవత్సరం ఒకటిన్నర లక్షల మంది మహిళలు, పిల్లలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు,అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 15లక్షలమంది చిన్నపిల్లల అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంతర్జాతీయ బాలల హక్కుల సంస్థ తెలియచేసింది. ప్రపంచవ్యాప్తంగా సాయుధ ఘర్షణలు, అంతర్యుద్ధాల వలన ఎక్కువమంది ఈ ముఠాల బారినపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యేటా 3200 కోట్లడాలర్ల విలువైన మానవ అవయవాల వ్యాపారం జరుగుతుందని ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడిస్తుండగా, అంతకన్నా చాలా ఎక్కువ జరుగుతున్నట్లు స్వచ్ఛంద సంస్థలు వెల్లడిస్తున్నాయి. చట్టసభల్లో ఈ అదృశ్యాలపై లోతైన చర్చజరగాలి. దేశాలు దాటుతున్న ఈ నేరాలను సమర్థవంతంగా అరికట్టాలంటే దేశాల మధ్య సమన్వయం అవసరం.

ప లుకారణాలతో వేరే ప్రాంతా లకు తరలించి మహిళల, చిన్నపిల్లల, మానవ్ఞల శరీరాల తో చేసే వ్యాపారమే మానవ అక్రమ రవాణా. భూమి మీద జరిగే అత్యం త హేయమైన పనుల్లో ఇది ఒకటి. మాదకద్రవ్యాల అక్రమరవాణా, మానవ అక్రమ రవాణా రెండూ పెద్ద చీకటి వ్యాపారాలుగా సాగుతు న్నాయి. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. మహిళ లను ప్రేమ పేరుతో వలవేసి కొందరు, పేదరికంలో కష్టాల్లో ఉన్న వారికి ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామని కొందరు, వెండితెర,బుల్లితెర అవకాశాలు కల్పిస్తామని మరికొందరు, రకరకాల మోసాలతో రకరకాల పద్ధతుల్లో అక్రమ రవాణా చేస్తున్నారు. అలాగే చిన్న పిల్లలను కూడా మాయమాటలతో ఎత్తుకెళ్లుతున్నారు. చెడు స్నేహాలతో తెలిసీతెలియనితనంతో చిన్న వయస్సులోనే కొందరు మోసపోతున్నారు. కరవ్ఞ ప్రాంతాల్లో మాటువేసి బాధల్లో ఉన్న వారిని పసిగట్టి వారితో పరిచయం పెంచుకుని వారికి కొంత ధనసహాయం కూడా చేసి, కష్టాల్లో ఉన్న వారికి రకరకాల మాయ మాటలు చెప్పి గద్దల్లా తన్నుకుపోయి అమ్మెస్తున్నారు. ఉపాధి పేరిట వలవేస్తున్నారు.

కుటుంబంలో మిగతా సభ్యులనయినా సుఖపెడతామని ఇల్లు దాటిని వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోపడిన చందంగా ఉంటుంది. కన్నవారికి భారం కాకూడ దని, సొంతకాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో ఇల్లుదాటుతున్న వారికి మంచి ఉద్యోగం లాంటి రకరకాల మాయమాటలతో బురిడీ కొట్టిం చి పడుపువృత్తిలోకి దించే తార్పుడుగాళ్లకు కొదువలేదు. ప్రధాన వెనుకబడిన ప్రాంతాల్లో, పేదలు నివసించే ప్రాంతాల్లో ఇవి ఎక్కు వగా జరుగుతున్నాయి. అనేక కారణాల వల్ల వాస్తవ అదృశ్యాల కంటే నమోదవ్ఞతున్న కేసులు తక్కువగానే ఉంటున్నాయి. తప్పని పరిస్థితుల్లో కొందరు, మోసపోయి మరికొంత మంది వీరిబారిన పడుతున్నారు.

వందలో ఒకరు అదృష్టవశాత్తు ఆ నరకకూపాల నుంచి బయటపడుతున్నారు. వారు చెప్పే అక్కడి చిత్రహింసలు వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.వారి నరకయాతన విని, చదివి, టీవీల్లో చూసి మరిచిపోవడానికి మనం అలవాటుపడ్డాం. అందుకే ఏడాదికేడాది ఇలాంటి ఉదంతాలు ఎక్కువవ్ఞతున్నాయి. కనిపించ కుండాపోయే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఎత్తుకెళ్లి సంతలో పశువ్ఞలను అమ్మినట్లు యమభటుల్లాంటి వారికి అమ్ముతున్నారు. అభంశుభం తెలియనివారు ఈ భూమి మీద పుట్టిన పాపానికి మాటల్లో చెప్పలేని బాధను అనుభవిస్తున్నారు.

చివరకు మత్తు పదార్థాలకు బానిసలై రోగాలతో ప్రాణాలు కోల్పోవటమో, జీవచ్చ వాలుగా బతకటమో జరుగుతుంది. పసిపిల్లల అక్రమ రవాణా పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. పనిచేయలేని వారి, పనికిరాని అభాగ్యుల అవయవాలు కూడా అమ్ముకుంటున్నారు. గుండెల్ని మెలిపెట్టే సంఘటనలు కొన్ని బయటపడుతున్నాయి. మెట్రోనగరాల్లో కొన్ని కర్మాగారాల్లో బాల లు ఏళ్లతరబడి మగ్గుతున్నారు. పంజరాల్లో ఉండే జంతువ్ఞల కన్నా హీనమైన జీవితాన్ని గడుపుతున్నట్లుగా, మానవ హక్కుల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, కార్మికశాఖ వారు వారిని విడిపించినప్పుడు బయటపడుతున్నది.

నరకానికి మించిన నష్టాలు వారు ఈ భూమ్మీద అనుభవిస్తున్నారు. మానవ అక్రమ రవాణా ప్రధానంగా వెట్టిచాకిరీ చేయించటం కోసం, వ్యభిచారులు గా మార్చటం కోసం, నిషేధిత మత్తుపదార్థాల రవాణాకు ఉపయో గించడం కోసం, యాచకవృత్తి కోసం జరుగుతున్నట్లుగా నివేదిక లను బట్టి తెలుస్తుంది. పరిచయస్తులైన మహిళలే కొన్నిసార్లు ఒంటరి మహిళలను మోసం చేస్తున్నారు. వివిధస్థాయిల్లో అల సత్వం వలన మానవ అక్రమ రవాణా నిరోధించలేని సమస్యగా మారింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న బిడ్డలు కనిపించక కన్నవారికి కడుపుశోకం మిగులుతుంది. అక్రమరవాణా కేసుల్లో శిక్షలు పడే కేసులు తక్కువగా ఉంటున్నాయి. దీనిపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. శిక్షలుపడక, లేదా తక్కువ శిక్షలు పడుతుండటంతో, తెరవెనుక ఉన్నవారు తప్పించు కోవటం తదితర కారణాలతో నేరస్తులు రెచ్చిపోతున్నారు.

మరలా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. అభాగ్యులైన బాధితులే కొన్నిసార్లు కోర్టులచుట్టూ తిరగాల్సివస్తున్నది. అదృశ్యమవ్ఞతున్న బాలల్లో దాదాపు సగం మంది ఆచూకీ తెలియడం లేదని గణాంకాలు తెలుపుతున్నాయి. ఐక్యరాజ్యసమితిడ్రగ్స్‌అండ్‌ క్రైమ్స్‌పై 2016లో విడుదల చేసిన నివేదిక ప్రకారం మానవ అక్రమ రవాణాలో మూడవ వంతు పిల్లలే ఉంటున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా వ్యాపారం 150 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 21 మిలియన్ల మంది నిర్బంధ కార్మి కులుగా ఉన్నారు.అక్రమ రవాణాలో దాదాపు 80శాతంవ్యభిచారం కోసం, 20 శాతం వెట్టిచాకిరి కోసం జరుగుతున్నట్లుగాతెలుస్తుంది.

జాతీయ నేర పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం 2016లో మన దేశంలో చిన్నారులు, మహిళలు 19223 మంది అక్రమ రవాణాకు గురయ్యారు. దక్షిణాసియాలో ప్రతి సంవత్సరం ఒకటిన్నర లక్షల మంది మహిళలు, పిల్లలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 15లక్షలమంది చిన్న పిల్లల అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంతర్జాతీయ బాలల హక్కుల సంస్థ తెలియచేసింది.ప్రపంచవ్యాప్తంగా సాయుధ ఘర్షణలు, అంతర్యుద్ధాల వలన ఎక్కువమంది ఈ ముఠాల బారినపడుతు న్నారు.

ప్రపంచవ్యాప్తంగా యేటా 3200 కోట్ల డాలర్ల విలువైన మానవ అవయవాల వ్యాపారం జరుగుతుందని ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడిస్తుండగా, అంతకన్నా చాలా ఎక్కువ జరుగుతు న్నట్లు స్వచ్ఛంద సంస్థలు వెల్లడిస్తున్నాయి. చట్టసభల్లో ఈ అదృ శ్యాలపై లోతైన చర్చజరగాలి. దేశాలు దాటుతున్న ఈ నేరాలను సమర్థవంతంగా అరికట్టాలంటే దేశాల మధ్య సమన్వయం అవ సరం. బంగ్లాదేశ్‌ నుండి మనదేశానికి చేరుస్తున్నారు. మనదేశం నుంచి ఇతర దేశాలకు తరలిస్తున్నారు. మానవ అక్రమరవాణా నిరోధక బిల్లు లోక్‌సభ ఆమోదం పొందటం కీలకమైన ముంద డుగు చర్యే అయినా ఇంకా ఎన్నో చర్యలతోనే దీనిని అరికట్టడం సాధ్యమవ్ఞతుంది.

గతంలో బయటపడిన యాదాద్రి సంఘటనలో చిన్నపిల్లల ఎదుగుదలకు హార్మోన్‌ ఇంజక్షన్లు ఇచ్చి పసివయస్సు లోనే వారిని అంగడి సరుకుగా మారుస్తున్నట్లుగా తెలిసింది. ఈ సంఘటనలో బాలికలు బయటపడినప్పుడు గతంలో తప్పిపోయిన బాలికల కుటుంబికులు తమవారి కోసం అక్కడకు క్యూ కట్టడం సమస్య తీవ్రతకు అద్దంపడుతుంది. మానవ అక్రమ రవాణా వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా మూడుపువ్ఞ్వలు ఆరుకాయలుగా సాగుతుంది. ఇది ప్రభుత్వాలకు పెనుసవాలుగా మారి తల్లిదండ్రు లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దందాను అరికట్టడానికి కృతనిశ్చయంతో పనిచేయాలి. స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టాలి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అక్రమరవాణా ముఠాలు పనిచేస్తున్నాయి. వేళ్లూనుకుపో యిన ఈ ముఠాలను ఉక్కుపాదంతో అణచివేసినప్పుడే అభాగ్యు లకు రక్షణ కలుగుతుంది. ఈ అక్రమ రవాణా మూలాలను కది లించాలి. పునాదులతోసహా పెకిలించాలి. మెట్రోనగరాల్లో బిచ్చగాళ్ల మాఫియాను పూర్తిగా అరికట్టాలి. ప్రభుత్వాలు, నేర విభాగాలు, పోలీసుశాఖ అనుకుంటే సాధ్యంకానిదేమీ లేదు.

బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లలో సిసికెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. అనుమానితులపై నిరంతర నిఘా ఉంచాలి. పెద్దనగరాలకే కేంద్రా లుగా ఈ వ్యాపారాలు సాగుతున్నాయి. రేపటి తరాలపై రాబందు ల రెక్కల నీడపడకుండా ఉండాలంటే ఈ సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలి. ఇలాంటివి ఇంకా జరుగుతున్నం దుకు అందరం సిగ్గుతో తలదించుకోవాలి. చట్టాలు ఉన్నా బాధి తులే నేరస్తులను ఎదుర్కోవలంటే కష్టం. సమర్థులైన అధికారులను ఈ కేసుల నిగ్గు తేల్చడానికి నియమించాలి.

– రావి శ్రీనివాసరావు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/